red sander
-
చిత్తూరు జిల్లాలో పోలీసుల కూంబింగ్
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లాలో మరోసారి ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. శ్రీవారి మెట్టు సమీపంలో శుక్రవారం పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులకు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. పోలీసులను చూసి ఎర్రచందనం దుంగలను వదిలేసి కూలీలు పరారయ్యారు. ఘటనాస్థలంలో 8 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. -
పోలీసులపై ఎర్ర కూలీల రాళ్లదాడి
చిత్తూరు: కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులపై తమిళ కూలీలు రాళ్ల దాడి చేశారు. ఈ సంఘటన జిల్లాలోని బాకరావుపేట ఘాట్‌రోడ్డులో బుధవారం తెల్లవారుజాము నుంచి టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించి ఇద్దరు తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 11 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ‘ఎర్ర’ కూలీలు పోలీసులపైకి రాళ్లు రువ్వి పరారయ్యారు. వారి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
నగరంలో ఎర్రచందనం స్వాధీనం
హైదరాబాద్: నగరంలోని దోబీ ఘాట్ వద్ద 240 కిలోల ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాద్‌నగర్ నుంచి హైదరాబాద్‌కు ఓ ఆటో ట్రాలీలో తరలిస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సోదాలను గుర్తించిన ఆటో డ్రైవర్ ఎర్రచందనం దుంగలను వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ఓ పూల డెకరేషన్ షాపు యజమానిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంతర్జాతీయ స్మగ్లర్ కందస్వామి అరెస్ట్
కడప క్రైం: అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న అంతర్జాతీయ స్మగ్లర్ పార్తీబన్ కందస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు ముగ్గురు తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 638 కిలోల బరువు ఉన్న 21 ఎర్రచందనం దుంగలతో పాటు ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం కడపలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ టీహెచ్‌డీ రామకృష్ణ వివరాలు తెలిపారు. -
తిరుపతిలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు
తిరుపతి: అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను టాస్క్ఫోర్సు పోలీసులు మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా భూపాల్కాలనీలో పట్టుకున్నారు. మంగళవారం ఫోర్డు ఎన్డెవర్ వాహనంలో ఎర్రచందనం తరలిస్తున్నారనే సమాచారంతో భూపాల్ కాలనీ దగ్గర టాస్క్ఫోర్సు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 21 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనంతో పాటు వాహనాన్ని సీజ్ చేశారు -
నల్లమలలో కూంబింగ్
కర్నూలు: కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో సోమవారం పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. నల్లమలలో స్మగ్లర్ల కదిలిక నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. తాజాగా ఈ రోజు ఉదయం జరిపిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని అధికారులు పట్టుకున్నారు. రవాణా చేస్తున్న 40 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు కూలీలను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన కూలీలు తమిళనాడుకు చెందినవారిగా గుర్తించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రూ. 50 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
సీతారామపురం: అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం దేవమ్మ చెరువు అటవీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజాము నంచి అటవీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడులలో 65 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ సుమారు రూ. 50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. -
రూ. 25 లక్షల ఎర్రచందనం స్వాధీనం
రైల్వే కోడూరు: అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు రైల్వేకోడూరులోని బాలుపల్లి చెక్‌పోస్టు వద్ద పట్టుకున్నారు. షేక్ దర్బార్ బాషా, మన్నూరు హుస్సేన్ అనే ఇద్దరు ఎర్రచందనం దొంగలను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ఇద్దరూ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ హసన్ భాయ్ అనుచరులుగా గుర్తించారు. వీరి నుంచి 28 ఎర్రచందనం దుంగలు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీకాకుళంలో ఎర్రచందనం పట్టివేత
పర్లాకిమిడి: శ్రీకాకుళం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. వజ్రపు కొత్తూరు మండలం వెంకటాపురం వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం తనిఖీలు చేపట్టిన పోలీసులకు స్కార్పియోలో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలు కనిపించాయి. సుమారు 390 కిలోల బరువైన 11 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవిప్రసాద్, అజయ్, మహంతి అనే వ్యక్తులను అరెస్ట్ చేసి ఒడిస్సా పోలీసులకు అప్పగించారు. దుంగలను పర్లాకిమిడి నుంచి ఒడిశా వైపు తరలిస్తున్నట్లు తేలింది. ఈ కేసును పర్లాకిమిడి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. కేసు నమోదు చేశారు. -
బడా స్మగ్లర్ అరెస్ట్
రామచంద్రాపురం: చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం గోకులాపురం గ్రామంలో ఎర్రచందనం బడా స్మగ్లర్ పురుషోత్తంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి ఇదే గ్రామంలో కూలీలను తరలిస్తున్న తుఫాన్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో కూలీలు పరారయ్యారు. కాగా, విచారణలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కోసమే పురుషోత్తంరెడ్డి వారిని తరలిస్తున్నట్టు తేలింది. దీంతో శనివారం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం చెట్లను ధ్వంసం చేసి దుంగలను చెన్నైకు స్మగ్లింగ్ చేయడంలో పురుషోత్తంరెడ్డి ఆరితేరినట్టు సమాచారం. ఇతడిపై ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నాయి. తాజా సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
కడప టౌన్: అంతర్జాతీయ ఎర్రచందనం దొంగ జైపాల్‌ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ నెల 14న హర్యానాలో జైపాల్‌ను కడప టాస్క్‌పోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, శనివారం కడపలో జరిగిన మీడియా సమావేశంలో నిందితుడిని ప్రవేశపెట్టారు. ఓబులవారిపల్లె, పెండ్లిమర్రి పోలీస్స్టేషన్ల పరిధిలో జైపాల్‌పై పలుకేసులు నమోదయ్యాయి. అతనికి ఢిల్లీ, చైనాలోని అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్లతో సంబంధాలున్నాయని పోలీసులు తెలిపారు. మరో ఘటనలో నేపాల్‌కు చెందిన లక్షణడాంగ్, ఢిల్లీకి చెందిన టింకూశర్మ ఇద్దరిని టాస్క్‌పోర్స్ పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిద్దరిని ఢిల్లీ నుంచి కడపకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రూ.15 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
కడప: వైఎస్ఆర్ జిల్లాలో భారీగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని చాపాడులో బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆరుగురి ఎర్రచందనం దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 15 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కర్నూలు జిల్లా వాసలుగా గుర్తించారు. రెండు కార్లను సీజ్ చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
రైల్వే కోడూరు: వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరులోని బాలుపల్లి అటవీ ప్రాంతంలో సింధుకొండ చెక్‌డ్యాం సమీపంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.5 లక్షల విలువ చేసే 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారంతా బూడుగుంట, సిద్ధారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వారు. వీరిపై కేసు నమోదు చేసుకుని స్టేషన్‌కు తరలించారు. -
5 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రైల్వేకోడూరు: అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం దేశెట్టిపల్లి ఫారెస్ట్‌బీట్‌లో పట్టుకున్నారు. అటవీ అధికారులు సాధారణ తనిఖీలు చేస్తుండగా ఇన్నోవా వాహనంలో ఐదు ఎర్రచందనం దుంగలను గుర్తించారు. ఇన్నోవా వాహనాన్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం.