రైల్వేకోడూరు అర్బన్ : కారుతో సహా పది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ రసూల్ సాహెబ్ తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ.. గురువారం సాయంత్రం మండల పరిధిలోని బాలుపల్లె సెక్షన్ దేశెట్టిపల్లె బీట్‌లోని కె.బుడుగుంటపల్లె గ్రామ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏపీ 16పీ0727నెంబర్ గల కారులో పది దుంగలను గుర్తించామని, కారులో ఉన్న కడప పట్టణం రామాంజినేయపురంకు చెందిన యాదగిరి శివప్రసాద్, అదే గ్రామానికి చెందిన చిన్నవీరయ్య, ఓబులవారిపల్లె మండలం బాలురెడ్డిపల్లె గ్రామానికి చెందిన సుబ్బారెడ్డిని అరెస్టు చేశామన్నారు.
వీరి వెనుక బడా స్మగ్లర్లు ఉన్నారని, త్వరలో వారిని కూడా పట్టుకుంటామన్నారు. సుబ్బారెడ్డి అడవుల్లోకి మనుషులను పంపించి దుంగలు తెప్పించి బడా స్మగ్లర్లకు సరఫరా చేసేవారన్నారు. కేసు నమోదు చేసి బడా స్మగ్లర్లను త్వరలో పట్టుకుంటామన్నారు. పట్టుబడ్డ దుంగలు 74కేజీలు, దుంగల విలువ రూ.లక్షా74వేలు, కారు రూ.2లక్షలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రమేష్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు.
10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
Published Fri, Oct 9 2015 4:48 PM | Last Updated on Sun, Sep 3 2017 10:41 AM
Advertisement
Advertisement