కడప: వైఎస్సార్ కడప జిల్లా ఓబులవారిపల్లెలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 45 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్మగ్లర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
స్మగ్లర్లు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు మండలంలోని బాలిరెడ్డిపల్లె పరిసర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అక్కడ నిల్వ ఉంచిన దుంగలను పట్టుకుని, స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.