
బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్‌సే (Mehaboob Dil Se) సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. తమ కుటుంబంలోకి ఓ బుడ్డోడు వచ్చాడంటూ మురిసిపోతున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. మా జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. మా కుటుంబంలో మరొకరు చేరారు. ఆనందభాష్పాలతో తనకు సాదర స్వాగతం పలుకుతున్నాం.
మా లైఫ్‌లో నువ్వే పెద్ద గిఫ్ట్
నా తమ్ముడు సుభాన్‌కు బాబు పుట్టాడు. అతడి రాకతో మా ఇల్లు మరింత ప్రేమమయంగా, నవ్వుల హరివిల్లుగా మారుతోంది. ఈ బుడ్డోడు ఇప్పటికే మాలో అంతులేని ఆనందాన్ని నింపాడు. తనే మా జీవితాల్లో అత్యంత విలువైన బహుమతి అని చెప్పకనే చెప్పాడు. మా బుడ్డోడు జీవితం సంతోషంగా, ఆరోగ్యంగా, సాఫీగా జరగాలని కోరుకుంటున్నాను. తండ్రిలాగే కరుణామయుడిగా, బలవంతుడిలా ఎదగాలని ఆశిస్తున్నాను.
మరి నీ పెళ్లెప్పుడు?
వీడ్ని నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు మా కుటుంబ బంధం మరింత బలపడినట్లు అనిపిస్తోంది అని భావోద్వేగానికి లోనయ్యాడు. ఇది చూసిన అభిమానులు మెహబూబ్ పెదనాన్న అయినందుకు శుభాకాంక్షలు చెప్తున్నారు. పనిలో పనిగా పెళ్లెప్పుడు చేసుకుంటావని ఆరా తీస్తున్నారు. దీనికి మెహు స్పందిస్తూ.. ఇప్పటికే ఇంట్లో పదేపదే పెళ్లి ప్రస్తావనే తెస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా మొదలుపెట్టారా? అని తల పట్టుకున్నాడు.
చదవండి: రూ.8 కోట్లు పెడితే రూ.55 కోట్లు.. ఓటీటీలో మిస్టరీ థ్రిల్లర్
Comments
Please login to add a commentAdd a comment