![Kannada Fans Fires On Rashmika Mandanna](/styles/webp/s3/article_images/2025/02/15/rashmika.jpg.webp?itok=Y1M67Xc6)
నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna)పై కర్ణాటక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుట్టిన ఊరిని మర్చిపోయావంటూ ఆమెపై మండిపడుతున్నారు. దీనికి కారణం ‘ఛావా’(Chhaava) ప్రమోషన్స్ ఈవెంట్‌లో రష్మిక చేసేన వ్యాఖ్యలే. విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన హిందీ చిత్రం ‘ఛావా’. ఈ మూవీ ఈ నెల 14న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. రిలీజ్‌కి ముందు ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో రష్మిక పాల్గొంది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తాను హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పింది. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో చర్చకు దారీ తీశాయి. పుట్టిన ప్రాంతం(కర్ణాటక) పేరు చెప్పడానికి రష్మికకు వచ్చిన సమస్య ఏంటంటూ కన్నడ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
(చదవండి: బాక్సాఫీస్‌పై ‘ఛావా’ దండయాత్ర.. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్, ఎన్ని కోట్లంటే..?)
కర్ణాటకలోని కొడగు జిలా విరాజ్ పేట రష్మిక జన్మస్థలం. కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో ఆమె చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ఛలో’తో తెలుగులోకి అడుగుపెట్టింది. గీత గోవిందం సినిమాలో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ లిస్ట్‌లోకి చేరిపోయింది. పుష్ప చిత్రంతో నేషనల్ క్రష్‌గా మారింది.
(చదవండి: తమన్‌కి ఖరీదైన కారుని గిఫ్ట్‌గా ఇచ్చిన బాలయ్య.. ధర ఎంతంటే?)
అయితే ఛావా ప్రమోషనల్ ఈవెంట్‌లో తన సొంతూరు హైదరాబాద్ అన్నట్లుగా మాట్లాడడంతో కన్నడ ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని తెలియజేస్తూ రష్మికను ట్రోల్ చేస్తున్నారు. వరుస హిట్లు వచ్చే సరికి సొంతూరును మర్చిపోవడం సరైన పద్దతి కాదంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
కాగా, గతంలోనూ రష్మికపై ఇలాంటి ట్రోలింగే జరిగింది. పుష్ప రిలీజ్ సమయంలో తన తొలి సినిమా కిరిక్ పార్టీ నిర్మాణ సంస్థ పేరును చెప్పకుండా...‘పేపర్లో వచ్చిన తన ఫొటో చూసి ఓ నిర్మాణసంస్థ తనకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చింది’ అని రష్మిక చెప్పడంతో నెటిజన్స్ ఫుల్ ఫైర్ అయ్యారు. అవకాశం ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్మిక నటించిన సినిమాలను బ్యాన్ చేయాలంటూ అప్పట్లో ట్వీట్స్ చేశారు. మళ్లీ చాలా రోజుల తర్వాత రష్మిక ట్రోలింగ్‌కి గురైంది. దీనికి ఈ నేషనల్ క్రష్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
'@iamRashmika, I sometimes feel pity for you for receiving unnecessary negativity/targeting from our fellow Kannadigas.
But when you make statements like this I think they are right and you deserve the backlash.👍#Kannada #Chaava #RashmikaMandanna pic.twitter.com/RBY7RcpHgP— Virat👑Rocky✨️ (@Virat_Rocky18) February 14, 2025
Comments
Please login to add a commentAdd a comment