crime against women
-
మహిళలపై నేరం క్షమించరాని పాపం... నేరగాళ్లకు కఠిన శిక్షలు తప్పవని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Rajasthan Elections 2023: ప్రచారాస్త్రంగా ‘మహిళలపై నేరాలు’.. ఇవీ గణాంకాలు..
‘మహిళలపై నేరాలు’ ప్రధాన ప్రచారాస్త్రంగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు సాగుతున్నాయి. వీటిపైనే బీజేపీ తమ ప్రచార ర్యాలీలు, బహిరంగ సభల్లో అధికార కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ రెండూ తమ మేనిఫెస్టోలలో మహిళా భద్రతకు సంబంధించి అనేక హామీలు ప్రకటించాయి. ప్రచార సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా బీజేపీ నేతలందరూ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. నవంబర్ 15న బార్మర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో మహిళలపై అఘాయిత్యాల్లో రాజస్థాన్ అగ్రగామిగా ఉందని ఆరోపించారు. గణాంకాలు ఇవీ.. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం.. 2021 సంవత్సరంలో అత్యధికంగా రేప్ కేసులు నమోదైన రాష్ట్రంగా రాజస్థాన్ అవతరించింది. రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్ 376 కింద 6,337 అత్యాచార కేసులు నమోదయ్యాయి. దీని తర్వాత ఉత్తరప్రదేశ్‌లో 2,845 కేసులు నమోదయ్యాయి. ఇక 2021లో దేశవ్యాప్తంగా 31,677 అత్యాచార కేసులు నమోదయ్యాయి. మహిళలపై ఇతర నేరాల విషయానికి వస్తే.. ఉత్తరప్రదేశ్ తర్వాత రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. 2021లో అత్యధికంగా 56,083 కేసులతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా, రాజస్థాన్‌లో 40,738 కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో మహిళలపై నేరాల సంఖ్య 2020 కంటే 2021లో దాదాపు 17 శాతం పెరిగింది. అయితే ఇది 2019 కేసుల సంఖ్య 41,550 కంటే 2 శాతం తగ్గడం గమనార్హం. 2021లో దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలకు సంబంధించి 4,28,278 కేసులు నమోదయ్యాయని ఎన్సీఆర్బీ గణాంకాలు చెబుతున్నాయి. -
ప్రతి 11 నిమిషాలకు.. ఒక యువతి బలి.. సొంత కుటుంబ సభ్యుల చేతుల్లోనే..
ఐక్యరాజ్యసమితి: ప్రపంచవ్యాప్తంగా ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ/బాలిక తమ భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల చేతిలో దారుణ హత్యకు గురవుతున్నారని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.. మానవ హక్కుల ఉల్లంఘనల్లో మహిళలపై జరిగే హింస ముందు వరసలో ఉందని పేర్కొంది. నవంబర్ 25న ‘‘మహిళలపై హింసా నిర్మూలన‘‘ అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రపంచంలో మానవ హక్కుల ఉల్లంఘనల్లో మహిళలపై హింస విస్తృతమైనది. ప్రతీ 11 నిమిషాలకు ఒక మహిళ తన భాగస్వామి లేదంటే సొంత కుటుంబానికి చెందిన వారి చేతిల్లోనే ప్రాణాలు కోల్పోతోంది. కోవిడ్–19, ఆర్థిక వెనుకబాటుతనం, ఇతర ఒత్తిళ్లతో మహిళలపై శారీరక, మానసిక హింస ఎక్కువైపోతోంది’’ అని గుటెరస్ పేర్కొన్నారు. దీనిని ఎదుర్కోవడానికి దేశాలన్నీ కార్యాచరణ రూపొందించాలన్నారు. ‘‘మహిళలపై హింస అంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. మహిళా హక్కుల కోసం పాటు పడే సంస్థలకు నిధులను 2026 నాటికి 50 శాతం పెంచాలి. మనందరం ఫెమినిస్టులమని గర్వంగా ప్రకటించుకోవాలి’’ అన్నారు. చదవండి: ఇండోనేసియా భూకంపం.. 268కి చేరిన మృతులు -
క్రైమ్ రిపోర్ట్ @ 14 అక్టోబర్ 2022
-
క్రైమ్ రిపోర్టు : ఆదిలాబాద్ జిల్లాలో గ్యాంగ్ రేప్ కలకలం
-
క్రైమ్ రిపోర్ట్ : నాన్నరూప రాక్షసుడు ..!
-
దారుణం.. మైనర్‌ను వివస్త్రను చేసి సామూహిక అత్యాచారం
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం వెలుగుచూసింది. 15 ఏళ్ల బాలికను వివస్త్రను చేసి సామూహిక అత్యాచారనికి పాల్పడ్డారు నలుగురు కిరాతకులు. మొరాదాబాద్ జిల్లాలో సెప్టెంబర్ 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక పక్క గ్రామంలో తిరనాళ్లకు వెళ్లినప్పుడు స్థానిక యువకులు ఆమెపై కన్నేసి ఈ క్రూర చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం బాలిక నగ్నంగా తన స్వగ్రామానికి వెళ్తుండగా.. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి అంకుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితుల్లో ఇప్పటివరకు ఒక్కరిని మాత్రమే అరెస్టు చేశారు. అయితే సెప్టెంబర్ 7న తమకు ఫిర్యాదు అందిందని పోలీసుల చెప్పారు. బాధితురాలి తల్లిదండ్రులను అడిగితే తమ కూతురికి జరిగిన విషయం చెప్పలేదని పేర్కొన్నారు. అయినా తాము దర్యాప్తు చేపట్టి నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామన్నారు. విచారణ కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. చదవండి: హోటల్ రూమ్‌లో లవర్‌తో భర్త రాసలీలలు.. భార్య ఎంట్రీతో సీన్ రివర్స్! -
జాతరలో ఇద్దరు అమ్మాయిలను లైంగికంగా వేధిస్తూ.. వీడియో వైరల్
భోపాల్: దేశంలో మహిళలపై లైంగిక దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. కొందరు ఆకతాయిలు కావాలనే యువతులను, మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా ఓ పోకిరి గ్యాంగ్ మిట్ట మధ్యాహ్నం నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఇద్దరు అమ్మాయిలను లైంగికంగా హింసించారు. వారు చేసేది చాలదన్నట్టుగా కొందరు వ్యక్తులు ఈ ఘటనను వీడియో తీస్తూ రాక్షసానందం పొందారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. అలిరాజ్పూర్ జిల్లా సోండ్వా తెహసీల్‌లోని వాల్పూర్ గ్రామంలో హోలీకి ముందర అలిరాజ్పూర్, ఝాబువా, దర్, బర్వాని, సహా పశ్చిమ మధ్యప్రదేశ్‌లో గిరిజనుల జాతర భగోరియా జరుగుతుంది. గిరిజనులు నివాసం ఉండే ప్రాంతంలో ఈ జాతరను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ప్రతీ ఏడాదిలాగే ఈ ఏడాది కూడా జాతర ప్రారంభమైంది. కాగా, జాతరలో మార్చి 11వ తేదీన ఓ అభ్యంతరకర ఘటన చోటుచేసుకుంది. జాతరకు వచ్చిన ఓ గ్యాంగ్.. రోడ్డుపై అరుచుకుంటూ నానా బీభత్సం సృష్టిస్తూ వెళ్తున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు గిరిజన అమ్మాయిలు భయంతో చాటుగా ముందుకు సాగుతున్నారు. ఇంతలో ఓ పోకిరి ఒక అమ్మాయి వైపు పరుగెత్తి తన వైపు లాక్కున్నాడు. లైంగికంగా వేధించాడు. ⚡️Distressing Video A tribal woman molested in broad daylight by saffron-clad goons during a fair in Madhya Pradesh, India.pic.twitter.com/lTZKLxVVwF — Ahmer Khan (@ahmermkhan) March 13, 2022 అంతటితో ఆగకుంగా ఆ గ్యాంగ్‌లో మరో వ్యక్తి రెండో అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా వారి పట్ల దురుసుగా ప్రవర్తించి.. లైంగిక వేధింపులకు గురి చేశారు. వారి వేధింపులను చూస్తూ జాతరలో ఉన్న వారు ఆపడానికి ప్రయత్నించకపోగా.. తమ ఫోన్లతో వీడియోలు తీశారు. అనంతరం సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంలో వీడియో కాస్తా వైరల్ మారింది. ఇదిలా ఉండగా.. ఈ ఘటన తమ దృష్టికి రాలేదని అలిరాజ్పూర్ ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. కానీ, ఈ వీడియో తీసిన గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఓ టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. -
విద్యార్థినిపై లైంగిక దాడి చేసి వీడియో తీసి.. ఆ తర్వాత..
లక్నో: దేశంలో మహిళలు, యువతులపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై దాడులను ఎదుర్కొనేందుకు ఎన్ని చట్టాలను అమలు చేస్తున్నా కొందరు మానవ మృగాలు మాత్రం మారడంలేదు. పోలీసుల నిఘా ఉన్నప్పటికీ దేశంలో ప్రతీ రోజు ఏదో ఒక చోట మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. యూపీలోని ఆగ్రా జిల్లాలో ఆదివారం సాయంత్రం ఓ కాలేజీ విద్యార్థిని ఆటోలో ఇంటికి తిరిగి వస్తోంది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ ఆమెపై కన్నేశాడు. వెంటనే తన స్నేహితులకు సమాచారం అందించాడు. దీంతో మరో ఇద్దరు అతడితో కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా, ముగ్గురు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడి చేయడమే కాకుండా.. బాధితురాలిని దారుణంగా కొట్టి.. అత్యాచారానికి సంబంధించిన వీడియోను రికార్డు చేశారు. ఈ విషయం బయటకు చెబితే వీడియోను బయటకు రిలీజ్ చేస్తామని బెదిరించినట్టు ఆమె తెలిపింది. వారి బారి నుండి బయట పడిన బాధితురాలు ఎత్మాద్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను భూరా యాదవ్, యశ్‌పాల్‌గా గుర్తించి వారిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని త్వరలోనే అతడిని కూడా అరెస్ట్ చేస్తామని ఎస్పీ సత్యజిత్ గుప్తా పేర్కొన్నారు. కాగా నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. -
హోటల్ గదిలో ఏకాంతంగా లవర్స్.. ఇంతలో ఫోన్ కాల్.. చివరకు..
సాక్షి, న్యూఢిల్లీ: వాళ్లు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ. ఇంతతో ఓ ఫోన్ కాల్ వారిద్దరి మధ్య చిచ్చుపెట్టింది. దీంతో హోటల్ రూమ్‌లో వారిద్దరి మధ్య వాగ్వాదం పెరిగి దారుణం జరిగింది. ఈ ఘర్షణలో ఆమె ప్రాణాలు కోల్పోవ్సాలి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన శివమ్ చౌహాన్(28), ఢిల్లీలోని కిశన్‌గఢ్‌కు చెందిన ఓ యువతి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఏకంతంగా కలుసుకునేందుకు ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఓ హెటల్‌కు వచ్చారు. ఈ క్రమంలో వారు హోటల్ రూమ్‌లో ఉండగా.. ఆమెకు ఓ వ్యక్తి వరుసగా కాల్స్ చేశాడు. దీంతో శివమ్.. ఎవరూ అని ప్రశ్నించగా తన సోదరి ప్రియుడు అని చెప్పింది. ఆమె మాటలు నమ్మని చౌహాన్.. మళ్లీ ప్రశ్నించడంతో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆవేశంతో శివమ్.. ఆమె తలను నెలకేసి కొట్టడంతో బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఇదిలా ఉండగా మరుసటి రోజు చౌహాన్ ఒక్కడే రూమ్ నుండి బయటకు వెళ్లిపోగా.. డెడ్ బాడీని గుర్తించిన హెటల్ సిబ్బంది ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ కెమెరాల ఆధారంగా శివమ్‌ను పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులు విచారించగా.. తన ప్రియురాలు తనను మోసం చేసి ఉత్కర్ష్ అనే మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్నట్టు చెప్పాడు. అందుకే తాను ఆమెను హత్య చేసినట్టు తెలిపాడని డీసీపీ గౌరవ్ శర్మ వెల్లడించారు. -
భర్త కళ్ల ముందే అత్యాచారం.. ఆపై వీడియో తీసి..
సాక్షి , ఆగ్రా: మహాత్మడు అర్థరాత్రి మహిళ ఒంటరిగా నడిచిన రోజే నిజమైన స్వాతంత్యం అని అన్నాడు. ఈ మాట పరిస్థితిమో గానీ ప్రస్తుత భారతావనిలో చూస్తే అర్థరాత్రి కాదు కదా పట్టపగలు, తోడుగా సొంత వాళ్లు ఉన్నా ఆమె పైన అఘాయిత్యాలు ఆగడం లేదు. కొందరు తాము మనుషులం అనే మాటను మరిచి మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా భర్త ముందే ఓ మహిళను అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. సాయంత్రం 6 గంటల సమయంలో భర్త స్కూటర్‌పై ఎట్మౌడౌలా ప్రాంతంలోని ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళుతుండగా, అకస్మాత్తుగా ముగ్గురు వ్యక్తులు వారిని రోడ్డుపై అడ్డగించారు. అనంతరం వాళ్లను కొట్టి, బలవంతంగా సమీపంలోని అడవిలోనికి లాక్కెళ్లారు. అక్కడ ఆ ముగ్గురు భర్త ముందే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. అంతే కాకుండా వారు ఈ వికృత చర్యను వీడియో కూడా తీశారు. పారిపోతూ వారి వద్ద ఉన్న 10,000 రూపాయలు, చెవిపోగులు దోచుకున్నట్లు ఎఫ్ఐఆర్లోలో పేర్కొంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో బాధిత దంపతులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ముగ్గురు వ్యక్తులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.( చదవండి: అనుమానం పెనుభూతమై.. భార్య గొంతు కోసి! ) -
మేకవన్నె మృగాడు
‘మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు’ అన్న సినీ కవి మాటలు అక్షర సత్యమయ్యాయి. ఎక్కడో ఒక చోట నిత్యమూ మహిళలు, బాలికలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు చోటు చేసుకుంటున్నాయి. ఏ మాత్రం ఆదమరిచినా.. మానవ మృగాలు రెచ్చిపోయి కబళిస్తున్నాయి. తండ్రి స్థానంలో ఉండాల్సిన వ్యక్తులు, విద్యా బుద్దలు నేర్పించే గురువులు, వయస్సుతో సంబంధం లేకుండా అకృత్యాలకు ఒడిగడుతున్నారు. ముక్కుపచ్చలారని బాలికలపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. ఏటా జిల్లాలో సగటున 50 వరకు ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా బుధవారం రాత్రి అనంతపురంలోని ఎర్రనేలకొట్టాలలో ఐదేళ్ల బాలికపై స్థానికంగా నివాసముంటున్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన నగర వాసులను భయభ్రాంతులకు గురి చేసింది. నిర్భయ లాంటి కఠిన చట్టాలు అమలవుతున్నా.. క్షేత్రస్థాయిలో నేరాలకు అడ్డుకట్ట పడకపోవడం వ్యవస్థ పతనావస్థకు అద్దం పడుతోంది. – అనంతపురం సెంట్రల్ నేరాల నియంత్రణకు కఠినమైన చట్టాలు అత్యాచార నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టానికి 2012లో ఆమోదం లభించింది. ఆ ఏడాది జూన్ 19న ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. జూన్ 20న భారతదేశం గెజిట్‌లో నోటిఫై చేశారు. చట్టంలో పేర్కొన్న మేరకు బాలిక ఆమోదం తెలిపినా, తెలపకపోయినా 18 సంవత్సరాలలోపు ఏ వ్యకిపైనైనా లైంగిక కలయిక జరిగితే అది అత్యాచారంగానే పరిగణించబడుతుంది. ఇప్పటి వరకూ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 375 ప్రకారం 16 సంవత్సరాలలోపు వ్యక్తి ఆమోదం తెలిపినా, తెలపకపోయినా అది అత్యాచారంగానే పరిగణించబడుతుంది. కానీ, ఇప్పుడు కొత్త చట్టం, నిబంధనల ప్రకారం అది 18 సంవత్సరాల వయసు గల ఏ వ్యక్తికైనా వర్తిస్తుంది. • పిల్లలపై లైంగిక అత్యాచారం చేస్తే ఏడేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష, అపరాధ రుసుము లేదా జీవిత ఖైదు కూడా విధించవచ్చు. (ఇటీవల రాష్ట్రపతి ఉరిశిక్ష అమలుపై ఆమోదం తెలిపారు. ) • పిల్లలపై అత్యాచారం లేదా వేధింపులకు గురిచేస్తే మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష, అపరాధ రుసుము, అశ్లీల దృశ్యాలకు, సాహిత్యానికి వాడుకుంటే ఐదేళ్ల జైలు శిక్ష, అపరాధ రుసుము, రెండోసారి అదే నేరంపై దొరికితే ఏడేళ్ల జైలు శిక్ష, అపరాధ రుసుము విధించవచ్చు. • నిపుణులకు, ప్రత్యేక అధ్యాపకులు, అనువాదకులు, వ్యాఖ్యాతలకు ఉండాల్సిన అనుభవం, అర్హతలను పొందుపరిచారు. అలాగే బాలల అత్యవసర వైద్య చికిత్స, ఆదరణ, రక్షణకు కావాల్సిన ఏర్పాట్ల గురించి, లైంగిక దాడి బాధితులైన పిల్లలకు కు ఇచ్చే నష్టపరిహారం పొందుపరిచారు. • సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉన్న మహిళా పోలీసు అధికారి, బాధిత పిల్లలు తెలిపే విషయాలను, ప్రామాణిక న్యాయసాక్ష్యంలాగా లిఖితపూర్వకంగా భద్రపరుస్తారు. పిల్లలను పోలీసు స్టేషన్లో రాత్రి వేళల్లో ఏ కారణంగానూ ఉంచరాదు. పిల్లల నుంచి విషయాలను లిఖిత పూర్వకంగా సేకరించేటప్పుడు పోలీసు అధికారి యూనిఫాంలో ఉండరాదు. పిల్లలు ఏ మాటలతో విషయాన్ని వివరిస్తారో, అదే రీతిలో దానిని రికార్డు చేయాలి. • పిల్లల అవసరం మేరకు చెప్పిన మాటలను అనువదించడానికి సహకారం కల్పించాలి. ఒకవేళ పిల్లలు వికలాంగులై అశక్తతకు గురైనవారైతే, వారికి ప్రత్యేక శిక్షకులు, లేదా వారిని అర్థం చేసుకునేలా చెప్పేవారి సహకారాన్ని తీసుకోవాలి. • వైద్య పరిశీలన/విచారణ సమయంలో పిల్లల తల్లి/తండ్రి కానీ, వారికి నమ్మకం కలిగిన వ్యక్తి సమక్షంలో జరపాలి. బాలిక పరిశీలన/విచారణ మహిళా డాక్టర్లు చేయాలి. • విచారణ, పరిశోధన, సాక్షి రికార్డింగ్, నేరాలను నిషేధించేటప్పుడు బాలల స్నేహ పద్ధతులను ఈ చట్టం, నిబంధనలను అందిస్తుంది. న్యాయవిచారణ జరిగే సమయంలో బాలలకు తరచూ విరామం కలిగించాలి. పిల్లలను విచారణ జరిపేటప్పుడు, మళ్లీ మళ్లీ సాక్ష్యమివ్వడానికి పిలవరాదు. పిల్లల విచారణ అనేది దాడి చేసే మాదిరిగా ఉండరాదు. వారి ప్రతిష్టకు అవమానం కలిగించేటట్లు ఉండరాదు. విచారణ అందరి సమక్షంలో కాకుండా గోప్యంగా జరపాలి. • పలు అంశాలు (బాధితురాలు గర్భవతి అయితే, లైంగిక వ్యాధులు ప్రబలితే వైద్య చికిత్సకు అవసరమైన డబ్బును బట్టి మొదలగునవి) పరిగణలోకి తీసుకుని ప్రత్యేక కోర్టు విచారణ త్వరగా జరపాలనే ఉద్దేశ్యంతో బాలల విచారణ, విషయాలను భద్రపరిచే చర్యను 30 రోజలలోపు చేయాలి. ప్రత్యేక కోర్టు న్యాయ విచారణ ఏడాదిలోపు పూర్తి చేయాలి. • ఫిర్యాదు అందిన తక్షణమే ప్రత్యేక బాలల పోలీసు బృందం (ఎన్.జె.పి.యు) రంగంలో దిగి బాధితుల సహాయం, పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. పిల్లలకు ఆదరణ, రక్షణ కల్పించే షెల్టర్ హోం కానీ, అస్పత్రికి కానీ తరలించాలి. ఫిర్యాదు వచ్చిన తరువాత స్థానిక పోలీసు లేదా ఏస్జేపీయూ ‘బాలల సంక్షేమ సమితి’ ఎదుట 24 గంటలలోపు నివేదికను ప్రవేశపెట్టాలి. • ఈ చట్టం, నిబంధనల సదుపాయాలను జాతీయ లేదా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్లు పర్యవేక్షణ చేస్తాయి. పిల్లలు సురక్షితంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అన్ని అసమానతల నుంచి వారిని కాపాడాలని అనుకుంటారు. రోజు వారి పనుల్లో భాగంగా చాలా మంది వ్యక్తులతో పిల్లలు సంప్రదిస్తుంటారు. ఇలాంటి వారిలో మంచి వారు, చెడ్డ వారు ఉంటారు. వారిలో ఉన్న నైజాన్ని పిల్లలు పసిగట్టగలగాలి. తద్వారా వారు ఏదైనా విచిత్రమైన పరిస్థితి లేదా వ్యక్తి తారసపడితే ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దాలి. అది తల్లిదండ్రుల బాధ్యత. ఇందులో భాగంగానే పిల్లలకు మంచి స్పర్శ.. చెడు స్పర్శ గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. రండి, పిల్లలు సురక్షితమైన వాతావరణంలో పెరిగేందుకు చేతులు కలపండి. మంచి, చెడు స్పర్శల గురించి పిల్లలకు నేర్పండి. – సాక్షి, అనంతపురం తల్లిదండ్రులు దేని కోసం చూడాలి? పిల్లలను పెంచేటప్పుడు అప్రమత్తత అవసరం. పిల్లల చుట్టూ ఉన్న అపరిచితులను గుడ్డిగా నమ్మరాదు. ఎదుటి వ్యక్తి వింత ప్రవర్తనను పసిగట్టగలగాలి. పిల్లలు బాధపడుతున్న విషయాన్ని అర్థం చేసుకోగలగాలి. ప్రత్యేకించి దుర్మార్గమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి స్నేహితుడో, కుటుంబ సభ్యుడో, జీవిత భాగస్వామినో అయితే పిల్లల భద్రత, వారి ఆనందం పూర్తిగా మీపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. పిల్లలకు శరీరంలోని కొన్ని ప్రాంతాలు వారి సొంతమనే భావనను పెంపొందించాలి. వాటి సంరక్షణపై జాగ్రత్తలు వివరించాలి. చొరబాటుదారుల నుంచి వాటిని ఎలా రక్షించుకోవాలో చైతన్య పరచాలి. విందులు.. వినోదాలు అంటూ ఆహ్వానించే అపరిచితులకు ‘నో’ చెప్పమనే స్థాయికి వారిని ఎదగనివ్వాలి. శరీరంలోని వ్యక్తిగత ప్రాంతాలను తాకితే తమకు అందుబాటులో ఉన్న వారిని వెంటనే అప్రమత్తం చేయగలిగేలా తీర్చిదిద్దాలి. గట్టిగా అరవడమో.. లేదా తిరగబడి పోరాటం చేసేలా సిద్ధపరచాలి. ► మంచి స్పర్శ మరియు చెడు స్పర్శ గురించి పిల్లలకు అవగాహన కల్పించే చిట్కాలు లైంగిక విషయాలను పిల్లలకు తెలిసిన ఉదాహరణలతో వివరించండి. ► పిల్లలతో ముభావంగానో, టెక్నికల్గానో ఉండరాదు. ప్రశ్నించబడుతున్నట్లు వారు భావించేలా ఉండరాదు. తీవ్రమైన చర్చను వెంటనే కత్తిరించాలి. సున్నితమైన, ప్రశాంతమైన స్వరాన్ని ఉపయోగించండి. ► పిల్లలలకు తల్లిదండ్రులకు మధ్య నమ్మకమనే దృఢమైన బంధం ఉండాలి. ఏదైనా తప్పు చేసినప్పుడు ప్రేమతో దగ్గరకు తీసుకుని నచ్చచెప్పగలగాలి. మీరు వారి కోసం ఉన్నారని భావనను వారికి తెలియజేయాలి. ► చెడు స్పర్శ గురించి చాలా చిన్న పిల్లలకు బోధించేటప్పుడు పాటించాల్సిన సాధారణ నియమం ఇది. లోదుస్తులతో కప్పబడిన వారి శరీరంలోని ఏదైనా భాగాలు వారి ప్రైవేట్ ప్రాంతం అని వివరించండి, అది వారు తప్ప మరెవరూ తాకకూడదు, చూడకూడదు అనే విషయంపై పూర్తి అవగాహన కల్పించాలి. వారి శరీరాలపై ఎక్కడైనా తాకితే వారు అసౌకర్యంగా భావిస్తే మీకు తెలియజేయాలని పట్టుబట్టండి. ► మంచి స్పర్శ గొప్పగా అనిపిస్తుంది ఇది ఒక బంధం. చెడు స్పర్శ అసౌకర్యం, ఒత్తిడిని పెంచుతుంది. ► మంచి స్పర్శ, చెడు స్పర్శ గురించి పిల్లలకు నేర్పించేందుకు చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకాలు సాధారణంగా మానవ శరీర నిర్మాణ శాస్త్రం యొక్క చిత్ర ప్రాతినిధ్యాలతో ఉంటాయి. దాని నుంచి వారు వారి శరీరాల గురించి కూడా తెలుసుకోవచ్చు. ► పిల్లలు ప్రాథమిక వివరణ కంటే దృశ్యమాన కథనాలకు అనుకూలంగా ఉంటారు. మీరు వారితో చిన్న ఆటలను ఆడవచ్చు, అక్కడ వారు సహాయం కోసం అరవడం లేదా ఎవరైనా వారిని వేధిస్తుంటే ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధం చేయవచ్చు. ► ఎవరైనా మీ ప్రైవేట్ భాగాలను కారణం లేకుండా తాకినట్లయితే, ఎవరైనా మిమ్మల్ని తాకి, ఎవరికీ చెప్పవద్దని చెబితే , ఇవన్నీ చెడ్డ స్పర్శకు సంకేతాలు. ► పిల్లలతో ఎక్కువ సమయాన్ని వెచ్చించాలి. వారు పగటిపూట చేసిన పనిని వివరిస్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి. వారు మీతో ఏదైనా పంచుకోవచ్చుననే భరోసా ఇవ్వగలగాలి. మా పని ఇంకా పూర్తి కాలేదనో, గట్టిగా అరుస్తూ హెచ్చరికలు చేయడం సరికాదు. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడైనా ఎదుర్కొంటే ఏమి చేయాలో నేర్పించాలి. నిందితులను వదిలే ప్రసక్తే లేదు ఆడపిల్లలపై అత్యాచార యత్నాలు, అత్యాచారాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. క్రూరులను వదిలే ప్రసక్తే లేదు. ఆడపిల్లల తల్లిదండ్రులు ధైర్యంగా జీవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవు. అనంతపురంలో గురువారం జరిగిన ఘటన చాలా దారుణమైనది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిందితుడికి కఠిన శిక్ష పడేలా కృషి చేస్తా. – ఉషాశ్రీచరణ్, ఎమ్మెల్యే, కళ్యాణదుర్గం చావు తప్పదన్న భయం ఉండాలి ఇలాంటి కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు ఉండాలి. కొన్ని నెలలు జైలులో ఉండి బయటకు వస్తామనే భావన వారిలో ఏ మాత్రం రానివ్వరాదు. తప్పు చేస్తే మరణశిక్ష పడుతుందనే భయం ఉండాలి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక బాలికపై జరిగిన యాసిడ్ దాడి ఘటనలో నిందితులను ఎలా శిక్షించారో.. ఆ తరహా శిక్షలను ఇక్కడ కూడా అమలు చేయాలి. అనంతపురం ఘటనను ఖండిస్తున్నా. – జొన్నలగడ్డ పద్మావతి, ఎమ్మెల్యే, శింగనమల కఠిన చర్యలు తప్పవు బాలికల సంరక్షణ కోసం ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు అమలు చేస్తున్నాయి. లైం గిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ప్రస్తుతం మారిన చట్టం ప్రకారం ఉరి శిక్ష కూడా పడే అవకాశం ఉంది. జిల్లాలో బాలికల సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటాం. జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఘటనపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. – బూసారపు సత్యయేసుబాబు, ఎస్పీ మార్పు రావాలి మానవత్వానికి, మృగత్వానికి జరుగుతున్న సంఘర్షణ ఇది. మానవత్వాన్ని గెలిపించాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు మగ పిల్లలను పెంచే విధానంలో మార్పు రావాలి. ఆడపిల్లలను తనను తాను రక్షించుకునే విధంగా తయారు చేయాలి. చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సమాజం కూడా ఇలాంటి వారిని బహిష్కరించాలని కోరుతున్నా. – కె. చౌడేశ్వరి, అదనపు ఎస్పీ బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం అమ్మాయిల ర క్షణ కోసం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అ నేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ము ఖ్యంగా ఫోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తున్నాం. అయినా నేరాలు జరుగుతుండడం బాధాకరం. ప్రస్తుత బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం. ఇద్దరు పిల్లలకు బాలసదనంలో ఆశ్రయం కల్పించి వారి చదువుకు సహకరిస్తాం. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. – చిన్మయాదేవి, ప్రాజెక్టు డైరెక్టర్, ఐసీడీఎస్ దురదృష్టకరం భగవంతుడితో స మానమైన ప సిమొగ్గల్ని చిదిమేస్తున్న నరరూప రాక్షసుల్ని కఠినంగా శిక్షించాలి. చట్టాలు కఠినంగా ఉంటే ఇలాంటి ప రిస్థితులు పునరావృతం కావు. ఏదేమైనా పిల్లల భద్రత పరమైన అంశాల్లో తల్లిదండ్రుల్లో జాగ్రత్తతో ఉండడం మంచిది. విపరీత ప్రవర్తన గల వారికి ప్రత్యేకమైన కౌన్సెలింగ్ నిర్వహించే వ్యవస్థ ఉండాలి. – ప్రొఫెసర్ ప్రశాంతి, డైరెక్టర్ , జేఎన్టీయూఏ గల్ఫ్ చట్టాలు రావాలి గల్ఫ్ దేశాల్లో అమలు చేసే కఠిన చట్టాలు ఇక్కడ కూడా అమలు కావాలి. అప్పుడే నేర ప్రవృత్తి తగ్గే అవకాశం ఉం టుంది. నరరూప రాక్షసుల పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలి. పసిబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్బడే వారికి తక్షణమే శిక్ష పడేలా వ్యవస్థలో మార్పు రావాలి. – ప్రొఫెసర్ కృష్ణకుమారి, జియాగ్రఫీ, ఎస్కేయూ అనంతపురం ఒకరిని ఉరి తీయాలి చిన్నారిపై అఘాయిత్యం జరిగిందని ఊహించుకుంటుంటేనే ప్రాణం పోయినట్లైంది. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడిన ఒకరిని నడి రోడ్డులో ఉరి తీయాలి. అప్పుడే అంతా సెట్ అవుతారు. ఇలాంటి విషయాలు మళ్లీ జరగకుండా న్యాయస్థానాలు, ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి. ప్రజలే శిక్షించేలా అవకాశం కల్పించాలి. నడిరోడ్డుపై రాళ్లు, కట్టలతో కొట్టి చంపాలి. – మృదుల, నర్సింగ్ విద్యార్థిని, అనంతపురం ఉరిశిక్షే సరైంది తప్పులు బహిరంగంగా చేస్తూ..శిక్ష మాత్రం రహస్యంగా అనుభవిస్తున్నారు. దీని ద్వారా తప్పు మీద తప్పులు జరుగుతున్నాయి. చిన్నపిల్లలు, బాలికలు, అమ్మాయిలపై రోజు రోజుకూ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కొందరు నరరూప రాక్షసులు కూతుళ్లు, మనవరాళ్ల వయసున్న వారి పట్ల పాశవికంగా ప్రవరిస్తున్నారు. ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఉండాలంటే ఉరి శిక్షే సరైంది. బహిరంగంగా ఉరి తీయాలి. అప్పుడే ఇలాంటి వాటిని అరికట్టవచ్చు. – డాక్టర్ ఉషశ్రీనాగ్, హౌస్‌సర్జన్, సర్వజనాస్పత్రి, అనంతపురం -
వివాదాస్పదంగా మారిన ప్రియాంక ట్వీట్
లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లో శాంతి భద్రతల అంశంపై స్పందిస్తూ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. శనివారం ప్రియాంక ట్విటర్ వేదికగా స్పందిస్తూ..‘రాష్ట్రంలో నేరగాళ్లు ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. యూపీ ప్రభుత్వం నేరగాళ్లకు లొంగిపోయిందా అనే అంశాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను’ అంటూ ప్రియాంక ట్వీట్ చేశారు. యూపీలో మహిళల మీద వేధింపులు, అత్యాచారాలు, నేరాలు రోజూవారి దినచర్యలో భాగమని ప్రియాంక విమర్శించింది. ప్రజలు ఆటవిక రాజ్యంలో మగ్గిపోతున్నారని మండిపడింది. అయితే ప్రియాంక ట్వీట్‌పై యూపీ పోలీసులు వెంటనే స్పందించారు. నేరగాళ్ల మీద తీసుకున్న చర్యలకు సంబంధించిన డేటా ఆధారంగా ఆమెకు సమాధానమిస్తూ ట్వీట్ చేశారు. తీవ్రమైన నేరాలకు సంబంధించి ఈ రెండు సంవత్సరాల్లో 9,225 నేరగాళ్లను అరెస్టు చేశామని, 81 మందిని ఎన్కౌంటర్ చేశామని వెల్లడించారు. సంచలనం సృష్టించిన కేసులను కేవలం 48 గంటల్లోపే పరిష్కరించామన్నారు. దోపిడీ, హత్యలు, కిడ్నాపులు వంటి నేరాలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. రాష్ట్రంలో నేరాల రేటు 20-30 శాతం తగ్గిందని, పోలీసుల పహారా, నేరస్థుల పట్ల కఠిన చర్యల ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నామని పోలీసులు వెల్లడించారు. -
అతివలంటే అలుసా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై నేరాల సంఖ్యకు అడ్డుకట్ట పడడం లేదు. దేశ సగటును మించి రాష్ట్రంలో మహిళలపై నేరాలు జరుగుతుండడం గమనార్హం. దేశంలో ప్రతి లక్ష మంది మహిళల్లో 55 మందిపై నేరాలు జరుగుతుండగా, ఏపీలో మాత్రం ప్రతి లక్ష మంది మహిళల్లో 65 మందిపై అఘాయిత్యాలు, అరాచకాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో మహిళపై ప్రధానంగా అత్యాచారాలు, లైంగిక వేధింపులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బిహార్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల కంటే ఏపీలోనే మహిళలపై నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ చేదునిజం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలతో ‘నీతి ఆయోగ్’ నిర్వహించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సమీక్షలో వెల్లడైంది. ఏపీలో 65 శాతం మందికే వంట గ్యాస్ కనెక్షన్లు నాగాలాండ్‌లో అతి తక్కువగా ప్రతి లక్ష మంది మహిళల్లో పది మందిపైన నేరాలు జరుగుతున్నట్లు బహిర్గతమైంది. బిహార్‌లో ప్రతి లక్ష మంది మహిళల్లో 25 మందిపై నేరాలు చోటుచేసుకుంటున్నాయి. మేఘాలయ, ఉత్తరాఖండ్‌లో ప్రతి లక్షల మంది మహిళల్లో 30 మందిపై నేరాలు జరుగుతుండగా, జార్ఖండ్‌లో 35 మందిపై నేరాలు జరుగుతున్నట్లు నీతి ఆయోగ్ సుస్థిర అభివృద్థి లక్ష్యాల డాక్యుమెంట్లో వెల్లడించింది. వివిధ రంగాల్లో రాష్ట్రాలు ఏ స్థితిలో ఉన్నాయనే విషయాన్ని నీతి ఆయోగ్ వివరించింది. దీని ప్రకారం... గ్రామీణ ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా చూస్తే 70.91 శాతం మందికి రక్షిత మంచినీటి సౌకర్యం అందుబాటులో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో 65 శాతం మందికి మాత్రమే రక్షిత మంచినీటి సౌకర్యం ఉంది. మిగతా 35 శాతం జనాభాకు ఈ సౌకర్యం లేదు. గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో నూరు శాతం జనాభాకు రక్షిత మంచినీటి సౌకర్యం ఉంది. ఉత్తరప్రదేశ్‌లో 99 శాతం జనాభాకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 65 శాతం మందికే వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇంకా 35 శాతం మందికి వంట గ్యాస్ కనెక్షన్లకు దూరంగా ఉన్నారు. ఢిల్లీలో 100 శాతం మందికి, చండీగఢ్‌లో 95 శాతం మందికి వంట గ్యాస్ సౌకర్యం ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల చేరిక దేశవ్యాప్తంగా 87.3 శాతం ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇది 80 శాతంగా ఉంది. దేశంలో సబ్సిడీపై ఆహార ధాన్యాలు 59 శాతం మందికి అందుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో 55 శాతం మందికి అందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషుల్లో 645 మందికి పని లభిస్తోంది. ప్రతి 1,000 మంది మహిళల్లో 560 మందికి పని లభిస్తోంది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషుల్లో 450 మందికి, ప్రతి 1,000 మంది మహిళల్లో కేవలం 175 మందికే పని లభిస్తోంది. -
మహిళలపై దాడుల్లో టీడీపీ నేతలు...
సాక్షి, అమరావతి : మహిళలపై వేధింపుల కేసుల్లో తెలుగుదేశం పార్టీ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. అధికార పార్టీకి చెందిన ఐదుగురు నేతలు మహిళలపై వేధింపులు, అత్యాచారయత్నం కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వారిలో ఇద్దరు మంత్రులతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇందులో నలుగురు ఎమ్మెల్యేలు మహిళలపై వేధింపులకు పాల్పడినట్లుగా, మరో ఎమ్మెల్యే అత్యాచార యత్నం చేసినట్లుగా కేసులున్నాయని ఢిల్లీకి చెందిన ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్) అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేలు, ఎంపీల ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించి.. వారిలో మహిళలపై వేధింపులు, అత్యాచారయత్నం కేసులున్న వారి జాబితాను ఈ నెల 19న విడుదల చేసింది. ఏడీఆర్ వెల్లడించిన జాబితా ప్రకారం.. మహిళలను వేధించిన కేసుల్లో ఏపీ సీనియర్ మంత్రి, కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వర్రావు, మరో సీనియర్ మంత్రి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు, పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, విప్ చింతమనేని ప్రభాకర్, విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు. ఇక ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణపై అత్యాచారయత్నం కేసు ఉంది. ఆయనపై 376 ఐపీసీతో పాటు 506, 511, 379, 366, 324 సెక్షన్ల కింద మహిళలపై వేధింపుల ఆరోపణలు ఉన్నట్లు ఏడీఆర్ నివేదికలో పేర్కొంది. ఈ ఎమ్మెల్యేలపై మహిళా వేధింపుల కేసులే కాకుండా మరిన్ని పోలీసు కేసులు కూడా ఉన్నాయని తెలిపింది. అత్యంత వివాదాస్పదుడిగా పేరు ఉన్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై మహిళలపై నేరాలకు సంబంధించి మొత్తం 23 కేసులున్నాయి. ఇందులో తీవ్రమైన సెక్షన్ల కింద ఉన్న కేసులు 13 ఉన్నాయి. ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణపై 10 కేసులు, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిపై 4 కేసులున్నట్టు ఏడీఆర్ సంస్థ నిర్థారించింది. మహిళలకు సంబంధించిన కేసుల్లో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు పేర్లు కూడా ఉన్నాయి. మంత్రి దేవినేని ఉమాపై 13 కేసులు, అచ్చెన్నాయుడిపై రెండు కేసులున్నట్టు ఆ సంస్థ తన నివేదిక తేల్చింది. కాగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటూ జీవోలు జారీచేసింది. హత్యలు, దోపిడీ కేసులు, మహిళలపై వేధింపులకు పాల్పడ్డ కేసులు, ప్రభుత్వ అధికారులపై దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడిన ఘటనలకు సంబంధించిన అనేక కేసులు ఈ ఉపసంహరణ జాబితాలో ఉన్నాయి. వాటిల్లో ఎమ్మెల్యేలపై కేసులు కూడా ఉన్నాయా అన్న సందేహం తలెత్తుతోంది. ప్రజాప్రతినిధులై ఉండి.. తప్పుడు చేష్టలకు పాల్పడినవారిపై కేసులను ఎత్తివేయడం దారుణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఏపీలో మహిళలపై దౌర్జన్యాలు,దాష్టీకాలు
-
ఆ.. తండ్రీకూతుళ్లు.. మానవత్వానికి మచ్చ
సాక్షి, యమునా నగర్ : మానవత్వానికి, విలువలకు మచ్చ తెచ్చేలా హర్యానాలోని తండ్రీకూతుళ్లు ప్రవర్తించారు. కుటుంబ విలువలు, బంధాల పతనానికి పరాకాష్టకు సాక్ష్యంలా వాళ్లు నిలిచారు. స్థానిక యమునా నగర్లో ఉంటున్న తండ్రీకూతుళ్ల వికృతత్వం తాజాగా బయటపడింది. ఆడ స్నేహితులను కుమార్తె ఇంటికి తీసుకురాగా తండ్రి వారిపై అత్యాచారం చేసేవాడు. ఈ ఘటననంతా కుమార్తె దగ్గరుండీ వీడియో తీసి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడం వారికి పరిపాటిగా మారింది. హర్యానా పోలీసు విచారణలో దిమ్మ తిరిగే నిజాలు వెలుగు చూశాయి. కుమార్తె.. బాగా డబ్బున్న వారితోనూ, అందంగా ఉండే పేద మహిళలతోనే స్నేహాలు చేస్తుండేది. వారికి బాగా నమ్మకం కుదిరాకా.. ఇంటికి ఆహ్వానించేది. ఇంట్లో కాఫీ, టీ, కూల్ డ్రిక్స్‌లో మత్తు మందు కలిపి వారికి ఇచ్చేవారు. తరువాత తండ్రి సీన్లోకి ఎంటరయి.. వారిపై అత్యాచారానికి దిగేవాడు. ఈ మొత్తం వ్యవహరాన్ని కుమార్తె దగ్గరుండి మరీ వీడియో తీసేది. తరువాత వీడియోను అడ్డం పెట్టుకుని వారిన డబ్బుకోసం బ్లాక్మెయిల్ చేసేవారు. ఇక్కడ మరో దారుణ విషయం ఏమిటంటే అందంగా ఉండే పేద మహిళలను బలవంతంగా వ్యభిరాకూపంలోకి దించారు. వారు వ్యభిచారం చేసి సంపాదించే మొత్తంలో వీరికి కూడా వాటా ఇవ్వాలని డిమాండ్ చేసేవారు. డబ్బులు ఇవ్వకపోతే.. వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించేవారు. తండ్రీకూతుళ్ల ఉచ్చులో పడి.. అత్యాచారానికి గురయిన మహిళ ధైర్యంగా యమునానగర్ పోలీసులను ఆశ్రయించడంతో వీరి బాగోతం బయటపడింది. సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తండ్రీకూతుళ్లపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. బాధిత మహిళ మాట్లాడుతూ.. నన్ను కూడా రూప10 వేలు డిమాండ్ చేస్తే.. ఇచ్చానని చెప్పారు. మళ్లీమళ్లీ డబ్బుల కోసం డిమాండ్ చేస్తుండడంతో.. పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె చెప్పారు. -
యువతిని తుపాకీతో బెదిరించి.. బిహార్ లో దారుణం!
పట్నా: బిహార్ లో మరో దారుణం చోటుచేసుకుంది. 21 ఏళ్ల యువతిని తుపాకీ బెదిరించి దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యంత కిరాతకంగా ఆమె ప్రైవేటు అంగాల్లో పిస్టోల్, చెక్కముక్కలను దూర్చారు. ఈ దారుణంలో తీవ్రంగా గాయపడిన బాధితురాలి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మోతిహరి జిల్లాలో గురువారం ఈ దారుణం జరిగింది. ప్రధాన నిందితుడు సమీవుల్లా గతంలో బాధితురాలిపై అత్యాచారం జరిపి.. ఆ ఘటనను వీడియో తీశాడు. ఆ వీడియోను చూపించి ఆమెను బ్లాక్ మెయిల్ చేసేందుకు అతడు ప్రయత్నించాడు. దీంతో అతనిపై బ్లేడుతో బాధితురాలు దాడి చేసింది. దీంతో ఆగ్రహించిన నిందితుడు ఆమెపై కిరాతకంగా అత్యాచారం జరిపాడు. ‘అతడు నన్ను కొట్టి అత్యాచారం జరిపాడు. ఆ తర్వాత అతని కుటుంబసభ్యులు కూడా నాపై లైంగిక దాడి చేశారు’ అని బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని, తాము పేదవాళ్లం కావడంతో కేసు వాపసు తీసుకోవాలని నిందితుడి కుటుంబసభ్యులు ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలి తండ్రి తెలిపాడు. -
ఏ తండ్రి చేయకూడని పని చేశాడు!
కనురెప్పే కనుపాపను కాటేసినరీతిలో ఓ తండ్రి దుర్మార్గానికి పాల్పడ్డాడు. 13 ఏళ్ల తన కూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా గుర్తుతెలియని వారితోనూ బాలికపై అత్యాచారం చేయించి.. ఆ దుర్మార్గాన్ని స్వయంగా వీక్షించాడు. కన్నబిడ్డపై కనీవినీ ఎరుగని ఉన్మాదానికి పాల్పడిన ఆ కామాంధుడికి ఆస్ట్రేలియా కోర్టు ఇరవై రెండున్నరేళ్ల జైలుశిక్ష విధించింది. బిడ్డపై అత్యాచారం చేయడమే కాకుండా ఇతరులతోనూ లైంగిక దాడులు చేయించి.. వీడియో తీయించిన ఆ కిరాతకుడు ఇలా చేయడం తనకు వినోదాన్ని పంచిందంటూ పోలీసుల విచారణలో తన వికృతస్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు. పోలీసుల విచారణలో ఆ నీచుడు తనపై పోలీసులు మోపిన 61 అభియోగాలను ఒప్పుకున్నాడు. 2013-15 మధ్యకాలంలో 11 నుంచి 13 ఏళ్ల మధ్య వయస్సున్న తన కూతురిపై ఈ వికృతానికి పాల్పడినట్టు అంగీకరించాడు. బాధితురాలి పేరు రహస్యంగా ఉంచే ఉద్దేశంతో నిందితుడి పేరును పోలీసులు వెల్లడించలేదు. ఈ కేసును విచారించిన పెర్త్ లోని వెస్ట్ ఆస్ట్రేలియన్ జిల్లా కోర్టు.. 42 ఏళ్ల నిందితుడితోపాటు.. బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆరుగురు వ్యక్తులకు శిక్ష విధించింది. ఆన్లైన్ లో పరిచయమైన ఆరుగురు వ్యక్తులతో అతడు బాలికపై లైంగిక దాడులు చేయించి.. ఆ దుర్మార్గాన్ని వీడియోలో చిత్రించాడు. తల్లిదండ్రులు వేరవ్వడంతో బాలిక తండ్రి వద్ద ఉండిపోయింది. ఆమె సంరక్షణ చూసుకోవాల్సిన తండ్రి కంచే చేను మేసినట్టు ఇంతటి దుర్మార్గానికి పాల్పడ్డాడని జడ్జి పేర్కొన్నారు. తండ్రితో ఆన్ లైన్ లో పరిచయం చేసుకొని బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన కామాంధుల్లో ఓ చర్చి పాస్టర్ కూడా ఉన్నాడు. అతనికి కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించింది. -
రేపిస్టులను కాల్చివేసేందుకు వెనుకాడను!
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ రేపిస్టుల విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం అనుమతిస్తే మహిళలపై నేరాలకు ఒడిగట్టే వారిని సంఘటన స్థలంలోనే కాల్చిపారేస్తామని, ఈ విషయంలో పోలీసులు ఏమాత్రం సంకోచించరని ఆయన పేర్కొన్నారు. అయితే, మన రాజ్యాంగం అలాంటి వాటిని అనుమతించదని, అందుకే పోలీసులు ప్రతి వ్యక్తి మానవహక్కులను గౌరవిస్తూ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నారని వెంటనే ఆయన వివరణ ఇచ్చారు. 'భారత రాజ్యాంగం అనుమతించి ఉంటే ఢిల్లీ పోలీసులు సంఘటన స్థలంలోనే మహిళలపై నేరాలకు పాల్పడిన వారిని కాల్చివేయడమో, ఉరి తీయడమో చేసేవారు. అయినప్పటికీ మేం మానవహక్కులకు కట్టుబడి ఉన్నాం. వాటిని గౌరవిస్తాం' అని బస్సీ చెప్పారు. దేశ రాజధానిలో మహిళలపై జరుగుతున్న నేరాలకు కారణం లింగ నిష్పత్తిలో భారీ అగాథం ఉండటమే. ప్రస్తుతం వెయ్యి మంది పురుషులకు 600 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. మరోవైపు కొందరు మగవాళ్లు మహిళలను తమ తల్లిగానో, చెల్లిగానో, కూతురిగానో, భార్యగానో చూడకుండా కేవలం సరుకుగా భావిస్తున్నారు. అందువల్లే 21 ఏళ్ల యువకుడు 80 ఏళ్ల మహిళ లేదా ఐదేళ్ల బాలిక మీద అత్యాచారానికి పాల్పడుతున్నాడు' అని బస్సీ పేర్కొన్నాడు. మహిళల భద్రతకు ఢిల్లీ పోలీసులు శాయశక్తుల కృషి చేస్తున్నారన్న బస్సీ.. అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ పై పరోక్ష విమర్శలు చేశారు. పోలీసులు కేజ్రీవాల్ సర్కార్ పరిధిలో లేకపోవడం తమ అదృష్టమని చెప్పారు. కేజ్రీవాల్ ప్రభుత్వం అధీనంలో ఉండి ఉంటే ఆయన 'స్థానిక ప్రయోజనాల' కారణంగా తమపై రాజకీయ ఒత్తిడి ఉండేదని, ప్రధానమంత్రి, హోంమంత్రికి అలాంటి ఉద్దేశం లేకపోవడం వల్ల తాము స్వేచ్ఛగా పనిచేస్తున్నామని బస్సీ అన్నారు. -
ఆ బాలికకు నాలుగు రోజులు నరకం చూపించారు
న్యూఢిల్లీ: కరువుతోనో.. కడుపుమాడ్చుకుంటూనో తనమానానతాను తల్లిదండ్రులతో ఉంటున్న ఓ బాలిక జీవితం ఊహించని విధంగా అంధకార కూపంలో పడిపోయింది. వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న వ్యక్తి ఆ బాలిక కుటుంబాన్ని నమ్మించాడు. ఆమెకు పని ఇప్పిస్తానని చెప్పి ఏకంగా పశ్చిమబెంగాల్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చాడు. అక్కడ కరోల్ బాగ్ అనే ప్రాంతంలోని ఓ నివాసంలో పెట్టాడు. అప్పటికే కరోల్ బాగ్ ఆ చుట్టుపక్కల వ్యభిచార రాకెట్ హవా నడుస్తోంది. అమాయకురాలైన ఆ బాలికకు తను ఎక్కడికి వచ్చానో కూడా తెలియదు. ఇంట్లో బంధించిన ఆ దుర్మార్గుడు ఆ బాలికకు పోర్న్ వీడియోలు చూపించి అత్యాచారం చేశాడు. కొట్టి పొట్టి దుస్తులు వేయించి వాహనాల్లో ఆయా ప్రాంతాలకు వ్యభిచారం చేయించడం కోసం తిప్పాడు. నాలుగు రోజులపాటు రోజుకు 15 మంది నుంచి 20మంది వరకు ఆ బాలికతో బలవంతపు వ్యభిచారం చేయించాడు. ఆ పనికి ఆ బాలిక తిరస్కరించడంతో దారుణంగా చిత్రహింసలు పెట్టారు. బెల్టులతో కొట్టారు. బలవంతంగా మత్తుపానీయాలు, సిగరెట్లు తాగించారు. ఏవో మాత్రలు మింగించారు. నాలుగు రోజుల్లోనే నరకం అంటే ఎలా ఉంటుందో ఆ బాలికకు చూపించి రాక్షసులు మనుషుల్లోనే ఉన్నారు మరెక్కడో లేరో అనేలా చేశారు. చివరికి అప్పటికే ఎప్పటి నుంచో కరోల్ బాగ్ అనే ప్రాంతం పోలీసులకు సమస్యగా మారడంతోపాటు అపస్మారక స్థితిలో ఉన్న ఆ బాలికను గుర్తించిన ఓ మహిళ ఆ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో ఢిల్లీ పోలీసులు పంజా విసిరారు. వరుస రైడింగ్ లు చేసి చివరకు వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు. ఈ క్రమంలో పలువురు పారిపోగా ఒకరిని మాత్రం అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసుల పర్యవేక్షణలో ఆమెకు ఢిల్లీలో వైద్య చికిత్స అందుతోంది. -
'యాసిడ్ బాధితులకు ఉచితంగా చికిత్స చేయండి'
న్యూఢిల్లీ: ఆమ్ల(యాసిడ్) దాడులకు గురైన బాధితులకు నష్టపరిహారం, పునరావాసం కల్పించడంతోపాటు ఉచిత వైద్యం కూడా చేయించాలని భారత ఉన్నత న్యాయస్థానం సోమవారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. గతంలో యాసిడ్ ఘటనలపై సీరియస్‌గా స్పందించిన సుప్రీంకోర్టు దానికి కొనసాగింపుగా నేడు తాజాగా మరోసారి గుర్తుచేసింది. బిహార్ కు చెందిన ఓ యాసిడ్ బాధితురాలి కేసు జస్టిస్ ఎంవై ఇక్బాల్, జస్టిస్ సీ నాగప్పన్‌తో కూడిన ధర్మాసనం ఈ సూచనలు చేసింది. యాసిడ్ దాడికి గురైన తనకు ఎవరూ అండగా నిలవలేదని, వైద్యం కూడా చేయించుకోలేని పరిస్థితుల్లో తాను ఉన్నానంటూ బిహార్ చెందిన ఓ బాధితురాలు సుప్రీంకోర్టు మెట్లెక్కగా కోర్టు ఆమెకు అండగా నిలిచింది. బిహార్ ప్రభుత్వం వెంటనే ఆమెకు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించడమే కాకుండా పునరావాసం కల్పించి ఉచిత వైద్యం అందించాలని ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రులకు కూడా ఇలాంటి కేసుల విషయంలో సీరియస్‌గా వేగంగా స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయాలని కూడా కోర్టు పేర్కొంది. -
ఆమె పొలిటికల్ మైలేజ్ కోసమే..
న్యూఢిల్లీ: తనకు రాజకీయ ప్రయోజనం లభిస్తుందనే ఉద్దేశంతోనే ఆ అమ్మాయి తనపై అనవసరంగా ఫిర్యాదు చేసిందని ఢిల్లీలో ఓ యువతిపై వేధింపులకు పాల్పడి అరెస్టయిన సన్నీ అనే యువకుడు ఆరోపించాడు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ యువతిపట్ల వెకిలి చేష్టలు ప్రవర్తిస్తూ, అసభ్య పదజాలంతో దూషించిన విషయం తెలిసిందే. అతడి ఫొటోను తీసి ఆమె ట్విట్టర్లో పెట్టి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయగా సోమవారం సాయంత్రం అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ వెంటనే అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో ఓ మీడియా అతడిని సంప్రదించగా ఆ యువతి ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారు అని, తన రాజకీయ భవిష్యత్ కోసం తనపై లేనిపోని ఆరోపణలు చేసి కేసు పెట్టిందని ఆరోపించాడు. మరోపక్క, ఆమెకున్న రాజకీయ అవకాశాలను ఆ యువతి తప్పుగా ఉపయోగించుకుంటోందని నిందితుడి తల్లి ఆరోపించింది. -
'కంప్లెయింట్ ఇచ్చి చూడు.. తర్వాత తెలుస్తుంది'
న్యూఢిల్లీ: ఢిల్లీలో మహిళలపై ఆగడాలు ఎక్కువవుతున్నాయి. దినదినం అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అందుకు ఒక ప్రదేశమంటూ మినహాయింపు లేని పరిస్థితి నెలకొంది. ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తి మహిళపట్ల అసభ్యంగా వ్యవహరించాడు. ఆమెను వేధింపులకు గురిచేయడమే కాకుండా అనకూడని మాటలు అన్నాడు. ఆ వ్యక్తిని ఫొటో తీసేందుకు ఆమహిళ ప్రవర్తిస్తుండగా ఫొటో తీస్కోని నీ దిక్కున్న చోట చెప్పుకోపో అన్నంతగా హెచ్చరించాడు. దీంతో అతడిని తన ఫోన్లో ఫొటో తీసిన ఆ మహిళ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. 'రాత్రి 8.30గంటల ప్రాంతంలో నేను తిలక్ నగర్ ప్రాంతంలో రోడ్డు దాటేందుకు సిద్ధమయ్యాను. రెడ్ సిగ్నల్ పడినప్పటికీ అతడు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. భయ్యా రెడ్ సిగ్నల్ పడింది కదా ఆగొచ్చు కదా అని ఆమహిళ సూచించగా నాతో రా నేను నిన్ను జనక్ పురి వద్ద డ్రాప్ చేస్తాను అని అన్నాడు. ఫొటో తీస్కో.. కంప్లెయిట్ ఇచ్చి చూడు.. మరోసారి కలిసినప్పుడు ఏమవుతుందో తెలుస్తుంది అంటూ హెచ్చరించాడు' అని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన పేర్కొంది. వేధింపులకు దిగిన ఓ వ్యక్తి ముందు ధైర్యంగా నిల్చుని అతడి ఫొటోని తీస్కోని ఫిర్యాదు చేయడం పట్ల పోలీస్ కమిషనర్ ఆమెను కొనియాడారు. వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు. -
టీజింగ్ అడ్డుకుందని 35సార్లు పొడిచారు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. ఈవ్ టీజింగ్‌ను అడ్డుకున్న ఓ యువతిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. దాదాపు 35 సార్లు ఆమెను కత్తితో పొడిచి ప్రాణాలు తీశారు. ఢిల్లీలోని ఆనంద్ పర్బాత్ ఏరియాలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గత కొంతకాలంగా ఓ ఇద్దరు సోదరులు పందోమ్మిదేళ్ల యువతిని ర్యాగింగ్ చేస్తూ వచ్చారు. ఆమె ప్రతిఘటించిన ప్రతిసారి అసభ్యకరంగా ప్రవర్తించారు. కాగా, గురువారం సాయంత్రం మార్కెట్‌కు వెళ్లిన యువతిని ఫాలో అయిన ఆ ఇద్దరు ముందు టార్చర్ పెట్టే ప్రయత్నం చేశారు. ఆమె వారి నుంచి తప్పించుకోని కొంచెం ముందుకు పరుగెత్తగా వెంటపడి మరీ బందించి మొత్తం 35 సార్లుకుపైగా కసాయివారిలా మారిపోయి కత్తితో పొడిచేశారు. దీంతో ఆ బాలిక అపస్మారక స్థితిలోకి పోయింది. అయినప్పటికీ వారు విడిచిపెట్టకుండా మరోసారి హింసించేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని అక్కడి ప్రత్యక్ష సాక్షులే తెలిపారు. గతంలో ఆ యువతి వారిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. కానీ, పోలీసులు ఆ ఫిర్యాదును పట్టించుకోలేదని, పెడచెవిన పెట్టడం వల్లే తమ బిడ్డ బలైందని తల్లిదండ్రులు, బంధువులు రోధిస్తున్నారు. నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేశారు.