లక్ష్మణ్ తమ్ముడూ ఎర్ర డానే..! | police searching for laxman brother about redwood smuggling | Sakshi
Sakshi News home page

లక్ష్మణ్ తమ్ముడూ ఎర్ర డానే..!

Published Sat, Nov 12 2016 2:00 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM

లక్ష్మణ్ తమ్ముడూ ఎర్ర డానే..!

లక్ష్మణ్ తమ్ముడూ ఎర్ర డానే..!

గుర్తించిన చిత్తూరు పోలీసులు
కళ్లు గప్పి తిరుగుతున్న స్మగ్లర్
గాలింపు చర్యలు ముమ్మరం

 చిత్తూరు (అర్బన్): లక్ష్మణ్ -  ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పరిచయం అవసరంలేని వ్యక్తి. సింపుల్‌గా పోలీసు రికార్డుల్లో ఉన్నట్లు చెప్పాలంటే రూ.వంద కోట్ల ఆస్తి, జిల్లాలో 20కి పైగా కేసులు, చిత్తూరు నుంచి చైనా వరకు ఎర్రచందనం దుంగల్ని రాచమార్గంలో తీసుకెళ్లగలిగే వ్యక్తి. ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో పీడీ యాక్టు కింద ఉన్నాడు. ఓ పెద్ద స్మగ్లర్‌కు చెక్ పెట్టగలిగామని సంబరపడుతున్న పోలీసులకు అతని తమ్ముడు రమేష్ ఇప్పుడు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు.

 విదేశాలకూ విస్తరించిన ‘ఎర్ర’ నెట్‌వర్క్
ఎర్రచందనం రవాణాలో అంతర్జాతీయ స్మగ్లర్‌గా ఎదిగిన లక్ష్మణ్ స్వస్థలం చెన్నై. ఇతన్ని రెండేళ్ల క్రితం అరెస్టు చేసిన పోలీసులు తొలిసారిగా రెండుసార్లు పీడీ యాక్టు బనారుుంచి అతడిని కటకటాల్లోకి నెట్టగలిగారు. అయినా జైల్లో నుంచే లక్ష్మణ్ తన రెండో భార్య. ఎర్రచందనం స్మగ్లింగ్ క్వీన్, మాజీ ఎరుుర్ హోస్టెస్ సంగీత ద్వారా హవాలా రూపంలో స్మగ్లర్లకు భారీగా నగదు పంపిస్తూ, ఎర్రచందనాన్ని విదేశాలకు అక్రమ రవాణా చేస్తూ వచ్చాడు. ఇది తెలుసుకున్న చిత్తూరు పోలీసులు సంగీతను కోల్‌కత్తాలో అరెస్టు చేయడం, భారీగా బంగారు, వెండి ఆభరణాలను సీజ్ చేయడం తెలిసిందే. అరుుతే, చిత్తూరులో పెండింగ్ కేసులు ఉన్నా న్యాయస్థానానికి హాజరుకాకుండా సంగీత తప్పించుకు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ప్రస్తుతం రమేష్ అనే పేరు తెరపైకి వచ్చింది. లక్ష్మణ్‌కు స్వయాన తమ్ముడైన రమేష్ ఇప్పుడు ఎర్రచందనం రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు పోలీసులకు దిమ్మదిరిగే వాస్తవాలు తెలిశాయి. గత నెల 17న చిత్తూరు పోలీసులు కడపకు చెందిన అందాలరాముడు అనే స్మగ్లర్‌ను అరెస్టు చేశా రు. ఇతడిని విచారణ చేయగా లక్ష్మణ్ తమ్ముడు రమేష్‌తో కలిసి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులకు వెల్లడించడంతో అసలు విషయం బయటపడింది.

చెన్నై కేంద్రంగా ’ఎర్ర’ వ్యాపారం
లక్ష్మణ్‌కు ఇద్దరు తమ్ముళ్లు. కరుప్పన్ అనే వ్యక్తి కొంతకాలం క్రితమే అనారోగ్యంతో చనిపోయాడు. లక్ష్మణ్ జైలుకు వెళ్లిన తరువాత సంగీత ఆటలు సాగకపోవడంతో రమేష్ ఎర్రచందనం స్మగ్లింగ్‌లోకి దిగాడు. జిల్లా నుంచి ఎర్రచందనం దుంగల్ని చెన్నై, బెంగళూరుకు చేర్చడం, కడప నుంచి కూడా పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగల్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసినట్లు పోలీసులు గుర్తించారు. చెన్నై కేంద్రంగా రమేష్ చేస్తున్న వ్యాపారాన్ని రట్టు చేసేందుకు చిత్తూరు నుంచి ఓ ప్రత్యేక బృందం గాలిస్తోంది. రమేష్ పోలీ సులు త్వరలోనే  పట్టుకోగలమనే పకడ్బందీ వ్యూహం తో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. అతడిని అరెస్టు చేస్తే చెన్నైలో 80 శాతం ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టనట్లే అవుతుందని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement