నందలూరు: పాత పెద్ద నోట్లను తీసుకుని కమీషన్ పట్టుకుని కొత్త నోట్లను ఇచ్చేందుకు ప్రయత్నించిన తొమ్మిది మంది సభ్యులు గల ముఠాను అరెస్టు చేసినట్లు నందలూరు ఎస్‌ఐ శ్రీనివాసులరెడి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓబులవారిపల్లె, మంగంపేట, రైల్వేకోడూరుకు చెందిన మోడి శ్రీనివాసులు, యస్.రాజగోపాల్, మొగలి నవీన్‌కుమార్, రాచపోయిన చెంగల్‌రాయుడు, మద్దిల నాగరాజు, కోడూరు రాంబాబు, నాటూరు నరసింహారెడ్డి, కొండా వెంకటేష్, కొండా రమేష్‌బాబులు నందలూరు చెయ్యేరు బ్రిడ్జి కింద నీలిపల్లి ప్రాంతంలో ఉండగా అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.10 వేలు నగదు, ఒక ఇండికా కారు, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరు కమీషన్‌కు కక్కుర్తి పడి పాత నోట్లుతీసుకు ని కొత్త నోట్లు ఇచ్చేందుకు ప్రయత్నించారన్నారు. తమకు అందిన పక్కా సమాచారంతో వీరిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారన్నారు. కాగా 9 మంది వద్ద కేవలం రూ.10 వేలు మాత్రమే ఉన్నాయనడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.