Rs.10 lakhs
-
భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం
వైఎస్సార్ జిల్లా : రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట చెరువుకట్ట పక్కన ముళ్ల పొదల్లో ఉన్న 9 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పోలీసులు రాకతో ఎర్రచందనం స్మగ్లర్లు దుంగలను ముళ్లపొదల్లో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రామయ్యకు రూ.10 లక్షల కిరీటం
భద్రాచలం: అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం కేటిల్కు చెందిన మేళ్లచెర్వు శ్రీకాంత్ సత్యనారాయణ, నావర్ధిని దంపతులు, కుటుంబసభ్యులు భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారికి రూ.10 లక్షల విలువైన బంగారు కిరీటం (311 గ్రాముల 270 మిల్లీ గ్రాములు), రూ.2 లక్షల విలువైన బంగారు పగడాల హారం (58 గ్రాముల 310 మిల్లీ గ్రాములు)లను కానుకగా ఇచ్చారు. ఉదయం శ్రీకాంత్ కుటుంబసభ్యులు అంతరాలయంలోని స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. శ్రీలక్ష్మీతయారమ్మవారిని, ఆంజనేయస్వామివారిని దర్శించుకున్నారు. ఈ బంగారు కిరీటాన్ని ప్రతిరోజు దర్బారు సేవలో స్వామివారికి ధరింపజేయనున్నారు. -
రూ.10 లక్షల విరాళం
గుంతకల్లు రూరల్ : నెట్టికంటి ఆంజనేయస్వామి వారి దేవస్థానానికి బెంగుళూరు కుచెందిన తిలక్ కుమార్ అనే వ్యాపారి రూ.10 లక్షల విరాళం అందజేశారు. కుటుంబ సమేతంగా ఆదివారం ఆలయానికి విచ్చేసిన ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆధ్వర్యంలో దాదాపు రూ.2.5 కోట్లతో వెండి రథం నిర్మాణానికి ఆలయ అధికారులు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో తిలక్ కుమార్ తన వంతు విరాళంగా రూ.10 లక్షల చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. -
ఫ్యాన్సీ నంబర్ కోసం రూ.10 లక్షలు వెచ్చించిన ఎన్టీఆర్
హైదరాబాద్ : సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కొత్తగా కొనుగోలు చేసిన బీఎండబ్ల్యు కారు కోసం టీఎస్ 09 ఈఎల్ 9999 ఫ్యాన్సీ నంబర్ ను భారీ మొత్తం చెల్లించి దక్కించుకున్నారు. ఈ నంబర్ కోసం రూ.10 లక్షలు వెచ్చించారు. ఈ నంబర్ కోసం శనివారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేలంలో జూనియర్‌తో పాటు మరో ముగ్గురు పోటీపడ్డారని రవాణా శాఖ అధికారులు తెలిపారు. చివరికి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే బరిలో నిలిచి నంబర్ దక్కించుకున్నారని తెలిపారు. -
రూ. 50 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
సీతారామపురం: అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం దేవమ్మ చెరువు అటవీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజాము నంచి అటవీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడులలో 65 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ సుమారు రూ. 50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. -
పోలీసునంటూ రూ.10 లక్షల దోపిడీ
నాచారం (హైదరాబాద్) : బ్యాంక్ నుంచి రూ.10 లక్షలు డ్రా చేసుకుని తీసుకువెళుతున్న ఓ వ్యక్తిని తాను లోకల్ పోలీస్‌నంటూ ఓ వ్యక్తి అడ్డగించి ఆ నగదుతో పరారయ్యాడు. ఈ ఘటన నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం కొలుటూరుకు చెందిన రైతు మల్లారెడ్డి (65)... మంగళవారం ఉదయం శామీర్‌పేటలోని సెంట్రల్ బ్యాంకు నుంచి రూ.10 లక్షలు డ్రా చేసుకున్నాడు. అనంతరం నాచారం హెచ్ఎంటీ కాలనీలోని తన స్నేహితుడిని కలిసేందుకు బైక్‌పై వెళుతున్నాడు. హబ్సిగూడ దాటిన తర్వాత ఓ వ్యక్తి మల్లారెడ్డిని ఆపాడు. తాను స్థానిక పోలీస్‌నని, బండి కాగితాలు చూపించాలని కోరాడు. దీంతో మల్లారెడ్డి బండిలో ఉన్న కాగితాలను చూపించే పనిలో ఉండగా నగదు బ్యాగుతో ఆ నకిలీ పోలీస్ పరారయ్యాడు. మల్లారెడ్డి లబోదిబోమంటూ నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
రూ.10 లక్షల సొత్తుతో ఉడాయించిన టాక్సీ డ్రైవర్
శంషాబాద్ : రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు మోసపోయారు. వారిద్దరినీ బురిడీ కొట్టించి రూ.10 లక్షల సొత్తుతో కారు డ్రైవర్ పరారయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన ఖలీద్, బోధన్‌కు చెందిన నాసర్ నాలుగేళ్లుగా కువైట్‌లో ఉంటున్నారు. వారిద్దరూ శుక్రవారం సాయంత్రం విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఎంజీబీఎస్‌కు వెళ్లేందుకు వారిద్దరూ ఓ కారును మాట్లాడుకున్నారు. అందులో ఎక్కి కొంతదూరం వెళ్లాక...'ఎయిర్‌పోర్టు టాక్సీ స్టాండు వద్ద మీ జేబులో నుంచి కొన్ని కాగితాలు పడిపోవటం చూశాను. అవి పాస్‌పోర్టు, వీసాలాగానే ఉన్నాయి...' అంటూ కారు డ్రైవర్ వారిని తికమకపెట్టాడు. అతని మాటలు నిజమేననుకున్న ఖలీద్, నాసర్ కారును వెనక్కి తీసుకెళ్లాలని కోరారు. ఎయిర్‌పోర్టు టాక్సీ స్టాండు వద్దకు వెళ్లాక వారిద్దరూ కిందికి దిగి వెతుకులాట మొదలుపెట్టారు. వారు ఏమరుపాటుగా ఉన్న సమయాన్ని గమనించి కారు డ్రైవర్ వారి లగేజీతో మాయమయ్యాడు. మోస పోయామని గ్రహించిన బాధితులు ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ బ్యాగుల్లో 450 కువైట్ దినార్లు, 10 సెల్ఫోన్లు, 5 తులాల బంగారు ఆభరణాలు తదితర రూ.10 లక్షల విలువైన సొత్తు ఉందని వారు పేర్కొన్నారు. అయితే, శనివారం సాయంత్రం వరకు ఆ కేసు దర్యాప్తు ప్రారంభం కాలేదనే సమాచారం మేరకు వారు జిల్లాకు చెందిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఆయన జోక్యం చేసుకోవటంతో పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
కారులో రూ.10 లక్షలు స్వాధీనం
రైల్వేకోడూరు: కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. 10 లక్షలను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం బాలుపల్లి చెక్‌పోస్ట్ వద్ద జరిగింది. వివరాలు.. కర్ణాటక రాష్ట్రం పేరుతో రిజిస్ట్రేషన్ ఉన్న కారులో అక్రమంగా రూ. 10 లక్షలను తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులను డబ్బు గురించి వివరాలు అడగ్గా.. పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా, నిందితులను ఉత్తరప్రదేశ్, చిత్తూరు, కర్ణాటకలోని పోలార్‌కు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. డబ్బు స్వాధీనం చేసుకొని, కారును సీజ్ చేశారు. కేసు నమోదు చేసి నిందితులను విచారిస్తున్నారు. -
పెద్ద మొత్తంలో గుట్కాల పట్టివేత
డెంకాడ (విజయనగరం) : విజయనగరం జిల్లా డెంకాడలో నిషేధిత ఖైనీలు పెద్ద మొత్తంలో బయటపడ్డాయి. జిల్లా ఆహార భద్రతా అధికారి నందాజీ ఆధ్వర్యంలో.. మూసివేసిన ఓ రైస్ మిల్లు గోదాముపై సోమవారం ఉదయం దాడులు జరిగాయి. ఈ సందర్భంగా గోదాములో 200 బాక్సుల్లో నిల్వ చేసిన రాజా ఖైనీలు వెలుగు చూడగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.10 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక్కడ నిల్వ చేసి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. రైస్ మిల్లు గోదామును నరసింహమూర్తి అనే వ్యక్తి మరో వ్యక్తికి లీజుకిచ్చినట్టు తెలియడంతో ఆ వ్యక్తి కోసం అన్వేషణ ప్రారంభించారు. -
ధర్మవరంలో అగ్ని ప్రమాదం
అనంతపురం: అనంతపురం జిల్లా ధర్మవరం మండలకేంద్రం పీఆర్టీ వీధిలోని ఓ ఎలక్ట్రికల్ దుకాణంలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ దుకాణంలోని షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని సకాలంలో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల నుంచి రూ.40 లక్షల దాకా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. (ధర్మవరం) -
చెట్టుకు కట్టేసి... రూ.10 లక్షలు డిమాండ్
కర్నూలు: ఇద్దరు దుండగులు డబ్బుల కోసం ఓ ఎడ్ల వ్యాపారిని అడవిలో నిర్బంధించిన ఘటన కర్నూలు జిల్లా బేతంచెర్ల మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం... నెల్లూరు జిల్లా కలిగిరి మండలం చింతినకోడూరుకు చెందిన కొండయ్య కొన్నేళ్లుగా బేతంచెర్ల పరిసర ప్రాంతాల్లో ఎడ్ల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మార్చి 5వ తేదీ సాయంత్రం బేతంచెర్ల మండలం ఉసినాపురం గ్రామానికి చెందిన బాలీశ్వర్‌రెడ్డి మరో వ్యక్తి వచ్చి ఎడ్ల అమ్మకం విషయమై కొండయ్యను బండిపై ఎక్కించుకుని సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ చెట్టుకు కట్టేసి నిర్బంధించారు. రూ.10 లక్షలు ఇవ్వాలని, లేకుంటే చంపేస్తామని కొండయ్య కుటుంబ సభ్యులను ఫోన్ చేసి బెదిరించారు. అయితే, శుక్రవారం సాయంత్రం బాలీశ్వర్‌రెడ్డి, మరో వ్యక్తి మద్యం మత్తులో ఉన్న సమయంలో కొండయ్య చేతికి కట్టిన తాళ్లను విడిపించుకుని అక్కడి నుంచి పరారై... పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు.' -
'ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 10 లక్షల నిధులు'
ఏలూరు: తీరప్రాంత మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శనివారం పశ్చిమగోదావరిజిల్లాలోని మోరీ, కలవపూడి గ్రామాలలో ఎన్టీఆర్ సుజల స్రవంతి, నీరు - చెట్టు, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అనంతరం బాబు మాట్లాడుతూ.... ప్రతి గ్రామానికి తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 10 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల అభివృద్ధికి రూ. 1300 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. -
'అమరుల త్యాగాలను కేసీఆర్ అవమానపరచడమే'
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మంగళవారం లేఖ రాశారు. తెలంగాణ కోసం 2వేల మంది అమరులయ్యారంటూ అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్... ఇప్పుడు కేవలం 459 మంది అమరుల కుటుంబాలకు మాత్రమే ఆర్థిక సాయం ప్రకటించటం సరికాదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఈ చర్య ముమ్మాటికీ తెలంగాణ అమరుల త్యాగాలను అవమానపరచడమేనని, మిగిలిన అమరుల కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం ప్రకటించాలని షబ్బీర్ అలీ తన లేఖలో డిమాండ్ చేశారు. కాగా తెలంగాణ కోసం ప్రాణాత్యాగాలు చేసిన 459మంది అమరుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.పది లక్షల ఎక్స్‌గ్రేషియాను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
నర్సీపట్నంలో భారీగా గంజాయి పట్టివేత
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వాహనాన్ని సీజ్ చేసి నిందితులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.