'అమరుల త్యాగాలను కేసీఆర్ అవమానపరచడమే' | congress MLC Shabbir ali Letter to KCR on pays money to 459 telangana martyrs | Sakshi
Sakshi News home page

'అమరుల త్యాగాలను కేసీఆర్ అవమానపరచడమే'

Published Tue, Oct 28 2014 2:23 PM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

congress MLC Shabbir ali Letter to  KCR on pays money to 459 telangana martyrs

హైదరాబాద్ :  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మంగళవారం లేఖ రాశారు. తెలంగాణ కోసం 2వేల మంది అమరులయ్యారంటూ అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్... ఇప్పుడు కేవలం 459 మంది అమరుల కుటుంబాలకు మాత్రమే ఆర్థిక సాయం ప్రకటించటం సరికాదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

 

ఈ చర్య ముమ్మాటికీ తెలంగాణ అమరుల త్యాగాలను అవమానపరచడమేనని, మిగిలిన అమరుల కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం ప్రకటించాలని షబ్బీర్ అలీ తన లేఖలో డిమాండ్ చేశారు. కాగా తెలంగాణ కోసం ప్రాణాత్యాగాలు చేసిన 459మంది అమరుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.పది లక్షల ఎక్స్గ్రేషియాను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement