రూ.10 లక్షల ఎర్రచందనం పట్టివేత | police catched red sandel worth 10 lakhs chittoor | Sakshi
Sakshi News home page

రూ.10 లక్షల ఎర్రచందనం పట్టివేత

Published Thu, Mar 5 2015 10:28 AM | Last Updated on Sat, Sep 2 2017 10:21 PM

police catched red sandel worth 10 lakhs chittoor

గుడిపాల : చిత్తూరు జిల్లా గుడిపాల మండలం నంగమంగళం వద్ద రూ.10లక్షల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు గురువారం ఉదయం పట్టుకున్నారు. వివరాలు.. కాణిపాకం వద్ద స్కూటర్‌ను ఓ కారు ఢీకొంది. దీంతో స్కూటరిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కారును వెంబడిస్తుండగా సుమారు ఐదు కిలోమీటర్ల వెళ్లిన తర్వాత కారును వదిలి నిందితులు పరారయ్యారు. పోలీసులు ఆ కారును పరిశీలించగా అందులో11 ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. కారును, ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.10లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
- గుడిపాల

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement