most expensive cars
-
దేశంలో ఖరీదైన కారు ఈయన దగ్గరే.. ఇప్పుడు మరో కారు..
దేశంలో అత్యంత ఖరీదైన కార్లు ఉన్న వ్యాపారవేత్తల గురించి మాట్లాడేటప్పుడు ముఖేష్ అంబానీ, గౌతమ్ సింఘానియా, రతన్ టాటా వంటి పేర్లు మాత్రమే వినిపిస్తాయి. అయితే భారత్‌లో అత్యంత ఖరీదైన కారు వీఎస్ రెడ్డి అనే వ్యాపారవేత్త దగ్గర ఉంది.బెంట్లీ ముల్సానే ఈడబ్ల్యూబీ సెంటినరీ ఎడిషన్ దేశంలో అత్యంత ఖరీదైన కారు. దీని ధర రూ .14 కోట్లు. ముఖేష్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ సింఘానియా వంటివారి వద్ద ఉన్న రోల్స్ రాయిస్, ఫెరారీ కార్ల కంటే దీని ధర ఎక్కువ. దీని ఓనర్ వీఎస్ రెడ్డి ఇప్పుడు రూ .3.34 కోట్లు పెట్టి కొత్త మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 680 కారు కొన్నారు.మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 680.. మేబాచ్ ఎస్-క్లాస్ ప్రీమియం వెర్షన్. ఇందులో 6.0-లీటర్ టర్బోఛార్జ్డ్ వి12 ఇంజన్ ఉంది. ఇది 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్‌తో ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 610బీహెచ్పీ పవర్, 900ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.ఎవరీ వీస్ రెడ్డి అంటే..ప్రముఖ న్యూట్రాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన బ్రిటిష్ బయోలాజికల్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టరే వీఎస్ రెడ్డి. 'ది ప్రోటీన్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పేరొందిన కర్ణాటకకు చెందిన వీఎస్ రెడ్డి పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. తాను ఆటోమోటివ్ ఔత్సాహికుడినని, దేశంలోని అన్ని బ్రాండ్ల కార్లు తన వద్ద ఉండాలనుకుంటానని ఈవీవో ఇండియా మ్యాగజైన్‌తో మాట్లాడుతున్న సందర్భంగా వీఎస్ రెడ్డి చెప్పారు. -
కోట్లు విలువ చేసే అత్యంత ఖరీదైన కార్లు వీరి దగ్గరే ఉన్నాయి - వారెవరో తెలుసా?
ప్రపంచంలోని చాలామంది ధనవంతులు ఖరీదైన లగ్జరీ కార్లను వినియోగిస్తారనే సంగతి తెలుసు. అయితే భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లను ఉపయోగించే వారు ఎవరు, వారు ఎలాంటి కార్లను వినియోగిస్తున్నారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. విఎస్ రెడ్డి - బెంట్లీ ముల్సానే సెంటినరీ ఎడిషన్ EWB భారతదేశంలో ఖరీదైన విలాసవంతమైన కార్లు ఉపయోగించే వారి జాబితాలో మెడికల్ న్యూట్రిషన్ తయారీ కంపెనీలలో ఒకటైన బ్రిటిష్ బయోలాజికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ 'VS రెడ్డి' ఉన్నారు. ఈయన ఉపయోగించే బెంట్లీ ముల్సానే సెంటినరీ ఎడిషన్ ఈడబ్ల్యుబి ధర సుమారు రూ. 14 కోట్లు. బెంట్లీ కంపెనీ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ లిమిటెడ్ ఎడిషన్ విడుదల చేసింది. ఈ కారు ప్రపంచ వ్యాప్తంగా 100 యూనిట్లకు మాత్రమే పరిమతమై ఉంది. ఇది 6.75 లీటర్ వి8 ఇంజిన్ కలిగి 506 హెచ్‌పి పవర్ 1020 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కేవలం 5.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 296 కిలోమీటర్లు. ముఖేష్ అంబానీ - రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII EWB & మెర్సిడెస్ S600 గార్డ్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII EWB భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ముఖేష్ అంబానీ ఒకరు. ఈయన గ్యారేజిలో ఉన్న ఖరీదైన కార్లలో ఒకటి రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ఫాంటమ్ సిరీస్ VIII EWB. దీని ధర రూ. 13.5 కోట్లు. ఈ లగ్జరీ కారు 6.75-లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V12 ఇంజన్ కలిగి 563 బిహెచ్పి పవర్, 900 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. మెర్సిడెస్ S600 గార్డ్ అంబానీ గ్యారేజిలోని మరో ఖరీదైన కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ఎస్600 గార్డ్. ఇది ముఖేష్ అంబానీకి కోసం ప్రత్యేకంగా తాయారు చేసిన కారు. దీని ధర సుమారు రూ. 10 కోట్లు. ఈ కారుని ముఖేష్ అంబానీ మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి. (ఇదీ చదవండి: ఉద్యోగికి రూ. 1500 కోట్ల ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన ముఖేష్ అంబానీ) కట్టుదిట్టమైన భద్రతా ఫీచర్స్ కలిగిం ఈ కారు బాడీ షెల్ రీన్ఫోర్స్డ్ స్టీల్‌తో తయారు చేశారు. ఇది ట్విన్ టర్బోచార్జ్ 6 లీటర్ వి12 ఇంజిన్ కలిగి 523 బిహెచ్పి పవర్, 850 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ముఖేష్ అంబానీ గ్యారేజిలో రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII EWB మాత్రమే కాకుండా రోల్స్ రాయిస్ ఫాంటమ్, కల్లినన్స్, గోస్ట్స్ వంటి కార్లతో పాటు ఇతర బెంజ్, ఆడి, బెంట్లీ కార్లు ఉన్నాయి. వీరి సెక్యురిలో కూడా అత్యంత ఖరీదైన కార్లు వినియోగించడం గమనార్హం. (ఇదీ చదవండి: పోర్షేకు షాక్.. కస్టమర్ దెబ్బకు రూ. 18 లక్షలు ఫైన్ - కారణం ఇదే..!) నసీర్ ఖాన్ - మెక్లారెన్ 765 LT స్పైడర్ అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉన్న ప్రముఖుల జాబితాలో హైదరాబాద్ నగరానికి చెందిన 'నసీర్ ఖాన్' కూడా ఉన్నారు. ఈయన వద్ద ఉన్న ఖరీదైన కారు మెక్లారెన్ 765 LT స్పైడర్. దీని ధర రూ. 12 కోట్లు. ఈ మోడల్ ప్రపంచ వ్యాప్తంగా 765 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇది 4.0 లీటర్ ట్విన్ టర్బో వి8 పెట్రోల్ ఇంజిన్ కలిగి 765 పిఎస్ పవర్, 800 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సూపర్ కారు 7-స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్‌తో ఉత్తమ పనితీరుని అందిస్తుంది. రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్: నసీర్ ఖాన్ గ్యారేజిలో మరో ఖరీదైన కారు రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కల్లినన్. దీని ధర సుమారు రూ. 8.20 కోట్లు. ఇది షారుఖ్ ఖాన్ వంటి ఇతర సెలబ్రిటీలు కూడా కలిగి ఉన్నారు. ఈ లగ్జరీ కారు 6.75 లీటర్ ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 600 బిహెచ్పి పవర్, 900 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేశాలను మాతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు
-
ట్రంప్ దగ్గరున్న ఖరీదైన కార్లేమిటో తెలుసా?
డొనాల్డ్ జే. ట్రంప్...ప్రపంచానికి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై అనూహ్య విజయం సాధించి, అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. 45వ అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసిన ట్రంప్, బిజినెస్‌మ్యాన్‌గా, రియల్ ఎస్టేట్ మొగల్‌గా, రియాల్టీ టెలివిజన్ పర్సనాలిటీగా ఎంతో పాపులర్ కూడా. ఆయనకు కార్లంటే అమితాసక్తట. కార్లంటే ఇంత పిచ్చి ఉన్న డొనాల్డ్ ట్రంప్ దగ్గర చాలా ఖరీదైన కార్లే ఉన్నాయట. ట్రంప్ దగ్గరున్న కొన్ని కార్ల వివరాలు... లాంబోర్ఘిని డయాబ్లో : ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారుగా ఎక్కువగా ప్రాముఖ్యం చెందిన ఈ ఇటాలియన్ కారుకు ట్రంప్ 90లోనే యజమాని అట. 1997లో ట్రంప్ ఈ కారును కొనుగోలు చేశారు. 90లో ఈ కారు మోస్ట్ ఐకానిక్ కారుగా ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ కారు గంటకు 320 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 325 కిలోమీటర్లు. సూపర్ స్పోర్ట్స్ కారు సెగ్మెంట్ డియాబ్లోకే అంకితం. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్లు 3000 యూనిట్లు అమ్ముడుపోయాయి. రోల్స్-రాయిస్ ఫాంటమ్: మీ దగ్గర అమితమైన సంపద ఉందనుకో మీరేం చేస్తారు? చాలామందైతే రోల్స్ రాయిస్ కొనుక్కోని ఎంచక్కా రోడ్లపై పరుగులు పెట్టిస్తుంటారు. సంపన్న వ్యక్తంటే రోల్స్ రాయిస్... రోల్స్ రాయిస్ అంటే సంపన్న వ్యక్తి. మరి వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలి, అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ దగ్గర, ఈ కారు ఉండకుండా ఉంటుందా? ట్రంప్ దగ్గర కూడా రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ఉందట. 6.7 లీటర్, వీ-12 ఇంజన్‌ను కలిగిన ఈ కారు 453 బీహెచ్పీ పవర్‌ను ఉత్పత్తిచేస్తుందట. ఈ కారు ధర 500,000 డాలర్లు అంటే రూ.3,41,00,050. రోల్స్ రాయిస్ సిల్వర్ క్లౌడ్ : 1956లోనే రోల్స్ రాయిస్ రోల్స్ రాయిస్ సిల్వర్ క్లౌడ్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొనుగోలు చేశారట. కొన్ని ఈవెంట్లకు ఆయన ఈ కారులోనే వెళ్లేవారట. 1955 నుండి 1966 మధ్య కాలంలో ఈ బాక్స్ రూపంలో ఉన్న సిల్వర్ క్లౌడ్ కార్లను రోల్స్ రాయిస్ ఉత్పత్తి చేసింది. రోల్స్ రాయిస్ దీనిని మూడు జనరేషన్లలో విడుదల చేసింది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 165 కిలోమీటర్లు. 1950 కార్లతో పోలిస్తే దీన్ని స్పీడేమి తక్కువ కాదంటలేండి. 2003 మెర్సిడెస్-బెంజ్ ఎస్ఎల్ఆర్ మెక్లారెన్: 2003లో ఇది విడుదల చేసినప్పటినుంచి మెర్సిడెస్కు ఇది సూపర్ మార్కెట్‌గా ఉంది. ఇది చాలా ఖరీదైన కారట. దీని ధర 455,000 డాలర్లట. దేశీయ కరెన్సీ లెక్కల ప్రకారం రూ.3 కోట్లకు పైమాటే. మెర్సిడెస్, బెంజ్ కలిసి దీన్ని రూపొందించాయి. 2005లో ఇది ట్రంప్ టవర్‌లోకి ప్రవేశించిందట. ట్రంప్ ఈ కారును ఎక్కువగా ఇష్టపడతాడని టాక్. ఇవే కాక ఇంకా చాలా బ్రాండెడ్ కార్లే ట్రంప్ దగ్గరున్నాయట.