సాక్షి, తిరుపతి / భాకరాపేట, న్యూస్‌లైన్: ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధంలో భాగంగా పోలీసు, అటవీ శాఖ సంయుక్త టాస్క్‌ఫోర్స్ ఆదివారం రూ.3 కోట్ల విలువ చేసే 312 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుంది. టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ ఉదయ్‌కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం కర్ణాటకలోని బెంగళూరు రూరల్ కటికనహళ్లికి చెందిన సయ్యద్‌హాదీక్, ముక్తి యార్ అనే కీలక ఎర్రచందనం నిందితులను పలమనేరు పోలీసుల సహకారంతో అరెస్టు చేశారు.
తిరుపతి అర్బన్ ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు టాస్క్‌ఫోర్స్ ఛేదించిన రెండు ప్రత్యేక ఆపరేషన్ల వివరాలను మీడియాకు వెల్లడించారు. భాకరాపేట అడవిలో ఎర్రచందనం దుంగలు లారీలో తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేశామన్నారు. వారి నుంచి 201 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. భాకరాపేట నుంచి ఎర్రచందనం దుంగలు స్మగ్లింగ్ చేస్తున్న ముఠా వెనుక ఉన్న చిత్తూరుకు చెందిన హాలీమ్ అలియాస్ సలీమ్ అనే స్మగ్లర్‌ను త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు.
మరొక కేసులో మామాండూరు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం నరికేందుకు వచ్చిన తిరువణ్ణామలై, వేలూరు జిల్లాలకు చెందిన 22 మంది ఎర్రచందనం కూలీలను అటవీ శాఖ సహకారంతో అరెస్టు చేసినట్లు వెల్లడిం చారు. వీరి నుంచి 10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని, తిరుపతి అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారన్నారు.
101 దుంగలు స్వాధీనం
చిన్నగొట్టిగల్లు ఊరి చివరన ఉన్న నర్సరీ వద్ద రూ.కోటి విలువైన 101 ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నట్లు పీలేరు సీఐ బీ. పార్థసారథి తెలిపారు. శనివారం రాత్రి ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఏపీ16 టీయూ 7779నంబర్ గల ఈచర్ వాహనాన్ని భాకరాపేట ఎస్‌ఐ డీ.నెట్టికంఠయ్యు, పీఎస్‌ఐ రహివుుల్లా ఆధ్వర్యంలో పోలీసులు వెంటాడి పట్టుకున్నట్లు చెప్పారు. వాహనంలో ఉన్న చెన్నైకు చెందిన వీ.శశికుమార్, అరుణ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అంతర్రాష్ర్ట ముఠా ఆధ్వర్యంలో ఈ ఎర్రచందనాన్ని తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. ప్రధాన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ దాడుల్లో భాకరాపేట ఏఎస్‌ఐ రాజు, పోలీసులు కాలేషా, హేవుసుందర్, ప్రతాప్‌రెడ్డి, రఘు, దావుు, సారథి, బాలసుబ్రవుణ్యం, గంగరాజు, తులసి, వల్లీ, పురుషోత్తం, వెంకట్రవుణ, చెంగల్‌రాయుులు పాల్గొన్నారు.
టాస్క్‌ఫోర్స్ సీజ్ చేసిన ఎర్రచందనం వివరాలు
టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు అయినప్పటి నుంచి రెండున్న ర నెలల కాలంలో 27 కేసులను ఛేదించినట్లు ఓఎస్డీ ఉదయ్‌కుమార్ వెల్లడించారు. 149 మంది స్మగర్లను, ఎర్రచందనం నరికే కూలీలను అరెస్టు చేశామన్నారు. 18,079 కిలోల బరువున్న 733 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న 17 వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. రూ.2.95 లక్షల నగదును కూడా స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఎస్పీ చేతుల మీదుగా క్యాష్ రివార్డు
రూ.రెండు కోట్ల విలువ చేసే ఎర్రచందనం పట్టుకోవడమేగాక ఇద్దరు కర్ణాటక స్మగ్లర్లను అరెస్టు చేయటంలో కీలకంగా పనిచేసిన టాస్క్‌ఫోర్స్ అధికారులు, సిబ్బందికి అర్బన్ ఎస్పీ ఎస్వీ. రాజశేఖర్‌బాబు ఆది వారం క్యాష్ రివార్డు అందజేశారు. ఓఎస్డీ ఉదయ్‌కుమార్ సిఫారసు మేరకు ఒక్కొక్కరికి రూ.500 క్యాష్ రివార్డు అందించారు. రివార్డు అందుకున్న వారిలో టాస్క్‌ఫోర్స్ సీఐ మద్దయ్యాచారి, ఎస్‌ఐ అశోక్‌కుమార్, ఎఫ్‌ఎస్‌వో నాగరాజు, కానిస్టేబుల్స్ రియాజ్, వెంకట్, మ్యాగీ, రంగ, సోనూ ఉన్నారు.
భారీగా ఎర్రచందనం స్వాధీనం
Published Mon, Sep 16 2013 3:14 AM | Last Updated on Tue, Nov 6 2018 5:21 PM
Advertisement
Advertisement