ప్రతీకాత్మక చిత్రం
లక్నో: దేశంలో మహిళలు, యువతులపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై దాడులను ఎదుర్కొనేందుకు ఎన్ని చట్టాలను అమలు చేస్తున్నా కొందరు మానవ మృగాలు మాత్రం మారడంలేదు. పోలీసుల నిఘా ఉన్నప్పటికీ దేశంలో ప్రతీ రోజు ఏదో ఒక చోట మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. యూపీలోని ఆగ్రా జిల్లాలో ఆదివారం సాయంత్రం ఓ కాలేజీ విద్యార్థిని ఆటోలో ఇంటికి తిరిగి వస్తోంది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ ఆమెపై కన్నేశాడు. వెంటనే తన స్నేహితులకు సమాచారం అందించాడు. దీంతో మరో ఇద్దరు అతడితో కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా, ముగ్గురు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడి చేయడమే కాకుండా.. బాధితురాలిని దారుణంగా కొట్టి.. అత్యాచారానికి సంబంధించిన వీడియోను రికార్డు చేశారు. ఈ విషయం బయటకు చెబితే వీడియోను బయటకు రిలీజ్ చేస్తామని బెదిరించినట్టు ఆమె తెలిపింది.
వారి బారి నుండి బయట పడిన బాధితురాలు ఎత్మాద్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను భూరా యాదవ్, యశ్‌పాల్‌గా గుర్తించి వారిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని త్వరలోనే అతడిని కూడా అరెస్ట్ చేస్తామని ఎస్పీ సత్యజిత్ గుప్తా పేర్కొన్నారు. కాగా నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment