కారులో రూ.10 లక్షలు స్వాధీనం | 10 lakshs caught in ysr distirict | Sakshi
Sakshi News home page

కారులో రూ.10 లక్షలు స్వాధీనం

Published Fri, Aug 28 2015 11:51 AM | Last Updated on Sun, Sep 3 2017 8:18 AM

10 lakshs caught in ysr distirict

రైల్వేకోడూరు: కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. 10 లక్షలను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం బాలుపల్లి చెక్‌పోస్ట్ వద్ద జరిగింది. వివరాలు.. కర్ణాటక రాష్ట్రం పేరుతో రిజిస్ట్రేషన్ ఉన్న కారులో అక్రమంగా రూ. 10 లక్షలను తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులను డబ్బు గురించి వివరాలు అడగ్గా.. పొంతనలేని సమాధానాలు చెప్పారు.

దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా, నిందితులను ఉత్తరప్రదేశ్, చిత్తూరు, కర్ణాటకలోని పోలార్‌కు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. డబ్బు స్వాధీనం చేసుకొని, కారును సీజ్ చేశారు. కేసు నమోదు చేసి నిందితులను విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement