ధర్మవరం ఎమ్మార్సీ సమీపంలో నివసిస్తున్న పుణ్యవతి, ప్రతాప్ దంపతుల ఇంట్లో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది.
ధర్మవరం అర్బన్ : ధర్మవరం ఎమ్మార్సీ సమీపంలో నివసిస్తున్న పుణ్యవతి, ప్రతాప్ దంపతుల ఇంట్లో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. వ్యవసాయ పనుల నిమిత్తం ప్రతాప్ పొలానికి వెళ్లగా, పుణ్యవతి విధి నిర్వహణ కోసం చెన్నేకొత్తపల్లికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యుత్‌షార్ట్‌సర్క్యూట్ సంభవించింది.
స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా, వారు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఇంట్లోని ఫ్రిజ్, టీవీ, మిక్సి, గ్రైండర్, ట్యూబ్‌లైట్లు, వైర్లు, బియ్యం, దుస్తులు, సామగ్రి, మంచం తదితర ఇంటి సామగ్రి కాలిపోయాయి. వీఆర్‌ఓ రాజశేఖర్ సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు నమోదు చేసుకున్నారు. రూ.5 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా.