red sandel
-
ఎర్ర స్మగ్లర్ డాన్ శ్రీను అరెస్ట్
మైదుకూరు టౌన్ : ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో జాండ్లవరం గ్రామానికి చెందిన శ్రీనివాసులు నాయుడు అలియాస్ డాన్ శ్రీను ను గురువారం మైదుకూరు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ ఏడాది ఏప్రిల్ 16న బెంగళూరుకు చెందిన స్మగ్లర్లతో సంబంధం ఉందనే కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ 16న కేసు నమోదైంది. ఆ కేసులో ఇతన్ని అరెస్ట్ చేసినట్లు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
ఒంటిమిట్ట పీఎస్‌లో ఎర్రచందనం దుంగలు మాయం
ఒంటిమిట్ట : ఇన్నాళ్లు అడవిని కొల్లగొట్టిన ఎర్రచందనం దొంగలు బరితెగించారు. ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఉన్న దుంగలను ఎత్తుకెళ్లారు. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో దుండగలు చోరికి పాల్పడ్డారు. అధికారులు సంరక్షణలో ఉన్న 15 పైగా ఎర్రచందనం దుంగలను శుక్రవారం తెల్లవారుజామున ఎత్తుకెళ్లారు. ఈ విషయం తెలిసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. దుండగలు దొంగిలించిన ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ. 15 లక్షలు ఉండవచ్చని సమాచారం. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నూజివీడులో ఎర్రచందనం దుంగలు స్వాధీనం
నూజివీడు : కృష్ణా జిల్లా నూజివీడులో బుధవారం ఉదయం స్థానిక అటవీ శాఖ అధికారులు ఎర్రచందనం దుండగలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ట్రిపుల్ ఐటీ కళాశాల సమీపంలోని పొదల్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వీటిని దాచారనే సమాచారంతో అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించగా 25 ఎర్రచందనం దుంగలు కనిపించాయి. వీటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ దుంగలను అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. -
ఇద్దరు ఎర్ర చందనం కూలీల అరెస్టు
రైల్వే కోడూరు : అక్రమంగా ఎర్ర చందనం తరలిస్తున్నతమిళనాడుకు చెందిన ఇద్దరు కూలీలను అటవీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో సోమవారం చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన మత్తు స్వామి, వేలు అనే ఇద్దరు వ్యక్తులు ఎర్ర చందనం దుంగలు తరలిస్తుండగా అరెస్ట్ చేశామని భానుపల్లి రేంజ్ అటవీ అధికారులు తెలిపారు. నిందితుల నుంచి మూడు దుంగలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. -
రూ. 50 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా ఎన్ కౌంటర్ లో కొందరు స్మగ్లర్లు తప్పించుకున్న నేపధ్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలంలోని అటవీ ప్రాంతంలో శనివారం పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్ లో రూ. 50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. ఎర్రచందనంతో పాటు ముగ్గురు తమిళకూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఎర్రచందనం రెండో విడత వేలం
హైదరాబాద్: అటవీ శాఖ గిడ్డంగుల్లో నిల్వ ఉన్న ఎర్రచందనం దుంగలను వచ్చే ఏడాదిలోగా ఎగుమతి చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సూత్రపాయ ఆమోదం తెలిపింది. 8,584 టన్నుల ఎర్రచందనం ఎగుమతికి కేంద్ర ప్రభుత్వ అధీనంలోని డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌ఏ) ఇచ్చిన గడువు ఈనెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రెండో విడత ఎర్రచందనం దుంగల విక్రయానికి ఈ - టెండర్లు నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్ర అటవీ శాఖ దుంగల ఎగుమతికి అదనపు గడువు కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మూడు రోజుల కిందట ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణాధికారి (పీసీసీఎఫ్) ఏవీ జోసెఫ్ కేంద్ర అటవీ పర్యావరణశాఖ మంత్రితోనూ, డీజీఎఫ్‌ఏ అధికారులతోనూ ఈ అంశంపై చర్చించారు. దీంతో మరో ఏడాది గడువు పొడిగించేందుకు డీజీఎఫ్‌ఏ అంగీకరించింది. ఈ నేపథ్యంలో 3500 టన్నుల ఎర్రచందనం విక్రయానికి వచ్చే నెల మొదటి వారంలో రెండో విడత ఈ టెండరు ప్రకటన జారీ చేస్తామని రాష్ట్ర అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి మురళీకృష్ణ తెలిపారు. టెండర్లు నిర్వహించేందుకు వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో నిర్ధారించిన ఎర్రచందనం దుంగలను డ్రెస్సింగ్ చేసి గోదాముల్లో సిద్ధంగా ఉంచామని ఆయన 'సాక్షి' కి తెలిపారు. టెండరు ప్రకటన జారీ చేసేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ఫైలు పంపామని, ఆమోదం రాగానే నోటిఫికేషన్ జారీ చేస్తామని వివరించారు. -
రూ.25 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
కడప : వైఎస్ఆర్ జిల్లాలో అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ముఠాను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని రైల్వేకోడూరు మండలం బాలుపల్లి రెంజీలో గురువారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా ఎర్రచందనం చెట్లను నరుకుతున్నట్టు పోలీసులు గుర్తించారు. దాంతో ముఠాలోని ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 25 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.అరెస్టయిన వాళ్లందరూ తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ( రైల్వేకోడూరు) -
ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటంలేదు. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా రవాణా యధేచ్ఛగా సాగుతోంది. తాజాగా అక్రమంగా తరలిస్తున్నఎర్రచందనం దుంగలను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లిలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో తరలిస్తున్న ఎర్రచందనాన్ని అధికారులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆటోను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
రూ.10 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని నాగయ్యగారి పల్లి వద్ద సోమవారం అటివీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ ఆటోలో తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ సుమారు రూ. 10 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆటోను సీజ్ చేసి స్టేషన్ కు తరిలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
రూ.10 లక్షల ఎర్రచందనం పట్టివేత
గుడిపాల : చిత్తూరు జిల్లా గుడిపాల మండలం నంగమంగళం వద్ద రూ.10లక్షల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు గురువారం ఉదయం పట్టుకున్నారు. వివరాలు.. కాణిపాకం వద్ద స్కూటర్‌ను ఓ కారు ఢీకొంది. దీంతో స్కూటరిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కారును వెంబడిస్తుండగా సుమారు ఐదు కిలోమీటర్ల వెళ్లిన తర్వాత కారును వదిలి నిందితులు పరారయ్యారు. పోలీసులు ఆ కారును పరిశీలించగా అందులో11 ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. కారును, ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.10లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. - గుడిపాల -
13 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
కడప : కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో 13 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బాలుపల్లి అటవీ ప్రాంతంలో స్పెషల్ పార్టీ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న 13 మందిని పోలీసులు పట్టుకున్నారు. మరికొంత మంది తప్పించుకుని పారిపోయారు. వీరి నుంచి 14 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా తమిళనాడుకు చెందినవారు. స్మగ్లర్లను పట్టుకునే సమయంలో పోలీసులపైకి రాళ్లు, రంపాలతో దాడికి దిగారు. (రైల్వేకోడూరు) -
ఎర్ర చందనం రవాణ.. 34 మంది అరెస్ట్
కడప: వైఎస్సార్ కడప జిల్లా చిన్నమండెంలో ఎర్రచందనం రవాణ కేసులో తమిళనాడుకు చెందిన 34 మందిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఆర్టీసీ బస్సులో రాయచోటి నుంచి మదనపల్లి వైపు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నట్టు చిన్నమండెం ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. -
నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
కడప: వైఎస్సార్ కడప జిల్లా ఓబులవారిపల్లెలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 45 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్మగ్లర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్మగ్లర్లు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు మండలంలోని బాలిరెడ్డిపల్లె పరిసర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అక్కడ నిల్వ ఉంచిన దుంగలను పట్టుకుని, స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.