
ఓటీటీ (OTT)లో ఎప్పటికప్పుడు బోలెడన్ని సినిమాలు, సిరీస్‌లు రిలీజవుతూనే ఉన్నాయి. తాజాగా మలయాళ హిట్ మూవీ డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైంది. అసిఫ్ అలీ (Asif Ali), అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన రేఖాచిత్రం మూవీ (Rekhachithram Movie) ఓటీటీలో రిలీజవుతోంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్ (SonyLiv) సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

'అందరూ మర్చిపోయిన నేరం.. పాతిపెట్టిన నిజాన్ని వెలికితీసే సమయం ఆసన్నమైంది. మార్చి 7న రేఖాచిత్రం సోనీలివ్‌లో చూసేయండి' అని ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. జనవరి 9న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. కేవలం రూ.8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన రేఖాచిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.75 కోట్లు వసూలు చేసింది.
కథేంటంటే?
మలక్కప్పర ప్రాంతంలో జరిగే ఘటనలు.. పోలీస్ ఇన్‌స్పెక్టర్ వివేక్‌ను కలవరపరిచే ఆత్మహత్య కేసు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే వివేక్ ఆ కేసుని ఎంతకీ ఛేదించలేకపోతాడు. ఎటు వెళ్లినా కేసు ఓ కొలిక్కి రాదు. చివరకు ఈ కేసు.. మరో కేసుకి లీడ్ ఇస్తుంది. సినిమా షూటింగ్, అందులో మిస్ అయిన ఓ వ్యక్తి.. పాతిపెట్టిన శవం దొరకడం వంటి ఘటనలతో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తుంటాయి. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేఖాచిత్రం ఓటీటీలో చూడాల్సిందే!
రేఖాచిత్రం విషయానికి వస్తే.. అసిఫ్, అనస్వరతో పాటు మనోజ్ కె.జయన్, సిద్దిఖి, జగదీశ్, సాయికుమార్, హరిశ్రీ అశోకన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జాఫిన్ టి.చాకో దర్శకత్వం వహించాడు. ముజీబ్ మజీద్ సంగీతం అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment