
సౌత్ ఇండియా స్టార్ హీరోలు, కేరళకు చెందిన తండ్రీకొడుకులు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్‌లకు కార్లంటే అమితమైన మోజు. వారి వద్ద పలు ప్రత్యేకమైన, ఖరీదైన కార్లు ఉన్నాయి. వారికి '0369 గ్యారేజ్' పేరుతో ప్రత్యేక కార్ల కలెక్షన్ ఉంది. అందులో కార్లన్నిటికీ రిజిస్ట్రేషన్ నంబర్ 0369. తాజాగా ఈ గ్యారేజీకి సరికొత్త మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 కారు చేరింది. (ఐఫోన్ 15 రాకతో కనుమరుగయ్యే ఐఫోన్ పాత మోడళ్లు ఇవే..)
GLS 600 అనేది మెర్సిడెస్ బెంజ్ నుంచి వచ్చిన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ. ఈ కారు కంపెనీ అల్ట్రా-లగ్జరీ విభాగమైన మెర్సిడెస్-మేబ్యాక్ కిందకు వస్తుంది. 0369 గ్యారేజ్‌లోకి చేసిన GLS 600 మమ్మద్ కుట్టి పేరు మీద రిజిస్టర్ అయింది. ఇది మమ్ముట్టి అసలు పేరు. మమ్ముట్టి కుమారుడు యువ హీరో దుల్కర్ సల్మాన్ బ్లాక్ కలర్ GLS 600 కారును డెలివరీ తీసుకుంటున్న వీడియో ఇంటర్నెట్‌లో కనిపించింది.
ఇది కేరళ రాష్ట్రంలో కొనుగోలు చేసిన మొదటి మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 కారు. తన అన్ని కార్ల మాదిరిగానే ఈ కారును కూడా మమ్ముట్టి 0369 నంబర్‌తో రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ ప్రత్యేక నంబర్ కోసం రూ.1.85 లక్షలు చెల్లించినట్లు సమాచారం. ఇక మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 కారు ధర సుమారు రూ. 2.92 కోట్లు (భారత్‌లో ఎక్స్-షోరూమ్ ధర).
దక్షిణ భారతదేశం నుంచి ఈ మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 కారును కొన్న రెండో సినీ నటుడు దుల్కర్ సల్మాన్. ఇతని కంటే ముందు తెలుగు హీరో రామ్ చరణ్ 2022లోనే ఈ కారును కొన్నారు. వీరితో పాటు అర్జున్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా, కృతి సనన్, రణ్‌వీర్ సింగ్, అనిల్ కపూర్, శిల్పా శెట్టితో సహా మరికొంత మంది బాలీవుడ్ ప్రముఖులు కూడా తమ కార్ కలెక్షన్‌లకు ఈ GLS 600ని జోడించారు.
Comments
Please login to add a commentAdd a comment