railway koduru
-
సామాజిక సాధికార యాత్రకు పోటెత్తిన జనం
-
నాన్న వచ్చాడు.. లేచి చూడు కన్నా..
సాక్షి, రైల్వేకోడూరు(కడప) : సరదాగా స్నేహితులతో తిరిగేవాడివి... మారం చేయకుండా బడికి వెళ్లే వాడివి... ఏ పని చెప్పినా చేసేవాడివి.. అందిరితో కిలివిడిగా ఉండే నీకు అప్పుడే నూరేళ్లు నిండాయా బిడ్డా అంటూ శివరామకృష్ణ తల్లి లావణ్య బోరున విలపిస్తోంది. నిన్నే ప్రాణంగా భావించి.. నీ అభివృద్ధి కోసం కువైట్‌కు వెళ్లిన మీ నాన్న నిన్ను చూడడానికి వచ్చాడు..ఒక్క సారి లేచి చూడరా నానా అంటూ ఆ తల్లి పెట్టిన ఆక్రందన అందరి గుండెలను పిండేసింది. గుంజన ఏటిలో మంగళవారం ఈతకు వెళ్లి గల్లంతైన శివరామకృష్ణ మృతదేహం గురువారం తెల్లవారు జామున లభ్యమైంది. జాలర్లు వల సహాయం మృతదేహాన్ని గట్టుకు చేర్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. కువైట్‌లో ఉన్న మృతుని తండ్రి సుబ్రమణ్యం కూడా ఇంటికి చేరుకోవడంతో కటుంబసభ్యులు, బంధువులు స్నేహితులు, గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికి అంత్యక్రియలు నిర్వహించారు. అంతా బంధువులే కావడంతో గుండాలపల్లె గ్రామస్తులు శోకసంద్రంలోనే ఉన్నారు. శివరామకృష్ణకు నివాళి ఏటిలో గల్లంతై మృతి చెందిన శివరామకృష్ణకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నివాళులరి్పంచారు. గురువారం ఉదయం గుండాలపల్లెకు వెళ్లి మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు, అధికారులు ఉన్నారు. ఫలించిన కొరముట్ల కృషి శివరామ కృష్ణ ఏటిలో గల్లంతయ్యాడని తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు చేసిన కృషి ఫలించింది. స్థానిక రెస్క్యూ టీం, గజ ఈతగాళ్లు గాలింపు చేసినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో జిల్లా ఎస్పీతో చర్చించారు. బోటు, జాలర్లను పిలిపించారు. గురువారం రాత్రంతా ఏటిలో జల్లెడ పట్టించారు. గుంజన ఏరు నీటి ఉధృతిని తగ్గించడానికి నాలుగు జేసీబీలతో నీటిని తగ్గించారు. విప్ కొరమట్లు దగ్గరుండి వారిని ప్రోత్సహించారు. చివరికి గురువారం తెల్లవారు జామున 4:30 గంటల సమయంలో మృతదేహాన్ని వెలికి తీశారు. కొరముట్ల కృషికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్ని శాఖల అధికారులు, జాలర్ల పనితీరును ప్రశంశించారు. శివరామకృష్ణ మృతదేహాన్ని వెలికి తీస్తున్న జాలర్లు మృతుని తల్లిదండ్రులను ఓదారుసున్న విప్ కొరముట్ల -
ప్రజల తమవంతుగా ఇళ్లకే పరిమితం కావాలి
-
రైల్వే కోడూరులో తప్పిన ప్రమాదం
-
ప్రియుడి మోజులో పడి.. దారుణానికి ఒడిగట్టి..
సాక్షి, రైల్వేకోడూరు(కడప) : రైల్వేకోడూరు పట్టణం రంగనాయకులపేటకు చెందిన అబ్దుల్ ఖాదర్ బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. అతనికి ఈనెల 23న తన అత్త కూతురితో వివాహం జరగాల్సి ఉండింది. ఇంతలో ఈనెల 5న రంజాన్ పండుగ సందర్భంగా సొంత ఊరికి వచ్చి బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యను పలు కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు మిస్టరీని ఛేదించారు. పెళ్లి కూతురిగా పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి తన ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించారు. ఈమేరకు సీఐ బాలయ్య విలేకరులకు వివరాలు వెల్లడించారు. అబ్దుల్ ఖాదర్‌కు తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా గుమ్మడిపూడిలో ఉంటున్న తన సొంత మేనత్త కూతురు శబ్నతో ఈ నెల 23న వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. అయితే అప్పటికే శబ్న అదే గ్రామానికి చెందిన ప్రిన్స్ అనే యువకుడిని ప్రేమించింది. ఆమె తన ప్రియుడితోనే సంబంధం కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో తనకు కాబోయే భర్తను చంపమంటావా లేకుంటే నీవు చంపుతావా అని తన ప్రియుడిని ప్రశ్నించింది. దీంతో ప్రియుడు ప్రిన్స్ తన స్నేహితులైన దీనదయాల్‌కు రూ.1.50 లక్షలు, సెల్వంకు రూ.2లక్షలు, లక్ష్మణ్‌కు రూ.3 లక్షలు, బ్రిస్టన్కు రూ.50వేలు డబ్బులు ఇచ్చి ఎలాగైనా తన ప్రియురాలికి కాబోయే భర్త అబ్దుల్ ఖాదర్‌ను హతమార్చాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నెల 5వ తేదీన రంజాన్ పండుగ రోజున ఉదయం 5.30 గంటలకు అబ్దుల్‌ఖాదర్ రైల్వేకోడూరులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బస్సు దిగాడు. అక్కడే పాలప్యాకెట్ తీసుకుని ఇంటికి వెళ్తుండగా సమీపంలోనే మాటు వేసి ఉన్న దుండగులు కృష్ణా హాల్ పక్క వీధిలో కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘాతుకానికి పాల్పడిన శబ్న ప్రియుడు ప్రిన్స్‌ను, అతని స్నేహితులు సెల్వం, దీనదయాల్‌ను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి మారుతి వాహనం, రూ. లక్షా 50 వేలు నగదు, వేట కొడవళ్లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
రైల్వేకోడూరులో గాలివాన బీభత్సం
-
రైల్వేకోడూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీనివాసులు ప్రచారం
-
చంద్రబాబు పాలనలో ప్రజలు విసిగిపోయారు: కోరుముట్ల
-
రైల్వేకోడూరులో రాజన్న క్యాంటీన్ ప్రారంభించిన కోరముట్ల
-
రైల్వే కోడూరులో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
అరటి రైతు విలవిల
రైల్వేకోడూరు: అత్యధికంగా పండ్లతోటలు ఉండే ఏకైక ప్రాంతంగా రైల్వేకోడూరు నియోజకవర్గం జిల్లాలోనే ప్రసిద్ధిగాంచింది. అయితే అరటి, మామిడి పంటలు చేతికొచ్చే సమయంలో ప్రకృతి ప్రకోపం కారణంగా పంట చేతికి వచ్చి కాయలు కోసే దశలో నేలపాలు కావడంతో రైతులు కుదేలవుతున్నారు. అయిపోతున్నాడు. బాగా దిగుబడి వచ్చింది, అప్పుల ఊబి నుంచి బయటపడతామని అనుకుంటుండగానే గత నెల 15వ తేదీ పెద్ద ఎత్తున వీచిన గాలి వానకు పుల్లంపేట, రైల్వేకోడూరు మండలాల్లో వందల ఎకరాల్లో అరటి నేల మట్టంకాగా, మామిడి కాయలు అన్ని మండలాల్లో నేల రాలిపోయాయి. అలాగే గత నెల చివరలో వచ్చిన ఈదురు గాలులకు ఒక్క పుల్లంపేట మండలంలోనే దాదాపు 120 ఎకరాల్లో అరటి నేలకొరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 22న ఆదివారం సాయంత్రం గాలి వానతో పాటు వడగండ్ల వాన రావడంతో మరోసారి వందల ఎకరాల్లో అరటి నేలకొరిగింది. దీంతో రైతులు దిక్కు తోచని స్థితిలో దిగాలు పడిపోయారు. పంట నష్టం గురించి రైతులు సమాచారం ఇచ్చినా అటు వైపు ఏ అధికారి కన్నెత్తి చూడటంలేదు. రెవెన్యూ, ఉద్యానవన అధికారులు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ కనీసం సర్వే చేసేందుకు కూడా ముందుకు రాకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. ఎట్టకేలకు తాము ప్రాధేయపడితే ఉద్యానవన అధికారులు వచ్చి తూతూ మంత్రంగా సర్వే చేసి వెళ్లారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు గట్టిగా ప్రశ్నిస్తే మీ తోటలో మీరు నిలబడి ఫొటోలు, ఆధార్‌కార్డు, పాసుపుస్తకాల జిరాక్సు కాపీలు తెమ్మని ఆదేశిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టం వాటిల్లితే తక్షణమే స్పందించి సర్వే చేయించి రైతులను ఆదుకొనేవారని రైతులు గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం కూడా రైతులకు అంతో ఇంతో సహాయం అందించిందని.. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం గత నాలుగేళ్ల కాలంలో ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన రైతులను ఆదుకున్న పాపాన పోలేదని రైతులు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రకృతితో నష్టపోయిన రైతు తిరిగి అదే భూమిలో మరో పంట పండించుకునేందుకు అయ్యే నామమాత్రపు ఖర్చును సైతం అందజేయని ఈ ప్రభుత్వం రైతుకు మేలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం దుర్మార్గపు చర్యగా రైతులు అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకుంటే లక్షల్లో నష్టపోయిన రైతులు కోలుకోవడం కష్టమేననే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అరటి పంట నేలకొరిగిన పొలాలను జిల్లా కలెక్టర్ పరిశీలించి, రైతులకు నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఉద్యానవన అధికారులకునియంత్రణ లేదా.. ప్రతి మండలంలో రైతులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ఉద్యానవన అధికారులను నియమించింది. కానీ ఈ శాఖకు చెందిన మండల స్థాయి అధికారులు రైతులకు చుక్కలు చూపిస్తున్నారనే విమర్శలున్నాయి. ఉన్నతాధికారులు వీరి చర్యలపై దృష్టి సారించి వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి నేను సాగు చేసిన ఐదు ఎకరాలలోని అరటి చెట్లు గాలి దెబ్బకు పడిపోయాయి. మళ్లీ పైరు పెట్టాలంటే కష్టంగా ఉంది. ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలి. –భీము రామచంద్రారెడ్డి, అరటిరైతు, మల్లెంవారిపల్లి, పుల్లంపేట మండలం. -
రోడ్డు ప్రమాదంలో తిరుమల యాత్రికుల మృతి
-
రోడ్డు ప్రమాదంలో తిరుమల యాత్రీకుల మృతి
- కారును ఢీకొన్న కంటైనర్.. ముగ్గురి మృతి రైల్వే కోడూరు: పుణ్య క్షేత్రానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. వైఎస్సార్ కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలోని అనంతరాజుపేట వద్ద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కారును అనంతరాజుపేట వద్ద ఓ కంటైనర్ ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరిని తిరుపతి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రమైన గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.అయితే మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
బిరబిరా కృష్ణవేణమ్మ
సాధికారత కృష్ణమ్మ మహారాష్ట్రలో పుట్టి ఏపీకి వచ్చింది. కృష్ణవేణి... ఏపీలో పుట్టి మహారాష్ట్రకు వెళ్లింది. ఏమిటి పోలిక... కృష్ణమ్మకు, కృష్ణవేణికి! చిన్న పాయగా మొదలైంది కృష్ణానది. మూమూలు గృహిణిగా మొదలైంది కృష్ణవేణి. పరవళ్లతో ప్రవహిస్తోంది కృష్ణమ్మ. ఉరకలపై ప్రజాసేవ చేస్తోంది కృష్ణవేణమ్మ. బిరబిరా కృష్ణమ్మ అంటాం కదా... అలాగే... బిరబిరా కృష్ణవేణమ్మ అనాలి!! తెలుగువారికి అందని ద్రాక్షగా మిగిలిన బృహన్ ముంబై మహానగర్ పాలిక (మున్సిపల్ కార్పొరేషన్) లో ఈ ఏడాది ప్రాతినిధ్యం లభించింది! గత ఎన్నికల్లో వరంగల్ జిల్లాకి చెందిన అనూష వల్పదాసి శివసేన టిక్కెట్‌పై విజయం సాధించి అతిపిన్న వయసు కార్పొరేటర్‌గా రికార్డు సృష్టించినప్పటికీ, అనంతరం సాంకేతిక కారణాల వల్ల ఆమె పదవి రద్దు అయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కండిగ కృష్ణవేణి రెడ్డి (48) కార్పొరేటర్‌గా విజయం సాధించడంతో.. ఐదు దశాబ్దాల తెలుగు ప్రజల నిరీక్షణ ఫలించినట్లయ్యింది. ముంబైలోని ‘సాక్షి’ దినపత్రిక కార్యాలయంలో ఇటీవలి వరకు ఆపరేటర్‌గా విధులు నిర్వహించిన కండిగ కృష్ణవేణి ఇప్పుడు ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్ అయ్యారు. కడప నుంచి ముంబైకి కృష్ణవేణి స్వస్థలం కడప జిల్లా రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేట గ్రామం. నాన్న పూత్తూరు శివరామిరెడ్డి, అమ్మ వెంకటలక్ష్మి. కృష్ణవేణి విద్యాభ్యాసం అనంతరాజుపేటతో పాటు రైల్వేకోడూరులో జరిగింది. వివాహం చిత్తూరు జిల్లాకు చెందిన కండిగ వినోద్ రెడ్డితో జరిగింది. వినోద్ ఉద్యోగ రీత్యా ఈ దంపతులు ముంబైలో స్థిరపడ్డారు. సుమారు ఇరవై ఏళ్లకుపైగా ఆమె ఒక సాధారణ గృహిణిగా కుటుంబ బాధ్యతలకే పరిమితం అయ్యారు. కృష్ణవేణికి సమాజానికి ఏదైనా చేయాలన్న తపన ఉండడంతో తమ ప్రాంతంలో తన వంతుగా సమాజసేవా కార్యక్రమాలలో పాల్గొనేవారు. ఇంటి నుంచి ఉద్యోగానికి తండ్రి దివంగత శివరామిరెడ్డి రాజకీయాల్లో ఉన్నప్పటికీ కృష్ణవేణికి అంతగా రాజకీయ అనుభవంలేదు. అయితే 2014లో ఆపరేటర్‌గా ఉద్యోగంలో చేరడంతో ఆమె ఆలోచనా పరిధి విస్తృతం అయింది. ‘‘సాక్షిలో నేను విధులు నిర్వహించింది 15 నెలలే అయినప్పటికీ, అనేక విషయాలను తెలుసుకోగలిగాను. ముఖ్యంగా సాక్షి ఉద్యోగిగా మా ఏరియాతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నాకు గౌరవం లభించే ది. దీంతో మరిన్ని సమాజసేవా కార్యక్రమాలు నిర్వహించడానికి వీలు కలిగింది. ఆ క్రమంలోనే స్థానిక నాయకుల ప్రోత్సహంతో బీజేపీలో చేరాను’’ అని చెప్పారు కృష్ణవేణి. 2015లో కృష్ణవేణి దక్షిణ మధ్య ముంబై బీజేపీ మహిళ మోర్చా ప్రధాన కార్యదర్శి అయ్యారు. అయితే మొదట ఆమె పూర్తిస్థాయిలో పార్టీకి సేవలు అందించలేకపోయారు. ఆ ఏడాదే ఆమె తల్లి మరణించారు. అనంతరం అదే ఏడాది ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయం రాజకీయాలకు కేటాయించారు. రాజకీయాల్లోకి రాక ముందు నుంచే ‘పసుపు కుంకుమ’ తదితర కార్యక్రమాల ద్వారా తమ ప్రాంతంలోని మహిళలతో కృష్ణవేణి మమేకమై ఉండేవారు. రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం ఆ అనుబంధాన్ని బరింత దృఢంగా కొనసాగించారు. ఉద్యోగం నుంచి పాలిటిక్స్‌కి గత ఏడాది ఫిబ్రవరిలో సైన్ కోలీవాడాలోని ఇంద్రనగర్ గార్డెన్లో కృష్ణవేణి ఆధ్వర్యంలో జరిగిన పార్టీ కార్యక్రమానికి ఊహించిన దానికంటే రెట్టింపు సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఆ కార్యక్రమం ఆమెకు ఒక గుర్తింపు సంపాదించి పెట్టింది. పార్టీలో ఆమె ప్రాధాన్యాన్ని మరింత పెంచేలా చేసింది. బీజేపీ దక్షిణ మధ్య ముంబై అధ్యక్షులు అనీల్ ఠాకూర్, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కెప్టెన్ తమిళ సెల్వన్‌లు బీజేపీ దక్షిణ ముంబై మహిళ విభాగానికి అధ్యక్షురాలిగా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. దాంతో ఆమె క్రియాశీలత, నిర్వహణ సామర్థ్యాలు దక్షిణ మధ్య ముంబై జిల్లాలోని బీజేపీ నాయకులతోపాటు దాదాపు ఇతర ప్రముఖులందరి దృష్టికీ వెళ్లాయి. సొంత టీమ్‌తో ఇంటింటికీ 2016 డిసెంబరులో కృష్ణవేణి తన కంటూ ఒక టీమ్‌ను నియమించుకున్నారు. ఈ టీమ్‌తో కలిసి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలకు ప్రచారకర్త అయ్యారు.‘ఘర్ ఘర్ కి అభియాన్’ ద్వారా... ముఖ్యంగా మహిళలకు సంబంధించిన పథకాలపై స్థానికుల్ని చైతన్యవంతుల్ని చేశారు. ఫలితమే కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమెకు బీజేపీ టిక్కెట్. ‘‘కార్పొరేటర్‌గా బరిలోకి దిగిన అనంతరం మహిళలే నాకు బలంగా నిలిచారు. వారిలో తెలుగువారు కూడా ఉన్నారు’’ అని కృష్ణవేణి తెలిపారు. ప్రచారానికి తక్కువగా సమయమే లభించినప్పటికీ బహిరంగ సభలు కాకుండా ఇంటింటి ప్రచారానికి ఆమె ప్రాధాన్యం ఇచ్చారు. తన వార్డులో కేవలం ఒకే ఒక్క బహిరంగ సభ జరిగింది. ఆమె వెంట ప్రచారంలో సుమారు 75 నుంచి 80 శాతం మహిళలుంటే 20 నుంచి 25 శాతం మాత్రమే పురుషులుండేవారు. ప్రచారంలో భాగంగా ఉదయం నుంచి రాత్రి వరకు బయటే ఉండడంతో చాలాసార్లు కేవలం పాలు తాగి పడుకోవాల్సి వచ్చేదని కృష్ణవేణి తెలిపారు. ఒత్తిళ్ల నుంచి విజయానికి రాజకీయాల్లోకి రావడానికి ముందు, తర్వాత కూడా తన కుటుంబ సభ్యులు ఇచ్చిన, ఇస్తున్న సహకారం మరువలేనిదని కృష్ణవేణి అన్నారు. ‘‘నా భర్తతో పాటు నా ఇద్దరు పిల్లలు కుషాల్, వినీత్‌ల సహకారం అన్ని విధాలా నా ఒత్తిడిని తగ్గించింది. ముఖ్యంగా మా చిన్నబ్బాయి వినీత్‌తోపాటు వినీత్ కాలేజీ ఫ్రెండ్స్ నా ప్రచారానికి, పనులకు కష్టపడి సహకరించారు’’ అని కృష్ణవేణి చెప్పారు. కుషాల్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేసి ఎంబిఎ చేస్తూ ఉద్యోగం చేస్తుంటే, వినీత్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి తండ్రికి వ్యాపారంలో సహాయంగా ఉన్నాడు. కృష్ణవేణి భర్త ముంబైలోని ‘కేర్ ఇట్’ ఫార్మా యునిట్‌ను నడుపుతున్నారు. పెద్దబ్బాయికి తన తల్లి రాజకీయాల్లోకి తిరగడం ఇష్టం లేకపోవడంతో ఆమె తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఆసక్తి కనబరచలేదు. నిరంతరం ఆమె పార్టీ పనుల్లో తీరిక లేకుండా ఉండడాన్ని చూసి ‘ఎందుకమ్మా ఇదంతా’ అని బాధపడేవాడు. పదవి నుంచి ప్రజాసేవకు కృష్ణవేణి పోటీ చేసిన వార్డు 1740 (యాంటాప్ హిల్స్ – విజయ్‌నగర్)లో అత్యధికంగా మురికివాడలే ఉన్నాయి. తాగునీరు, మురుగునీటి వ్యవస్థతోపాటు ఆ వార్డులో అనేక సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని కృష్ణవేణి తెలిపారు. ‘‘రాజకీయాల్లో నాకంటూ ఓ ప్రత్యేక ముద్ర కోసం ప్రయత్నిస్తా. అందరిని కలుపుకుని పెద్దల సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుతా. ముఖ్యంగా బీజేపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే కెప్టెన్ తమిళ సెల్వన్‌తోపాటు నా వార్డులోని బీజేపీ నాయకుల మార్గదర్శకత్వంలో కార్యకర్తలను కలుపుకుని పని చేస్తా’’ అని చెప్పారు. ‘‘మహిళలతోపాటు యువత రాజకీయాల్లో కొస్తే కొత్త ఆలోచనలతోపాటు, సాంకేతిక పరిఙ్ఙానాన్ని ఉపయోగించుకుని సమస్యలను త్వరగా పరిష్కరించే అవకాశం ఉంది. ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. అందుకే ప్రజలు నాకు అవకాశం కల్పించారు. పార్టీతోపాటు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల సమస్యలు పరిష్కరిస్తా’’ అని కృష్ణవేణి అన్నారు. ‘రాజకీయ అనుభవం లేని మీరు రాజకీయ బురదలోకి ఎందుకుకొస్తున్నారు.. వచ్చినా.. ఎలా నెగ్గుకొస్తారు?’ అని కృష్ణవేణిని చాలామందే ప్రశ్నించారు. వారందరికీ చిరునవ్వుతో ఆమె చెప్పిన సమాధానం ఒక్కటే. ‘‘రాజకీయం బురద కాదు. బురదను శుభ్రం చేసే అవకాశం?’’అని! శ్రమను గుర్తించాడు కుషాల్! ‘నేను గెలిచినట్టు ప్రకటన రాగానే వాడిని ‘నాకు కంగ్రాట్స్ చెప్పవా?’ అని అడిగితే మా పెద్దబ్బాయి ఏమన్నాడో తెలుసా... సింపుల్‌గా ‘నీ కష్టానికి ఫలితం దక్కింది’ అన్నాడు. ఆ మాట నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. అభినందనలు చెప్పినా అంత ఆనందం కలిగేది కాదేమో! నా శ్రమను గుర్తించాడు మా పెద్దబ్బాయి’ అని కృష్ణవేణి చెప్పారు. అన్నట్టు... ప్రత్యర్థులు కూడా ఆమెను ‘లోకం తెలియని’ ఇల్లాలిగానే ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని తన గెలుపుతో తిప్పికొట్టారు కృష్ణవేణి. • ‘రాజకీయాలొద్దు... బురద’ అన్నారు పెద్దవాళ్లు. •‘ఎందుకమ్మా ఇదంతా’ అన్నాడు పెద్ద కొడుకు. •‘లోకం తెలియని ఇల్లాలివి’ అన్నారు ప్రత్యర్థులు. • అయినా ఆమె నిలిచారు. నిలిచి గెలిచారు. – గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంబై -
9 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రైల్వే కోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండలం బలపల్లె వద్ద టాస్క్ఫోర్సు తనిఖీలు జరిపింది. ఈ సందర్భంగా టాస్క్ఫోర్సు అధికారులను చూసి పదిమంది ఎర్రచందనం కూలీలు పరారయ్యారు. ఆ స్థలంలో 9 ఎర్రచందనం దుంగలను టాస్క్ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
నోట్లు మార్పిడి ముఠా అరెస్టు
నందలూరు: పాత పెద్ద నోట్లను తీసుకుని కమీషన్ పట్టుకుని కొత్త నోట్లను ఇచ్చేందుకు ప్రయత్నించిన తొమ్మిది మంది సభ్యులు గల ముఠాను అరెస్టు చేసినట్లు నందలూరు ఎస్ఐ శ్రీనివాసులరెడి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓబులవారిపల్లె, మంగంపేట, రైల్వేకోడూరుకు చెందిన మోడి శ్రీనివాసులు, యస్.రాజగోపాల్, మొగలి నవీన్‌కుమార్, రాచపోయిన చెంగల్రాయుడు, మద్దిల నాగరాజు, కోడూరు రాంబాబు, నాటూరు నరసింహారెడ్డి, కొండా వెంకటేష్, కొండా రమేష్‌బాబులు నందలూరు చెయ్యేరు బ్రిడ్జి కింద నీలిపల్లి ప్రాంతంలో ఉండగా అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.10 వేలు నగదు, ఒక ఇండికా కారు, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరు కమీషన్‌కు కక్కుర్తి పడి పాత నోట్లుతీసుకు ని కొత్త నోట్లు ఇచ్చేందుకు ప్రయత్నించారన్నారు. తమకు అందిన పక్కా సమాచారంతో వీరిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారన్నారు. కాగా 9 మంది వద్ద కేవలం రూ.10 వేలు మాత్రమే ఉన్నాయనడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఆటోను ఢీకొన్న లారీ : ఒకరి మృతి
రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు రూరల్ మండలం ఎస్ ఉప్పరపల్లి హరిజనవాడ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ... ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను 108 వాహనంలో రైల్వేకోడూరులోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మృతుడి వివరాలు మాత్రం తెలియరాలేదని పోలీసులు తెలిపారు. -
రైలు కింద పడి వ్యక్తి మృతి!
రైల్వేకోడూరు : రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు స్టేషన్ సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పాతగేటు సమీపంలో ముక్కలు ముక్కలుగా పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచరం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చికిత్స పొందుతూ యువకుడు మృతి
వైఎస్సార్ జిల్లా: రైల్వేకోడూరు మండలం మాధవరంపోడుకు చెందిన మల్లు మల్లికార్జునరెడ్డి(23) ఈ నెల 10వ తేదీన మదనపల్లె సమీపంలో ఆర్టీసు బస్సు బైక్‌ను ఢీకొన్న ఘటనలో గాయపడ్డాడు. బెంగుళూరుకు తరలించగా అక్కడ ఓ ప్రైవేటు వైద్యశాలలో వైద్యం పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు అతని బంధువులు తెలిపారు. మృతుడు మదనపల్లెలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో చదువు పూర్తి చేశారని, సర్టిఫికెట్లు తీసుకుని వచ్చేటప్పుడు ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈయనపై చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో 10 ఎర్రచందనం కేసులు ఉన్నట్లు సమాచారం. -
రూ. 3 కోట్ల ఎర్రచందనం స్వాధీనం
రైల్వే కోడూరు: వైఎస్సార్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం నాగేటికోట అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న అటవీ అధికారులు భారీ ఎర్రచందనం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి నుంచి కొనసాగుతున్న ఈ కూంబింగ్‌లో ఇప్పటి వరకు 182 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని అక్రమంగా అంతర్జాతీయ మార్కెట్లో అమ్మడానికి యత్నిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ. 3 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
టీడీపీ నేత ఇంటిపై ఐటీ దాడులు
రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లాలో ఓ టీడీపీ నేత ఇంటిపై సోమవారం ఆదాయపుపన్ను శాఖాధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రైల్వే కోడూరు టీడీపీ ఇంఛార్జ్ విశ్వనాథ్‌నాయుడు ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో అధికారులు మెరుపు దాడులు చేపట్టారు. రైల్వేకోడూరు, తిరుపతిలోని ఇళ్లు, ఆయన కార్యాలయాలతో పాటు టీడీపీ కార్యాలయాల్లో దాడులు కొనసాగుతున్నాయి. భారీ ఎత్తున ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐటీ అధికారుల దాడులు జరుగుతున్నాయి. -
ఆటో, బస్సు ఢీకొని ఒకరు మృత్యువాత
వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు సమీపంలో గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణ సమీపంలోని వై.కోట బైపాస్ వద్ద ఓబులవారిపల్లె మండలం మంగళంపల్లె వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఒకరు అక్కడికక్కడే చనిపోగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను రైల్వేకోడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రైల్వే కోడూరు (వైఎస్సార్ జిల్లా): అక్రమంగా తరలించేందుకు మామిడి తోటలో దాచి ఉంచిన 51 ఎర్రచందనం దుంగలను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండలం జ్యోతికాలనీకి ఎదురుగా ఉన్న మామిడి తోటలో ఎర్రచందనం దుంగలు దాచి ఉంచారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రూ. 25 లక్షల విలువైన ఎర్రదుంగలను స్వాధీనం చేసుకున్నారు. -
గొంతు కోసి యువకుడి హత్య
రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం బజ్జువారిపల్లె పంచాయతీ బంగ్లామిట్ట సమీపంలో ఒక యువకుడిని గొంతు కోసి హతమార్చారు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. రామయ్యపాళెం ఎస్టీ కాలనీకి చెందిన పెంచలసుబ్రమణ్యం(22) ఆదివారం సాయంత్రం బంగ్లామిట్టలో జరిగిన జాతరకు వచ్చాడు. జాతర అనంతరం బైక్‌పై వెళుతున్నసుబ్రమణ్యంను కత్తులతో గొంతుకోసి బైక్‌పైనే శవాన్ని వదిలేసి వెళ్లారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
31మంది తమిళ కూలీలు అరెస్ట్
రైల్వే కోడూరు (వైఎస్సార్ జిల్లా) : అక్రమంగా ఎర్ర చందనం దుంగలను తరలించడానికి ప్రయత్నిస్తున్న 31 మంది తమిళ కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం కుప్పలదొడ్డి సమీపంలో శనివారం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి సీఐ రసూల్ సాబ్ బృందం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా.. రైల్వే ట్రాక్ సమీపంలో ఎర్రచందనం దుంగలను తరలించడానికి ప్రయత్నిస్తున్న కూలీలు తారసపడ్డారు. దీంతో పోలీసులు 31 మంది తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 34 ఎర్ర చందనం దుంగలతో పాటు, ఓ కారు, ఓ లారీ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సీఐ శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.