రణ్‌వీర్‌ సింగ్‌ దగ్గర ఎన్ని కార్లో! వాటి ధర తెలిస్తే గుడ్లు తేలేయాల్సిందే! | Ranveer Singh Buys Swanky Mercedes Maybach GLS 600 Worth Rs 2.43 Crore | Sakshi
Sakshi News home page

Ranveer Singh: కార్ల కోసం కోట్లు గుమ్మరిస్తున్న బాలీవుడ్‌ స్టార్‌

Published Fri, Jul 9 2021 7:28 PM | Last Updated on Fri, Jul 9 2021 8:26 PM

Ranveer Singh Buys Swanky Mercedes Maybach GLS 600 Worth Rs 2.43 Crore - Sakshi

బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ మరో కొత్త కారుకు ఓనరయ్యాడు. జూలై 6న జరుపుకున్న తన 36వ పుట్టినరోజు సందర్భంగా తనకు తానే కారును గిఫ్ట్‌గా ఇచ్చుకున్నాడు. మెర్సిడిస్‌ మేబీచ్‌ జీఎల్‌ఎస్‌ 600ను కొనుగోలు చేసి తన ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంతకీ గత నెలలోనే భారత్‌లో లాంచ్‌ అయిన ఈ కొత్త మోడల్‌ ధర ఎంతనుకుంటున్నారు? అక్షరాలా 2 కోట్ల 43 లక్షల రూపాయలు. లేటెస్ట్‌గా లాంచ్‌ అయిన ఈ మోడల్‌కే ప్రస్తుతం ఎక్కుడ డిమాండ్‌ ఉంది.

ఇదే ఏడాది మేలో రణ్‌వీర్‌​ లంబోర్గిని యురుస్‌ పెరల్‌ క్యాప్సుల్‌ మోడల్‌ను తన సొంతం చేసుకున్నాడు. దీని కోసం రూ.3.15 కోట్లు వెచ్చించాడు. వీటితోపాటు ఈ హీరో దగ్గర ఆస్టన్‌ మార్టిన్‌ స్పోర్ట్స్‌ కారు కూడా ఉంది. ఇది పై రెండు కార్ల ఖరీదును కన్నా ఎక్కువే. ఈ స్పోర్ట్స్‌ కారును తన వశం చేసుకోవడం కోసం అతడు ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. మొత్తానికి రణ్‌వీర్‌ కార్ల సంఖ్య ఇప్పుడు నాలుగుకు చేరింది. రణ్‌వీర్‌కు కార్ల మీదున్న ప్రేమ చూస్తుంటే త్వరలో ఏదైనా కొత్త మోడల్‌ దిగితే దానికోసం ఎన్ని కోట్లైనా ఖర్చు చేసేలా ఉన్నాడు.

రణ్‌వీర్‌ సింగ్‌ ప్రస్తుతం అలియాభట్‌తో కలిసి 'రాకీ ఔర్‌ రాణీకీ ప్రేమ్‌ కహానీ' సినిమాలో నటిస్తున్నాడు. అలాగే స్పోర్ట్స్‌ డ్రామా '83'లో క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ పాత్ర పోషిస్తున్నాడు. వీటితోపాటు 'జయేశ్‌భాయ్‌ జోర్దార్‌', 'సర్కస్‌', 'అన్నియన్‌', 'తాకత్‌' చిత్రాలు కూడా లైన్‌లో ఉన్నాయి. అలాగే 'బిగ్‌ పిక్చర్‌' అనే క్విజ్‌ షో ద్వారా త్వరలోనే బుల్లితెరపై కూడా ఎంట్రీకి సిద్ధమయ్యాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement