దేశంలో ఖరీదైన కారు ఈయన దగ్గరే.. ఇ‍ప్పుడు మరో కారు.. British Biologicals MD V.S. Reddy Purchased Mercedes-Benz Maybach S680 Luxury Sedan | Sakshi
Sakshi News home page

దేశంలో ఖరీదైన కారు ఈయన దగ్గరే.. ఇ‍ప్పుడు మరో కారు..

Published Sun, Jun 30 2024 12:44 PM | Last Updated on Sun, Jun 30 2024 1:19 PM

VS Reddy most expensive car owner now owns Mercedes Maybach S680

దేశంలో అత్యంత ఖరీదైన కార్లు ఉన్న వ్యాపారవేత్తల గురించి మాట్లాడేటప్పుడు ముఖేష్‌ అంబానీ, గౌతమ్ సింఘానియా, రతన్ టాటా వంటి పేర్లు మాత్రమే వినిపిస్తాయి. అయితే భారత్‌లో అత్యంత ఖరీదైన కారు వీఎస్ రెడ్డి అనే వ్యాపారవేత్త దగ్గర ఉంది.

బెంట్లీ ముల్సానే ఈడబ్ల్యూబీ సెంటినరీ ఎడిషన్ దేశంలో అత్యంత ఖరీదైన కారు.  దీని ధర రూ .14 కోట్లు. ముఖేష్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ సింఘానియా వంటివారి వద్ద ఉన్న రోల్స్ రాయిస్, ఫెరారీ కార్ల కంటే దీని ధర ఎక్కువ. దీని ఓనర్‌ వీఎస్‌ రెడ్డి ఇప్పుడు రూ .3.34 కోట్లు పెట్టి కొత్త మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 680 కారు కొన్నారు.

మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 680.. మేబాచ్ ఎస్-క్లాస్ ప్రీమియం వెర్షన్. ఇందులో 6.0-లీటర్ టర్బోఛార్జ్‌డ్ వి12 ఇంజన్ ఉంది. ఇది 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్‌తో ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 610బీహెచ్‌పీ పవర్, 900ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఎవరీ వీస్‌ రెడ్డి అంటే..
ప్రముఖ న్యూట్రాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన బ్రిటిష్ బయోలాజికల్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టరే వీఎస్ రెడ్డి. 'ది ప్రోటీన్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పేరొందిన కర్ణాటకకు చెందిన వీఎస్‌ రెడ్డి పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. తాను ఆటోమోటివ్ ఔత్సాహికుడినని, దేశంలోని అన్ని బ్రాండ్ల కార్లు తన వద్ద ఉండాలనుకుంటానని ఈవీవో ఇండియా మ్యాగజైన్‌తో మాట్లాడుతున్న సందర్భంగా వీఎస్‌ రెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement