
సాక్షి , ఆగ్రా: మహాత్మడు అర్థరాత్రి మహిళ ఒంటరిగా నడిచిన రోజే నిజమైన స్వాతంత్యం అని అన్నాడు. ఈ మాట పరిస్థితిమో గానీ ప్రస్తుత భారతావనిలో చూస్తే అర్థరాత్రి కాదు కదా పట్టపగలు, తోడుగా సొంత వాళ్లు ఉన్నా ఆమె పైన అఘాయిత్యాలు ఆగడం లేదు. కొందరు తాము మనుషులం అనే మాటను మరిచి మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా భర్త ముందే ఓ మహిళను అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. సాయంత్రం 6 గంటల సమయంలో భర్త స్కూటర్‌పై ఎట్మౌడౌలా ప్రాంతంలోని ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళుతుండగా, అకస్మాత్తుగా ముగ్గురు వ్యక్తులు వారిని రోడ్డుపై అడ్డగించారు. అనంతరం వాళ్లను కొట్టి, బలవంతంగా సమీపంలోని అడవిలోనికి లాక్కెళ్లారు.
అక్కడ ఆ ముగ్గురు భర్త ముందే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. అంతే కాకుండా వారు ఈ వికృత చర్యను వీడియో కూడా తీశారు. పారిపోతూ వారి వద్ద ఉన్న 10,000 రూపాయలు, చెవిపోగులు దోచుకున్నట్లు ఎఫ్‌ఐఆర్‌లోలో పేర్కొంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో బాధిత దంపతులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ముగ్గురు వ్యక్తులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.( చదవండి: అనుమానం పెనుభూతమై.. భార్య గొంతు కోసి! )
Comments
Please login to add a commentAdd a comment