అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అజయ్ (47)పై పీడీ యాక్టు నమోదుచేయాలని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
చిత్తూరు: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అజయ్ (47)పై పీడీ యాక్టు నమోదుచేయాలని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కేరళ రాష్ట్రం కాలికట్ జిల్లాలో ఏప్రిల్ 6న అజయ్‌ను చిత్తూరు పోలీసులు అరెస్టుచేశారు. ఎర్రచందనాన్ని దేశవిదేశాలకు సుమారు 200 టన్నుల వరకు అజయ్ స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడు. ప్రస్తుతం కడప జైలులో ఉన్న అతనిపై పీడీ యాక్డు పెట్టాలన్న పోలీసులు ప్రతిపాదనకు కలెక్టర్ ఆమోదముద్ర వేశారు. ఇప్పటికే అజయ్‌పై 13 కేసులు నమోదై ఉన్నాయి.