smuggler
-
Mahakumbh-2025: ఏడాదిన్నరగా పరారై.. పుణ్యస్నానం చేస్తూ పోలీసులకు చిక్కి..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. దేశంతో పాటు ప్రపంచంలోని నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి వచ్చి, పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భారీ జనసమూహంతో కిటకిటలాడుతున్న ఈ ప్రాంతంలో పలు ఆసక్తికర ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా పరారీలోవున్న ఒక నేరస్తుడు పుణ్యస్నానం ఆచరిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.వివరాల్లోకి వెళితే ఆదివారం మహా కుంభమేళాలో పర్యాటకులు, భక్తులు స్నానమాచరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఒక మద్యం స్మగ్లర్ కూడా పుణ్యస్నానం చేసేందుకు సంగమతీరానికి చేరుకున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. వారు సంగమస్థలిలో మద్యం స్మగ్లర్ ప్రవేశ్ యాదవ్‌ను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని భదోహి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిమన్యు మాంగ్లిక్ మీడియాకు తెలియజేశారు.మద్యం స్మగ్లర్ ప్రవేశ్ యాదవ్ రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా నివాసి అని అభిమన్యు మాంగ్లిక్ తెలిపారు. ప్రవేశ్ యాదవ్ ఒకటిన్నర సంవత్సరాలుగా పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. 2023, జూలై 29న జాతీయ రహదారి-19పై వాహనాల తనిఖీలు చేస్తుండగా మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ప్రవేశ్ యాదవ్, రాజ్ దోమోలియాలను పోలీసులు అరెస్టు చేసినట్లు అభిమన్యు పేర్కొన్నారు. నాడు ఆ నిందితులు బీహార్‌కు అక్రమంగా తరలిస్తున్న కల్తీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంతలో ప్రవేశ్ యాదవ్ పోలీసుల కన్నుగప్పి, అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే కుంభమేళాలో పుణ్యస్నానం చేసేందుకు ప్రవేశ్ యాదవ్ వచ్చాడన్న సమాచారం అందుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని అభిమన్యు మాంగ్లిక్ తెలిపారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: 10 ప్రత్యేక ఆకర్షణలు.. సోషల్ మీడియాలో చక్కర్లు -
షాకింగ్! ఏకంగా 10 అనకొండలతో వచ్చాడు.. చివరికి..!
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 ఎల్లో అనకొండలను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబట్టాడు.నిందితుడిని అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు తదుపరి దర్యాప్తు మొదలు పెట్టారు.బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక ప్రయాణీకుడు చెక్-ఇన్ బ్యాగ్‌లో దాచిన 10 పసుపు రంగు అనకొడలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు. ఒక సూట్ కేసులో ఒక తెల్లని కవర్లో వీటిని జాగ్రత్తగా ప్యాక్ చేశాడు. కానీ తనిఖీల్లో దొరికిపోయాడు. ప్యాసింజర్ బ్యాగ్‌లో ఏకంగా 10 పసుపు రంగు అనకొండల్ని చూసిన అధికారులూ షాకయ్యారు.బెంగళూరు కస్టమ్స్ ‘ఎక్స్’లో దీనికి సంబంధించిన ఫోటోలను అధికారులు పోస్ట్ చేశారు. వన్యప్రాణుల రవాణా చట్టవిరుద్ధమని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. (సమ్మర్లో పిల్లలకు ఇలా చేసి పెడితే, ఇష్టంగా తింటారు, బలం కూడా!)#Indiancustomsatwork Bengaluru Air #Customs intercepted attempt to smuggle 10 yellow Anacondas concealed in checked-in bag of a pax arriving from Bangkok. Pax arrested and investigation is underway. Wildlife trafficking will not be tolerated. #CITES #WildlifeProtection 🐍✈️ pic.twitter.com/2634Bxk1Hw— Bengaluru Customs (@blrcustoms) April 22, 2024 -
వీరప్పన్ బిడ్డకు ఎంపీ టికెట్
-
'ఏక్ రూపాయ్వాలా, నీ యవ్వ తగ్గేదేలే...'
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అడవిలో చెట్లు కొట్టుకునే కూలోడు అంతర్జాతీయ స్మగ్లర్‌గా ఎదిగిన కథ ‘పుష్ప’ సినిమా. వాస్తవానికి అలాంటి ఘటనలు నిజ జీవితంలో జరగవు. కానీ.. ఉమ్మడి కరీంనగర్లో పీ డీఎస్ బియ్యం కొనుగోలు చేసి.. అధిక ధరలకు ఇ తర రాష్ట్రాలకు ఎగుమతి చేసే వ్యాపారిని చూస్తే ని జమే అనిపిస్తోంది. ‘ఏక్ రూపాయ్వాలా’ కోడ్ నే మ్తో అధికారులు ముద్దుగా పిలుచుకునే ఈ స్మగ్లర్ నెట్వర్క్ ఒకప్పుడు పాత కరీంనగర్ జిల్లాకే పరిమి తం. నేడు ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. రెండేళ్ల క్రితం ఉమ్మడి జిల్లా దాటి మహారాష్ట్రలో ఎంటర్ అ య్యాడు. ఆ సమయంలో అతడి దందా.. పీడీఎస్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్న తీరును ‘సాక్షి’ దినపత్రిక ‘ఏక్ రూపాయ్వాలా’ శీర్షికన వ రుస కథనాలు ప్రచురించింది. వీటిపై డీజీపీ కార్యాలయం స్పందించి దాడులకు ఆదేశించింది. అప్పటి కరీంనగర్ సీపీ సత్యనారాయణ నేతృత్వంలో టా స్క్‌ఫోర్స్ బృందాలు వరుస దాడులతో విరుచుకుపడ్డాయి. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిని బైండోవర్ కూడా చేశాయి. దీంతో కొంతకా లం సదరు వ్యాపారి, అతని అనుచరులు కార్యకలాపాలు నిలిపివేశారు. సైకిళ్లతో మొదలై.. గూడ్స్ రైళ్లలో తరలించే స్థాయికి.. ఒకప్పుడు గ్రామాల్లో సైకిళ్లపై తిరుగుతూ.. పీడీఎస్ బియ్యాన్ని సేకరించి వాహనాల్లో తరలించడంలో ఏక్ రూపాయ్వాలాది అందెవేసిన చేయి. అప్పట్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలు వ రుసగా రావడం.. పత్రికల్లో వరుస కథనాలు రావడంతో అతడి వ్యాపారం సుప్తావస్థలోకి వెళ్లింది. ఆ తర్వాత కొత్త పద్ధతిలో వ్యాపారంలోకి దిగాడు. అధి కారులకు లంచాలిస్తూ.. మహారాష్ట్రకు బియ్యం తరలించడం కంటే అధికారికంగానే ఎగుమతి చేయాల ని నిర్ణయించాడు. అదునుకోసం చూస్తున్న అతడికి తమిళనాడు తెలంగాణ ప్రభుత్వానికి బియ్యం కో సం చేసిన వినతి ఆసరాగా దొరికింది. రూ.37.50కు కిలో చొప్పున కావాలని తమిళనాడు కోరడం.. ఆ డీల్ రద్దు కావడంతో ‘ఏక్ రూపాయ్వాలా’ రంగంలోకి దిగాడు. కిలో రూ.31.50కే ఇస్తామని డీల్ కుది ర్చినట్లు సమాచారం. ఎగుమతికి కావాల్సిన బి య్యంలో తనవంతుగా పీడీఎస్ రైస్ ఇచ్చేందుకు సి ద్ధమయ్యాడు. అతడికి కావాల్సినంత బియ్యం ఇచ్చేందుకు ఉమ్మడి జిల్లాలోని పలువురు రైస్‌మిల్లర్లు కూడా సమ్మతించారని తెలిసింది. ఇందులో కస్ట మ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ఉన్నట్లు తెలిసింది. వా రం వ్యవధిలో దాదాపు ఐదు వేల టన్నుల బియ్యాన్ని కరీంనగర్ నుంచి గూడ్స్ ద్వారా ఎగుమతి చేసినట్లు సమాచారం. వీటివిలువ దాదాపు రూ.160 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. డిమాండ్ నేపథ్యంలో మరోరూ.60 కోట్ల విలువైన 2వేల ట న్నుల బియ్యాన్ని తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు మరో గూడ్స్రేక్ (కొన్ని బోగీలతో కూ డిన రైలు)ను ఇప్పటికే బుక్చేశారని సమాచారం. ఇంత జరుగుతున్నా.. సివిల్ సప్లయి అధికారులు, పోలీసులకు సమాచారం లేకపోవడం గమనార్హం. అటెన్షన్ డైవర్షన్‌లో అందెవేసిన చేయి.. తెలంగాణ, మహారాష్ట్రలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాలో ‘ఏక్ రూపాయ్వాలా’ది అందె వేసిన చే యి. అచ్చం వీరప్పన్ తరహాలో.. పోలీసులు బందో బస్తుల్లో నిమగ్నమయ్యే సందర్భాల్లోనే భారీ వాహనాల్లో టన్నుల కొద్దీ బియ్యం రాష్ట్ర సరిహద్దులు దా టిస్తాడు. ఇపుడు బహిరంగ దందా చేస్తున్న నేపథ్యంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. తమ పై సివిల్ సప్లయీస్, పోలీసుల కన్ను పడకుండా.. గణేశ్ ఉత్సవాల్లో అధికారులు తలమునకలైన సందర్భాన్ని వాడుకుని రైలు ద్వారా తెలివిగా.. పకడ్బందీగా తమిళనాడుకు బియ్యం ఎగుమతి చేశా డు. త్వరలో ఎన్నికలకోడ్ రాబోతోంది. కోడ్ వస్తే వాహన తనిఖీలు పెరుగుతాయి. దానికి ముందే రెండోవిడత సరుకు పంపేలా ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. కిలో రూపాయి బియ్యాన్ని రూ. 4 లేదా రూ.5 కమీషన్ చొప్పున విక్రయించే ‘ఏక్ రూపాయ్ వాలా’ నేడు రూ.వందల కోట్ల వ్యాపారా నికి పడగలెత్తిన తీరు సినిమా కథను తలపిస్తోంది. ఫిర్యాదు వచ్చింది చర్యలు తీసుకుంటాం కరీంనగర్ నుంచి తమిళనాడుకు సీఎంఆర్ బియ్యం అక్రమంగా వెళ్తున్నాయని మాకు అధికారికంగా ఫిర్యాదు వచ్చింది. వెంటనే అడిషనల్ కలెక్టర్, సివిల్ సప్లయీస్ ఉన్నతాధికారులకు చేరవేశాను. వారు స్పందించి రంగంలోకి దిగారు. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. – రవీందర్ సింగ్, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ -
మహిళా డ్రగ్స్ స్మగ్లర్ మృతి వెనుక అంతుచిక్కని మిస్టరీ..
అది 1985, ఏప్రిల్ 22, నేషనల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్(ఎన్ఎస్ఓ) 35 ఏళ్ల మహిళ గ్లోరియా ఒకాన్‌ను హెరాయిన్‌తో పాటు ఇతర హార్డ్ డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నందుకు నైజీరియాలోని అమీను కానో అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసింది. ఆ సమయంలో ఆమె నుంచి 56.70 గ్రాముల మత్తు పదార్ధాలు, 301 డాలర్లు, 60 పౌండ్ల స్టెర్లింగ్, 20,000యెన్లు,19,000 ఇటాలియన్ లిరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె నైజీరియా నుండి ఇంగ్లండ్‌కు వెళుతోంది. గ్లోరియా ఒకాన్ చేస్తున్న మత్తుమందుల రవాణాకు సంబంధించిన వార్తలు స్థానిక, అంతర్జాతీయ మీడియాలో సంచలనంగా మారాయి. నైజీరియన్లు ఆమె గురించి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి చూపారు. ఎందుకంటే నాటి బుహారీ మిలిటరీ.. నిషేధిత డ్రగ్స్‌తో ఎవరైనా పట్టుబడితో మరణశిక్ష విధిస్తామని ప్రకటించింది. గ్లోరియా ఒకాన్‌ను అరెస్టు చేసిన ఆరు రోజుల తర్వాత అంటే 1985, ఏప్రిల్ 28న కస్టడీలో ఉన్న ఆమె వివాదాస్పద రీతిలో మరణించింది. ఆమె మృతికి ఫుడ్ పాయిజనింగ్ కారణమని మెడికల్ రిపోర్టు వెల్లడించింది. అరెస్టు చేసిన సమయంలో ఆమెలో అనారోగ్య సంకేతాలు లేవని దానిలో పేర్కొన్నారు. తొలగని అనుమానాలు.. గ్లోరియా ఒకాన్‌ను కస్టడీలో ఉంచిన కస్టమ్స్ అధికారి మాట్లాడుతూ ఆమెను అరెస్టు చేసిన రోజున, ఆమె రైస్, బీన్స్ అడిగిందని, ఆ తరువాత ఆమె అనారోగ్యానికి గురయ్యానని తెలిపిందన్నారు. ఆ తరువాత ఆమె మరణించిందని అన్నారు. అయితే ఆమె మరణానికి ముందు ఆమెను పోలీసులు విచారించారు. కానీ ఆమె మాట్లాడేందుకు నిరాకరించింది. అయితే ఆమె ఒక క్లూని మాత్రంవదిలి వెళ్లింది. బస్సీ అనే పేరును విచారణలో ఆమె ప్రస్తావించింది. కాగా గ్లోరియా ఒకాన్ బంధువులెవరూ ఆమె మృతదేహాన్ని క్లెయిమ్ చేయడానికి రాలేదు. అది మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. నాటి పాలకుడు బాబాంగిడా బుహారీని అధికారం నుండి తొలగించిన తర్వాత, గ్లోరియా ఒకాన్ కేసు దర్యాప్తును తిరిగితోడేందుకు నైజీరియన్ న్యాయవాది గని ఫవేహిన్మి సిద్ధమయ్యారు. అయితే గ్లోరియా ఒకాన్ కేసులో ఎటువంటి ముగింపు లేకపోవడంతో నైజీరియన్లలో అనేక ఊహాగానాలు చెలరేగాయి. Her mule, Gloria Okon was caught redhanded, reports claimed she was dead but infact she was secretly pardoned by Babangida, and Dele Giwa had proof of this, he even had a picture of this Gloria and Maryam Babangida in London, Chilling! pic.twitter.com/xs6muRlT48— Ronu Spirit (@ronuspirit) March 17, 2023 సాధారణ జీవితం గడుపుతూ.. గ్లోరియా ఒకాన్ నాటి నైజీరియన్ ఆర్మీ జనరల్ బాబాంగిడా కోసం పనిచేస్తున్నదని కొందరు భావించారు. అందుకే ఆమెను హత్య చేశారని అనుకున్నారు. గ్లోరియా ఒకాన్ మరణం అసహజమైనదని, ఆమె కుటుంబసభ్యులకు పంపిన మృతదేహం ఆమెది కాదని కొందరు వాదించారు. నైజీరియాలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఆమె సాధారణ జీవితాన్ని గడిపేదని కూడా అంటారు. జూన్ 2009లో నైజీరియన్ ప్రొఫెసర్ తైమివో ఒగునాడే ది నేషన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “గ్లోరియా ఒకాన్ అసలు పేరు చిన్యెరే. ఆమె ఛార్లెస్ "జెఫ్" చాండ్లర్ను వివాహం చేసుకుంది. అతను న్జియోగ్వు హత్య జరిగిన మర్నాడు హతమయ్యాడు. కాగా చిన్యేరే, మరియమ్, ప్రిన్సెస్ అట్టా మొదలైనవారంతా స్నేహితులు. వారందరూ మిలిటరీలోని వారిని వివాహం చేసుకున్నారు. నాటి రోజుల్లో మిలటరీలో పనిచేసేవారిని ఎంతో గౌరవించేవారు. కేసు రీఓపెన్ అవుతుందా? ఇమో స్టేట్‌కు చెందిన టివ్... చిన్యెరేను వివాహం చేసుకున్నాడు. భర్త మరణంతో చిన్యెరే వితంతువుగా మారింది. అనంతరం ఆమె యూకే- నైజీరియా మధ్య డ్రగ్స్ వ్యాపారాన్ని ఆశ్రయించింది. ఆపై ఆమె డ్రగ్స్‌తో పట్టుబడింది. కానో నుండి లండన్‌కు వెళ్లే విమానంలో చిన్యేరేను ఎక్కించిన మమ్మన్ వత్సా ఆమె చనిపోయిందని పేర్కొన్నారు. ఈ నాటి వరకు గ్లోరియా ఒకాన్ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీగానే మిగిలింది. మూసివేసిన ఈ కేసును తిరిగి తెరవడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. కేసు రీఓపెన్ అవుతుందా? లేదా అనేది వేచిచూడాల్సిందే. He doesn't know the Gloria Okon Saga story small kids pic.twitter.com/2iDxIDcCBF— LUCA BRASI -5.0 The UnderBoss (@donortez) November 14, 2022 ఇది కూడా చదవండి: పళ్లను చూసి పెళ్లాడేస్తారు.. -
ప్యాంటు చెక్ చేస్తే నిండా పాములు, బల్లులు.. అధికారులే షాక్!
వాషింగ్టన్: పాముల వంటి విష జీవులను తాకేందుకే భయంతో వణికిపోతాం. అయితే, ఓ వ్యక్తి తన దుస్తుల్లో దాచిపెట్టి వాటిని స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇటీవలే తన ప్యాంటులో 60 రకాల పాములు, బల్లులు, ఇతర సరిసృపాలను దాచిపెట్టి స్మగ్లింగ్ చేస్తుండగా దొరికిపోయాడు. ఈ సంఘటన అమెరికా- మెక్సికో సరిహద్దులో వెలుగు చూసింది. 7,50,000 డాలర్ల విలువైన సరిసృపాల స్మగ్లింగ్‌లో భాగంగా ప్యాంటులో దాచిపెట్టి అమెరికాలోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. వన్యప్రాణుల అక్రమ రవాణాకు పాల్పడిన నిందితుడికి రెండు దశాబ్దాలకిపైగా జైలు శిక్ష పడినట్లు వెల్లడించారు. దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన జోస్ మాన్యుయెల్ పెరెజ్ అనే వ్యక్తి ఆరేళ్లలో 1,700 జంతువులను మెక్సికో, హాంకాంగ్‌ల నుంచి అమెరికాకు స్మగ్లింగ్ చేసినట్లు చెప్పారు అధికారులు. నిరాటంకంగా సాగుతున్న అతడి అక్రమ రవాణా ఈ ఏడాది మార్చిలో బట్టబయలైంది. పాములు, బల్లులు వంటి వాటిని ప్యాంటులో దాచి మెక్సికో నుంచి తరలిస్తుండగా పట్టుబడ్డాడు. అయితే, ముందు తన పెంపుడు బల్లులను తీసుకెళ్తున్నాని కస్టమ్స్ అధికారులకు తెలిపాడు. కానీ, అతడి దుస్తులు మొత్తం విప్పి పరిశీలించగా ప్యాంటులో 60 పాములు, బల్లుల వంటివి బయపడినట్లు అధికారులు తెలిపారు. కోర్టు విచారణ సందర్భంగా తన స్మగ్లింగ్‌పై ఆశ్చర్యకర విషయాలు వెల్లడించాడు నిందితుడు జోస్ పెరెజ్. కొన్నిసార్లు గాడిదలపై తరలించేందుకు డబ్బులు చెల్లించానని, ఇతర సమయాల్లో తానే సరిహద్దులు దాటానని ఒప్పుకున్నాడు. అతడు అక్రమ రవాణా చేసి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా తన ఖాతాదారులకు సుమారు 7,39,000 డాలర్లకు సరిసృపాలను విక్రయించినట్లు పత్రాలు సమర్పించారు అధికారులు. అందులో యుకాటాన్ బాక్స్ తాబేళ్లు, మెక్సికన్ బాక్స్ తాబేళ్లు, పిల్ల మొసళ్లు, మెక్సికన్ పూసల బల్లులు సహా ఇతర జంతువులు ఉన్నాయి. రెండు కేసుల్లో అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఇదీ చదవండి: ప్రపంచం చుట్టేశాడు.. రెండు గిన్నిస్ రికార్డులు పట్టేశాడు -
బడా స్మగ్లర్ కోసం వేట.. ‘ఆపరేషన్ మాణిక్యం’ ప్రారంభం
తమిళనాడుకు చెందిన ఇతను ఎలా ఉంటాడో తెలియదు.. కనీసం ఇప్పటి వరకు సరైన ఆనవాళ్లు కూడా లేవు. అయితే పోలీసులు వారం కిందట మాణిక్యం ఇద్దరు కొడుకులతో పాటు జిల్లాలో అతని ముఖ్య అనుచరుడు, టీడీపీ నేతల దన్ను దండిగా ఉన్న నాయుడును వల వేసి పట్టుకున్నారు. దీంతో ఇప్పుడు టార్గెట్ మాణిక్యం ఆపరేషన్‌ను పోలీసులు వేగవంతం చేశారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: రెండుమూడేళ్ల కిందట అడపాదడపా ఎర్రచందనం దుంగలను పట్టుకుని ఫొటోలకు ఫోజులివ్వడం అలవాటైన పోలీసులు ఇప్పుడు రూటుమార్చారు. దుంగలతోపాటు ఎర్రచందనం దొంగలను కూడా పట్టుకుని స్మగ్లర్ల గుండెల్లో నిద్రపోతున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు చెక్ పెట్టి స్మగ్లర్ల వేటలో పడ్డారు. ఈ క్రమంలోనే ఎర్రచందనం ప్రధాన స్మగ్లర్ తమిళనాడుకు చెందిన మాణిక్యం ఇద్దరు కుమారులతో పాటు ఆ ముఠాలో కీలకంగా ఉన్న జిల్లాకు చెందిన దేవానంద నాయుడును అరెస్టు చేశారు. చంద్రగిరి నియోజకవర్గం ఐతేపల్లికి చెందిన నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలకు సన్నిహితుడు. ఓ రకంగా చెప్పాలంటే ఆ పార్టీ కార్యకర్త అన్నది బహిరంగ రహస్యం. దాదాపు పదేళ్ల కిందట ఎర్రచందనం అక్రమ రవాణాలోకి అడుగుపెట్టిన నాయుడు 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెలరేగిపోయాడు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నేతల అండదండలతో అంచెలంచెలుగా ఎదిగి.. స్మగ్లింగ్‌లో ఆరితేరాడు. ప్రధాన స్మగ్లర్ మాణిక్యంకు ముఖ్యమైన అనుచరుడిగా వ్యవహరిస్తున్నాడు. ముఠాలో ఆ నలుగురే కీలకం శేషాచలం అటవీ ప్రాంతంలోని విలువైన ఎర్ర బంగారం కోసం స్మగ్లర్లు కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో తిష్ట వేయడం తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన మాణిక్యం అక్కడి నుంచి రూటు మార్చి శేషాచలంలోని ఎర్రచందనంపై కన్నేశాడు. ఇందుకు అవసరమైన బ్యాచ్‌ని సిద్ధం చేసుకున్నాడు. ఆ బ్యాచ్‌లో రాజకీయ పలుకుబడి, ఐదేళ్ల క్రితం అధికారంలో ఉన్న టీడీపీ ముఖ్య నేతలతో సత్సంబంధాలు ఉన్న వారిని ఎంచుకున్నాడు. వీరిలో ప్రముఖమైన వ్యక్తి ఐతేపల్లి వాసి దేవానంద నాయుడు. ఇతనితో పాటు తన ఇద్దరు కుమారులు ఎం.మనోజ్‌కుమార్, ఎం.అశోక్‌కుమార్‌ను ఆ ముఠాలో చేరి్పంచాడు. మొత్తంగా ఈ నలుగురు ముఠా సభ్యులను లీడ్ చేస్తూ విచ్చలవిడిగా స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడు. శేషాచలంలో నాణ్యమైన ఎర్రచందనం ఎక్కడ దొరుకుతుంది, ఆ ప్రాంతానికి ఎలా వెళ్లాలి.. అనేది నాయుడు స్కెచ్ గీస్తాడు. ఇక మాణిక్యం కొడుకులు ముఠాతో కలిసి ఆ ఎర్రచందనం చెట్లను నరకడం, తర్వాత వాటిని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టడం వంటి పనులు పూర్తి చేస్తారు. ఆ తర్వాత వాటిని తరలించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తారు. చెట్లు నరికేందుకు అడవిలో ఉన్న కూలీలకు నిత్యావసర సరుకుల సరఫరా పని కూడా చేస్తారు. ఇదంతా గుట్టుచప్పుడు కాకుండా ఓ పథకం ప్రకారం ఆ నలుగురూ చేస్తూ వస్తున్నారు. ముగ్గురు చిక్కారు కరోనా లాక్డౌన్ సమయంలో అడవిలోకి చొరబడిన స్మగ్లర్లు భారీగా ఎర్రచందనం చెట్లను నరికి దుంగలను సిద్ధం చేశారు. వాటిని తరలించే వరకు అడవిలోని పలు ప్రాంతాల్లో పూడ్చిపెట్టారు. వారం రోజుల కిందట వాటిని బయటకు తీసి చెన్నైకి తరలిస్తుండగా జిల్లా పోలీసులు కాపుకాచి తమిళనాడులోని వేలూరు సమీపంలో పట్టుకున్నారు. కంటైనర్‌తో పాటు ఐతేపల్లికి చెందిన నాయుడు, మాణిక్యం ఇద్దరు కుమారులు కూడా పోలీసులకు పట్టుబడ్డారు. ఇక కంటైనర్‌లో ఉన్న ఎర్రచందనం దుంగలన్నీ నాణ్యమైనవే అని పోలీసులు తేల్చారు. పోలీసులు స్వా«దీనం చేసు కున్న ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ.5 కోట్లకుపైనే ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు పట్టుబడిన వారి నుంచి సమాచారం తీసుకున్న పోలీసులు మాణిక్యం వేటలో ఉన్నట్టు సమాచారం. -
సరిహద్దు వద్ద రూ.135 కోట్ల డ్రగ్స్ రవాణా యత్నం!
జమ్మూ: భారత్–పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంట మాదకద్రవ్యాల అక్రమరవాణా ప్రయత్నానికి బీఎస్ఎఫ్ బలగాలు అడ్డుకట్టవేశాయి. మార్కెట్లో రూ.135 కోట్ల విలువచేసే 27 కేజీల హెరాయిన్‌ను భారత భూభాగంలోకి తీసుకొస్తున్న పాకిస్తానీ స్మగ్లర్‌ను బీఎస్ఎఫ్ బలగాలు హతమార్చాయి. జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో భారత్–పాక్ సరిహద్దు వెంట పర్సర్ బోర్డర్ ఔట్‌పోస్ట్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి దాటాక(తెల్లారితే బుధవారం) 2.30–3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను బీఎస్ఎఫ్(జమ్మూ) ఐజీ ఎన్ఎస్ జామ్వాల్ వెల్లడించారు. చదవండి: పార్లమెంటరీ కమిటీ భేటీలో హైడ్రామా -
గంజాయి స్మగ్లర్ బాబు ఖాలే అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ముంబైకి చెందిన గంజాయి స్మగ్లర్ బాబు ఖాలేను హైదరాబాద్‌లో పట్టుకున్నారు. నగర శివారులో బాబు ఖాలేను అనూహ్య రీతిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. అతని వద్ద పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రా నుంచి మహారాష్ట్రకు గంజాయి సరఫరా చేస్తున్న ఖాలే కోసం.. గత కొన్ని సంవత్సరాలుగా పోలీసులు గాలిస్తున్నారు. గంజాయి స్మగ్లింగ్‌లో బాబు ఖాలే కీలక సూత్రధారి. రెండు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు దొరికిన గంజాయి స్మగ్లింగ్ వెనకాల బాబు ఖాలే హస్తం ఉంది. ఎన్సీబీ అధికారులు.. ఖాలేతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. చదవండి: ఈఎస్ఐ స్కాం: నాయిని అల్లుడి ఇంట్లో ఈడీ సోదాలు డబ్బుల్లేక భార్యతో గొడవ.. కూతుళ్లతో విషం తాగి -
మాదక ద్రవ్యాల స్మగ్లర్ కిషన్ సింగ్ భారత్‌కు అప్పగింత
లండన్: పేరుమోసిన మాదక ద్రవ్యాల స్మగ్లర్ కిషన్ సింగ్‌ను(38) బ్రిటన్ ప్రభుత్వం భారత్‌కు అప్పగించింది. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న కిషన్ సింగ్ భారత్‌లో వాంటెడ్ నేరగాడిగా పోలీసు రికార్డులక్కాడు. లండన్ మెట్రోపాలిటన్ పోలీసు శాఖ అతడిని ఇండియాకు అప్పగించింది. రాజస్తానీ మూలాలున్న కిషన్ సింగ్ బ్రిటీష్ పౌరుడు. 2016–17లో ఇండియాలో మెఫాడ్రోన్ (వైట్ మ్యాజిక్), మ్యావ్ మ్యావ్, కెటామైన్ అనే మాదక ద్రవ్యాలను అక్రమంగా సరఫరా చేసినట్లు అతడిపై కేసు నమోదయ్యింది. 2018లో లండన్‌లో అక్కడి పోలీసులు కిషన్ సింగ్‌ను అరెస్టు చేశారు. -
బీజేపీలో చేరిన వీరప్పన్ కూతురు
హోసూరు: ఒకప్పుడు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్, అడవి దొంగ వీరప్పన్ కూతురు విద్య తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలోని ప్రైవేట్ కళ్యాణ మంటపంలో శనివారం జరిగిన కార్యక్రమంలో పార్టీ తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్రన్, పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి మురళీధరన్, మాజీ కేంద్ర మంత్రి పొన్ రాధాక్రిష్ణన్‌ల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. 2 వేల మంది ఆమె మిత్రులు, అనుచరులు పార్టీలో చేరారు. -
చింపాంజీలను అటాచ్ చేసిన ఈడీ!
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మూడు చింపాంజీలు, నాలుగు మార్మోసెట్ల (పొడవాటి తోక గల దక్షిణ అమెరికా కోతులు) ను అటాచ్చేసింది. ఈడీ చింపాంజీలను అటాచ్ చేయడమేంటి అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వన్యప్రాణి స్మగ్లర్‌పై మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా వీటిని అటాచ్ చేసింది. స్మగ్లర్ ఇంటి నుంచి వాటిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని కోల్‌కతాలోని అలిపోర్ జంతుప్రదర్శన శాలలో ఉంచినట్లు కేంద్ర సంస్థ వెల్లడించింది. ఈ చింపాంజీలు సందర్శకులను ఆకర్షించడమే కాకుండా, జూకి ఒక మంచి ఆదాయ మార్గం అని చెప్పింది. కాగా, కోతులను జంతు శాలలో ఉంచినట్లు తెలిపింది. ఈ విధంగా మనీ లాండరింగ్ చట్టంకింద జంతువులను అటాచ్ చేయడం మొదటి సారి అని ఈడీ పేర్కొంది. స్మగ్లర్ ఆ జంతువులను అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించింది. మొత్తం ఏడు జంతువుల విలువ రూ.81 లక్షలు ఉంటుందని, ఒక్కో చింపాంజీ విలువ రూ.25 లక్షలు కాగా.. కోతుల విలువ రూ.1.5 లక్షలుంటుందని వెల్లడించింది. అడవి జంతువులను అక్రమంగా నిర్భంధించాడని స్మగ్లర్ సుప్రదీప్ గుహపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. గుహ ‘వ్యవస్థీకృత వన్యప్రాణుల అక్రమ రవాణా రాకెట్‌ను నడుపుతున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైనట్లు ఈడీ తెలిపింది. -
స్మగ్లింగ్ ముఠా అరెస్టు
పెద్దారవీడు (ప్రకాశం): వాహనాల తనిఖీల్లో భాగంగా భారీగా గుట్కా బస్తాలు, నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు మార్కాపురం డీఎస్పీ ఎన్వీ రామాంజనేయులు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్లో బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి మార్కాపురం సబ్‌డివిజన్ పరిధిలో దేవారాజుగట్టు, రాయవరం, హనుమాన్‌జంక్షన్ కుంట, కోమటికుంటల పరిసరాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. దేవరాజుగట్టు సెంటరు వద్ద మండలంలోని హనుమాన్ జంక్షన్ కుంట నుంచి వేగంగా వస్తున్న మూడు వాహనాలను అపేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్లు ఆపకుండా వెళ్తుండటంతో సీఐ భీమానాయక్ రంగంలోకి దిగారు. వెంటనే పోలీసులను అప్రమత్తం చేసి వాహనాల వెంటబడి పట్టుకున్నారు. వాటిని తనిఖీ చేయగా నిషేధించిన పొగాకు, గుట్కా, ఖైనీ, గంజాయి నిల్వలు గుర్తించారు. వాటితో పాటు 11 మందిని అదుపులో తీసుకున్నారు. వీటిని చుట్టు పక్కల ప్రాంతాలైన గుంటూరు జిల్లా రెంటచింతల, నరసరావుపేట, గుంటూరు పట్టణం, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కంభం, నెల్లూరు జిల్లా ప్రాంతాల్లో సబ్ డీలర్లకు భారీగా సరఫరా చేస్తున్నారు. నిందితులైన నల్లారి రామాంజనేయులు, బాదా శివానందరెడ్డి, మిడియాల సత్యనారాయణ, పెరకలపాటి ధనుంజయ, పెబ్బి వెంకటరాముడు, ఎలూర నరేంద్ర, వెన్నపూస నాగర్జునరెడ్డిలు అనంతపురం జిల్లా చెందిన వారు. ప్రధాన ముద్దాయి నల్లారి రామాంజనేయులు కర్ణాటక రాష్ట్రం బళ్లారి కేంద్రంగా నాలుగు టీంలుగా ఏర్పడి పలు ప్రాంతాల్లో ఉన్న సబ్ డీలర్లకు సరఫరా చేసేందుకు మనుషులను నియమించుకొని వాటిని సరఫరా చేస్తున్నాడు. సరుకు వేసిన అనంతరం డబ్బులు కూడా వారే వసూలు చేసుకొని యజమానికి ఇవ్వడం చేస్తున్నారు. 125 బస్తాల గుట్కా, ఖైనీల విలువ రూ. 30 లక్షలుగా గుర్తించారు. అలాగే రూ. 23,71,610 స్వాధీనం చేసుకున్నారు. కేజీ గంజాయిని చిన్న ప్యాకెట్లుగా చేసి షాపుల యజమానులకు శాంపిల్స్ చూపించేందుకు తరలిస్తున్నారు. ఇందులో భాగంగా మార్కాపురం పట్టణం చెందిన తడికమళ్ల శేషగిరి, గుంటూరు జిల్లా రెంటచింతల చెందిన నామం కిశోర్, షేక్ సైదులు, గిద్దలూరుకు చెందిన భవనాశి వెంకటసుబ్బయ్యలకు నిషేధిత ఉత్పత్తులను నల్లారి రామాంజనేయులు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సరుకు ఉన్న వాహనం ముందు మరొక వాహనంలో ముగ్గురు ఉండి పైలెట్‌గా పోతూ వెనుక వచ్చే వాహనాల డ్రైవర్లకు ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తూ రాకపోకలు సాగిస్తున్నారు. 11 మందిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. సీఐ, ఎస్ఐలు, పోలీసులకు జిల్లా ఎస్పీ ద్వారా రివార్డులు ఇప్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో పెద్దారవీడు, మార్కాపురం టౌన్, రూరల్ ఎర్రగొండపాలెం, పెద్దదోర్నాల ఎస్సైలు పి. ముక్కంటి, జి. రామకోటయ్య, మల్లికార్జున, దేవకుమార్, రామకోటయ్య, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
తొమ్మిది మంది ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్
రైల్వేకోడూరు : నియోజకవర్గంలో వేరు వేరు చోట్ల దాడులు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది మంది ఎర్ర స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు డీఎస్పీ లక్ష్మినారాయణ తెలిపారు. శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఉర్లగట్టుపోడు పంచాయతీలోని కన్నెకుంట రోడ్డులో బుగ్గలవాగు పరిసర ప్రాంతాలలో గాలిస్తుండగా పోలీసులపై స్మగ్లర్లు రాళ్లు, కట్టెలతో దాడిచేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఇందులో భాగంగా చాకచక్యంగా అక్కడున్న ఐదు ఎర్రచందనం దుంగలను, ఒక మహేంద్ర గూడ్స్ వాహనం, ఒక హీరో హోండా బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అలాగే రాఘవరాజుపురం అరుంధతివాడకు చెందిన దంతం వెంకటేష్, అనంతపురం జిల్లా గుంతకల్‌కు చెందిన బెల్డోనా మల్లయ్య, వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన నుగాలన్ అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న రూ. 2.30 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అలాగే ఓబులవారిపల్లె మండలం వైకోట సమీపంలోని గుండాలేరు అటవీ ప్రాంతంలో 6 ఎర్రచందనం దుంగలను , ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కె.బుడుగుంటపల్లె పంచాయతీ సమతానగర్‌కు చెందిన వెలుగు గంగయ్య, అల్లం మణి, రాఘవరాజుపురం అరుంధతివాడకు చెందిన ఎలకచెర్ల సుదర్శన్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అలాగే చిట్వేలి మండలం రాజుకుంట సమీపంలో నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని రాఘవరాజుపురం అరుంధతివాడకు చెందిన వెంకటేష్, కన్నెకుంట ఎస్టీ కాలనికి చెందిన కమ్మల వెంకటరమణ,, తమిళనాడుకు చెందిన పూచి గోవ్నరాజ్‌లను అరెస్ట్ చేశామన్నారు. పై మూడు దాడుల్లో 15 దుంగలను, మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సీఐ సాయినాథ్, రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె , చిట్వేలి ఎస్ఐలు వెంకటేశ్వర్లు, భక్తవత్సలం, సత్యనారాయణ, డాక్టర్ నాయక్‌లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
పగలేమో డాక్టర్.. రాత్రేమో...
రైల్వేకోడూరు అర్బన్ : సమాజంలో ఎంతో పవిత్రమైన వైద్యవృత్తిలో ఉంటూ.. ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, ఆర్ఎంపీ డాక్టర్ కాల్వ నాగేశ్వర్రావుతో పాటు మరి కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. రాజంపేట డీఎస్పీ లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో సీఐ సాయినాథ్ పర్యవేక్షణలో ఎస్ఐలు వెంకటేశ్వర్లు, భక్తవత్సలంలు తమ సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఎంతోకాలంగా గుట్టుచప్పుడు కాకుండా డాక్టర్ ముసుగులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న కాల్వ నాగేశ్వర్రావు, ప్రొటెక్షన్ వాచర్లు సుధాకర్, పరశురాం, శ్రీనులను కోడూరు మండలం కుక్కలదొడ్డికి చెందిన అంకయ్య, చిత్తూరు జిల్లా మామండూరుకు చెందిన గురవయ్యలను అరెస్ట్ చేసి 9,28,000 రూపాయలు విలువచేసే 15 ఎర్ర చందనం దుంగలు, ఒక కారు, 2 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కోడూరు, చిట్వేలి, ఓబులవారిపల్లి అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందనే సమాచారంతో మూడు బృందాలుగా దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడులలో స్మగ్లర్లు రాళ్లు, గొడ్డళ్లతో దాడి చేశారన్నారు. వారిలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మిగిలిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. విచారణలో వీరు తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాలకు చెందిన కొంతమంది స్మగ్లర్లతో ఒప్పందం కుదుర్చుకుని కూలీలను తీసుకువచ్చి వారిని అడవుల్లోకి తరలించి దుంగలు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. పాత నేరస్తుడితో సంబంధాలు స్మగ్లింగ్ చేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్ కాల్వ నాగేశ్వర్రావుకు పలు ఎర్రచందనం కేసులలో నిందితుడిగా ఉంటూ పరా రీలో ఉన్న స్మగ్లర్ భీమాతో సంబంధాలు ఉన్న విషయం పోలీసుల విచారణలో తెలిసినట్లు సమాచారం. స్మగ్లర్ భీమాపై సుమారు 9 కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాంతానికి వస్తే అరెస్ట్ చేస్తారేమోనని డాక్టర్ ద్వారా పనులు చక్కబెడుతున్నట్లు తెలిసింది. -
భారీగా గంజాయి స్వాధీనం
జయపురం: కొరాపుట్ జిల్లా లమతాపుట్ సమితి మాచ్‌ఖండ్–లమతాపుట్ మార్గంలో పోలీసులు పెద్ద ఎత్తున గంజాయి పట్టుకున్నారు. లమతాపుట్, మాచ్‌ఖండ్, ఒనకఢిల్లీ, మొదలగు ప్రాంతాలలో గంజాయి అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతుండడంతో పోలీసులు ఆయా ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించారు. మాచ్‌ఖండ్, లమతాపుట్, జోళాపుట్ పోలీసులు సంయుక్తంగా పెట్రోలింగ్ జరుపుతుండగా లమతాపుట్–మాచ్‌ఖండ్ మార్గంలో సిందిపుట్ నదీ ఘాట్ వద్ద కొంతమంది గంజాయి తరలించేందుకు యత్నిస్తున్నారు. ఆ సయంలో పోలీసులు అటువైపు రావటం చూచిన వారు గంజాయిని, వాహనాన్ని వదిలిపెట్టి పరారీ అయ్యారు. పోలీసులు గంజాయిని, వాహనాన్ని స్వాధీన పరచుకొన్నారు. మాచ్‌ఖండ్ తహసీల్దార్, మెజిస్ట్రేట్ కర్ణదేవ్ సమర్ధర్, నందపూర్ ఎస్డీపీవో శివరాం నాయిక్ సమక్షంలో తూయగా 40 క్వింటాళ్ల 40 కేజీలు ఉన్నట్టు వెల్లడైంది. పట్టుబడిన గంజాయి విలువ దాదాపు రూ. 20 లక్షలు ఉంటుందని అంచనా. ఈ దాడిలో మాచ్‌ఖండ్ పోలీసు అధికారి తపన కుమార్ నాహక్, జోలాపుట్ పోలీసు అధికారి మహేశ్ కిరిససాని, లమతాపుట్ పోలీసు అధికారి శివప్రసాద్ షొడంగి, తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
గంజాయి మాఫియా గుట్టురట్టు
సాక్షి, బరంపురం: ఒడిశా నుంచి ఆంధ్రా మీదుగా మహరాష్ట్రకు అక్రమంగా కారులో గంజాయిని రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర గంజాయి మాఫియా ముఠాను గంజాం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారి దగ్గర నుంచి కారు, 244 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని దిగపండి పోలీస్‌స్టేషన్‌లో శనివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కె.నువగాం పోలీస్‌స్టేషన్ ఐఐసీ అధికారి సుజిత్ నాయక్ మాట్లాడుతూ గంజాం, గజపతి జిల్లాల సరిహద్దుల్లో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయిని హైదరాబాద్ నుంచి అద్దెకు తీసుకున్న కారులో 244 కిలోల గంజాయి ప్యాకెట్లను ఎక్కించుకుని ఒడిశా-ఆంధ్రా మీదుగా మహరాష్ట్రకు తరలిస్తుండగా కె.నువగాం పోలీసులు దాడి చేసి వారిని అరెస్ట్ చేశారన్నారు. అరెస్టయిన వారి దగ్గర నుంచి కారు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. అరెస్ట్ అయిన వారిని గొళంతరాకు చెందిన రవీంద్ర గౌడ, కె. నువగాంకు చెందిన విద్యాధర్ ప్రధాన్, మహేష్ దేశాయి, ముంబైకి చెందిన మోహిత్ వర్మ, సూరజ్ విజయ్ మిశ్రాలుగా గుర్తించామని ఐఐసీ తెలియజేశారు. -
టాస్క్‌ఫోర్స్ పోలీసులపై స్మగ్లర్ల రాళ్లదాడి
సాక్షి, కాశీనాయన/ చంద్రగిరి : వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ళ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని నల్లమల అడవుల్లోను, చిత్తూరు జిల్లా నాగపట్ల ఈస్టు బీట్ పరిధిలోని శేషాచల అటవీ ప్రాంతం శ్రీవారిమెట్టు వద్ద పోలీసులు పెద్దఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. బుధవారం అర్థరాత్రి కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు రాళ్లతో దాడి చేసి పారిపోయారు. ఈ సంఘఠనలో ఒక కానీస్టేబుల్ గాయపడ్డాడు. దాడిచేసినవారిపై పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఈ సందర్భంగా 47 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలువురు ఎర్రచందనం కూలీలు పోలీసుల అదుపులో ఉన్నట్లు చెబుతున్నారు. ఆర్ఎస్సై వాసు, డీఆర్వో పీవీఎన్.రావు బృందం బుధవారం అర్ర్థరాత్రి నాగపట్ల ఈస్టు బీట్ పరిధిలోని శేషాచల అటవీ ప్రాంతం శ్రీవారిమెట్టు వద్ద కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో తమిళనాడు జావాదిమలైకు చెందిన మురుగన్ అనుమానాస్పదంగా తచ్చాడుతుండటంతో అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. తాను ఎర్రచందనం కూలీలకు పైలట్‌గా వచ్చానని అతను చెప్పడంతో, అతన్ని తీసుకుని శ్రీవారిమెట్టు మార్గంలోని పంప్‌హౌస్ సమీప అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. కూలీలు దుంగలు మోసుకొస్తూ కనిపించడంతో అధికారులు వారిపై దాడులు చేశారు. కూలీలు వారి వద్దనున్న కర్రలు, రాళ్లతో ఎదురుదాడికి దిగారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ చేతికి గాయమైంది. దాంతో అధికారులు గాల్లో కాల్పులు జరపగా, ఎర్రకూలీలు అటవీ ప్రాంతంలోకి పరుగులు పెట్టారు. చివరకు తమిళనాడు తిరువణ్ణామలైకు చెందిన చిన్నప్పయ్య, స్వామినాథన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు జిల్లాల పరిధిలో ఎర్ర కూలీల నుంచి సుమారు 47 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దాడిలో గాయపడ్డ పీసీ లక్ష్మీనారాయణకు మెరుగైన వైద్యంకోసం తిరుపతి రుయాకు తరలించారు. -
అంతర్జాతీయ స్మగ్లర్ అరెస్ట్
మైదుకూరు: వైఎస్సార్ జిల్లా మైదుకూరు చెక్‌పోస్టు వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో అంతర్జాతీయ స్మగ్లర్ ఏటీ మైదీన్‌ను పోలీసులు పట్టుకున్నారు. మైదీన్ స్వస్థలం తమిళనాడు రాష్ట్రం నాగపట్నం జిల్లా. చాయ్‌వాలాగా జీవితం ప్రారంభించిన మైదీన్ స్మగ్లింగ్ దిగి భారీగా ఆస్తులు కూడబెట్టాడు. అతని వద్ద నుంచి 66 ఎర్రచందనం దుంగలతో పాటు 2 బీఎండబ్ల్యు కార్లు, మరో 2 నిస్సాన్ కార్లు, ఒక టాటా క్సినాన్ పికప్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద రూ. 55 వేల నగదు, వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎం కార్డులు, 4 సెల్ఫోన్లు, పలు డాక్యుమెంట్లు గుర్తించారు. సుమారు రూ.78 కోట్ల స్థిర చర ఆస్తులు ఉన్నట్లు గుర్తించామని జిల్లా ఎస్పీ విలేకరులకు తెలిపారు. అతనితో పాటు మరో ఇద్దరు అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. -
రూ.30 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
-
15 మంది స్మగ్లర్లు అరెస్ట్
13 ఎర్రచందనం దుంగలు స్వాదీనం ఖాజీపేట: అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న 15 మంది స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు మైదుకూరు డీఎస్పీ జింకల శ్రీలక్ష్మి తెలిపారు. ఖాజీపేట పోలీస్ స్టేషన్లో ఆమె విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఖాజీపేట మండలం లోని లంకమల్ల అడవుల్లోకి తమిళ స్మగ్లర్లు, మరికొందరు స్థానిక స్మగ్లర్లు దొంగచాటుగా ప్రవేశించి ఎర్రచందనాన్ని నరికి తీసుకు వచ్చి స్మగ్లింగ్ చేసేవారన్నారు. తమకు అందిన సమాచారం మేరకు నిఘా ఉంచామన్నారు. చెన్నముక్కపల్లె తెలుగుగంగ సమీపంలో ఎర్రచందనం తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో 15 మంది స్మగ్లర్లతో పాటు 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అరెస్టయిన స్మగ్లర్లు వీరే.. 1.ఆకుల జయరాముడు, 2. ఆకుమల్ల పెద్దరాముడు, 3.మద్దెల కిరణ్ 4. మద్దెల రజనీకాంత్, 5. మద్దెల చెప్పలయ్య, 6. మెల్ల జయరాముడు (చెన్నముక్కపల్లె) 7. తవ్వా స్వామి కొండారెడ్డి (చెన్నముక్కపల్లె) 8. మధుర దొరబాబు (చెన్నముక్కపల్లె) 9. ఆకుమల్ల సుధాకర్ (చెన్నముక్కపల్లె) 10. తవ్వా బాలకొండారెడ్డి (చెన్నముక్కపల్లె) 11. ఆకులమల్ల రామ్‌బాబు (చెన్నముక్కపల్లె) 12. మెల్ల రఘురాం (చెన్నముక్కపల్లె) 13. మల్లె బాబు (చెన్నముక్కపల్లె) 14. అబ్బిరెడ్డి ఓబుళరెడ్డి 15. పొట్టి ప్రతాప్‌రెడ్డి ఉన్నారు. పోలీస్, అటవీ అధికారులుగా బెదిరింపులు ఇక్కడి అడవుల్లో తమిళ కూలీల రాక పోకలు అధికంగా ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. దీనిని గుర్తించి స్థానిక స్మగ్లర్లు తాము అటవీ, పోలీసు అధికారులమని తమిళ కూలీలను బెదిరించి వారిపై దాడులు చేసేవారన్నారు. తమిళ కూలీలు వదిలిన 15 దంగలను తీసుకుని దువ్వూరు, చెన్నూరు, పెండ్లిమర్రి కి చెందిన వ్యక్తులకు అమ్మి రూ.2లక్షలు సొమ్ము చేసుకున్నారని తెలిపారు. తమిళ కూలీల కదలిక పై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరించే వారు ఎంతటివారైనా సహించేదిలేదని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఎరక్కపోయి..ఇరుక్కుపోయాడు
దుబాయ్ పోలీసుల చెరలోపాతబస్తీ యువకుడు సాయం చేయబోరుు నిషేధిత మత్తు టాబ్లెట్లు ఉండటంతో అరెస్టు విషయం తెలిసి తప్పించుకున్న సూత్రధారులు సిటీబ్యూరో: నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ యువకుడు పరిచయస్తులకు సాయం చేయబోరుు ఇబ్బందుల్లో పడ్డాడు. తనకు తెలియకుండానే స్మగ్లర్‌గా మారడంతో దుబాయ్ విమానాశ్రయంలో అధికారులకు చిక్కాడు. విషయం తెలిసి సూత్రధారులు తప్పించుకుని పారిపోగా... ఎరక్కపోరుు ఇరుక్కుపోరుున యువకుడు మాత్రం ప్రస్తుతం దుబాయ్‌లో విచారణ ఎదుర్కోబోతున్నాడు. గత నెలలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం కోసం వెళ్తుండగా పాతబస్తీలోని బార్కస్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు గత నెలలో ఉద్యోగం కోసం దుబాయ్ పయనమయ్యాడు. ఈ విషయం తెలిసిన పరిచయస్తులు దుబాయ్‌లోనే ఉన్న తమ వారికి స్వీట్లు తీసుకువెళ్ళాల్సిందిగా కోరారు. కేవలం మిఠారుులే కదా అనే ఉద్దేశంతో సదరు యువకుడు అందుకు అంగీకరించాడు. ప్రయాణానికి ఒక్క రోజు ముందు ఆ పరిచయస్తులు ఓ స్వీట్ ప్యాకెట్‌ను పార్శిల్ చేసి తీసుకువచ్చి అతడికి ఇచ్చారు. తన లగేజ్‌తో పాటు దానిని తీసుకుని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన యువకుడు దుబాయ్‌లో దిగిన తర్వాత ఇబ్బందులు మొదలయ్యారుు. తనిఖీల్లో బయటపడిన ట్యాబ్లెట్స్... దుబాయ్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు సదరు యువకుడితో పాటు అతడు తీసుకువచ్చిన లగేజ్‌ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో స్వీట్ బాక్స్ అడుగున ఉన్న మూడు స్ట్రిప్స్ మత్తు ట్యాబ్లెట్లను గుర్తించారు. వీటిపై ఆ దేశంలో నిషేధం ఉన్నందున వీటిని కలిగి ఉంటే అక్కడి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. దీంతో నిషేధిత ట్యాబ్లెట్లు తీసుకువచ్చిన యువకుడిని దుబాయ్ విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ స్వీట్ ప్యాకెట్ తనది కాదని, పరిచయస్తులు దుబాయ్‌లో ఉన్న తమ వారి కోసం పంపించారని బాధితుడు పోలీసులకు చెప్పాడు. ఫోన్ చేయడంతో కథ అడ్డం తిరిగి... యువకుడు చెప్పిన అంశాన్ని పరిగణలోకి తీసుకున్న దుబాయ్ పోలీసులు ఆ ప్యాకెట్ ఎవరికి అందించాల్సి ఉందో వారికి ఫోన్ చేసి రప్పించాల్సిందిగా ఆదేశించారు. ఇందుకోసం ఓ ఫోన్ కాల్ చేసుకునే అవకాశం ఇచ్చారు. అరుుతే నగర యువకుడు దుబాయ్‌లో వాటిని రిసీవ్ చేసుకోవాల్సిన వారికి ఫోన్ చేయకుండా... నగరంలో దాన్ని తనకు ఇచ్చిన పరిచయస్తులకు కాల్ చేసి విషయం చెప్పాడు. తన ప్రమేయం లేకుండా తనను ఇబ్బందుల పాలు చేశారంటూ వాపోయాడు. దుబాయ్‌లో స్వీట్ ప్యాకెట్ తీసుకోవాల్సిన వారి వివరాలు వెలుగులోకి వచ్చిన వెంటనే అక్కడి అధికారులు అరెస్టు చేస్తారని భావించిన ‘పరిచయస్తులు’ వెంటనే ఫోన్ ద్వారా అక్కడి తమ వారిని అప్రమత్తం చేశారు. ఢిల్లీకి పారిపోరుు వచ్చిన సూత్రధారులు... హైదరాబాద్‌లో ఉన్న వారి ద్వారా విషయం తెలుసుకున్న ‘ప్యాకెట్ రిసీవర్లు’ తక్షణం దుబాయ్ వదిలేశారు. ఆఘమేఘాల మీద ఆ దేశం విడిచిపెట్టి, వివిధ దేశాలు తిరుగుతూ ఢిల్లీకి వచ్చేశారు. ఈ విషయం తెలుసుకున్న దుబాయ్ పోలీసులు సూత్రధారులకు సహకరించడానికే హైదరాబాద్ యువకుడు ఫోన్ చేిసినట్లు భావింస్తూ సదరు యువకుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసు అక్కడి న్యాయస్థానంలో విచారణకు రానుంది. ఢిల్లీ పారిపోరుు వచ్చిన, నగరంలో ఉన్న సూత్రధారులు చిక్కితే తప్ప పాతబస్తీ యువకుడు శిక్ష నుంచి తప్పించుకునే పరిస్థితులు కనిపించట్లేదు. ఎందుకు నిషేధించారంటే... మత్తు ట్యాబ్లెట్స్ను దుబాయ్‌లో నిషేధించడానికి పెద్ద కారణమే ఉంది. ఒకప్పుడు ఈ తరహా ట్యాబ్లెట్లు అక్కడ కూడా లభించేవి. మరోపక్క దుబాయ్‌లో నివసిస్తున్న పాకిస్థానీయులు జర్దాను విరివిగా వినియోగిస్తున్నారు. ఆ దేశానికి చెందిన యువత మత్తు మందులు, డ్రగ్స దొరకని సందర్భాల్లో ఈ రెంటినీ శీతలపానీయాల్లో కలిపి తాగుతున్నారు. దీంతో నిషాలో జోగుతూ ఆ మత్తులో వాహనాలు నడుపుతూ ప్రాణాలు వదులుతున్నారు. వరుసగా వెలుగులోకి వచ్చిన ఉదంతాలను పరిగణలోకి తీసుకున్న అక్కడి అధికారులు మత్తు ట్యాబ్లెట్స్, జర్దా విక్రయాలను నిషేధించారు. కేవలం అత్యవసరమైన వారికి మాత్రమే అనుమతులు తీసుకున్నాక పరిమితంగా విక్రరుుంచే అవకాశం ఉంది. -
లక్ష్మణ్ తమ్ముడూ ఎర్ర డానే..!
• గుర్తించిన చిత్తూరు పోలీసులు • కళ్లు గప్పి తిరుగుతున్న స్మగ్లర్ • గాలింపు చర్యలు ముమ్మరం చిత్తూరు (అర్బన్): లక్ష్మణ్ - ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పరిచయం అవసరంలేని వ్యక్తి. సింపుల్‌గా పోలీసు రికార్డుల్లో ఉన్నట్లు చెప్పాలంటే రూ.వంద కోట్ల ఆస్తి, జిల్లాలో 20కి పైగా కేసులు, చిత్తూరు నుంచి చైనా వరకు ఎర్రచందనం దుంగల్ని రాచమార్గంలో తీసుకెళ్లగలిగే వ్యక్తి. ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో పీడీ యాక్టు కింద ఉన్నాడు. ఓ పెద్ద స్మగ్లర్‌కు చెక్ పెట్టగలిగామని సంబరపడుతున్న పోలీసులకు అతని తమ్ముడు రమేష్ ఇప్పుడు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. విదేశాలకూ విస్తరించిన ‘ఎర్ర’ నెట్వర్క్ ఎర్రచందనం రవాణాలో అంతర్జాతీయ స్మగ్లర్‌గా ఎదిగిన లక్ష్మణ్ స్వస్థలం చెన్నై. ఇతన్ని రెండేళ్ల క్రితం అరెస్టు చేసిన పోలీసులు తొలిసారిగా రెండుసార్లు పీడీ యాక్టు బనారుుంచి అతడిని కటకటాల్లోకి నెట్టగలిగారు. అయినా జైల్లో నుంచే లక్ష్మణ్ తన రెండో భార్య. ఎర్రచందనం స్మగ్లింగ్ క్వీన్, మాజీ ఎరుుర్ హోస్టెస్ సంగీత ద్వారా హవాలా రూపంలో స్మగ్లర్లకు భారీగా నగదు పంపిస్తూ, ఎర్రచందనాన్ని విదేశాలకు అక్రమ రవాణా చేస్తూ వచ్చాడు. ఇది తెలుసుకున్న చిత్తూరు పోలీసులు సంగీతను కోల్‌కత్తాలో అరెస్టు చేయడం, భారీగా బంగారు, వెండి ఆభరణాలను సీజ్ చేయడం తెలిసిందే. అరుుతే, చిత్తూరులో పెండింగ్ కేసులు ఉన్నా న్యాయస్థానానికి హాజరుకాకుండా సంగీత తప్పించుకు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ప్రస్తుతం రమేష్ అనే పేరు తెరపైకి వచ్చింది. లక్ష్మణ్‌కు స్వయాన తమ్ముడైన రమేష్ ఇప్పుడు ఎర్రచందనం రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు పోలీసులకు దిమ్మదిరిగే వాస్తవాలు తెలిశాయి. గత నెల 17న చిత్తూరు పోలీసులు కడపకు చెందిన అందాలరాముడు అనే స్మగ్లర్‌ను అరెస్టు చేశా రు. ఇతడిని విచారణ చేయగా లక్ష్మణ్ తమ్ముడు రమేష్‌తో కలిసి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులకు వెల్లడించడంతో అసలు విషయం బయటపడింది. చెన్నై కేంద్రంగా ’ఎర్ర’ వ్యాపారం లక్ష్మణ్‌కు ఇద్దరు తమ్ముళ్లు. కరుప్పన్ అనే వ్యక్తి కొంతకాలం క్రితమే అనారోగ్యంతో చనిపోయాడు. లక్ష్మణ్ జైలుకు వెళ్లిన తరువాత సంగీత ఆటలు సాగకపోవడంతో రమేష్ ఎర్రచందనం స్మగ్లింగ్‌లోకి దిగాడు. జిల్లా నుంచి ఎర్రచందనం దుంగల్ని చెన్నై, బెంగళూరుకు చేర్చడం, కడప నుంచి కూడా పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగల్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసినట్లు పోలీసులు గుర్తించారు. చెన్నై కేంద్రంగా రమేష్ చేస్తున్న వ్యాపారాన్ని రట్టు చేసేందుకు చిత్తూరు నుంచి ఓ ప్రత్యేక బృందం గాలిస్తోంది. రమేష్ పోలీ సులు త్వరలోనే పట్టుకోగలమనే పకడ్బందీ వ్యూహం తో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. అతడిని అరెస్టు చేస్తే చెన్నైలో 80 శాతం ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టనట్లే అవుతుందని పోలీసులు భావిస్తున్నారు. -
ఐదుగురు బడా స్మగ్లర్లపై పీడీ యాక్టు
– ఓఎస్డీ సత్య ఏసుబాబు వెల్లడి కడప అర్బన్ : ఐదుగురు బడా ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్టు ప్రయోగిస్తూ జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఓఎస్డీ (ఆపరేషన్స్) బి.సత్య ఏసుబాబు సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఎర్రచందనం స్మగ్లర్లు కర్ణాటక రాష్ట్రం కటిగెనహళ్లికి చెందిన షేక్ ఫయాజ్ షరీఫ్ అలియాస్ ఫయాజ్ అలియాస్ ఫయ్యో (40), బెంగళూరుకు చెందిన హెచ్ఎస్ ప్రవీణ్‌కుమార్ అలియాస్ ప్రవీణ్ (38), తుంకూరు జిల్లా సిరా పట్టణానికి చెందిన షేక్ అబ్దుల్ రెహ్మాన్ అలియాస్ రెహ్మాన్, చెన్నై రెడ్‌హిల్స్‌కు చెందిన కందస్వామి పార్తిబన్ అలియాస్ పార్తిపన్ (46) జిల్లాలోని బద్వేలుకు చెందిన రైస్‌మిల్ సుబ్బారెడ్డి అలియాస్ సుబ్బిరెడ్డి అలియాస్ గాజులపల్లి సుబ్బారెడ్డి (48)లపై పీడీ యాక్టు ప్రయోగించినట్లు ఓఎస్డీ తెలిపారు. ఫయాజ్‌పై 71 కేసులు నమోదుకాగా వైఎస్సార్ జిల్లాలో 45, చిత్తూరు జిల్లాలో 26 కేసులు ఉన్నాయన్నారు. హెచ్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై 22 కేసులు, షేక్ అబ్దుల్ రెహ్మాన్‌పై 27 కేసులు, కందస్వామి పార్తిబన్‌పై 28 కేసులు, రైస్‌మిల్ సుబ్బారెడ్డిపై 20 కేసులు నమోదయ్యాయన్నారు. -
గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
గోదావరిఖని టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ౖయెటింక్లయిన్‌కాలనీలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని సోమవారం పట్టుకున్నట్లు సీఐ దేవారెడ్డి తెలిపారు. స్థానిక శ్రీలంక షిర్కేక్వార్టర్స్ ఏరియాలోని పోచమ్మ గుడి వద్ద గంజాయి అమ్ముతున్న కమలాపూర్ మండలం ఉప్పల్‌కు చెందిన మహ్మద్ యాకూబ్‌పాషా, పెద్దపల్లికి చెందిన సయ్యద్ షాహిద్‌ను కానిస్టేబుళ్లు జె.రమేష్, ఓ.కృష్ణారెడ్డిలు చాకచక్యంగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వీరి నుంచి రూ.4,400 విలువచేసే గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని కమాన్‌పూర్ తహసీల్దార్ హన్మంతరావుతో పంచనామా చేయించారు.