India's 5 Most Expensive Cars And Their Owners; Check Here Names - Sakshi
Sakshi News home page

భారత్‌లో అత్యంత ఖరీదైన కార్లు వీరి దగ్గరే ఉన్నాయి - ధరలు తెలిస్తే దిమ్మతిరిగాల్సిందే!

Published Thu, Apr 27 2023 10:04 AM | Last Updated on Thu, Apr 27 2023 11:55 AM

Most expensive cars their owners in india - Sakshi

ప్రపంచంలోని చాలామంది ధనవంతులు ఖరీదైన లగ్జరీ కార్లను వినియోగిస్తారనే సంగతి తెలుసు. అయితే భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లను ఉపయోగించే వారు ఎవరు, వారు ఎలాంటి కార్లను వినియోగిస్తున్నారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

విఎస్ రెడ్డి - బెంట్లీ ముల్సానే సెంటినరీ ఎడిషన్ EWB
భారతదేశంలో ఖరీదైన విలాసవంతమైన కార్లు ఉపయోగించే వారి జాబితాలో మెడికల్ న్యూట్రిషన్ తయారీ కంపెనీలలో ఒకటైన బ్రిటిష్ బయోలాజికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ 'VS రెడ్డి' ఉన్నారు. ఈయన ఉపయోగించే బెంట్లీ ముల్సానే సెంటినరీ ఎడిషన్ ఈడబ్ల్యుబి ధర సుమారు రూ. 14 కోట్లు.

బెంట్లీ కంపెనీ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ లిమిటెడ్ ఎడిషన్ విడుదల చేసింది. ఈ కారు ప్రపంచ వ్యాప్తంగా 100 యూనిట్లకు మాత్రమే పరిమతమై ఉంది. ఇది 6.75 లీటర్ వి8 ఇంజిన్ కలిగి 506 హెచ్‌పి పవర్ 1020 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కేవలం 5.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 296 కిలోమీటర్లు.

ముఖేష్ అంబానీ - రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII EWB & మెర్సిడెస్ S600 గార్డ్

రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII EWB
భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ముఖేష్ అంబానీ ఒకరు. ఈయన గ్యారేజిలో ఉన్న ఖరీదైన కార్లలో ఒకటి రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ఫాంటమ్ సిరీస్ VIII EWB. దీని ధర రూ. 13.5 కోట్లు. ఈ లగ్జరీ కారు 6.75-లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V12 ఇంజన్ కలిగి 563 బిహెచ్‌పి పవర్, 900 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

మెర్సిడెస్ S600 గార్డ్
అంబానీ గ్యారేజిలోని మరో ఖరీదైన కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ఎస్600 గార్డ్. ఇది ముఖేష్ అంబానీకి కోసం ప్రత్యేకంగా తాయారు చేసిన కారు. దీని ధర సుమారు రూ. 10 కోట్లు. ఈ కారుని ముఖేష్ అంబానీ మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి.

(ఇదీ చదవండి: ఉద్యోగికి రూ. 1500 కోట్ల ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన ముఖేష్ అంబానీ)

కట్టుదిట్టమైన భద్రతా ఫీచర్స్ కలిగిం ఈ కారు బాడీ షెల్ రీన్‌ఫోర్స్డ్ స్టీల్‌తో తయారు చేశారు. ఇది ట్విన్ టర్బోచార్జ్ 6 లీటర్ వి12 ఇంజిన్ కలిగి 523 బిహెచ్‌పి పవర్, 850 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ముఖేష్ అంబానీ గ్యారేజిలో రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII EWB మాత్రమే కాకుండా రోల్స్ రాయిస్ ఫాంటమ్, కల్లినన్స్, గోస్ట్స్ వంటి కార్లతో పాటు ఇతర బెంజ్, ఆడి, బెంట్లీ కార్లు ఉన్నాయి. వీరి సెక్యురిలో కూడా అత్యంత ఖరీదైన కార్లు వినియోగించడం గమనార్హం.

(ఇదీ చదవండి: పోర్షేకు షాక్.. కస్టమర్‌ దెబ్బకు రూ. 18 లక్షలు ఫైన్ - కారణం ఇదే..!)

నసీర్ ఖాన్ - మెక్లారెన్ 765 LT స్పైడర్
అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉన్న ప్రముఖుల జాబితాలో హైదరాబాద్ నగరానికి చెందిన 'నసీర్ ఖాన్' కూడా ఉన్నారు. ఈయన వద్ద ఉన్న ఖరీదైన కారు మెక్‌లారెన్ 765 LT స్పైడర్. దీని ధర రూ. 12 కోట్లు. ఈ మోడల్ ప్రపంచ వ్యాప్తంగా 765 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇది 4.0 లీటర్ ట్విన్ టర్బో వి8 పెట్రోల్ ఇంజిన్ కలిగి 765 పిఎస్ పవర్, 800 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సూపర్ కారు 7-స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్‌తో ఉత్తమ పనితీరుని అందిస్తుంది.

రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్:
నసీర్ ఖాన్ గ్యారేజిలో మరో ఖరీదైన కారు రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కల్లినన్. దీని ధర సుమారు రూ. 8.20 కోట్లు. ఇది షారుఖ్ ఖాన్ వంటి ఇతర సెలబ్రిటీలు కూడా కలిగి ఉన్నారు. ఈ లగ్జరీ కారు 6.75 లీటర్ ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 600 బిహెచ్‌పి పవర్, 900 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 

ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేశాలను మాతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement