mercedes
-
ప్రపంచంలోని గ్రేటెస్ట్ సూపర్ కార్లు ఇవే (ఫోటోలు)
-
Hit And Run Case: రూ. 1.98 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశం
న్యూఢిల్లీ: గత ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదం కేసులో దాదాపు రెండు కోట్ల నష్ట పరిహారం చెల్లించాలంటూ ఇన్సూరెన్స్ కంపెనీని ట్రిబ్యూనల్ ఆదేశించింది. రూ.1.21 కోట్లను పరిహారంగా, 77.61 లక్షలను వడ్డీ రూపంలో.. మొత్తం రూ. 1.98 కోట్లను మృతుడి తల్లిదండ్రులకు 30 రోజుల్లోగా ఇవ్వాలని ఆదేశించింది.వివరాలు 2016 ఏప్రిల్ 4న ఢిల్లీలో హిట్ అండ్ రన్ ఘటన జరిగింది. సివిల్స్ లైన్ ప్రాంతంలో ఓ మైనర్ బాలుడు నిర్లక్ష్యంగా మెర్సిడెస్ బెంజ్ కారు నడపడంతో రోడ్డు దాటుతున్న 32 ఏళ్ల సిద్ధార్థ్ శర్మ అనే వ్యక్తి మరణించాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సిద్ధార్థ్‌ను ఢీకొట్టిన తర్వాత కారు ముందు టైర్ పగిలిపోవడంతో దూరంగా వెళ్లి ఆగిపోయింది. ఘటన అనంతరం నిందితుడైన మైనర్ కారును అక్కడే వదిలి తన స్నేహితులతో కలిసి పారిపోయాడు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మైనర్ అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు తేల్చారు. కారు ఢీకొన్న సమయంలో సిద్ధార్థ్ 20 అడుగుల దూరంలో ఎగిరిపడినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. తాజాగా ఈ ఘటనపై విచారణ చేపట్టిన మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యూనల్ బాధతుడైన సిద్ధార్థ శర్మ తల్లిదండ్రులకు రూ.1.21 కోట్లను పరిహారంగా, 77.61 లక్షలను వడ్డీ రూపంలో.. మొత్తం రూ. 1.98 కోట్లను 30 రోజుల్లోగా ఇవ్వాలని ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది. అంతేగాక కారు రిజిస్ట్రేషన్ చేసిన మైనర్ తండ్రి నుంచి పరిహారం మొత్తాన్ని రికవరీ చేసుకునేదుకు బీమా కంపెనీకి కోర్టు అనుమతినిచ్చింది. మైనర్ కుమారుడిని మెర్సిడెస్ కారు నడుపడం అడ్డుకోవడంలో తండ్రి విఫలమైనట్లు చెబుతూ అతన్ని కూడా బాధ్యులుగా ట్రిబ్యునల్ పేర్కొంది. -
అపరకుబేరుడు ముఖేశ్ అంబానీ లగ్జరీ కార్లు
-
దేశంలో ఖరీదైన కారు ఈయన దగ్గరే.. ఇప్పుడు మరో కారు..
దేశంలో అత్యంత ఖరీదైన కార్లు ఉన్న వ్యాపారవేత్తల గురించి మాట్లాడేటప్పుడు ముఖేష్ అంబానీ, గౌతమ్ సింఘానియా, రతన్ టాటా వంటి పేర్లు మాత్రమే వినిపిస్తాయి. అయితే భారత్‌లో అత్యంత ఖరీదైన కారు వీఎస్ రెడ్డి అనే వ్యాపారవేత్త దగ్గర ఉంది.బెంట్లీ ముల్సానే ఈడబ్ల్యూబీ సెంటినరీ ఎడిషన్ దేశంలో అత్యంత ఖరీదైన కారు. దీని ధర రూ .14 కోట్లు. ముఖేష్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ సింఘానియా వంటివారి వద్ద ఉన్న రోల్స్ రాయిస్, ఫెరారీ కార్ల కంటే దీని ధర ఎక్కువ. దీని ఓనర్ వీఎస్ రెడ్డి ఇప్పుడు రూ .3.34 కోట్లు పెట్టి కొత్త మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 680 కారు కొన్నారు.మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 680.. మేబాచ్ ఎస్-క్లాస్ ప్రీమియం వెర్షన్. ఇందులో 6.0-లీటర్ టర్బోఛార్జ్డ్ వి12 ఇంజన్ ఉంది. ఇది 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్‌తో ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 610బీహెచ్పీ పవర్, 900ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.ఎవరీ వీస్ రెడ్డి అంటే..ప్రముఖ న్యూట్రాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన బ్రిటిష్ బయోలాజికల్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టరే వీఎస్ రెడ్డి. 'ది ప్రోటీన్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పేరొందిన కర్ణాటకకు చెందిన వీఎస్ రెడ్డి పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. తాను ఆటోమోటివ్ ఔత్సాహికుడినని, దేశంలోని అన్ని బ్రాండ్ల కార్లు తన వద్ద ఉండాలనుకుంటానని ఈవీవో ఇండియా మ్యాగజైన్‌తో మాట్లాడుతున్న సందర్భంగా వీఎస్ రెడ్డి చెప్పారు. -
మెర్సిడెస్ టాప్ ఎండ్ రైడ్.. రూ.2.35 కోట్ల కారు విడుదల
ముంబై: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ రూ.1 కోటి కంటే అధిక ధర కలిగిన టాప్ ఎండ్ మోడళ్లను భారత్‌కు తీసుకురానుంది. మెట్రోయేతర నగరాల నుండి కూడా డిమాండ్ వేగంగా పెరుగుతుండడం ఇందుకు కారణమని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. టాప్ ఎండ్ వెహికల్స్ (టీఈవీ) వాటా సంస్థ మొత్తం విక్రయాల్లో 25 శాతం ఉందన్నారు. ఏఎంజీ ఎస్ఎల్55 4మేటిక్ ప్లస్ రోడ్‌స్టర్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దీని ధర ఎక్స్‌షోరూంలో రూ.2.35 కోట్లు. -
రూ.3 కోట్లు పెట్టి దుల్కర్ సల్మాన్ కొన్న కొత్త కారు ఏంటో తెలుసా?
సౌత్ ఇండియా స్టార్ హీరోలు, కేరళకు చెందిన తండ్రీకొడుకులు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్‌లకు కార్లంటే అమితమైన మోజు. వారి వద్ద పలు ప్రత్యేకమైన, ఖరీదైన కార్లు ఉన్నాయి. వారికి '0369 గ్యారేజ్' పేరుతో ప్రత్యేక కార్ల కలెక్షన్ ఉంది. అందులో కార్లన్నిటికీ రిజిస్ట్రేషన్ నంబర్ 0369. తాజాగా ఈ గ్యారేజీకి సరికొత్త మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 కారు చేరింది. (ఐఫోన్ 15 రాకతో కనుమరుగయ్యే ఐఫోన్ పాత మోడళ్లు ఇవే..) GLS 600 అనేది మెర్సిడెస్ బెంజ్ నుంచి వచ్చిన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ. ఈ కారు కంపెనీ అల్ట్రా-లగ్జరీ విభాగమైన మెర్సిడెస్-మేబ్యాక్ కిందకు వస్తుంది. 0369 గ్యారేజ్‌లోకి చేసిన GLS 600 మమ్మద్ కుట్టి పేరు మీద రిజిస్టర్ అయింది. ఇది మమ్ముట్టి అసలు పేరు. మమ్ముట్టి కుమారుడు యువ హీరో దుల్కర్ సల్మాన్ బ్లాక్ కలర్ GLS 600 కారును డెలివరీ తీసుకుంటున్న వీడియో ఇంటర్నెట్లో కనిపించింది. ఇది కేరళ రాష్ట్రంలో కొనుగోలు చేసిన మొదటి మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 కారు. తన అన్ని కార్ల మాదిరిగానే ఈ కారును కూడా మమ్ముట్టి 0369 నంబర్‌తో రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ ప్రత్యేక నంబర్ కోసం రూ.1.85 లక్షలు చెల్లించినట్లు సమాచారం. ఇక మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 కారు ధర సుమారు రూ. 2.92 కోట్లు (భారత్‌లో ఎక్స్-షోరూమ్ ధర). దక్షిణ భారతదేశం నుంచి ఈ మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 కారును కొన్న రెండో సినీ నటుడు దుల్కర్ సల్మాన్. ఇతని కంటే ముందు తెలుగు హీరో రామ్ చరణ్ 2022లోనే ఈ కారును కొన్నారు. వీరితో పాటు అర్జున్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా, కృతి సనన్, రణ్వీర్ సింగ్, అనిల్ కపూర్, శిల్పా శెట్టితో సహా మరికొంత మంది బాలీవుడ్ ప్రముఖులు కూడా తమ కార్ కలెక్షన్లకు ఈ GLS 600ని జోడించారు. -
ఎలాన్ మస్క్‌కు ఝలక్: లెవల్-3 అటానమస్ కార్ల తొలి కంపెనీ ఏదంటే?
న్యూఢిల్లీ: టెస్లా సీఈవో ఎలాన్ మాస్క్‌కు షాక్ తగిలింది.సెల్ఫ్-డ్రైవింగ్ కార్లలో టెస్లాను బీట్ చేసింది మరో టాప్ కార్‌మేకర్ మెర్సిడెస్. అమెరికాలో లెవెల్-3 అటానమస్ సర్టిఫైడ్ కార్లను అందించిన తొలి కంపెనీగా అవతరించింది. తద్వారా ఇటీవలి కీలకమైన రేసులో మెర్సిడెస్ టెస్లాపై పైచేయి సాధించింది. లెవెల్-3 ఆటోమేషన్, కండిషనల్ ఆటోమేషన్‌గా పిలిచే ఈ రేసులో మెర్సిడెస్ దూసుకొచ్చింది. సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్ (SAE) ద్వారా డ్రైవింగ్ ఆటోమేషన్ లెవల్-3గా వర్గీకరించింది. ఇది నిర్దిష్ట పరిస్థితులలో కారును స్వయంగా నడపడానికి అనుమతిస్తుంది. స్టీరింగ్ పట్టుకోవాల్సిన, బ్రేక్‌ను కంట్రోల్ చేయాల్సిన అవసరం లేకుండానే కారు నడిపవచ్చు. అయితే డ్రైవర్ అప్రమత్తంగా ఉంటూ, ఏ క్షణంలోనైనా కంట్రోల్లోకి తీసుకునేలా అలర్ట్‌గా ఉండాలి. లెవల్-3 ఆటోమేషన్ కోసం ప్రంపచవ్యాప్తంగా దిగ్గజ ఆటో కంపెనీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అయితే ఈ విషయంలో టెస్లా, దాని ఫుల్లీ సెల్ఫ్-డ్రైవింగ్ ఫీచర్ ముందంజలో ఉన్నప్పటికీ కానీ సమయానికి అవసరమైన ధృవపత్రాలను పొందలేకపోయినట్టు తెలుస్తోంది. అయితే నిబంధనల పరంగా లెవెల్-3 ఆటానమస్ అంతా ఆశాజనంగా లేకపోవడం గమనించదగ్గ విషయం. చాలా దేశాల్లో ఇంకా లెవల్-3 ఆటోమేషన్ వాహనాలకు నిర్దిష్ట నిబంధనలను కలిగి లేవు . అలాగే ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్, కారు తయారీదారుకు సంబంధించిన చట్టపరమైన బాధ్యతలపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో మాత్రమే అనుమతి. "ఇన్నోవేషన్ పట్ల తిరుగులేని నిబద్ధతే మెర్సిడెస్-బెంజ్‌ను మొదటి నుండి నిలకడగా మార్గ నిర్దేశనం చేసిందనీ, దీన్ని కొనసాగించడతోపాటు, లెవల్-3 షరతులతో కూడిన ఆటోమేటెడ్ డ్రైవింగ్ సర్టిఫికేట్ పొందిన తొలి ఆటోమోటివ్ కంపెనీ నిలవడం గర్వకారణమని మెర్సిడెస్ అమెరికా మార్కెటింగ్ అండ్ సేల్స్ హెడ్, సీఈవో హెడ్ డిమిట్రిస్ పిసిలాకిస్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. లెవెల్-3 స్వయంప్రతిపత్తి సాంకేతికత అభివృద్ధి పూర్తిగా ఆటోమేటెడ్ డ్రైవింగ్‌కు ప్రయాణంలో ఒక అడుగు మాత్రమే, ఇంకా చాలా పురోగతి సాధించాల్సి ఉందని ఆటో పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. అయితే, మెర్సిడెస్ సాధించిన లెవెల్-3 ఆటోమేషన్ విజయం ఆటో పరిశ్రమకు కొత్త ప్రమాణాన్ని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్నందున, లెవల్-3 నుంచి లెవల్-4,లెవల్-5 ఆటోమేషన్ ఉన్నత స్థాయి అటానమస్ డ్రైవింగ్ అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ కార్లను రోడ్లపై దూసుకుపోయేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో చూడాలి. -
రండి! నా స్టార్టప్‌లో పనిచేయండి.. బెంజ్ కార్లు బహుమతిగా ఇస్తా!
భారత్ పే మాజీ ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్ 3వ స్టార్టప్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్టార్టప్ భవిష్యత్ ప్రణాళికలు ఏంటనేవి లింక్డిన్ పోస్ట్‌లో షేర్ చేశారు అశ్నీర్. తాను ప్రారంభించిన కొత్త వెంచర్లో ఉద్యోగులు, పెట్టుబడి దారులకు స్వాగతం అంటూ ఆహ్వానించారు. పైగా కొత్త స్టార్టప్‌లో విధులు నిర్వహించే ఉద్యోగులకు మెర్సిడెజ్ బెంజ్ కార్లను బహుమతిగా ఇస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. 2023లో కొంత పని పూర్తి చేద్దాం! అంటూ థర్డ్ స్టార్టప్ పనులు చాలా నిశబ్ధంగా, శాంతియుతంగా కొనసాగుతున్నాయి.మార్కెట్‌ను షేక్ చేసేలా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నాం. మేం విభిన్నంగా బిజినెస్ కార్యకలాపాలు చేస్తున్నాం. కాబట్టి మీరు తదుపరి టూడో - ఫోడో అంశంలో భాగం కావాలనుకుంటే బిజినెస్‌ను ఎలా చేస్తున్నామో మీరు తెలుసుకోవాలంటూ కొన్ని ఇమెజెస్‌ను చూపించగా.. అందులో థర్డ్ యునికార్న్‌కు వెంచర్ క్యాపిటలిస్ట్‌లు నిధులు సమకూర్చరని ఒక ఇమేజ్‌లో ఉంది. దేశీ/స్వయంగా సంపాదించిన మూలధనాన్ని మాత్రమే ఉపయోగిస్తాం. జట్టులో 50 మంది సభ్యులు ఉంటారని అందులో జోడించింది. అంతే కాదు, ఉద్యోగులు కంపెనీలో ఐదేళ్లు పూర్తి చేస్తే, వారికి మెర్సిడెస్ ఇస్తామని అశ్నీర్ గ్రోవర్ ఆఫర్ చేశారు. -
మెర్సిడెస్ బెంజ్‌కు భారీ షాక్!
ప్రముఖ జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్‌కు భారీ షాక్ తగిలింది. బెంజ్ కార్లలో బ్రేకింగ్ సిస్టమ్‌లో లోపాల్ని జర్మన్ ఫెడరల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఎత్తిచూపించింది. వెంటనే బెంజ్‌కు చెందిన 1మిలియన్ కార్లను రీకాల్ చేయాలని స్పష్టం చేసింది. న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ ప్రకారం.. 2004 - 2015 మధ్య కాలంలో తయారు చేసిన ఎంఎల్, జీఎల్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ సిరీస్‌తో పాటు ఆర్ -క్లాస్ లగ్జరీ మినివాన్ వంటి కార్లలో ఈ లోపం తలెత్తినట్లు స్పష్టం చేసింది. మెర్సిడెస్ సైతం కార్లను రీకాల్‌ను ఏఎఫ్పీకి ధృవీకరించింది. కొన్ని సందర్భాలలో బ్రేకింగ్ సిస్టమ్‌లో లోపాలు తలెత్తే అవకాశం ఉందని తెలిపింది. ఇక బెంజ్ ప్రపంచవ్యాప్తంగా 993,000 వాహనాలు రీకాల్ చేయబడుతున్నాయి. వాటిలో 70,000 వెహికల్స్ జర్మనీలో ఉన్నాయని ఏఎఫ్‌పీ నివేదించింది. -
విలాసవంతమైన కారు కొన్న స్టార్ హీరో.. ధర ఎంతంటే ?
బాలీవుడ్ చాక్లెట్ బాయ్, కబీర్ సింగ్ షాహిద్ కపూర్ కొత్త కారును కొనుగోలు చేశాడు. దానికి సంబంధించిన ఫొటోలను, వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. షాహిద్ కొన్న కొత్త కారు మెర్సిడెస్ మేబాచ్ ఎస్-580. దీని విలువ సుమారు రూ. 3 కోట్ల దాకా ఉంటుందని అంచనా. మెర్సిడెస్ కారులో డ్రైవ్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేశాడు షాహిద్. దీనికి 'ఫాలింగ్ బ్యాక్ బ్యాచ్' అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Auto Hangar Mercedes-Benz (@autohangar) అనేక మంది బీటౌన్ తారలు, అభిమానులు, నెటిజన్లు ఈ పోస్ట్‌కు కామెంట్ పెడుతూ అభినందనలు తెలుపుతున్నారు. 'ఏప్రిల్‌లో మేబాచ్' అని ర్యాప్ సింగర్ బాద్ షా కామెంట్ చేశాడు. షాహిద్ వద్ద ఇదివరకే అనేక విలాసవంతమైన కార్లు ఉన్నాయి. జాగ్వార్, రేంజ్ రోవర్, మెర్సిడెస్, పోర్షే వంటి తదితర బ్రాండ్లు ఉన్నాయి. కాగా షాహిద్ కపూర్ ప్రస్తుతం జెర్సీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్, పంకజ్ కపూర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం తెలుగు 'జెర్సీ' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కించారు. View this post on Instagram A post shared by Shahid Kapoor (@shahidkapoor) -
కార్ల రేట్లు రయ్..!
న్యూఢిల్లీ: ముడి వస్తువుల వ్యయాలు పెరిగిపోవడంతో కార్ల తయారీ కంపెనీలు మళ్లీ రేట్ల పెంపు బాట పట్టాయి. మారుతీ సుజుకీ, ఆడి, మెర్సిడెస్ తదితర సంస్థలు జనవరి 1 నుంచి ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించాయి. పెంపు అనేది మోడల్‌ను బట్టి ఆధారపడి ఉంటుందని దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ (ఎంఎస్ఐ) తెలిపింది. ఎంత మేర పెంచేది మాత్రం వెల్లడించలేదు. ‘వివిధ ముడి వస్తువుల ధరలు ఎగియడం వల్ల వాహనాల తయారీ వ్యయాలపై గత ఏడాది కాలంగా తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో అదనపు వ్యయాల భారంలో కొంత భాగాన్ని వాహనాల రేట్ల పెంపు రూపంలో కస్టమర్లకు బదలాయించక తప్పడం లేదు‘ అని కంపెనీ వివరించింది. ‘కమోడిటీల రేట్లు భారీగా పెరిగిన నేపథ్యంలో ధరల పెంపు కూడా గణనీయంగానే ఉండవచ్చు‘ అని ఎంఎస్ఐ సీనియర్ ఈడీ (మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగం) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. హ్యాచ్‌బ్యాక్ ఆల్టో మొదలుకుని ఎస్యూవీ ఎస్ క్రాస్ దాకా వివిధ మోడల్స్‌ను మారుతీ విక్రయిస్తోంది. వీటి ధరలు సుమారు రూ. 3.15 లక్షల నుంచి రూ. 12.56 లక్షల వరకూ (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంటున్నాయి. మారుతీ ఈ ఏడాదిలో ఇప్పటికే మూడు సార్లు రేట్లు పెంచింది. జనవరిలో 1.4 శాతం, ఏప్రిల్‌లో 1.6 శాతం, సెప్టెంబర్‌లో 1.9 శాతం.. మొత్తం మీద 4.9 శాతం మేర పెంచింది. ఉక్కు, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్‌తో పాటు ఇతర ముఖ్యమైన లోహాల ధరలు గత ఏడాది కాలంగా పెరుగుతూనే ఉన్నాయని శ్రీవాస్తవ తెలిపారు. వాహన తయారీ వ్యయాల్లో వీటి వాటా 75–80 శాతంగా ఉంటుందని, అందుకే ఉత్పత్తి ఖర్చు పెరిగిపోతోందని ఆయన పేర్కొన్నారు. 2 శాతం వరకూ మెర్సిడెస్ పెంపు.. లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్–బెంజ్.. జనవరి 1 నుంచి తమ కార్ల ధరలను 2 శాతం వరకూ పెంచనున్నట్లు తెలిపింది. కొత్త ఫీచర్లను జోడిస్తుండటం, ముడి వస్తువుల ధరలు పెరుగుతుండటం ఇందుకు కారణమని వివరించింది. అయితే, ఎంపిక చేసిన కొన్ని మోడల్స్‌కు మాత్రమే పెంపును వర్తింపచేయనున్నట్లు పేర్కొంది. జీఎల్ఈ 400, జీఎల్ఈ 400డి ఎస్‌యూవీలను ఇప్పటికే బుక్ చేసుకుని, డెలివరీ కోసం ఏప్రిల్ నుంచి నిరీక్షిస్తున్న కస్టమర్లకు ధర పెంపుపరంగా రక్షణ ఉంటుందని వివరించింది. ఆడి 3 శాతం వరకూ.. అటు ఆడి కూడా తమ వాహనాల ధరలను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 3 శాతం వరకూ పెంచనున్నట్లు ప్రకటించింది. ముడి వస్తువులు, నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడమే ఇందుకు కారణమని వివరించింది. ఏ4, ఏ6, ఆర్ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్ తదితర మోడల్స్‌ను దేశీయంగా ఆడి విక్రయిస్తోంది. 2021లో అయిదు ఎలక్ట్రిక్ కార్లతో పాటు మొత్తం 9 కొత్త వాహనాలను ప్రవేశపెట్టింది. అసాధారణంగా పెరుగుతున్న కమోడిటీల ధరలు.. కమోడిటీ ధరల పెరుగుదల భారం కంటే తాము తక్కువే పెంచామని శ్రీవాస్తవ వివరించారు. ‘గతేడాది ఏప్రిల్–మేలో కేజీ ఉక్కు ధర రూ. 38గా ఉండేది. ఈ ఏడాది అది రూ. 77కి పెరిగిపోయింది. ఇది అసాధారణ స్థాయి. ఉక్కు రేట్లు.. అలాగే ప్లాస్టిక్ ఖర్చులు కూడా భారీ స్థాయిలోనే కొనసాగవచ్చని అంచనాలు ఉన్నాయి. ఇక చైనాలో అల్యూమినియం ఉత్పత్తి పడిపోవడంతో టన్ను ధర 1,700–1,800 డాలర్ల నుంచి ఏకంగా రూ. 2,700–2,800 డాలర్లకు ఎగిసింది. అలాగే రాగి, ఇతర విలువైన లోహాల ధరలు కూడా పెరిగిపోయాయి. రేట్లు తగ్గుతాయేమోనని మేము వేచి చూస్తూ ఉన్నప్పటికీ అది జరగలేదు. మా పరంగా మేము ఖర్చులు తగ్గించుకోవడం వంటి చర్యలు అన్నీ తీసుకున్నాం. కానీ ముడి వస్తువుల వ్యయాలు ఈ స్థాయిలో ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు. అందుకే రేట్ల పెంపు నిర్ణయం తీసుకోక తప్పలేదు‘ అని ఆయన తెలిపారు. -
రూ. 2కోట్ల ఖరీదైన కారు కొన్న హీరోయిన్
Kriti Sanon New Car: ‘మిమి’ సక్సెస్.. చేతిలో ‘ఆదిపురుష్’ వంటి భారీ ప్రాజెక్ట్‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్న హీరోయిన్ కృతీ సనన్ తనకు తానే ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చుకున్నారు. సరికొత్త మెర్సిడెస్-మేబాచ్ జీఎల్ఎస్ 600 కారును తనకు తానే గిఫ్ట్‌గా ఇచ్చుకున్నారు కృతీ సనన్. దీని ఖరీదు సుమారు 2 కోట్ల రూపాయల ఉంటుందని సమాచారం. ప్రసుత్తం ఈ ఖరీదైన బహుమతి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ కొత్త మెర్సిడెస్-మేబాచ్ జీఎల్ఎస్ 600 లగ్జరీ కారు కృతీ కార్ల సేకరణకు అదనపు ఆకర్షణగా నిలిచింది. (చదవండి: ఆ రోజు ఆటోలో కూర్చోని బాగా ఏడ్చాను: కృతి సనన్) ‘మిమి’ సినిమా విజయంతో కృతీ సనన్ బాలీవుడ్లో సక్సెస్‌తో పాటు విమర్శకులు ప్రశంసలు సైతం అందుకున్నారు. ఇన్నాళ్లు ఆమె పడిన శ్రమకు ‘మిమి’ సినిమాతో ఫలితం లభించింది. ఇక ‘ఆదిపురుష్’ వంటి క్రేజి ప్రాజెక్ట్‌కి సైన్ చేసి బాలీవుడ్ టాప్ హీరోయిన్లా జాబితాలో చేరారు కృతీ సనన్. (చదవండి: గర్భవతిగా కనిపించడం కోసం ఏకంగా 15 కిలోలు.. ఇప్పుడు) ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కృతీ సనన్ 'ఆదిపురుష్', 'బచ్చన్ పాండే,' భేదియా ',' గణపత్ ',' హమ్ దో హమారే దో 'తో పాటు మరికొన్ని పేర్లు ఖరారు చేయని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. చదవండి: 'సీత'ను సెట్లోకి ఆహ్వానించిన ప్రభాస్ -
Formula One: గొప్ప అవకాశం.. ధన్యవాదాలు: రసెల్
లండన్: బ్రిటన్‌కు చెందిన 23 ఏళ్ల జార్జ్ రసెల్ వచ్చే ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్ నుంచి మెర్సిడెస్ డ్రైవర్‌గా బరిలోకి దిగనున్నాడు. దాంతో 2022 సీజన్లో హామిల్టన్‌తో కలిసి రసెల్ మెర్సిడెస్ తరఫున రేసింగ్ చేయనున్నాడు. 2019లో విలియమ్స్ టీమ్ ద్వారా రసెల్ ఎఫ్1లో అరంగేట్రం చేశాడు. ప్రస్తుత సీజన్లో మెర్సిడెస్ డ్రైవర్‌గా ఉన్న బొటాస్... 2022 నుంచి అల్ఫా రొమేయో జట్టు తరఫున రేసింగ్‌లో పాల్గొంటాడు. ఇక తనకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మెర్సిడెస్కు రసెల్ ధన్యవాదాలు తెలిపాడు. చదవండి: Shafali Verma: టాప్ ర్యాంక్‌లోనే షఫాలీ వర్మ US Open 2021: కొత్త చాంపియన్ అవతరించనుంది! You never forget your first…once a Williams driver, always a Williams driver 💙 A message from @GeorgeRussell63...🗣️ pic.twitter.com/BaPQFXAoNL — Williams Racing (@WilliamsRacing) September 7, 2021 -
Hungarian Grand Prix: హామిల్టన్‌కు ‘పోల్’
బుడాపెస్ట్: ఫార్ములావన్ (ఎఫ్1) తాజా సీజన్లో మెర్సిడెస్ డ్రైవర్, ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ మళ్లీ మెరిశాడు. శనివారం జరిగిన హంగేరి జీపీ క్వాలిఫయింగ్‌లో ఈ బ్రిటన్ డ్రైవర్ పోల్ పొజిషన్‌ను దక్కించుకున్నాడు. ల్యాప్‌ను అందరికంటే ముందుగా ఒక నిమిషం 15.419 సెకన్లలో పూర్తి చేసి ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించనున్నాడు. సీజన్లో హామిల్టన్‌కిది మూడో పోల్‌కాగా... ఓవరాల్‌గా 101వది. బొటాస్ (మెర్సిడెస్) రెండో స్థానంలో నిలువగా... వెర్స్టాపెన్ మూడో స్థానంలో నిలిచాడు. నేడు జరిగే ప్రధాన రేసు సాయంత్రం గం. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
రణ్వీర్ సింగ్ దగ్గర ఎన్ని కార్లో! వాటి ధర తెలిస్తే గుడ్లు తేలేయాల్సిందే!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ మరో కొత్త కారుకు ఓనరయ్యాడు. జూలై 6న జరుపుకున్న తన 36వ పుట్టినరోజు సందర్భంగా తనకు తానే కారును గిఫ్ట్‌గా ఇచ్చుకున్నాడు. మెర్సిడిస్ మేబీచ్ జీఎల్ఎస్ 600ను కొనుగోలు చేసి తన ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంతకీ గత నెలలోనే భారత్‌లో లాంచ్ అయిన ఈ కొత్త మోడల్ ధర ఎంతనుకుంటున్నారు? అక్షరాలా 2 కోట్ల 43 లక్షల రూపాయలు. లేటెస్ట్గా లాంచ్ అయిన ఈ మోడల్‌కే ప్రస్తుతం ఎక్కుడ డిమాండ్ ఉంది. ఇదే ఏడాది మేలో రణ్వీర్ లంబోర్గిని యురుస్ పెరల్ క్యాప్సుల్ మోడల్‌ను తన సొంతం చేసుకున్నాడు. దీని కోసం రూ.3.15 కోట్లు వెచ్చించాడు. వీటితోపాటు ఈ హీరో దగ్గర ఆస్టన్ మార్టిన్ స్పోర్ట్స్ కారు కూడా ఉంది. ఇది పై రెండు కార్ల ఖరీదును కన్నా ఎక్కువే. ఈ స్పోర్ట్స్ కారును తన వశం చేసుకోవడం కోసం అతడు ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. మొత్తానికి రణ్వీర్ కార్ల సంఖ్య ఇప్పుడు నాలుగుకు చేరింది. రణ్‌వీర్‌కు కార్ల మీదున్న ప్రేమ చూస్తుంటే త్వరలో ఏదైనా కొత్త మోడల్ దిగితే దానికోసం ఎన్ని కోట్లైనా ఖర్చు చేసేలా ఉన్నాడు. రణ్వీర్ సింగ్ ప్రస్తుతం అలియాభట్‌తో కలిసి 'రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ' సినిమాలో నటిస్తున్నాడు. అలాగే స్పోర్ట్స్ డ్రామా '83'లో క్రికెటర్ కపిల్ దేవ్ పాత్ర పోషిస్తున్నాడు. వీటితోపాటు 'జయేశ్‌భాయ్ జోర్దార్', 'సర్కస్', 'అన్నియన్', 'తాకత్' చిత్రాలు కూడా లైన్లో ఉన్నాయి. అలాగే 'బిగ్ పిక్చర్' అనే క్విజ్ షో ద్వారా త్వరలోనే బుల్లితెరపై కూడా ఎంట్రీకి సిద్ధమయ్యాడు. -
హైస్పీడులో లగ్జరీ కార్ సేల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మెర్సిడెస్ మైబాహ్ జీఎల్ఎస్ 600.. ధర ఎక్స్‌షోరూంలో రూ.2.43 కోట్లు. ఇందులో విశేషం ఏమిటంటారా? ఈ సూపర్ లగ్జరీ కారు భారత మార్కెట్లోకి రాక ముందే ఇక్కడి కస్టమర్లు బుక్ చేసుకున్నారట. కంపెనీ భారత్ కోసం కేటాయించింది అటూ ఇటుగా 50 యూనిట్లు మాత్రమే. రెండవ లాట్ వచ్చేది 2022 జనవరి–మార్చిలోనే. సూపర్ లగ్జరీ కార్లకు భారత విపణిలో ఏ స్థాయిలో డిమాండ్ ఉందో ఇదొక్కటే చెబుతోంది. ఇక రూ.2.5 కోట్లకుపైగా ధర కలిగిన సూపర్ లగ్జరీ కార్లు 2019లో దేశవ్యాప్తంగా 265 యూనిట్లు అమ్ముడయ్యాయి. కోవిడ్–19 ముందస్తు స్థాయికి ఈ ఏడాది విక్రయాలు ఉంటాయని లంబోర్గినీ అంచనా వేస్తోంది. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి నుంచి మొత్తం 50కిపైగా కొత్త మోడళ్లు ఈ ఏడాది విడుదల కానుండటం కంపెనీల ఆసక్తికి నిదర్శనం. చిన్న మార్కెట్ అయినప్పటికీ భారత్‌పై సూపర్ లగ్జరీ కార్ల తయారీ సంస్థలు పెద్ద ఆశలే పెట్టుకున్నాయి. కోవిడ్–19 సమయంలోనూ.. దేశంలో సూపర్ లగ్జరీ కార్ల అమ్మకాలు కోవిడ్–19 సమయంలోనూ కొనసాగుతున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ప్రకారం 2020–21లో పోర్ష 249 కార్లను విక్రయించింది. లంబోర్గినీ 26 కార్లు, రోల్స్ రాయిస్ 21, ఫెరారీ 16, బెంట్లే నుంచి 12 కార్లు రోడ్డెక్కాయి. 2019–20తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో లంబోర్గినీ ఏకంగా 100 శాతం వృద్ధి సాధించింది. ఊరూస్ మోడల్‌కు విపరీత డిమాండ్ కారణంగానే ఈ స్థాయి వృద్ధి నమోదు చేసింది. ఎక్స్‌షోరూంలో ఊరూస్ ధర రూ.3.15 కోట్ల నుంచి ప్రారంభం. మెర్సిడెస్ 2021లో 15 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. జనవరి–జూన్‌లో ఇప్పటికే ఎనిమిది మోడళ్లు కొలువుదీరాయని తెలిపింది. కన్జూమర్ సెంటిమెంట్ తిరిగి బలపడిందనడానికి మైబాహ్ జీఎల్ఎస్ 600 బుకింగ్స్ ఉదాహరణగా వివరించింది. తొలి అర్ధ భాగంలో 50% వృద్ధి సాధించామని.. వచ్చే త్రైమాసికాల్లోనూ అమ్మకాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తోంది. ఇన్నాళ్లు ఖర్చులకు దూరంగా.. షికార్లు, షాపింగ్‌కు సంపన్నులు తరచూ విదేశాలు చుట్టి వస్తుంటారు. కోవిడ్–19 మూలంగా విమాన ప్రయాణాలకు పరిమితులు ఉండడం, వైరస్ భయం కారణంగా గతేడాది నుంచి వీరంతా షికార్లు, షాపింగ్‌కు దూరంగా ఉన్నారు. వీరి వద్ద ఆర్థిక సామర్థ్యం ఉందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ మార్టిన్ ష్వెంక్ తెలిపారు. ‘మెరుగైన ఇల్లు, కార్లవైపు వినియోగదార్లు చూస్తున్నారు. ఆరోగ్యం, జీవితంపై అనిశ్చితి నేపథ్యంలో స్తోమత ఉన్నప్పుడు ఈ రోజే ఎందుకు సొంతం చేసుకోకూడదు. ఎందుకు ఓ అయిదేళ్లు ఆగాలి అన్న భావన కస్టమర్లలో ఉంది. ఈ అంశమే అమ్మకాలకు బూస్ట్‌నిస్తోంది’ అని లంబోర్గినీ ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏటా 30–40 సూపర్ లగ్జరీ కార్లు రోడ్డెక్కుతున్నాయని వసంత్ మోటార్స్ ఫౌండర్ కొమ్మారెడ్డి సందీప్ రెడ్డి తెలిపారు. రూ.220 కోట్లకుపైగా సంపద కలిగిన అల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ ప్రస్తుతం దేశంలో 6,884 మంది ఉన్నారు. అయిదేళ్లలో ఈ సంఖ్య 63% వృద్ధి చెందుతుం దని ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ తెలిపింది. -
Lewis Hamilton: హామిల్టన్ ‘సెంచరీ’
బార్సిలోనా (స్పెయిన్): ఫార్ములావన్ (ఎఫ్1) క్రీడలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ మరో రికార్డు నెలకొల్పాడు. శనివారం జరిగిన స్పెయిన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ‘పోల్ పొజిషన్’ సాధించడంద్వారా ఎఫ్1 క్రీడా చరిత్రలో 100 పోల్ పొజిషన్స్ సాధించిన తొలి డ్రైవర్‌గా హామిల్టన్ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. చివరి క్వాలిఫయింగ్ సెషన్లో ల్యాప్‌ను అందరికంటే వేగంగా ఒక నిమిషం 16.741 సెకన్లలో ముగించిన హామిల్టన్ కెరీర్లో 100వ పోల్ పొజిషన్‌ను సొంతం చేసుకున్నాడు. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఎఫ్1 దిగ్గజం మైకేల్ షుమాకర్ పేరిట ఉన్న అత్యధిక పోల్ పొజిషన్స్ (68) రికార్డును 2017లోనే బద్దలు కొట్టిన హామిల్టన్ నాలుగేళ్ల తర్వాత ‘సెంచరీ’ మైలురాయిని చేరుకున్నాడు. ► 2007లో మాంట్రియల్లో జరిగిన కెనడా గ్రాండ్‌ప్రిలో మెక్లారెన్ జట్టు తరఫున బరిలోకి దిగిన హామిల్టన్ కెరీర్లో తొలిసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. ► 2012 వరకు మెక్లారెన్ జట్టుతోనే కొనసాగిన హామిల్టన్ ఆ జట్టు తరఫున 26 పోల్ పొజిషన్స్ సాధించాడు. ► 2013 సీజన్ నుంచి మెర్సిడెస్ జట్టు తరఫున బరిలోకి దిగిన హామిల్టన్ ఇప్పటి వరకు అదే జట్టుతో కొనసాగుతున్నాడు. మెర్సిడెస్ తరఫున హామిల్టన్ 74 పోల్ పొజిషన్స్‌ను కైవసం చేసుకున్నాడు. తన 14 ఏళ్ల ఎఫ్1 కెరీర్లో హామిల్టన్ అత్యధికంగా ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచి మైకేల్ షుమాకర్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. ఈ క్రీడలో అత్యధిక విజయాలు (97) సాధించిన డ్రైవర్‌గానూ గుర్తింపు పొందాడు. ► స్పెయిన్ గ్రాండ్‌ప్రిలో భాగంగా జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో మాక్స్ వెర్స్టాపెన్ రెండో స్థానంలో నిలువగా... హామిల్టన్ సహచరుడు వాల్తెరి బొటాస్ మూడో స్థానాన్ని పొందాడు. గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్); 2. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్); 3. బొటాస్ (మెర్సిడెస్); 4. లెక్లెర్క్ (ఫెరారీ); 5. ఎస్తెబన్ ఒకాన్ (అలైన్); 6. కార్లోస్ సెయింజ్ (ఫెరారీ); 7. రికియార్డో (మెక్లారెన్); 8. సెర్గియోపెరెజ్ (రెడ్‌బుల్); 9. లాండో నోరిస్ (మెక్లారెన్); 10. ఫెర్నాండో అలోన్సో (అలైన్); 11. లాన్స్ స్ట్రోల్ (ఆస్టన్ మార్టిన్); 12. పియరీ గాస్లీ (అల్ఫాటౌరి); 13. సెబాస్టియన్ వెటెల్ (ఆస్టన్ మార్టిన్); 14. జియోవినాజి (అల్ఫా రోమియో); 15. జార్జి రసెల్ (విలియమ్స్); 16. యుకీ సునోడా (అల్ఫా టౌరి); 17. కిమీ రైకోనెన్ (అల్ఫా రోమియో); 18. మిక్ షుమాకర్ (హాస్); 19. నికోలస్ లతీఫి (విలియమ్స్); 20. నికిటా మేజ్‌పిన్ (హాస్). -
క్వాలిఫయింగ్‌లో హామిల్టన్‌కు నిరాశ
పోర్టిమావో (పోర్చుగల్): కెరీర్లో 100వ పోల్ పొజిషన్ సాధించేందుకు డిఫెండింగ్ చాంపియన్, మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరో వారం రోజులు వేచి చూడాలి. తాజా ఫార్ములావన్ సీజన్లో భాగంగా శనివారం జరిగిన పోర్చుగల్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు. గత రెండు రేసుల్లో నిరాశ పరిచిన మెర్సిడెస్ జట్టుకే చెందిన మరో డ్రైవర్ వాల్తెరి బొటాస్ మాత్రం ఈ క్వాలిఫయింగ్ సెషన్లో అదరగొట్టాడు. అందరికంటే వేగంగా ల్యాప్‌ను నిమిషం 18.348 సెకన్లలో పూర్తి చేసి పోల్ పొజిషన్‌ను సొంతం చేసుకున్నాడు. అతడి కెరీర్లో ఇది 17వ పోల్. ఆదివారం జరిగే ప్రధాన రేసును బొటాస్ తొలి స్థానం నుంచి ఆరంభించనున్నాడు. రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మూడో స్థానంలో నిలిచాడు. సీజన్లో ఇప్పటి వరకు మూడు క్వాలిఫయింగ్ సెషన్లు జరగ్గా... ఈ మూడు సార్లు వేర్వేరు డ్రైవర్లు పోల్ పొజిషన్‌ను దక్కించుకున్నారు. బహ్రెయిన్‌లో వెర్స్టాపెన్, ఇమోలా గ్రాండ్‌ప్రిలో హామిల్టన్‌లు పోల్ పొజిషన్‌తో మెరిశారు. గ్రిడ్ పొజిషన్స్ 1. బొటాస్ (మెర్సిడెస్), 2. హామిల్టన్ (మెర్సిడెస్), 3. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 4. పెరెజ్ (రెడ్‌బుల్), 5. సెయింజ్ (ఫెరారీ), 6. ఒకాన్ (ఆల్పైన్), 7. నోరిస్ (మెక్లారెన్), 8. లెక్లెర్క్ (ఫెరారీ), 9, గ్యాస్లీ (ఆల్ఫా టారీ), 10. వెటెల్ (ఆస్టన్ మార్టిన్), 11. రసెల్ (విలియమ్స్), 12. జియోవినాజి (ఆల్ఫా రోమియో), 13. అలోన్సో (ఆల్పైన్), 14, సునోడా (ఆల్ఫా టారీ), 15. రైకొనెన్ (ఆల్ఫా రోమియో), 16. రికియార్డో (మెక్లారెన్) 17. స్ట్రోల్ (ఆస్టన్ మార్టిన్), 18. లతీఫ్ (విలియమ్స్), 19. మిక్ షుమాకర్ (హాస్), 20. మేజ్‌పిన్ (హాస్) -
హామిల్టన్... పోల్ @ 98
సాఖిర్ (బహ్రెయిన్): ఇప్పటికే ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయమైనప్పటికీ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ జోరు తగ్గించడం లేదు. ఈ సీజన్లో పదోసారి... కెరీర్లో 98వ సారి ఈ బ్రిటన్ డ్రైవర్ పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో 34 ఏళ్ల హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 27.264 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే పది రేసుల్లో విజేతగా నిలిచిన హామిల్టన్ 11వ రేసు టైటిల్ వేటలో ఉన్నాడు. మెర్సిడెస్‌కే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానం నుంచి రేసును ఆరంభిస్తాడు. గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. బొటాస్ (మెర్సిడెస్), 3. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 4. ఆల్బోన్ (రెడ్‌బుల్), 5. పెరెజ్ (రేసింగ్ పాయింట్), 6. రికియార్డో (రెనౌ), 7. ఒకాన్ (రెనౌ), 8. గాస్లే (అల్ఫా టౌరి), 9. నోరిస్ (మెక్లారెన్), 10. క్వియాట్ (అల్ఫా టౌరి), 11. వెటెల్ (ఫెరారీ), 12. లెక్లెర్క్ (ఫెరారీ), 13. లాన్స్ స్ట్రాల్ (రేసింగ్ పాయింట్), 14. రసెల్ (విలియమ్స్), 15. సెయింజ్ (మెక్లారెన్), 16. గియోవినాజి (అల్ఫా రోమియో), 17. రైకోనెన్ (అల్ఫా రోమియో), 18. మాగ్నుసెన్ (హాస్), 19. గ్రోస్యెన్ (హాస్), 20. లతీఫీ (విలియమ్స్). -
కోపంతో మెర్సిడెస్ కారునే కాల్చేశాడు..
ఎక్కడికైనా వెళ్తుంటే దారిలో కారు కానీ, బైక్ కానీ ఆగిపోతే అక్కడే పడేసి వేరే వాళ్లని లిఫ్ట్ అడికి వెళ్తుండటం సినిమాల్లో చూస్తుంటాం. కారు చిన్న ట్రబుల్ ఇస్తే.. పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు హాలివుడ్ సినిమాల్లో చూస్తుంటాం. అయితే అవి డమ్మీ కార్లు కాబట్టి ఎన్నింటిని తగలబెట్టినా పోయేదేమీ ఉండదు. కానీ ఓ యూట్యూబర్ మాత్రం కోపంతో ఏకంగా మెర్సిడెస్ కారునే తగులబెట్టాడు. అంతటితో ఆగకుండా ఆ తతంగాన్ని అంతా వీడియో తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన మైఖేల్ లిట్విన్ ఓ యూ ట్యూబర్. సాహసాలు, ప్రాంక్ వీడియోలు చేస్తూ, ఆ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేస్తుంటాడు. ఆయన కొద్ది రోజుల క్రితం ఓ మెర్సిడెస్ కారును కొనుగోలు చేశాడు. అయితే.. ఆ కారు తరుచూ బ్రేక్‌డౌన్ అవుతూ ఇబ్బంది పెడుతోంది. ఆ సమస్య వచ్చినప్పుడల్లా కారును తనకు విక్రయించిన డీలర్ వద్దకు తీసుకెళ్తున్నాడు. ఇలా దాదపు ఐదుసార్లు తన కారును మెర్సిడెజ్ డీలర్ వద్దకు తీసుకెళ్లాడు. కానీ, సమస్యకు పరిష్కారం మాత్రం దొరలేదు. కంప్లైంట్ చేసిన ప్రతిసారి డీలర్ ఆ కారును రెండ్రోజుల పాటు సర్వీస్ సెంటర్లో ఉంచుకుంటున్నాడు. ఆ తర్వాత తిరిగి ఇచ్చేస్తున్నాడు. దానిని ఎన్నిసార్లు రిపేర్‌కు ఇచ్చినా.. సరిగా పనిచేయడం లేదు. దీంతో విసుగు చెందిన మైఖేల్.. రూ. 2.4 కోట్ల విలువైన తన కారును కాల్చేద్దామని డిసైడ్ అయ్యాడు. ఆ కారును వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకెళ్లి దానిపై పెట్రోల్ పోశాడు. ఆ తర్వాత నేరుగా కొంత దూరం వరకు పెట్రోలు పోసుకుంటూ వెళ్లాడు. అనంతరం తన జేబులో నుంచి లైటర్ తీసి నిప్పుల కొలిమిని వెలిగించాడు. దానికి స్నాక్స్‌ని వేడి చేసుకొని తింటూ హీరో లెవల్లో వెనక్కి తిరిగి నిప్పు అంటించాడు. ఆ మంట నేరుగా వెళ్లి కారును టచ్ చేసింది. దీంతో ఖరీదైన కారు కాలి బూడిదైంది. ఆ దృశ్యాలన్నింటినీ లిట్విన్ విడియో తీసి తన యూట్యూబ్ చాలెన్లో అప్లోడ్ చేశాడు. ప్రస్తుత ఆ వీడియో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలీలో కామెంట్లు చేస్తున్నారు. ‘ఖరీదైన కారును ఎలా కాల్చేయాలనిపించింది?, అమెరికన్లు ఐఫోన్లను పగులగొడితే.. రష్యన్లు మెర్సిడెస్ కార్లనే కాల్చేస్తున్నారు’, ‘ ఈ వీడియోకు వచ్చిన ఆదాయంతో మరో రెండు మెర్సిడెస్ కార్లను కొనుక్కొవచ్చేలే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
షుమాకర్ సరసన లూయిస్ హామిల్టన్
నుర్బర్గ్రింగ్ (జర్మనీ): ఈసారి అందివచ్చిన అవకాశాన్ని మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ వదులుకోలేదు. ఫార్ములావన్ (ఎఫ్1)లో అత్యధిక విజయాలు సాధించిన దిగ్గజ రేసర్ మైకేల్ షుమాకర్ (జర్మనీ) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును హామిల్టన్ సమం చేశాడు. ఆదివారం జరిగిన జర్మనీ ఐఫెల్ గ్రాండ్‌ప్రి రేసులో 35 ఏళ్ల హామిల్టన్ చాంపియన్‌గా నిలిచాడు. రెండో స్థానం నుంచి రేసును ప్రారంభించిన హామిల్టన్ నిర్ణీత 60 ల్యాప్‌లను అందరికంటే వేగంగా గంటా 35 నిమిషాల 49.641 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. ఈ విజయంతో ఎఫ్1లో అత్యధిక రేసులు గెలిచిన డ్రైవర్‌గా 2006 నుంచి మైకేల్ షుమాకర్ (91 విజయాలు) పేరిట ఉన్న రికార్డును హామిల్టన్ సమం చేశాడు. షుమాకర్ కెరీర్లో 306 రేసుల్లో పాల్గొని 91 విజయాలు అందుకోగా... హామిల్టన్ 261 రేసుల్లోనే ఈ ఘనతను సాధిం చాడు. ఈ సీజన్లో మరో ఆరు రేసులు మిగిలి ఉన్న నేపథ్యంలో షుమాకర్ రికార్డును హామిల్టన్ బద్దలు కొట్టడం ఖాయం. సీజన్ లోని తదుపరి రేసు పోర్చుగల్ గ్రాండ్‌ప్రి ఈనెల 25న జరుగుతుంది. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టుకే చెందిన మరో డ్రైవర్ బొటాస్ 13వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉన్నాడు. రెండో స్థానం నుంచి ఆరంభించిన హామిల్టన్ 13వ ల్యాప్‌లో బొటాస్‌ను ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వెళ్లాడు. బొటాస్ 18వ ల్యాప్‌లో రేసు నుంచి తప్పుకోగా... అటునుంచి ఈ బ్రిటన్ డ్రైవర్ వెనుదిరిగి చూడలేదు. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో, రికియార్డో (రెనౌ) మూడో స్థానంలో నిలిచారు. తన తండ్రి రికార్డును సమం చేసిన హామిల్టన్‌కు షుమాకర్ తనయుడు మిక్ ఓ జ్ఞాపిక ఇచ్చాడు. షుమాకర్ తన కెరీర్ చివరి సీజన్ (2012)లో ఉపయోగించిన హెల్మెట్‌ను హామిల్టన్‌కు మిక్ బహుమతిగా ఇచ్చాడు. మరోవైపు ఈ రేసులో బరిలోకి దిగడం ద్వారా ప్రపంచ మాజీ చాంపియన్ కిమీ రైకోనెన్ (ఆల్ఫా రోమియో) అత్యధికంగా 323 ఎఫ్1 రేసుల్లో పాల్గొన్న డ్రైవర్‌గా రికార్డు నెలకొల్పాడు. 322 రేసులతో బారికెల్లో (బ్రెజిల్) పేరిట ఉన్న రికార్డును రైకోనెన్ బద్దలు కొట్టాడు. -
తక్కువకే లగ్జరీ కారు వస్తుందని..
బెంగళూరు: ఆఫర్ కనిపిస్తే చాలు.. అప్పు చేసైనా సరే ఆ వస్తువును కొనేయాలని చాలామంది తహతహలాడుతుంటారు. కానీ ఆ ఆఫర్లు, డిస్కౌంట్ల వెనక ఉండే మోసాల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. తీరా మోసపోయాక లబోదిబోమంటూ ఏడుస్తారు. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త ఖలీల్ షరీఫ్‌కు సెకండ్ హ్యాండ్ మెర్సిడిస్ కారు తక్కువ ధరకే ఇస్తామంటూ ఓ వ్యక్తి ఆఫర్ ఇచ్చాడు. ఇంకేముందీ.. ఇంత చీప్‌గా కారు దొరుకుతున్నందుకు తెగ సంతోషపడ్డాడు. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండలేదు. (లీజు కనికట్టు.. కార్లు తాకట్టు) షరీఫ్ ఓసారి జీవన్ బీమానగర్‌లోని గ్యారేజీకి వెళ్లాడు. అక్కడ గ్యారేజీ యజమాని బంధువు దస్తగిరి పరిచయమయ్యాడు. అతను 2 లక్షల రూపాయలకే మెర్సిడిస్ లగ్జరీ కారు ఇస్తానంటూ ఆశ చూపడంతో.. అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు షరీఫ్ సిద్ధపడ్డాడు. మార్చి 11న గూగుల్ పే ద్వారా తొలుత 78 వేల రూపాయలను అతనికి చెల్లించాడు. దీంతో మరో రెండు రోజుల్లో ఇంటి ముందు కారు ఉంటుందని దస్తగిరి మాటిచ్చాడు. కానీ రెండు రోజులు కాదు కదా, రెండు నెలలు దాటిపోయినా అతని దగ్గర నుంచి కారు ఊసే లేదు. అతనికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అనే వచ్చేది. లాక్డౌన్ వల్ల వీలు కావడం లేదేమోనని మూడు నెలలు ఎదురు చూశాడు. ఆ తర్వాత కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన షరీఫ్ పోలీసులను ఆశ్రయించాడు. తీరా అక్కడికి వెళ్లేసరికి దస్తగిరి పేరు మీద ఇదివరకే 30 కేసులు ఉన్నట్లు తేలింది. (మార్కెట్లోకి మెర్సిడెస్ బెంజ్ కొత్త జీఎల్ఈ ఎల్‌డబ్ల్యూబీ) -
బొటాస్దే బోణీ
స్పీల్బర్గ్: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫార్ములావన్ (ఎఫ్1) 2020 సీజన్ తొలి రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన సీజన్ తొలి రేసు ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో ‘పోల్ పొజిషన్’తో బరిలోకి దిగిన బొటాస్ చివరి ల్యాప్ వరకు ఆధిక్యాన్ని కొనసాగించి టైటిల్ సొంతం చేసుకున్నాడు. 71 ల్యాప్‌ల ఈ రేసులో బొటాస్ అందరికంటే ముందుగా గంటా 30 నిమిషాల 55.739 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని పొందాడు. మొత్తం 20 మంది డ్రైవర్లు పోటీపడిన ఈ రేసులో తొమ్మిది మంది మధ్యలోనే వైదొలిగారు. డ్రైవర్ల అత్యుత్సాహంతో మూడుసార్లు ఈ రేసులో సేఫ్టీకారు రావాల్సి వచ్చింది. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో మెర్సిడెస్‌కే చెందిన మరో స్టార్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌పై మూడు స్థానాల గ్రిడ్ పెనాల్టీ విధించారు. అనంతరం ప్రధాన రేసులో ట్రాక్‌పై మరో డ్రైవర్‌ను ఢీకొట్టడంతో ఐదు సెకన్ల పెనాల్టీ వేశారు. దాంతో హామిల్టన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకోగా... చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ)కు రెండో స్థానం... బ్రిటన్‌కు చెందిన లాండో నోరిస్ (మెక్లారెన్) మూడో స్థానం పొందారు. ఈ ప్రదర్శనతో నోరిస్ (20 ఏళ్ల 235 రోజులు) ఫార్ములావన్ చరిత్రలో పిన్న వయస్సులో పోడియం (టాప్–3)పై నిలిచిన మూడో డ్రైవర్‌గా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో మాక్స్ వెర్స్టాపెన్ (18 ఏళ్ల 228 రోజులు), లాన్స్ స్ట్రోల్ (18 ఏళ్ల 240 రోజులు) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. రేసు ప్రారంభానికి ముందు జాత్యాహంకారానికి వ్యతిరేకంగా వరల్డ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్‌తో కలిసి మరో 13 మంది డ్రైవర్లు మోకాలిపై నిల్చోని తమ సంఘీభావం తెలిపారు. సీజన్‌లోని రెండో రేసు ఇదే వేదికపై 10న జరుగుతుంది. ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ఫలితాలు (టాప్–10): 1. బొటాస్ (మెర్సిడెస్–25 పాయింట్లు); 2. చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ–18); 3. లాండో నోరిస్ (మెక్లారెన్–16); 4. హామిల్టన్ (మెర్సిడెస్–12); 5. కార్లోస్ సెయింజ్ జూనియర్ (మెక్లారెన్–10); 6. పెరెజ్ (రేసింగ్ పాయింట్–8); 7. పియరీ గాస్లీ (అల్ఫా టౌరీ–6), 8. ఒకాన్ (రెనౌ–4); 9. గియోవినాజి (అల్ఫా రోమియో–2 పాయింట్లు), 10. వెటెల్ (ఫెరారీ–1 పాయింట్). -
హామిల్టన్ హవా
బుడాపెస్ట్: మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో ఎనిమిదో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో 70 ల్యాప్‌ల రేసును మూడో స్థానం నుంచి ప్రారంభించిన అతను అందరికంటే ముందుగా గంటా 35 నిమిషాల 3.796 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. కెరీర్లో తొలిసారి పోల్ పొజిషన్ సాధించిన రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ చివర్లో ఆధిక్యాన్ని కోల్పోయి రెండో స్థానంతో సరిపెట్టుకోగా... ఫెరారీ డ్రైవర్ వెటెల్ మూడో స్థానంలో నిలిచాడు. తదుపరి బెల్జియం గ్రాండ్‌ప్రి సెప్టెంబర్ 1న జరుగుతుంది. -
బొటాస్‌కు ‘పోల్’
బాకు (అజర్బైజాన్): ఈ సీజన్లో మంచి ఫామ్‌లో ఉన్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ వరుసగా రెండో రేసులోనూ పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో బొటాస్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 40.495 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఫార్ములావన్ సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన బొటాస్ గత చైనా గ్రాండ్‌ప్రి రేసులోనూ పోల్ పొజిషన్ సంపాదించాడు. అజర్బైజాన్ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానం నుంచి... ఫెరారీ డ్రైవర్ వెటెల్ మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. బహ్రెయిన్, చైనా గ్రాండ్‌ప్రి రేసుల్లో విజేతగా నిలిచిన హామిల్టన్ నేటి రేసులోనూ గెలిచి ‘హ్యాట్రిక్’ సాధించాలని పట్టుదలతో ఉన్నాడు. -
‘బహ్రెయిన్’ విజేత హామిల్టన్
బహ్రెయిన్: నాటకీయంగా సాగిన బహ్రెయిన్ గ్రాండ్ ప్రిలో డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్ లూయీస్ హామిల్టన్ (మెర్సిడెస్) విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. 1 గంట 34 నిమిషాల 21.29 సెకన్లలో హామిల్టన్ రేసును పూర్తి చేశాడు. మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ రెండో స్థానంలో నిలిచాడు. రేసు ఆరంభంనుంచి వేగంగా దూసుకుపోయి విజేతగా నిలుస్తాడని అనిపించిన చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ)ని దురదృష్టం వెంటాడింది. అతని కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో చివరకు మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2019 సీజన్లో ప్రస్తుతం అగ్రస్థానంలో బొటాస్ కొనసాగుతుండగా... తర్వాతి రేసు ఏప్రిల్ 12–14 మధ్య చైనా గ్రాండ్ ప్రి రేసు జరుగనుంది. -
కనువిందు చేసిన పారిస్ ఆటో షో
-
హామిల్టన్ హవా
సింగపూర్: మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో ఏడో విజయం నమోదు చేశాడు. ఆదివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రి రేసులో ఈ బ్రిటన్ డ్రైవర్ 61 ల్యాప్‌ల రేసును గంటా 51 నిమిషాల 11.611 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్)కు రెండో స్థానం, వెటెల్ (ఫెరారీ)కు మూడో స్థానం లభించాయి. ఫోర్స్ ఇండియా డ్రైవర్లలో ఒకాన్ తొలి ల్యాప్‌లోనే వైదొలగగా... పెరెజ్ 16వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. సీజన్లో 15 రేసులు పూర్తయ్యాక హామిల్టన్ 281 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. తదుపరి రేసు రష్యా గ్రాండ్‌ప్రి ఈనెల 30న జరుగుతుంది. -
ఇటలీ గ్రాండ్‌ప్రి విజేత హామిల్టన్
మోంజా: అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో ఆరో విజయం నమోదు చేశాడు. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో హామిల్టన్ విజేతగా నిలిచాడు. 53 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 16 నిమిషాల 54.484 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది ఆరో విజయంకాగా, కెరీర్లో 68వ టైటిల్. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన రైకోనెన్ 45వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉన్నాడు. అయితే అదే ల్యాప్‌లో రైకోనెన్ను వెనక్కినెట్టి ఆధిక్యంలోకి వచ్చిన హామిల్టన్ చివరి ల్యాప్ వరకు దీనిని కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఫెరారీ డ్రైవర్ రైకోనెన్ రెండో స్థానంతో సరిపెట్టుకోగా... మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ మూడో స్థానంలో... ఫెరారీ మరో డ్రైవర్ వెటెల్ నాలుగో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. -
మాస్ కార్లపైనే మారుతీ దృష్టి
న్యూఢిల్లీ: విలాసవంతమైన కార్ల కన్నా జనసామాన్యం ఎక్కువగా కొనుగోలు చేసే అందుబాటు ధరల్లోని కార్ల విభాగంపైనే దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ దృష్టి పెట్టనుంది. కంపెనీ 37వ వార్షిక సర్వసభ్య సమావేశంలో మారుతీ చైర్మన్ ఆర్సీ భార్గవ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే మాస్ విభాగంలో మెజారిటీ వాటా ఉన్న మారుతీ .. లగ్జరీ సెగ్మెంట్లో కూడా ప్రవేశించాలంటూ షేర్హోల్డర్లు చేసిన సూచనపై స్పందిస్తూ ఆయన ఈ వివరణనిచ్చారు. మారుతీ లగ్జరీ కార్ల కోవకి చెందినది కాదని భార్గవ చెప్పారు. అవి అధిక రేటుతో తక్కువ సంఖ్యలో కార్లను విక్రయిస్తాయని... మారుతీ సుజుకీ అందుబాటు ధరలో భారీ స్థాయిలో విక్రయిస్తుందని ఆయన వివరించారు. రేటుకు అత్యంత ప్రాధాన్యం ఉండే దేశీ మార్కెట్లో ఈ వ్యూహంపైనే తాము ప్రధానంగా దృష్టి సారిస్తామని భార్గవ చెప్పారు. అలాగని, ప్రీమియం కార్ల అనుభూతి కోరుకునే వారికి ఆ ఫీచర్స్‌ను అందించకుండా ఉండబోమని, ప్రీమియం కార్లతో పోలిస్తే చౌకగానే అందిస్తామన్నారు. -
పాలకు, మెర్సిడెజ్‌కు ఒకే పన్నా?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని వస్తువులపై ఒకే జీఎస్టీ రేటును అమలుచేయడం సాధ్యం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పాలకు, మెర్సిడెజ్ కారుకు ఒకే పన్ను విధించడం సరికాదన్నారు. అన్ని వస్తువులపై ఏకరూపకంగా 18% జీఎస్టీ ఉండాలన్న కాంగ్రెస్ పార్టీ ఆలోచన సరైంది కాదని.. ఇలాంటి నిర్ణయాల ద్వారా ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతాయన్నారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్టీ అమలుకు ఏడాది పూర్తయిన సందర్భంగా ‘స్వరాజ్య’ అనే మేగజైన్‌కు ప్రధాని ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, వివిధ రకాల కేంద్ర, రాష్ట్రాల పన్నులను కలిపి పరోక్ష పన్నుల విధానాన్ని సరళతరం చేసేందుకే జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చామని మోదీ తెలిపారు. జీఎస్టీ ద్వారా ఇన్స్పెక్టర్ రాజ్ తగ్గిపోయిందన్నారు. రాష్ట్రాలు, వ్యాపారులు, ఇతర భాగస్వామ్య వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఎప్పటికప్పుడు జీఎస్టీలో సానుకూల మార్పులు కూడా తెస్తున్నామని ప్రధాని వెల్లడించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశ ప్రజలకు అభినందనలు. సహకార సమాఖ్య విధానానికి, టీమిండియా స్ఫూర్తికి ఇదో గొప్ప ఉదాహరణ. ఒకే దేశం–ఒకే పన్ను విధానం ద్వారా అభివృద్ధి జరగడంతోపాటు పన్ను విధానంలో సరళత, పారదర్శకత పెరిగాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో జీఎస్టీ ఓ సానుకూల మార్పు తీసుకొచ్చింది’ అని ఆదివారం ఉదయం మోదీ ట్వీట్ చేశారు. ఏడాదిలో జీఎస్టీ ద్వారా సాధించిన విజయాలతో కూడిన పోస్టర్‌ను అందులో ఉంచారు. ధరలు పెంచడమే వారి ఆలోచన ‘అన్ని వస్తువులకు ఒకే పన్నురేటు అమల్లో ఉంటే చాలా సులభంగా, సౌకర్యంగా ఉండేది. కానీ దీని ప్రకారం చూస్తే.. ఆహార వస్తువులపై 0% పన్నురేటు ఉండటం సాధ్యం కాదు. పాలకు, విలాసవంతమైన మెర్సిడెజ్ కారుకు ఒకే పన్నురేటు ఉండటం సమంజసమేనా? కాంగ్రెస్ పార్టీలోని మన మిత్రులు ఒకే జీఎస్టీ రేటు ఉండాలని అడుగుతున్నారు. అంటే.. ప్రస్తుతం 0–5% పన్ను రేటు మధ్యనున్న ఆహార వస్తువులు, నిత్యావసర వస్తువులకు కూడా 18 శాతం పన్ను విధించాలనేది వారి ఆలోచన’ అని మోదీ ‘స్వరాజ్య’ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. స్వాతంత్య్రానంతరం నుంచి నేటి వరకు దేశంలో 66 లక్షల మంది పన్ను చెల్లింపుదారులుంటే.. ఇందులో 48 లక్షల మంది 2017, జూలై 1న జీఎస్టీ అమల్లోకి వచ్చాకే పన్ను చెల్లింపులోకి వచ్చారని ప్రధాని వెల్లడించారు. ‘ఏడాది కాలంలో 350 కోట్ల బిల్లులు ప్రాసెస్ అయ్యాయి. 11 కోట్ల రిటర్న్స్ ఫైల్ అయ్యాయి. దేశవ్యాప్తంగా చెక్‌పోస్టులు రద్దయ్యాయి. రాష్ట్రాల సరిహద్దుల వద్దనున్న వాణిజ్య పన్నుల కార్యాలయాల వద్ద క్యూలు కట్టాల్సిన పనిలేకుండా పోయింది. ఇది ట్రక్కు డ్రైవర్ల విలువైన సమయాన్ని ఆదా చేస్తోంది. లాజిస్టిక్స్ రంగానికి భారీగా ఊతమందుతోంది. తద్వారా దేశంలో ఉత్పత్తి పెరుగుతోంది. ఒకవేళ జీఎస్టీ సంక్లిష్టంగా ఉండుంటే ఇవన్నీ జరిగేవేనా?’ అని మోదీ ప్రశ్నించారు. నిత్యావసరాల ధరలు తగ్గాయ్..! ‘మీరు ఏం చూస్తున్నారో.. అదే చెల్లిస్తున్నారు. దాదాపు 400 వస్తువులపై ప్రభుత్వం పన్నులు తగ్గించింది. 150 వస్తువులు 0% పన్ను పరిధిలో ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలను గమనించినట్లయితే.. వాటి ధరలన్నీ తగ్గాయి. బియ్యం, గోధుమలు, చక్కెర, మసాలా దినుసులు వంటి వాటిపై పన్నులు చాలామేర తగ్గించాం. రోజువారీ వినినియోగంలో వచ్చే దాదాపు అన్ని వస్తువులను 5%లోపు పరిధిలోనే ఉంచాం. దాదాపు 95% వస్తువులు 18% లోపు జీఎస్టీ శ్లాబ్ లోనే ఉన్నాయి’ అని మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్‌లో పన్నువిధానంలో భారీగా మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేశామన్న ప్రధాని.. ఈ క్రమంలో (జీఎస్టీ అమలులో) కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ‘17 పన్నులు, 23 సెస్సులను సంస్కరించి ఒక పన్నుగా మార్చాం. సరళంగా, వ్యవస్థ సున్నితత్వానికి తగినట్లుగా దీన్ని రూపొందించాం. ఓ గొప్ప సంస్కరణ వచ్చినపుడు బాలారిష్టాలు సహజమే. కానీ మేం వీటిని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వాటిని పరిష్కరిస్తూనే ఉన్నాం. సహకార సమాఖ్య విధానానికి జీఎస్టీ సంస్కరణే గొప్ప ఉదాహరణ’ అని మోదీ తెలిపారు. కేంద్రంలో గత కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలతో ఈ ఏకాభిప్రాయం సాధించడంలోనే విఫలమయ్యాయన్నారు. -
మెర్సిడెస్ జీఎల్ఎస్ గ్రాండ్ ఎడిషన్
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్ బెంజ్’ తాజాగా తన ప్రముఖ ఎస్యూవీ ‘జీఎల్ఎస్’లో గ్రాండ్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.86.9 లక్షలు. ఇది జీఎల్ఎస్ 350డీ గ్రాండ్ ఎడిషన్ (డీజిల్), జీఎల్ఎస్ 400 గ్రాండ్ ఎడిషన్ (పెట్రోల్) అనే రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. వీటిల్లో 3 లీటర్ వీ6 ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. జీఎల్ఎస్ గ్రాండ్ ఎడిషన్‌లో 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 10 స్పోక్ అలాయ్ వీల్స్, రియర్ సీట్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్, సన్‌రూఫ్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో రొనాల్డ్ ఫోల్గర్ తెలిపారు. -
అఖిలేష్ కోసం మెర్సిడెస్ పంపారు
లక్నో : 30 ఏళ్ల బీజేపీ కంచుకోటని ఎస్పీ-బీఎస్పీ కూటమి బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్, పుల్పూర్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీని ఘోరంగా దెబ్బతీస్తూ.. ఎస్పీ-బీఎస్పీ కూటమిలు విజయ భావుటా ఎగరవేశాయి. ఈ ఫలితాల ప్రకటన వెలువడిన తర్వాత బీఎస్పీ అధినేత మాయవతి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో గంటపాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఈ సమావేశం కోసం అఖిలేష్‌ను తీసుకు రావడానికి మాయవతి మెర్సిడెస్‌ను పంపినట్టు తెలిసింది. మెర్సిడెస్ పంపించి మరీ అఖిలేష్ యాదవ్‌ను తన ఇంటికి తీసుకొచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి. గోరఖ్‌పూర్, పుల్పూర్ ఉపఎన్నికల్లో గెలిచిన అనంతరం, అఖిలేష్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ అనంతరం ఆయన తన ఇంటికి వెళ్లిపోయారు. అఖిలేష్ తన ఇంటికి వెళ్లిన అనంతరం, ఓ సీనియర్ బీఎస్పీ లీడరు నుంచి ఆయనకు ఫోన్ చేసి అభినందించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ సమయంలో మాయవతికి ఫోన్ చేయాలని సీనియర్ బీఎస్పీ లీడరు, అఖిలేష్‌ను అభ్యర్థించారని.. ఆయన అభ్యర్థన మేరకు అఖిలేష్, బీఎస్పీ బాస్‌తో మాట్లాడారని, తదుపరి పరిణామాలపై చర్చించాలని ఆశిస్తున్నట్టు కోరారని తెలిపాయి. అఖిలేష్ అభ్యర్థన మేరకు బీఎస్పీ బాస్, ఆయన తీసుకురావడానికి తన ప్రతినిధితో కూడిన మెర్సిడెస్ కారును, అఖిలేష్ ఇంటికి పంపించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. కిలోమీటర్ దూరంలో ఉన్న విక్రమాదిత్య మార్గ్ నుంచి మాల్ అవెన్యూ బరేలీలో ఉన్న మాయవతి ఇంటికి అఖిలేష్ ఆ కారులోనే వెళ్లినట్టు పేర్కొన్నాయి. మాయవతి, అఖిలేష్ సమావేశానికి బీఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్సీ మిశ్రా, బీఎస్పీ ఎంపీ అశోక్ సిద్ధార్థ్‌లు కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది. అయితే ఎస్పీ, బీఎస్పీ అధినేతలు ఏం మాట్లాడుకున్నారన్నది తెలియరాలేదు. గంట పాటు మాయవతితో సమావేశమైన అఖిలేష్, మీడియా ముందు ఏం స్పందించకుండానే ఇంటికి వెళ్లిపోయారు. -
హద్దులు మీరకున్నంత వరకే ముద్దు..!
-
హద్దులు మీరకున్నంత వరకే ముద్దు..!
న్యూఢిల్లీ: ఐపీఎల్ సీజన్ 10లో అద్భుత ఆటతీరు కనబరచిన యువ క్రికెటర్లలో రిషబ్ పంత్ ఒకడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడిన పంత్ 14 మ్యాచ్‌లలో 366 పరుగులు సాధించాడు. ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు పంత్. వీడియోలో మెర్సిడెజ్ బెంజ్ జీఎల్సీ ఎస్యూవీ కారును 125 కిలోమీటర్ల కంటే అధిక వేగంతో నడుపుతున్నట్లు ఉంది. అయితే, పంత్ ఆనందం కోసం చేసిన పని విమర్శకులకు దారి తీసింది. ఢిల్లీ వీధుల్లో అత్యధిక వేగంతో వాహనాలను నడపకూడదు. దీంతో పంత్ నిర్లక్ష్యంపై కొందరు విమర్శలు చేశారు. హద్దులు మీరకున్నంత వరకే ముద్దని అంటున్నారు. ❤❤ #NewCar @rishabpant A post shared by Rishabh Pant FAN Culb (@rishabpant777) on May 23, 2017 at 2:25am PDT -
హిట్ అండ్ రన్ కేసులో బిజినెస్మెన్ అరెస్ట్
న్యూఢిల్లీ : మెర్సిడిస్ హిట్ అండ్ రన్ కేసులో ప్రమేయమున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 27 ఏళ్ల బిజినెస్మెన్ సవ్నీత్ సింగ్‌ను ఢిల్లీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అతుల్ అరోరా అనే విద్యార్థి ఆదివారం రాత్రి స్కూటర్‌పై తన స్నేహితుడిని డ్రాప్ చేసి వస్తుండగా.. మెర్సిడెస్ కారు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. పశ్చిమ్ విహార్ ప్రాతంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో.. 100 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించిన కారు విద్యార్థిని సుమారు 50 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ప్రమాదం జరిగాక కనీసం ఆగి కూడా చూడకుండా.. మెర్సిడెస్ కారులోని వ్యక్తి పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన వ్యక్తిని రాజౌరీ క్రైం బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన మెర్సిడిస్ కారును కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ సంఘటన జరిగిన సమయంలో సవ్నీత్ సింగ్ పీకల్లోతు వరకు తాగి ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సవ్నీత్ సింగ్ తన స్నేహితునితో కలిసి రెస్టారెంట్‌కు వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బడాబాబుల విలువైన కార్లు ఢిల్లీ పౌరుల పాలిట శాపంగా మారుతున్నాయి. హై ఎండ్ వాహనాలు.. అదుపులేని వేగంతో దూసుకొస్తూ మనుషుల ప్రాణాలు బలిగొనడం ఇటీవల దేశ రాజధానిలో పరిపాటిగా మారింది. దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో బీఎమ్‌డబ్ల్యూ కారు అతివేగం మూలంగా ఓ ఉబర్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన జనవరిలో జరిగింది. అదే నెలలో ఢిల్లీ శివార్లలో జరిగిన మరో ఘటనలో ఆడీ స్పీడు.. ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌తో సహా నలుగురిని పొట్టనబెట్టుకుంది. రోడ్డు ప్రమాదాల్లో 97 శాతం అతివేగం, నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ మూలంగానే జరుగుతున్నాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. -
మెర్సిడెస్ స్పీడుకు ఇంటర్ విద్యార్థి బలి
-
మెర్సిడెస్ స్పీడుకు ఇంటర్ విద్యార్థి బలి
న్యూఢిల్లీ: బడాబాబుల విలువైన కార్లు ఢిల్లీ పౌరుల పాలిట శాపంగా మారుతున్నాయి. హై ఎండ్ వాహనాలు.. అదుపులేని వేగంతో దూసుకొస్తూ మనుషుల ప్రాణాలు బలిగొనడం ఇటీవల దేశ రాజధానిలో పరిపాటిగా మారింది. తాజాగా అక్కడ ఓ 17 ఏళ్ల ఇంటర్ కుర్రాడు మెర్సిడెస్ కారు స్పీడుకు బలైపోయాడు. అతుల్ అరోరా అనే విద్యార్థి ఆదివారం రాత్రి స్కూటర్‌పై తన స్నేహితుడిని డ్రాప్ చేసి వస్తుండగా.. మెర్సిడెస్ కారు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పశ్చిమ్ విహార్ ప్రాతంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో.. 100 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించిన కారు విద్యార్థిని సుమారు 50 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ప్రమాదం జరిగాక కనీసం ఆగి కూడా చూడకుండా.. మెర్సిడెస్ కారులోని వ్యక్తి పరారయ్యాడు. సీసీటీవీ ఫోటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన వ్యక్తిని కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో బీఎమ్‌డబ్ల్యూ కారు అతివేగం మూలంగా ఓ ఉబర్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన జనవరిలో జరిగింది. అదే నెలలో ఢిల్లీ శివార్లలో జరిగిన మరో ఘటనలో ఆడీ స్పీడు.. ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌తో సహా నలుగురిని పొట్టనబెట్టుకుంది. రోడ్డు ప్రమాదాల్లో 97 శాతం అతివేగం, నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ మూలంగానే జరుగుతున్నాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. -
ఖరీదైన కార్లలో సమాజ్‌వాదీ నేతలు
-
వేరొకరిని ప్రేమించిందని కక్షగట్టి..!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మెర్సిడిస్ కారులో జరిగిన యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వేరే వ్యక్తితో లవ్ అఫైర్ ఉందన్న అక్కసుతోనే హత్యచేశానని నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. సౌత్-వెస్ట్ డీసీపీ సురేందర్ కుమార్ కథనం ప్రకారం.. కొన్ని రోజుల కిందట స్థానిక నజఫ్ గఢ్‌కు చెందిన సిమ్రన్(17) ఇద్దరు స్నేహితులతో కలిసి షాపింగ్‌కు వెళ్లింది. షాపింగ్ తర్వాత ఇద్దరితో కలిసి మెర్సిడిస్ కారులో ఇంటి సమీపానికి చేరుకుంది. ఓ యువకుడు కారు దిగి వెళ్లిపోయాడు. కారులోనే ఉన్న శుభం గుప్తా, సిమ్రన్ను ఆమె తల్లి చూస్తుండగానే తుపాకీతోనే కాల్చేశాడు. ఆ వెంటనే సిమ్రన్ తల్లి ఇంటి ముందున్న కారు వద్దకు పరుగున వెళ్లి చూడగా కూతురు అప్పటికే చనిపోయింది. ఈ విషయంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. హత్యకు కొంత సమయం ముందు వారిద్దరూ కలిసి దిగిన ఫొటోలు, తీసుకున్న వీడియోలు సిమ్రన్ మొబైల్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీని ఆధారంగా నిందితుడి కోసం గాలించి, దక్షిణ ఢిల్లీలోని ఓ బంధువు ఇంట్లో తలదాచుకున్న శుభమ్ గుప్తాను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ సురేందర్ కుమార్ తెలిపారు. నితిన్ అనే మరో వ్యక్తితోనూ సన్నిహితంగా ఉండటం, తనకు అబద్ధాలు చెప్పడంతో హత్యచేసినట్లు నిందితుడు శుభమ్ గుప్తా వెల్లడించాడు. తన తల్లి పోన్ చేపినప్పుడు నితిన్ లాగా మాట్లాడాలని చెప్పడంతో శుభమ్‌కు విపరీతమైన కోపం వచ్చింది. అంతకుముందు ఇద్దరు ఓ పార్టీకి వెళ్లగా తీసుకున్న ఫొటోలలో.. చేతిలో పిస్తోల్‌తో దిగిన ఫొటోకు అన్ని బుల్లెట్లు లోడ్ చేసి ఉన్నాయి అని క్యాప్షన్ తో పోస్ట్ చేశాడు. ఇంటి ముందు కారు ఆపిన తర్వాత.. నితిన్ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, వెంటనే తుపాకీతో కాల్చేశానని చెప్పాడు. కాల్పులు జరిపిన అనంతరం తాను భయంతో అక్కడినుంచి పారిపోయానని నిందితుడు పూర్తి వివరాలను పోలీసులకు తెలిపాడు. సిమ్రన్ మొబైల్ ఆధారంగానే కేసు మిస్టరీని త్వరగా ఛేదించగలిగామని పోలీసులు వివరించారు. -
మెర్సిడెస్ ‘ఏఎంజీ-43’ @77.5 లక్షలు
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్’ తాజాగా ‘ఏఎంజీ ఎస్ఎల్సీ 43’ మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకువ చ్చింది. దీని ధర రూ.77.5 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఈ టూ సీట్స్ టాప్‌లెస్ కారులో 3.0 లీటర్ 6 సిలిండర్ ట్విన్ టర్బో ఇంజిన్, 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, అత్యాధునిక ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ, అదిరిపోయే డిజైన్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ వివరించింది. ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 4.7 సెకన్లలో అందుకుంటుందని పేర్కొంది. ఇక కారు గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. ‘ఎస్‌ఎల్‌కే 55 ఏఎంజీ’ స్థానంలో కంపెనీ దీన్ని ప్రవేశపెట్టింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో డీజిల్ (2000 సీసీపై సామర్థ్యమున్న) వెహికల్స్‌పై నిషేధం ఉండటంతో కంపెనీ దేశంలో విక్రయిస్తోన్న అన్ని మోడళ్లలకు సంబంధించిన పెట్రోల్ వెర్షన్లను సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. -
మెర్సిడెస్ కొత్త ఎస్యూవీ ‘జీఎల్సీ’
♦ పెట్రోల్. డీజిల్ వేరియంట్లలో లభ్యం ♦ ధర రూ.50.7 లక్షల నుంచి రూ.50.9 లక్షల రేంజ్లో న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ కొత్త స్పోర్ట్స్‌యుటిలిటీ వెహికల్(ఎస్యూవీ)ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. జీఎల్సీ పేరుతో ఈ ఎస్‌యూవీని పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో అందిస్తున్నామని మెర్సిడెస్ ఇండియా పేర్కొంది. 2143 సీసీ డీజిల్ ఇంజిన్‌తో రూపొందించిన జీఎల్సీ 220డి మోడల్ ధర రూ.50.7 లక్షలని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ, రోలాండ్ ఫోలర్ చెప్పారు. అలాగే 1991 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో రూపొందించిన జీఎల్సీ 300, ధర రూ.50.9 లక్షలని(అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, పుణే) వివరించారు. జీఎల్ఏ, జీఎల్ఈ లగ్జరీ ఎస్‌యూవీల మధ్య ఉన్న ఖాళీని ఈ తాజా జీఎల్సీ ఎస్యూవీ భర్తీ చేస్తుందని పేర్కొన్నారు. మెర్సిడెస్.. ఆరో ఎస్యూవీ: ఈ ఏడాది 12 కొత్త మోడళ్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీంట్లో భాగంగా ఈ ఏడాది తామందిస్తున్న ఐదో మోడల్ ఇదని రోలాండ్ వివరించారు. కాగా భారత్‌లో మెర్సిడెస్ అందిస్తున్న ఆరో ఎస్యూవీ మోడల్ ఇది. కారు ప్రత్యేకతలు.. : ఈ కారులో ఏడు అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ (ఈ ఎస్‌యూవీని 360 డిగ్రీల్లో చూడగలిగే ప్రత్యేకతను ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూపగలదు) 20 సీడీల స్టీరియో, గర్మిన్ ఆధారిత నావిగేషన్, 2 యూఎస్బీ పోర్ట్‌లు, బ్లూ టూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌లో ఉన్నాయి. 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, మల్టీపుల్ డ్రైవింగ్ మోడ్స్, 4మ్యాటిక్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్, ఎడాప్టివ్ బ్రేక్ లైట్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 7 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ అంటోంది. డీజిల్ ఎస్యూవీ 0-100 కిమీ వేగాన్ని 8.3 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 210 కిమీ. ఇక పెట్రోల్ ఎస్యూవీ 0-100 కిమీ. వేగాన్ని 6.5 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 222 కిమీ. -
రోస్బర్గ్కు తొలి ‘పోల్’
♦ చివరి స్థానం నుంచి హామిల్టన్ ♦ నేడు చైనా గ్రాండ్‌ప్రి షాంఘై (చైనా): ఫార్ములావన్ సీజన్‌లోని తొలి రెండు రేసుల్లోనూ విజేతగా నిలిచిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ మూడో విజయంపై దృష్టి పెట్టాడు. శనివారం జరి గిన చైనా గ్రాండ్‌ప్రి రేసు క్వాలిఫయింగ్ సెషన్లో రోస్‌బర్గ్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 35.402 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని సంపాదించాడు. గత రెండు రేసుల్లో ‘పోల్ పొజిషన్’ సాధించిన ప్రస్తుత ప్రపంచ చాంపియన్ హామిల్టన్‌కు క్వాలిఫయింగ్ సెషన్ కలిసిరాలేదు. కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో క్వాలిఫయింగ్ తొలి సెషన్లో ల్యాప్ కూడా పూర్తి చేయకుండానే వైదొలిగాడు. దాంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ చివరి స్థానం నుంచి మొదలుపెడతాడు. 2014లో హంగేరి గ్రాండ్‌ప్రి తర్వాత హామిల్టన్ ఒక రేసును చివరి స్థానం నుంచి ప్రారంభిస్తుండటం ఇదే తొలిసారి. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్, హుల్కెన్‌బర్గ్ వరుసగా ఏడు, పది స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. గ్రిడ్ పొజిషన్స్: 1. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), 2. రికియార్డో (రెడ్‌బుల్), 3. రైకోనెన్ (ఫెరారీ), 4. వెటెల్ (ఫెరారీ), 5. బొటాస్ (విలియమ్స్), 6. క్వియాట్ (రెడ్‌బుల్), 7. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 8. కార్లోస్ సెయింజ్ (ఎస్టీఆర్), 9. వెర్స్టాపెన్ (ఎస్టీఆర్), 10. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), 11. మసా (విలియమ్స్), 12. అలోన్సో (మెక్లారెన్), 13. బటన్ (మెక్లారెన్), 14. గ్రోస్యెన్ (హాస్), 15. ఎరిక్సన్ (సాబెర్), 16. నాసర్ (సాబెర్), 17. మాగ్నుసన్ (రెనౌ), 18. గుటిరెజ్ (హాస్), 19. పాల్మెర్ (రెనౌ), 20. హర్యాంతో (మనోర్), 21. వెర్లీన్ (మనోర్), 22. హామిల్టన్ (మెర్సిడెస్). -
ప్రాణాల కోసం పరిగెత్తినా.. కారు గాల్లోకి లేపింది!
న్యూఢిల్లీ: ముప్పై రెండేళ్ల సిద్ధార్థ శర్మ అప్పుడు న్యూడిల్స్ పార్శిల్ కట్టించుకొని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. రోడ్డు దాటేందుకు అటు-ఇటు చూసి అడుగు ముందుకేశాడు. ఎదురుగా 100 కిలోమీటర్ల వేగంగా మెర్సిడెస్ కారు దూసుకొస్తుంది. తనను చూసి కూడా కారు డ్రైవర్ స్పీడ్ తగ్గించలేదు. తన మీదకొస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు సిద్ధార్థ వెంటనే పరుగులు పెట్టాడు. అయినా ఫలితం లేకపోయింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఆయనను ఢీకొట్టి.. అమాంతం గాల్లోకి లేపేసింది. ఆయనను ప్రమాదం నుంచి తప్పించడానికి ఆ కారులోని కుర్ర డ్రైవర్ ప్రయత్నించలేదు. ఢీకొట్టిన తర్వాత కూడా కారు స్లో చేయలేదు. అంతే వేగంగా పేవ్మెంట్ మీదకు దూసుకుపోయాడు. కారు ముందు టైరు పగిలిపోవడంతో ఆగిపోయింది. లేకుంటే మరింత విధ్వంసం సృష్టించేదే. అమాంతం గాలిలోకి లేచిన సిద్ధార్థ శరీరం.. నిర్జీవమై రోడ్డుపై పడింది. ఆయన న్యూడిల్ పార్సిల్ ఉన్న బ్యాగు దూరంగా పడిపోయింది. అక్కడ ఉన్న వాళ్లు అయ్యో అంటూ అతని మృతదేహం చుట్టూ మూగారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం సీసీటీవీ దృశ్యాలు ఇవి. ఓ సంపన్నుడి మైనర్ కొడుకు కన్నుమిన్నుకానని వేగంతో మెర్సిడెస్ కారును నడుపుతూ ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. ఇంటర్ పరీక్షలు ముగిశాయన్న ఆనందంతో కారులో స్నేహితులతో జల్సా చేస్తూ.. అదుపులేని వేగంతో ఈ ప్రమాదానికి ఒడిగట్టి.. ఆ వెంటనే సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు మైనర్ కావడంతో సంపన్నుడైన అతని తండ్రిపై అభియోగాలు మోపారు. మైనర్‌కు వాహనం ఇచ్చి ప్రమాదానికి కారణమైనట్టు బెయిలబుల్ అభియోగాన్ని మాత్రమే అతనిపై పెట్టారు. ఈ ప్రమాదంలో తన ఒక్కగాను ఒక్క కొడుకును కోల్పోయిన హేమ్రాజ్ శర్మ మాత్రం పోలీసుల విచారణ ఓ జోక్‌లా కనిపిస్తోందని, పోలీసుల తీరు ప్రశార్థకంగా ఉందని అంటున్నారు. సంపన్నుడైన నిందితుడిని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి నేరగాళ్లకు శిక్ష విధించకుంటే రేపొద్దున మీ కుటుంబాలకు తన కుటుంబానికి వచ్చిన పరిస్థితే వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
'మీ కార్లు ఆక్సిజన్ విడుదల చేస్తాయా?'
న్యూఢిల్లీ: 'మీ కార్లు ఆక్సిజన్ విడుదల చేస్తాయా?' అని టయోటా, మెర్సిడెజ్ సహా ప్రముఖ కార్ల తయారీ సంస్థలను సుప్రీంకోర్టు పశ్నించింది. పెద్ద డీజిల్ కార్లపై ఢిల్లీలో విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలన్న అభ్యర్థనపై అత్యున్నత న్యాయస్థానం ఈ విధంగా స్పందించింది. వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు పెద్ద డీజిల్ కార్ల రాకపోకలపై గత నెల నుంచి ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. దీనిపై పునరాలోచన చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మహీంద్ర అండ్ మహీంద్ర లిమిటెడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2000 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన కార్లను మార్చి 31 వరకు విక్రయించరాదని వాహన తయారీ సంస్థలను ఆదేశించింది. ప్రపంచంలో అత్యంత కలుషితమైన మొదటి 20 నగరాల్లో 13 మనదేశంలోనే ఉన్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యయనంలో వెల్లడైందని సర్వోన్నత న్యాయస్థానం గుర్తు చేసింది. పెద్ద కార్లు, ఎస్ యూవీలతో పర్యావరణానికి పెద్ద ప్రమాదం ఏమీ లేదని.. అంతర్జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగానే డీజిల్ కార్లు తయారు చేస్తున్నామని... బొలిరొ, సుమో లాంటి పెద్ద కార్లను సామాన్యులు, గ్రామాల్లోనూ వాడుతున్నారని వాహన తయారీ సంస్థలు వాదించాయి. ఈ వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. 'ఈ వర్గానికి చెందిన ప్రజలు 2000 సీసీ వాహనాలు వాడుతున్నారు? డబ్బున్నవాళ్లు మాత్రమే వీటిని వినియోగిస్తున్నారు. డీజిల్ కార్లు కాలుష్యం స్వల్పమేనని మీరు చెబుతున్నారు. మీ కార్లు ఆక్సిజన్ వెలువరిస్తాయా?' అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఐఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలను ప్రభుత్వం ఎందుకు వాడుతుందని అడిగారు. -
కార్ల రేట్ల మోతే..!
వచ్చే నెల నుంచి ధరలు పెంచుతున్న కంపెనీలు 1-3 శాతం దాకా పెరుగుదల లిస్టులో హ్యుందాయ్, టయోటా, మెర్సిడెస్ ముడివస్తువుల వ్యయాలు పెరగడం, కరెన్సీ హెచ్చుతగ్గులే కారణం న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా కార్ల అమ్మకాలు పుంజుకోవడంతో ఊపిరి తీసుకుంటున్న వాహనాల కంపెనీలు తాజాగా ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. జనవరి నుంచి 1-3 శాతం శ్రేణిలో రేట్లు పెంచబోతున్నాయి. ఇప్పటికే హ్యుందాయ్, టయోటా, మెర్సిడెస్, బీఎండబ్ల్యూ తదితర సంస్థలు ధరల పెరుగుదల విషయాన్ని ప్రకటించాయి. ఒకవైపు ముడివస్తువుల వ్యయాలు పెరిగిపోవడం, మరోవైపు కరెన్సీ మారక విలువలు గణనీయంగా హెచ్చుతగ్గులకు లోనవుతుండటమే ఇందుకు కారణమని చెబుతున్నాయి. ఎలీట్, క్రెటా మోడల్స్ తప్ప మిగతా అన్ని కార్ల ధరలు వచ్చే నెల నుంచి రూ. 30,000 దాకా పెంచనున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేశ్ శ్రీవాస్తవ తెలిపారు. ప్రస్తుతం కంపెనీ వివిధ విభాగాల్లో దేశీయంగా గ్రాండ్ ఐ10, ఎక్సెంట్, వెర్నా తదితర తొమ్మిది కార్ల మోడల్స్‌ను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ. 3.10లక్షల నుంచి రూ. 30.41 లక్షల (ఢిల్లీ ఎక్స్‌షోరూం) దాకా ఉన్నాయి. అటు టయోటా తమ కార్ల రేట్లను 3 శాతం దాకా పెంచనున్నట్లు తెలిపింది. అయితే, ఏ కారుపై ఎంత పెంచనున్నదీ ఇంకా నిర్ణయించలేదని వెల్లడించింది. ముడి వస్తువుల రేట్ల పెరుగుదలను కొనుగోలుదారులపై మోపకుండా చాలాకాలంగా కంపెనీ భరిస్తూనే ఉందని, కానీ ప్రస్తుతం రేట్లు పెంచక తప్పని పరిస్థితి నెలకొందని టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) డెరైక్టర్ ఎన్ రాజా తెలిపారు. టీకేఎం ప్రస్తుతం లివా, ల్యాండ్ క్రూయిజర్ తదితర వాహనాలను విక్రయిస్తోంది. వీటి రేట్లు రూ. 5 లక్షల నుంచి రూ. 1.29 కోట్ల (ఢిల్లీ ఎక్స్‌షోరూం) దాకా ఉన్నాయి. అదే బాటలో నిస్సాన్, స్కోడా.. మిగతా కార్ల కంపెనీల బాటలోనే నిస్సాన్, స్కోడా కూడా వచ్చే నెల రేట్లు పెంచాలని నిర్ణయించాయి. హోండా కార్స్ ఇండియా, రెనో ఇండియా ప్రస్తుతం పెంపు పరిమాణంపై కసరత్తు చేస్తున్నాయి. తాము సైతం పెంచబోతున్నట్లు జర్మనీ లగ్జరీ కార్ల సంస్థ ఆడి కూడా సూచనప్రాయంగా తెలిపింది. ఇక, మెర్సిడెస్-బెంజ్ అన్ని మోడల్స్‌పైనా జనవరి 1 నుంచి రేట్లను 2 శాతం దాకా పెంచనున్నట్లు వెల్లడించింది. కారు కల సాకారం చేసుకోవాలనుకునే వారికి తోడ్పడేందుకు స్టార్ ఫైనాన్స్, స్టార్ ఎజిలిటీ, స్టార్ లీజ్ తదితర విభాగాల ద్వారా సర్వీసులు అందిస్తున్నామని, రేట్లు పెరిగినా కొనుగోలుదారులు వీటి ద్వారా ప్రయోజనాలు పొందవచ్చని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ రోలాండ్ ఫోల్గర్ పేర్కొన్నారు. అటు మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సైతం జనవరి నుంచి 3 శాతం దాకా రేట్లు పెంచనున్నట్లు ప్రకటించింది. సాధారణంగానే కార్ల కంపెనీలు జనవరిలో ధరలు పెంచుతుంటాయని ఆటోమొబైల్ పరిశ్రమ విశ్లేషకులు వివరించారు. ప్రస్తుతానికి డిస్కౌంట్ల వెల్లువ.. వచ్చే నెల నుంచి రేట్ల పెంపు ఎలా ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి మాత్రం కార్ల కంపెనీలు డిస్కౌంట్లు కొనసాగిస్తున్నాయి. మారుతీ సుజుకీ ఆల్టోపై రూ. 25,000, సెలీరియోపై రూ. 15,000, వ్యాగన్ఆర్.. ఎర్టిగాలపై రూ. 10,000 మేర నగదు డిస్కౌంట్లు ఇస్తోంది. ఆగస్టులో ప్రవేశపెట్టిన ఎస్-క్రాస్పైనా ఇస్తోంది. ఇప్పటికే మారుతీ కారు ఉన్నవారిఇక లాయల్టీ బోనస్ అందిస్తోంది. గత నెలతో పోలిస్తే వివిధ మోడల్స్‌పై కంపెనీ ఇచ్చే డిస్కౌంట్లు రూ. 5,000-రూ.10,000 దాకా పెరిగాయని సంస్థ డీలర్లు వెల్లడించారు. ఇక, పోటీ సంస్థ హ్యుందాయ్ పలు మోడల్స్‌పై గిఫ్ట్ చెక్‌లు, ఉచిత బీమా ఆఫర్లు ఇస్తోంది. ఇయాన్‌పై రూ. 20,500, ఐ10పై రూ. 14,000, గ్రాండ్ మీద రూ. 8,000-10,000, ఎక్సెంట్ పై రూ. 5,000-7,500 మేర గిఫ్ట్ చెక్‌లు అందిస్తోంది. వెర్నా, ఎలాంట్రా సెడాన్ కార్లపైన రూ. 20,000 గిఫ్ట్ చెక్ ఇస్తోంది హ్యుందాయ్. ఇదే బాటలో హోండా, మహీంద్రా, నిస్సాన్ తదితర సంస్థలు కూడా భారీ ఆఫర్లు అందిస్తున్నాయి. -
హీరో సోదరికి గ్యాంగ్ స్టర్ ఝలక్..
ముంబయి: అసలే అతడు పాత నేరస్తుడు. పైగా గ్యాంగ్ స్టర్. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతడు చేసిన నేరాల కారణంగా ముంబయి, థానే వంటి నగరాల్లో అడుగుపెట్టొద్దని పోలీసులు గట్టిగా హెచ్చరించి అతడిని బహిష్కరించారు. అలాంటి వ్యక్తిని నమ్మి టెస్ట్ డ్రైవింగ్ కారు ఇస్తే చేతివాటం చూపించకుండా ఊరుకుంటాడా. సరిగ్గా ముంబయిలో అదే జరిగింది. గ్యాంగ్ స్టర్ అఫ్తాబ్ పటేల్ బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ కారును టెస్టు డ్రైవింగ్ కోసం తీసుకెళ్లి పరారయ్యాడు. ఈ ఘటన చోటుచేసుకుని వారం రోజులు గడిచింది. పూర్తి వివరాల్లోకి వెళితే సాహిల్ ఖాన్ సోదరి షయిస్టా తమ మెర్సిడీస్ కారును ఆన్ లైన్ పోర్టల్ ద్వారా అమ్మకానికి పెట్టదలుచుకున్నారు. అ క్రమంలోనే దాని వివరాలు ఫొటోలతో సహా ఆన్ లైన్ లో ఈ నెల 7న పెట్టింది. ఈ ప్రకటన చూసిన పటేల్.. సాహిల్ సోదరికి అక్టోబర్ 8న ఫోన్ చేశాడు. అదే రోజు అక్టోబర్ 8న కాందివ్లీ అనే గ్రామం వద్ద సాయంత్రం కలుసుకున్నాడు. తాను రూ.42 లక్షలు చెల్లించి కారును సొంతం చేసుకుంటానని, అంతకంటే ముందు టెస్ట్ డ్రైవింగ్ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. మరో రోజు ఉదయం 8 గంటలకు పజీరో జీపు(ఎంహెచ్-03-ఏఎం-5832) లో మరికొందరు స్నేహితులతో కలిసి వచ్చాడు. అనంతరం డీల్ కుదుర్చుకుని సాహిల్ కారు డ్రైవర్ అర్షాద్ అన్సారీ చేతిలో రూ.50 వేలు పెట్టాడు. టెస్టు డ్రైవింగ్‌కు వెళ్లొచ్చాడు. మిగితా డబ్బు చెల్లించాక కారు తీసుకెళ్తానని చెప్పాడు. అయితే, తన ఖాతాలో మిగితా డబ్బు చెల్లించాలని షయిస్టా చెప్పింది. అలాగే, అని మరో రోజు ఉదయం ఏకంగా ఆమె ఇంటికి ఓ స్నేహితుడితో కలిసి వెళ్లి మరోసారి టెస్ట్ డ్రైవింగ్ కోసం అడిగాడు. అలా రెండోసారి టెస్ట్ డ్రైవింగ్ కోసం కారును తీసుకెళ్లిన పటేల్ ఇక తిరిగి ముఖం చూపించలేదు. ఈ విషయం చివరికి షయిస్టా తన సోదరుడికి చెప్పడంతో అతడు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడికోసం పోలీసులు గాలింపులు ప్రారంభించారు. -
హామిల్టన్ @ 9
మెర్సిడెస్ డ్రైవర్ ఖాతాలో రష్యా గ్రాండ్‌ప్రి టైటిల్ ఈ సీజన్లో తొమ్మిదో విజయం ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్ పెరెజ్‌కు మూడో స్థానం సోచి (రష్యా): ఆద్యంతం నాటకీయంగా సాగిన రష్యా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సత్తా చాటుకున్నాడు. 53 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 37 నిమిషాల 11.024 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది తొమ్మిదో టైటిల్ కావడం విశేషం. ఓవరాల్‌గా హామిల్టన్ కెరీర్లో ఇది 42వ టైటిల్. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ ఏడు ల్యాప్‌ల తర్వాత కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో వైదొలగగా... అతని వెనకాలే రెండో స్థానంలో ఉన్న హామిల్టన్ ఆధిక్యంలోకి వెళ్లాడు. అటు నుంచి వెనుదిరిగి చూడని హామిల్టన్ చివరి ల్యాప్ వరకూ ఆధిక్యంలో నిలిచి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) రెండో స్థానాన్ని దక్కించుకోగా... భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్ సెర్గియో పెరెజ్ మూడో స్థానంలో నిలిచాడు. 30 రేసుల తర్వాత ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్ టాప్-3లో నిలువడం గమనార్హం. చివరి ల్యాప్‌లో పెరెజ్ ఐదో స్థానానికి పడిపోయే అవకాశం కనిపించింది. అయితే పెరెజ్‌ను ఓవర్టేక్ చేయబోయిన కిమీ రైకోనెన్, బొటాస్ పరస్పరం ఢీకొట్టుకున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పెరెజ్ మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా ఈ రేసులో ఏడుగురు డ్రైవర్లు మధ్యలోనై వైదొలిగారు. ఈ సీజన్లో 15 రేసులు పూర్తయ్యాక ‘డ్రైవర్స్ చాంపియన్‌షిప్’ టైటిల్ రేసులో హామిల్టన్ (302 పాయింట్లు), వెటెల్ (236 పాయింట్లు), రోస్‌బర్గ్ (229 పాయింట్లు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. -
హామిల్టన్ అదుర్స్
జపాన్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం ఈ సీజన్లో ఎనిమిదో విజయం సుజుకా (జపాన్): వారం రోజుల క్రితం సింగపూర్ గ్రాండ్‌ప్రిలో విఫలమైన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈసారి అద్వితీయ ప్రదర్శనతో పుంజుకున్నాడు. జపాన్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచి ఈ సీజన్లో తన ఖాతాలో ఎనిమిదో టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఆదివారం జరిగిన 53 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 28 నిమిషాల 06.508 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ రెండో స్థానంతో సరిపెట్టుకోగా... ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానాన్ని సాధించాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. నికో హుల్కెన్‌బర్గ్ ఆరో స్థానంలో నిలువగా... మరో డ్రైవర్ పెరెజ్ 12వ స్థానంతో సంతృప్తి పడ్డాడు. తాజా విజయంతో హామిల్టన్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ రేసులో 277 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... నికో రోస్‌బర్గ్ (229 పాయింట్లు), వెటెల్ (218 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ విజయంతో హామిల్టన్ ఫార్ములావన్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన డ్రైవర్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. 41 టైటిల్స్‌తో విఖ్యాత డ్రైవర్ అయిర్టన్ సెనా (బ్రెజిల్)తో కలిసి హామిల్టన్ సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నాడు. మైకేల్ షుమాకర్ (91 టైటిల్స్), అలైన్ ప్రాస్ట్ (51 టైటిల్స్), సెబాస్టియన్ వెటెల్ (42 టైటిల్స్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు రష్యా గ్రాండ్‌ప్రి అక్టోబరు 11న జరుగుతుంది. తొలి ల్యాప్‌లోనే ఆధిక్యంలోకి... రెండో స్థానం నుంచి రేసును ఆరంభించిన హామిల్టన్ తొలి ల్యాప్ మలుపులో ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన నికో రోస్బర్గ్ను ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వెళ్లాడు. అటు నుంచి హామిల్టన్ వెనుదిరిగి చూడలేదు. మధ్యలో రెండుసార్లు పిట్స్‌లో ఆగిన అతనికి ఏదశలోనూ మిగతా డ్రైవర్ల నుంచి పోటీ ఎదురుకాలేదు. చివరి ల్యాప్ వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొన్న హామిల్టన్ తుదకు విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. గమ్యం చేరారిలా (టాప్-10) 1. హామిల్టన్ (మెర్సిడెస్-1గం:28ని.06.508 సెకన్లు), 2. నికో రోస్‌బర్గ్ (మెర్సిడెస్-1గం:28ని.25.472 సెకన్లు), 3. వెటెల్ (ఫెరారీ-1గం:28ని.27.358 సెకన్లు), 4. రైకోనెన్ (ఫెరారీ-1గం: 28ని.40.276 సెకన్లు), 5. బొటాస్ (విలియమ్స్-1గం:28ని.43.254 సెకన్లు), 6. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా-1గం:29ని.02.067 సెకన్లు), 7. గ్రోస్యెన్ (లోటస్-1గం:29ని.18.806 సెకన్లు), 8. మల్డొనాడో (లోటస్-1గం: 29ని.20.083 సెకన్లు), 9. వెర్స్టాపెన్ (ఎస్టీఆర్-1గం:29ని.41.823 సెకన్లు), 10. కార్లోస్ సెయింజ్ (ఎస్టీఆర్-ప్లస్ ఒక ల్యాప్). -
మెర్సిడెస్ నుంచి ‘ఏఎంజీ ఎస్-63’
బెంగళూరు: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ తాజాగా ఏఎంజీ సిరీస్‌లో సెడాన్ కేటగిరీ కింద ‘ఏఎంజీ ఎస్-63’ అనే మరో కొత్త కారును మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ కారులో 585 హర్స్‌పవర్ సామర్థ్యమున్న ఏఎంజీ 5.5 లీటర్ల వీ8 బైటర్బో ఇంజిన్, హెడ్ ఆప్ డిస్ప్లే, నైట్ వ్యూ అసిస్ట్ ప్లస్, మ్యాజిగ్ బాడీ కంట్రోల్, సీట్ కంఫర్ట్ ప్యాకేజ్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర రూ.2.53 కోట్లు (ఎక్స్ షోరూమ్ బెంగళూరు)గా ఉంది. డిజైనో ప్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదారులు ‘ఏఎంజీ ఎస్-63’ కారులో వారికి నచ్చిన సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. -
మెర్సిడెస్ నుంచి మూడు లగ్జరీ కార్లు
న్యూఢిల్లీ : అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ... జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేరోజు మూడు కొత్త కార్లను మార్కెట్లో ఆవిష్కరించింది. ఎస్ 500 కూపే, ఏఎంజీ ఎస్ 63 కూపే, ఏఎంజీ జీ 63 ‘క్రేజీ కలర్’ ఎడిషన్ కార్లను వినియోగదారుల కోసం మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటి ధర రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల (ఢిల్లీ ఎక్స్ షోరూం) మధ్యలో ఉంది. ఎస్500 కూపే ధర రూ.2 కోట్లుగా, ఏఎంజీ ఎస్ 63 కూపే ధర రూ.2.60 కోట్లుగా, ఏఎంజీ జీ 63 ‘క్రేజీ కలర్’ ఎడిషన్ ధర రూ.2.17 కోట్లుగా ఉంది. 2015లో 15 మోడళ్లను భారత మార్కెట్లో ఆవిష్కరించాలనే ‘15 లో 15’ వ్యూహంలో భాగంగానే ఈ కార్లను మార్కెట్లోకి తె చ్చినట్లు కంపెనీ పేర్కొంది. అలాగే కంపెనీ వినియోగదారుల కోసం ‘డిజైనో’ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా నచ్చిన ప్రత్యేక రంగు, హై క్వాలిటీ ఇంటీరియర్స్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు వంటి తదితర ఆప్షన్లను అందిస్తోంది. -
కన్నుగీటాడని.. అపరకాళిక అవతారం..
-
కన్నుగీటాడని.. అపరకాళిక అవతారం..
ఆగ్రా: వెకిలి వేషాలేసిన ఎమ్మెల్యే గార్డును, ఓ యువతి చీల్చి చెండాడిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అనుచరుడు ఓ యువతికి కన్నుగీటాడు. పిచ్చి పిచ్చి సైగలు చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన 23 ఏళ్ల ఆ యువతి అపరకాళిక అవతారమెత్తింది. కారులోంచి వేషాలేస్తున్న అతగాడ్ని దమ్ముంటే బయటకు రమ్మని సవాల్ చేసింది. అయితే అతగాడు ఎంతకూ కారు దిగకపోయే సరికి ఆ యువతి అతని వాహనం పైకి ఎగిరి దూకింది. మెర్సిడెస్ బెంజ్ విండ్‌షీల్డ్ పైకి ఎక్కి అద్దాలు ధ్వంసం చేసింది. పార్టీ జెండాను పీకి ముక్కలు ముక్కలు చేసింది. స్థానికులు, వాహనదారులు ఆమెకు మద్దుతుగా నిలిచారు. ఎమ్మెల్యే అనుచరుడికి బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే సదరు ఎమ్మెల్యే మాత్రం దీనిపై స్పందించడానికి నిరాకరించాడు. కాగా ఈ సంఘటనపై పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేస్తారనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి ఆగడాలకు ఆదిలోనే అంతం పలకాలని, తగిన బుద్ధి చెప్పిందని మహిళా సంఘాలు అభినందిస్తున్నాయి. భయపడి పారిపోతే మరింత వెంటపడి వేధిస్తారంటున్నాయి. -
హామిల్టన్‌కే పట్టం
అబుదాబి: విజేతను తేల్చే రేసులో సంయమనంతో డ్రైవ్ చేసిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఒకే విజయంతో రెండు లక్ష్యాలను సాధించాడు. ఆదివారం జరిగిన 2014 ఎఫ్1 సీజన్ చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. దాంతోపాటు ఈ ఏడాది డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌నూ కైవసం చేసుకున్నాడు. 2008లో తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన హామిల్టన్ కెరీర్లో ఇది రెండో ప్రపంచ టైటిల్. 55 ల్యాప్‌ల అబుదాబి రేసును ఈ మెర్సిడెస్ డ్రైవర్ గంటా 39 నిమిషాల 02.619 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. 19 రేసుల ఈ సీజన్‌ను హామిల్టన్ 11వ విజయంతో ఘనంగా ముగింపు పలికాడు. మారిన నిబంధనల ప్రకారం సీజన్ చివరి రేసులో రెట్టింపు పాయింట్లు లభిస్తాయి. ఫలితంగా హామిల్టన్ 384 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన రోస్బర్గ్కు తొలి మలుపు వద్దే హామిల్టన్ ఓవర్టేక్ చేశాడు. రెండో స్థానం నుంచి రేసును ఆరంభించిన హామిల్టన్ రెండో ల్యాప్ నుంచే ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఇదే జోరును కొనసాగించాడు. కారులో సమస్య తలెత్తడంతో రోస్‌బర్గ్ ఆఖరికి 14వ స్థానంతో సరిపెట్టుకొని ఒక్క పాయింట్ కూడా నెగ్గలేకపోయాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్, పెరెజ్ వరుసగా ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు. గత నాలుగేళ్లుగా ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన వెటెల్ ఈ సీజన్లో ఒక్క విజయాన్ని దక్కించుకోలేకపోవడం గమనార్హం. 2015 సీజన్ మార్చి 15న ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రితో మొదలవుతుంది. కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ (టాప్-5) స్థానం జట్టు పాయింట్లు 1 మెర్సిడెస్ 701 2 రెడ్‌బుల్ 405 3 విలియమ్స్ 320 4 ఫెరారీ 216 5 మెక్లారెన్ 181 డ్రైవర్స్ చాంపియన్‌షిప్ (టాప్-5) స్థానం డ్రైవర్ జట్టు పాయింట్లు 1 హామిల్టన్ మెర్సిడెస్ 384 2 రోస్‌బర్గ్ మెర్సిడెస్ 317 3 రికియార్డో రెడ్‌బుల్ 238 4 బొటాస్ విలియమ్స్ 186 5 వెటెల్ రెడ్‌బుల్ 167 గమ్యం చేరారిలా... స్థానం డ్రైవర్ జట్టు సమయం పాయింట్లు 1 హామిల్టన్ మెర్సిడెస్ 1:39:02.619 50 2 మసా విలియమ్స్ 1:39:05.195 36 3 బొటాస్ విలియమ్స్ 1:39:31.499 30 4 రికియార్డో రెడ్‌బుల్ 1:39:39.856 24 5 బటన్ మెక్లారెన్ 1:40:02.953 20 6 హుల్కెన్‌బర్గ్ ఫోర్స్ ఇండియా 1:40:04.767 16 7 పెరెజ్ ఫోర్స్ ఇండియా 1:40:13.679 12 8 వెటెల్ రెడ్‌బుల్ 1:40:14.664 8 9 అలోన్సో ఫెరారీ 1:40:28.432 4 10 రైకోనెన్ ఫెరారీ 1:40:30.439 2 -
లగ్జరీ కార్ల అమ్మకాల జోరు!
దేశంలో లగ్జరీ కార్ల మార్కెట్ జోరుగా ఉంది. కార్ల కంపెనీల మధ్య పోటీ పెరగడం, సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ విస్తరిస్తుండటంతో లగ్జరీ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం(2013-2014)లో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 6 శాతం తగ్గాయి. అదే సమయంలో లగ్జరీ కార్ల అమ్మకాలు 25 శాతం పెరిగి, 35 వేల యూనిట్లకు పెరిగాయి. అదే సమయంలో సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్ల మార్కెట్ 60 శాతం పెరిగి 30 వేల యూనిట్లకు చేరింది. సాధారణంగా ప్రతి రెండు మూడేళ్లలో లగ్జరీ కార్లను వాటి యజమానులు మార్చేస్తున్నారు. ఈ కారణంగా యూజ్డ్ కార్ల మార్కెట్ విస్తృతి పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో మెర్సిడెజ్-బెంజ్ యూజ్డ్ కార్ల అమ్మకాలు 42 శాతం పెరిగాయి. గడిచిన కొన్ని సంవత్సరాలుగా యూజ్డ్ లగ్జరీ కార్ల మార్కెట్ సగటున 25 శాతం చొప్పున వృద్ధి చెందుతూ వస్తోంది. బిఎండబ్లూ 3 సిరీస్ కారు కొత్తది 34 లక్షల రూపాయలు కాగా, సెకండ్ హ్యాండ్ ధర 22 లక్షల రూపాయలుగా ఉంది. కారు వయసు పెరిగే కొద్దీ ధర మరింతగా తగ్గుతుంది. ప్రస్తుతం మన దేశంలో బెంజ్, బిఎండబ్లూ, ఆడి కార్లు ప్రధానంగా లగ్జరీ కారు బ్రాండ్లుగా ఉన్నాయి. వీటికి పోటీగా టయోటా లెక్సస్, నిస్సాన్ ఇన్ఫినిటీ, జనరల్ మోటార్స్ క్యాడిల్లాక్ కంపెనీలు కూడా ఇండియన్ మార్కెట్ మీద దృష్టి పెట్టాయి. మార్కెట్ విస్తృతి పెరిగే కొద్దీ కొత్త కంపెనీలు రంగంలోకి రావడం సహజం. ఈ పోటీని తట్టుకునేందుకు ఇప్పటికే ఉన్న కంపెనీలు తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్స్ ఉండే లగ్జరీ కార్లను రంగంలోకి దించుతున్నాయి. మొత్తం మీద కుబేరులు, కోట్ల రూపాయల వేతనాలందుకునే ఎగ్జిక్యూటివ్‌లతోపాటు ఓ మాదిరి ధనవంతులు కూడా ఇప్పుడు లగ్జరీ కార్లు కొనుగోలు చేసే అవకాశం ఏర్పడుతోంది. ** -
సోషల్ సైట్ల ద్వారా ఆటో ప్రచారం
గ్రేటర్ నోయిడా: యువ వినియోగదారులను ఆకట్టుకోవడానికి కార్ల కంపెనీలు కొత్త వ్యూహాలు అవలంబిస్తున్నాయి. ఇందులో భాగంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్ల తలుపు తడుతున్నాయి. షెవర్లే(జనరల్ మోటార్స్), మెర్సిడెస్, హీరో, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆడి కంపెనీలు యూ ట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్లతో యువ వినియోగదారులకు చేరువ అవుతున్నాయి. మెర్సిడెస్ బెంజ్ సంస్థ 12వ ఆటో ఎక్స్‌పోలో తమ స్టాల్ వీడియోలను యూట్యూబ్‌లో పెట్టింది. యువ వినియోగదారులకు తాజా సమాచారం కావాలని, అందుకే తాము డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా వారికి నేరుగా కనెక్ట్ అయ్యేలా వినూత్నమైన మార్కెటింగ్ విధానాలను అనుసరిస్తున్నామని హ్యుందాయ్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇక జనరల్ మోటార్స్ కంపెనీ షెవర్లె బ్రాండ్ కోసం చాటెరెట్టి పేరుతో వినూత్నమైన ప్రచారాన్ని నిర్వహిస్తోంది. సందర్శకుల అభిప్రాయాలను, ప్రతిస్పందలను యూట్యూబ్‌లో షేర్ చేస్తోంది. హీరో మోటొకార్ప్ కంపెనీ బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌తో గూగుల్ ప్లస్ హ్యాంగవుట్ సెషన్‌ను నిర్వహించింది. భారత్‌లో 20 కోట్ల మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారని అంచనా. వాహనాలకు సంబంధించిన సమాచారానికి వినియోగదారులు టీవీ, వార్తాపత్రికల కంటే ఇంటర్నెట్పైననే అధికంగా అధారపడుతున్నారని గూగుల్ ఇండియా ఇండస్ట్రీ హెడ్ గౌరవ్ కపూర్ చెప్పారు. వాహన కంపెనీలు ఇంటర్నెట్ను ఈ ఆటో షోకు కూడా బాగానే వినియోగించుకుంటున్నాయని ఆయన చెప్పారు.