అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రైల్వేకోడూరు: అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం దేశెట్టిపల్లి ఫారెస్ట్‌బీట్‌లో పట్టుకున్నారు. అటవీ అధికారులు సాధారణ తనిఖీలు చేస్తుండగా ఇన్నోవా వాహనంలో ఐదు ఎర్రచందనం దుంగలను గుర్తించారు. ఇన్నోవా వాహనాన్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం.