చెట్టుకు కట్టేసి... రూ.10 లక్షలు డిమాండ్ | Businessman kidnapped, Rs.10 lakhs demand in kurnool district | Sakshi
Sakshi News home page

చెట్టుకు కట్టేసి... రూ.10 లక్షలు డిమాండ్

Published Sat, Mar 7 2015 7:17 PM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM

Businessman kidnapped, Rs.10 lakhs demand in kurnool district

కర్నూలు: ఇద్దరు దుండగులు డబ్బుల కోసం ఓ ఎడ్ల వ్యాపారిని అడవిలో నిర్బంధించిన ఘటన కర్నూలు జిల్లా బేతంచెర్ల మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం... నెల్లూరు జిల్లా కలిగిరి మండలం చింతినకోడూరుకు చెందిన కొండయ్య కొన్నేళ్లుగా బేతంచెర్ల పరిసర ప్రాంతాల్లో ఎడ్ల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మార్చి 5వ తేదీ సాయంత్రం బేతంచెర్ల మండలం ఉసినాపురం గ్రామానికి చెందిన బాలీశ్వర్‌రెడ్డి మరో వ్యక్తి వచ్చి ఎడ్ల అమ్మకం విషయమై కొండయ్యను బండిపై ఎక్కించుకుని సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు.

అక్కడ చెట్టుకు కట్టేసి నిర్బంధించారు. రూ.10 లక్షలు ఇవ్వాలని, లేకుంటే చంపేస్తామని కొండయ్య కుటుంబ సభ్యులను ఫోన్ చేసి బెదిరించారు. అయితే, శుక్రవారం సాయంత్రం బాలీశ్వర్‌రెడ్డి, మరో వ్యక్తి మద్యం మత్తులో ఉన్న సమయంలో కొండయ్య చేతికి కట్టిన తాళ్లను విడిపించుకుని అక్కడి నుంచి పరారై... పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు.'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement