అనంతపురం జిల్లా ధర్మవరం మండలకేంద్రం పీఆర్‌టీ వీధిలోని ఓ ఎలక్ట్రికల్ దుకాణంలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది.
అనంతపురం: అనంతపురం జిల్లా ధర్మవరం మండలకేంద్రం పీఆర్‌టీ వీధిలోని ఓ ఎలక్ట్రికల్ దుకాణంలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ దుకాణంలోని షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని సకాలంలో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల నుంచి రూ.40 లక్షల దాకా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.
(ధర్మవరం)