
రష్మిక మందన్న(Rashmika Mandanna ) ఓ ఏడాది క్రితం అయితే ఏమోగాని...ఇప్పుడు ఆమె ఇంటర్నేషనల్ స్టార్. పుష్ప, పుష్ప 2లతోనే అమాంతం అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆమెను ఆ వెంటనే వచ్చిన చావా ఎక్కడికో తీసుకెళ్లిపోయింది.
ప్రస్తుతం తన తాజా చిత్రం ఛావా విజయాన్ని ఎంజాయ్ చేస్తోన్న రష్మిక త్వరలోనే విడుదల కానున్న సికిందర్ లో సల్మాన్‌ఖాన్ సరసన నటించింది. ఈ సినిమా మీద కూడా బాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపధ్యంలో రష్మిక ఇటీవల మరో బాలీవుడ్ సీనియర్ నటి నేహా ధూపియాతో ‘‘నేహాతో నో ఫిల్టర్’’ షోలో తన కుటుంబం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
అమ్మానాన్న ఇన్వాల్వ్ కారు...భారం నాదే...
స్టార్ హీరోయిన్ గా ఎదిగినా ఇప్పటికీ రష్మిక నిరాడంబరంగా కనిపిస్తుంది. వీలైనంత వరకూ డౌన్ టూ ఎర్త్ ఉంటుంది. ఈ పరిణితికి కారణం ఏమిటి? అంటే... ఆమె తన తల్లిదండ్రుల పెంపకమే అని స్పష్టం చేస్తుంది. ‘‘ ఇది నీ జీవితం నీ జీవితంలో జోక్యం చేసుకోమని మమ్మల్ని అడగకు ’’ అని నా తల్లిదండ్రులు భారాన్ని తీసుకొచ్చి నా తలపై ఉంచారు కాబట్టి, ‘ అని ఆమె వివరించింది. తన పేరు ప్రఖ్యాతులు ఎంతగా పెరుగుతున్నప్పటికీ తన తల్లిదండ్రులు ఎల్లప్పుడూ నిరాడంబరమైన, స్వతంత్ర జీవితాన్ని జీవిస్తున్నారని చెప్పింది.

చెల్లి...పదహారేళ్ల వ్యత్యాసం...
రష్మిక మందన్నకు ఓ సోదరి ఉంది. ఈ ఇంటర్వూలో తన చెల్లెలు గురించి రష్మిక కొన్ని ఆశ్చర్యకరమైన వివరాలను పంచుకుంది, అందులో ముఖ్యమైనది తనకు తన చెల్లికి మధ్య 16 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉండడం. ‘నాకు 10 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక చెల్లెలు ఉంది, మా మధ్య దాదాపు 16 సంవత్సరాల గ్యాప్ ఉంది‘ అని రష్మిక ఆ సంభాషణలో వెల్లడించారు.
రష్మిక ఎప్పుడూ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటుంది. ఆ స్వేఛ్చకు ఆమె సెలబ్రిటీ హోదా కూడా అడ్డం కాకూడదని ఆశిస్తుంది. ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించడం కోసం, వీలైనంత వరకూ సాదా సీదాగా సాధారణ స్థితిని కొనసాగించడం కోసమే ప్రాధాన్యతనిస్తుంది,తన తల్లిదండ్రుల పెంపకాన్ని రష్మిక అభినందిస్తుంది. తన పెంపకం ఓ వ్యక్తిగా తనని ఎలా తీర్చిదిద్దిందో తన సోదరి కూడా అలాగే ఎదగాలని తాను కోరుకుంటున్నట్లు వివరించింది.
‘నేను ఎప్పుడూ నా చెల్లి విషయంలో ఆలోచించేది ఒకటే, నాకున్న ఇప్పటి పరిస్థితుల వల్ల ఆమె కోరుకున్నది ఏదైనా ఆమె పొందుతుంది. కానీ అది ముఖ్యం కాదు, ఎందుకంటే నేను పెరిగిన పెంపకం లాంటిదే ఆమెకు మంచిది. దాని కారణంగానే నేను ఈ రోజు ఇలా ఉన్నాను,‘ అని ఆమె చెప్పింది, బాల్యం నుంచే ప్రతీ వ్యక్తీ స్వతంత్రంగా ఎదగాల్సిన అవసరం ఉందనేది ఆమె అభిప్రాయం.
‘అయితే, ప్రస్తుతం, ఆమె చిన్న పిల్ల. తర్వాత తర్వాత నేను ఆమెకు ఇవ్వాల్సిన భద్రత చాలా ఉంది, వయసుతో పాటు ఆమెకు నేను అందించగలిగిన సౌకర్యాలు కూడా చాలా ఉన్నాయి’’ అంటూ చెల్లి పట్ల తనకున్న అపారమైన ప్రేమను రష్మిక పంచుకుంది. , భవిష్యత్తులో తన సోదరికి రక్షణ సౌకర్యవంతమైన జీవితాన్ని అందించడంతో పాటు లేత వయస్సులో సరైన పెంపకాన్ని అందించడం చాలా అవసరమని అంటున్న రష్మిక అభిప్రాయాలకు దోహదం చేసింది స్వీయానుభవాలే.