కన్నుగీటాడని.. అపరకాళిక అవతారం.. | Woman smashes SP leader's car after his guard winked at her | Sakshi
Sakshi News home page

కన్నుగీటాడని.. అపరకాళిక అవతారం..

Published Tue, May 19 2015 10:44 AM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM

కన్నుగీటాడని.. అపరకాళిక అవతారం..

కన్నుగీటాడని.. అపరకాళిక అవతారం..

ఆగ్రా:   వెకిలి వేషాలేసిన ఎమ్మెల్యే గార్డును,  ఓ  యువతి చీల్చి చెండాడిన వైనం ఆలస్యంగా  వెలుగులోకి వచ్చింది.   సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అనుచరుడు ఓ యువతికి  కన్నుగీటాడు.  పిచ్చి పిచ్చి సైగలు చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన 23 ఏళ్ల ఆ యువతి అపరకాళిక అవతారమెత్తింది.  కారులోంచి వేషాలేస్తున్న అతగాడ్ని   దమ్ముంటే బయటకు రమ్మని సవాల్ చేసింది. అయితే అతగాడు ఎంతకూ   కారు దిగకపోయే సరికి ఆ యువతి అతని వాహనం పైకి ఎగిరి దూకింది. మెర్సిడెస్  బెంజ్ విండ్షీల్డ్ పైకి ఎక్కి అద్దాలు ధ్వంసం చేసింది.  పార్టీ జెండాను పీకి ముక్కలు ముక్కలు చేసింది.  

స్థానికులు, వాహనదారులు ఆమెకు మద్దుతుగా నిలిచారు. ఎమ్మెల్యే అనుచరుడికి బుద్ధి చెప్పాలని డిమాండ్  చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే సదరు ఎమ్మెల్యే మాత్రం దీనిపై  స్పందించడానికి  నిరాకరించాడు. కాగా  ఈ సంఘటనపై పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేస్తారనేది  తెలియాల్సి ఉంది. ఇలాంటి ఆగడాలకు ఆదిలోనే అంతం పలకాలని,   తగిన బుద్ధి చెప్పిందని  మహిళా సంఘాలు అభినందిస్తున్నాయి.  భయపడి పారిపోతే మరింత వెంటపడి వేధిస్తారంటున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement