అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్ | red sander smuggaler jaipal arrested | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్

Published Sat, Jul 18 2015 1:32 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

red sander smuggaler jaipal arrested

కడప టౌన్: అంతర్జాతీయ ఎర్రచందనం దొంగ జైపాల్‌ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ నెల 14న హర్యానాలో జైపాల్‌ను కడప టాస్క్‌పోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, శనివారం కడపలో జరిగిన మీడియా సమావేశంలో నిందితుడిని ప్రవేశపెట్టారు. ఓబులవారిపల్లె, పెండ్లిమర్రి పోలీస్‌స్టేషన్ల పరిధిలో జైపాల్‌పై పలుకేసులు నమోదయ్యాయి. అతనికి ఢిల్లీ, చైనాలోని అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్లతో సంబంధాలున్నాయని పోలీసులు తెలిపారు.

మరో ఘటనలో నేపాల్‌కు చెందిన లక్షణడాంగ్, ఢిల్లీకి చెందిన టింకూశర్మ ఇద్దరిని టాస్క్‌పోర్స్ పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిద్దరిని ఢిల్లీ నుంచి కడపకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement