
శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి ముఖ్య పాత్రల్ని పోషించిన చిత్రం త్రికాల (Trikala Movie). మణి తెల్లగూటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రిత్విక్ వేట్షా సమర్పణలో రాధిక, శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శనివారం నాడు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ‘యుద్ధం రేపటి వెలుగు కోసం.. కానీ ఈ అంధకాసురిడి యుద్ధం వెలుగుని నాశనం చేయడానికి’.. అంటూ తనికెళ్ల భరణి డైలాగ్స్‌తో ట్రైలర్ ఆరంభమవుతుంది.
యాక్షన్ సీక్వెన్స్, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా అన్నీ కూడా హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. ‘ఒక సైక్రియార్టిస్ట్‌గా ఛాలెంజింగ్ కేసుని చూస్తున్నా’ అంటూ శ్రద్దా దాస్ పాత్రను ఈ ట్రైలర్‌లో పరిచయం చేశారు. యాక్షన్ సీక్వెన్స్, ట్రైలర్ చివర్లో అజయ్ విశ్వరూపం, డైలాగ్స్ అదిరిపోయాయి. త్రికాల ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అజయ్ మాట్లాడుతూ.. ‘మణి గారు నాకు రెండు, మూడేళ్ల క్రితం త్రికాల కథ చెప్పారు. బడ్జెట్ ఎక్కువ అయ్యేట్టుంది ఎలా చేస్తారో అనుకున్నా. ఇంత వరకు నాకు ఏం చూపించలేదు. నేరుగా ఇక్కడే ట్రైలర్‌ను చూశాను. అద్భుతంగా వచ్చింది’ అని అన్నారు.

మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ.. ‘త్రికాల సినిమా కోసం నిర్మాతలు చాలా కష్టపడ్డారు. ఈ మూవీ కోసం చాలా రీషూట్ జరిగింది. కానీ ఎప్పుడు కూడా వారు ప్రశ్నించలేదు. మా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. సమ్మర్‌లో మా సినిమా రాబోతోంది. అందరూ మా చిత్రాన్ని సపోర్ట్ చేయండి’ అని అన్నారు. దర్శకుడు మణి మాట్లాడుతూ.. ‘ఈ కథను అజయ్ గారికే ముందుగా చెప్పాను. వీఎఫ్ఎక్స్ గురించి జాగ్రత్తగా చూసుకో అని ఆయన సలహా ఇచ్చారు.
త్రికాల సినిమాటిక్ యూనివర్స్ అని ట్రైలర్‌లో పెట్టాం. అంబటి అర్జున్ ఒక్క రోజే షూటింగ్ చేశారు. అదేంటో ఫ్యూచర్‌లో తెలుస్తుంది. ఈ మూవీ కోసం మేము చాలా వదులుకున్నాం. మా చిత్రాన్ని అందరూ సపోర్ట్ చేయండి’ అన్నారు. నిర్మాత రాధిక మాట్లాడుతూ.. ‘సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని, మన సూపర్ హీరోల్ని అందరికీ చూపించాలని త్రికాల సినిమా తీశాం. బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్‌లా మన త్రికాల ఉంటుంది. టైంతో సంబంధం లేకుండా కాపాడేవాడే త్రికాల. ఇంకా త్రికాల గురించి తెలియాలంటే సినిమా చూడాల్సిందే’ అన్నారు.

నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘త్రికాల మూవీకి సీజీ వర్క్ ఎక్కువగా అవసరం పడింది. అందుకే ఈ మూవీ లేట్ అవుతూ వచ్చింది. మన పురాణాల్లోనే హనుమాన్, భీమ్ వంటి సూపర్ హీరోలున్నారు. మనం ఓ ఫిక్షనల్ హీరోని సృష్టించాలని అనుకున్నాం. అలా పుట్టిందే ఈ త్రికాల’ అన్నారు.
చదవండి: జీవితంలో కొత్త అధ్యాయం షురూ.. మెహబూబ్ దిల్‌సే ఎమోషనల్
Comments
Please login to add a commentAdd a comment