College student
-
చదివే చోటు సరిగ్గా ఉందా?
వంట గది చప్పుళ్లు... టీవీ సౌండు... తల్లిదండ్రుల కబుర్లు, వాదనలు,... చిన్న తమ్ముడో, చెల్లెలో మధ్యలో దూరి ఆటలు... ‘మంచి మార్కులు తేవాలి’ అంటారు గాని చదివేందుకు మంచి చోటును చూపిస్తున్నారా? సంక్రాంతి దాటితే పిల్లలందరూ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలి.ఇంట్లో మీ పిల్లలు చదివే చోటును చూడండి.వారు శ్రద్ధగా చదువుకునేలా ఆ చోటును ఎలా ఏర్పాటు చేయాలో నిపుణుల మాట వినండి.ఇల్లు సర్దుకుంటే ఇల్లు ఎంత విశాలమో అర్థమవుతుంది. చిన్న ఇల్లయినా పెద్ద ఇల్లయినా సర్దుకోవడంలోనే స్థలం బయట పడుతుంది. ముంబై వాసులు అతి చిన్న ఇంటిలో కూడా అన్నీ అందంగా అమర్చుకుంటారు. కాని మనకు ఎంత విశాలమైన ఇల్లు ఉన్నా అవసరం లేని సామాను, వాడని సామాను, పారేయని సామాను ఉంచుకుని పిల్లల చదువుకు, పుస్తకాలు పెట్టుకోవడానికి కూడా స్థలం లేనట్టుగా తయారు చేస్తాం. మళ్లీ వాళ్లు బాగా చదవాలని డిమాండ్ చేస్తాం. శుభ్రమైన చోటు చదువు తలకెక్కే చోటు అలాంటి చోటును మీ ఇంట్లో మీ పిల్లలకు చదువు కోసం కేటాయిస్తున్నారా?అబ్రహం లింకన్ వీధి దీపాల కింద చదివాడు. ఎనభైల నాటి పిల్లలు డాబాల మీద లైట్లు లాగి చదివారు. కాని ఇప్పటి పిల్లలు అలా చదవడం లేదు. ఇంటిలోనే నిశ్శబ్దంగా చదువుకోవడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇంట్లో వాళ్లకు యోగ్యమైన చోటును ఏర్పాటు చేయాలి. కామన్ ఏరియాకు సంబంధం లేకుండా ఎవరైనా ఇంటికి వచ్చి వెళుతున్నా కన్ను పడని చోటు ఇంటిలో చదువుకునే పిల్లలకు ఇవ్వాలి. ఆ చోటును పూర్తిగా శుభ్రంగా ఉంచాలి. పిల్లలు కంప్యూటర్లో ప్రశ్నాపత్రాలు చూసి చదువుకుంటున్నారు. వారికి డెస్క్‌టాప్ లేదా లాప్టాప్ ఏర్పాటు చేయలేకపోతే కనీసం ఫోన్లో అన్నా తగినంత డేటా వేయించి ఇవ్వాలి.పిల్లలు చదివి అలసి పడుకోవాలంటే ఆ దాపునే బెడ్ ఉంటే మరీ మేలు. అది వాలగానే నిద్రపోయేలా తప్పక శుభ్రంగా సౌకర్యంగా ఉండాలి. కష్టపడి చదివి నిద్ర పట్టక ఇబ్బంది పడితే చదివింది నిద్ర లేమి వల్ల వృధా అవుతుంది.పిల్లలు చదువుతున్నప్పుడు వారి మానసిక ఆరోగ్యం బాగుండాలి. ఇంట్లో తగాదాలు పూర్తిగా బంద్ చేయాలి. తల్లిదండ్రులు మంచి మూడ్‌లో కనిపిస్తూ పిల్లలతో స్నేహంగా మాట్లాడాలి. వారికి ఇష్టమైన పదార్థాలు అందుబాటులో ఉంచాలి. బయట తిండి కాకుండా ఇంటి తిండి ఇవ్వాలి.∙పిల్లలు చదువుకునే సమయంలో దగ్గర కూచుని అప్పుడప్పుడు పలకరిస్తూ ఏదో ఒక పుస్తకం చదువుకుంటూ ఉంటే వాళ్లూ ఆ ప్రెజెన్స్ ఇష్టపడతారు. అయితే రోజూ నువ్వు 99 పర్సెంట్ తేవాలి... టాపర్‌గా నిలవాలి అనే మాటలు ఎత్తి స్ట్రెస్ క్రియేట్ చేయకూడదు. న్యాయంగా ఎంత కష్టపడాలో అంత కష్టపడమని మాత్రమే చెప్పాలి.∙గంటకోసారన్నా చదివే చోట నుంచి లేచి కాస్త అటూ ఇటూ నడిచేలాగా, నీరు తాగేలా, బాల్కనీలోనో కారిడార్లోనో కాస్త గాలి పీల్చేలా చూడాలి.∙ -
బీకామ్ బ్యాచ్.. పెద్ద సందడి..
అమలాపురం రూరల్: అసలే పెద్ద పండగ. వారంతా పూర్వ విద్యార్థులు. 28 ఏళ్ల తరువాత కలుసుకున్నారు. ఇంతకన్నా పెద్ద సందర్భం ఏముంటుంది వారి అల్లరికి? 1993–96 అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాల బీకాం బ్యాచ్ వారంతా. చదివింది బీకాం అయినా కామ్‌గా ఉండే బ్యాచ్ కాదది. అటువంటి వారంతా ఆదివారం ఆ కళాశాలలో సమావేశమయ్యారు. కలసిన సమయం అంతా నాటి అల్లర్లలోకి, సరదా కబుర్లలో మునిగి తేలిపోయారు. హైదరాబాద్ జీ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ప్రసాద్ ఈ బ్యాచ్‌లో సభ్యుడే. వారికి తోడు సినీ హీరో నాగార్జున వీడియో ద్వారా తన సందేశాన్ని విద్యార్థులకు పంపుతూ వారి కలయికను అభినందిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మా నిమ్మకాయల ప్రసాద్ కూడా అక్కడే ఉన్నారని నాగార్జున ఆ వీడియోలో ప్రస్తావించారు. దాదాపు 120 మందితో కూడి ఆ బ్యాచ్ కుటుంబ సమేతంగా ఎంతో సందడి చేశారు. వారికి పాఠాలు చెప్పిన అప్పటి అధ్యాపకులు డాక్టర్ పైడిపాల, కనకరాజు, వక్కలంక కృష్ణమోహన్ తదితరులను సాదరంగా ఆహ్వానించి పాదాభివందనాలు చేసి సన్మానించారు. పూర్వపు విద్యార్థులు మున్సిపల్ కౌన్సిలర్ గొవ్వాల రాజేష్, పిండి శేషు, నల్లా శ్రీధర్, సాపే శ్రీనివాస్ (హైదరాబాద్), కుమారి (గుజరాత్), చొల్లంగి సుబ్బిరామ్ తదితరులు పూర్వపు విద్యార్థులను సమీకరించి ఈ వేడుకకు ఏర్పాటుచేశారు. చివరగా తమ జ్ఞాపకాలను వారు పదిలం చేసుకుంటూ గ్రూప్ ఫోటో దిగారు. -
హాజరుకూ మార్కులు!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ విద్యార్థులను కళాశాలకు రప్పించే విధానానికి ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టబోతోంది. సమగ్ర నిరంతర మూల్యాంకన విధానంలో భాగంగా వారి హాజరుకూ మార్కులివ్వనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పోస్టు–గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఈ ఏడాది దీన్ని ప్రయోగాత్మకంగా చేపట్టగా, మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలోనే డిగ్రీ స్థాయిలోనూ దీన్ని అమలులోకి తేవాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించారు. అకడమిక్ మార్కులే కాకుండా, వాస్తవ ప్రతిభను వెలికి తీయడం దీని ముఖ్యోద్దేశమని మండలి అధికారులు చెబుతున్నారు. మూల్యాంకన విధానంపై అధ్యయనానంతరం ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ)చేసిన సిఫారసులకు విశ్వవిద్యాలయాల వీసీలూ ఆమోదం తెలిపారు. ఐఎస్బీ అభిప్రాయ సేకరణ అధ్యయనంలో భాగంగా ఐఎస్బీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. 258 కాలేజీల అధ్యాపకుల మనోగతాన్ని పరిశీలించింది. 692 మంది విద్యార్థులతో మూల్యాంకన విధానంపై చర్చించింది. విద్యార్థి ప్రతిభను అంచనా వేయాలని 41 శాతం మంది అభిప్రాయపడ్డారు. థియరీ ద్వారా మార్కులు నిర్ణయించే ప్రస్తుత విధానం కన్నా సమర్థవంతమైంది కావాలని 82 శాతం తెలిపారు. ఉపాధి కోర్సుల అవసరం ఉందని 24 శాతం మంది పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం డిగ్రీ స్థాయిలో నైపుణ్యం పెంచాలని 38 శాతం తెలిపారు. డిగ్రీ క్లాసులకు హాజరయ్యేలా విద్యార్థులను ప్రోత్సహించాలని 76 శాతం అధ్యాపకులు పేర్కొన్నారు. కొత్త అంశాల అన్వేషణకు క్లాస్ రూం వేదిక కావాలని 84 శాతం మంది ఆకాంక్షించారు. ఈ అభిప్రాయాల ఆధారంగానే ఐఎస్బీ కొన్ని సిఫార్సులు చేసింది. ముఖ్యంగా హాజరు తప్పనిసరి చేయడమే కాకుండా, క్లాసు రూంలో వివిధ బోధన పద్ధతులను సూచించింది. ప్రతి 20 రోజులకు విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా పరీక్షలుండాలని స్పష్టం చేసింది. ప్రతి అంశానికీ మార్కులు సంవత్సరం మొత్తంలో 75 శాతానికి పైగా హాజరు ఉన్న వారికి 10 మార్కులు ఇవ్వాల్సిన అవసరాన్ని ఐఎస్బీ ప్రస్తావించింది. యాక్టివ్‌గా ఉండే విద్యార్థులను వెలికితీయడం, వారు ఏ అంశాల్లో ఆసక్తిగా ఉన్నారనేది అధ్యాపకుడు గుర్తించాలి. దీనికీ కొన్ని మార్కులు నిర్దేశించారు. మంచి సంస్థలను గుర్తించి, అక్కడే ప్రాజెక్టు వర్క్ చేయాలి. ప్రాజెక్టు వర్క్‌లో నైపుణ్యానికి మార్కులుంటాయి. నెలకు కనీసం నాలుగు క్విజ్లు, వివిధ అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి, మార్కులివ్వాలి. ఈ విధానం ఎలా ఉండాలనేది ఆయా యూనివర్సిటీలు నిర్ణయిస్తాయి. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అనుసంధానం పెంచడం, ఇంటర్న్‌షిప్, ప్రాంగణ నియామకాల కల్పనకు ఒక వెబ్ పోర్టల్ ఏర్పాటును వర్సిటీలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రతి వారం విద్యార్థి ప్రతిభకు మార్కులు నిర్ణయించి, వాటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తారు. ప్రతి యూనివర్సిటీలోనూ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ ఎవాల్యుయేషన్ అండ్ అసెస్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. డిగ్రీ స్థాయిలోనూ పరిశోధన సంస్కృతికి ఊతం ఇవ్వడం కొత్త విధాన లక్ష్యం. కృత్రిమ మేధ కోర్సులు, డేటాసైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్ కోర్సులను పెద్ద ఎత్తున డిగ్రీలో చేపట్టాలని ఐఎస్బీ సిఫారసు చేసింది. గుణాత్మక మార్పుకు దోహదం దేశంలోనే తొలిసారి నిరంతర మూల్యాంకన విధానం ఈ ఏడాది ప్రవేశపెట్టాం. పీజీ (నాన్– ఇంజనీరింగ్) కోర్సుల్లో దీన్ని అమలు చేస్తున్నారు. దీనికోసం సాఫ్ట్వేర్ కూడా రూపొందించాం. ప్రశ్నపత్రాల రూపకల్పనపై అన్ని వర్గాల ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. ఇబ్బందులుంటే చర్యలు చేపడుతున్నాం. గుణాత్మక మార్పునకు ఇది దోహదపడుతుందని ఆశిస్తున్నాం. దీన్ని డిగ్రీ స్థాయికీ విస్తరించాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. – ప్రొఫెసర్ డి.రవీందర్ (వీసీ, ఉస్మానియా యూనివర్సిటీ) -
ఆంజనేయులు ఎక్కడ?.. బ్రిలియంట్ కాలేజీలో ఏం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్ బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థి ఆంజనేయులు గత ఆదివారం నుంచి కాలేజ్ హాస్టల్ నుంచి అదృశ్యం అయినప్పటికీ ఇప్పటి వరకు కళాశాల యాజమాన్యం స్పందించలేదంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాలతో కలిసి విద్యార్థులు భారీ ధర్నాకు దిగారు. కొడంగల్‌కి చెందిన ఆంజనేయులు ఆ కళాశాలలో డిప్లమో రెండో సంవత్సరం చదువుతున్నాడు. విద్యార్థి అదృశ్యానికి యాజమాన్యమే కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆంజనేయులుకు అతని తల్లిదండ్రులు ఫోన్ చేయడంతో.. స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానంతో తల్లిదండ్రులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. తన కుమారుడి గురించి అడగ్గా, కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఇంత పెద్ద కాలేజీలో కనీసం సీసీ కెమెరాలు కూడా లేవని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: విశాఖ: చైనా వెళ్తున్నానని చెప్పి లాడ్జిలో.. -
పాలిటెక్నిక్ విద్యార్థిని బలవన్మరణం
హిందూపురం అర్బన్: స్థానిక ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని శ్రావణి (18) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. కనగానపల్లి మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన నరసింహులుకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తూ పిల్లలను చదివించుకుంటున్నాడు. ఈ క్రమంలో పెద్ద కుమార్తె శ్రావణి (18) హిందూపురంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కళాశాల క్యాంపస్‌లోని హాస్టల్లో ఉంటున్న ఆమె మంగళవారం ఉదయం 10.20 గంటలకు స్నానాలగదిలో అపస్మారక స్థితిలో పడి ఉండగా గమనించిన స్నేహితుల నుంచి సమాచారం అందుకున్న ప్రిన్సిపాల్ హరీష్‌బాబు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. క్రిమి సంహారక మందు తాగినట్లుగా వైద్యులు గుర్తించి చికిత్స మొదలు పెట్టారు. పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్ఐ హరూన్‌బాషా కళాశాల వసతి గృహానికి చేరుకుని పరిశీలించారు. క్రిమి సంహారక మందు తాగే ముందు శ్రావణి రాసి పెట్టిన ఓ ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో తన మృతికి కారకులు ఎవరూ కాదని ఆమె పేర్కొంది. క్యాన్సర్‌తో బాధపడుతున్నానని, తనకు ఆపరేషన్ అంటే భయమని వివరించింది. తల్లిదండ్రులకు తాను భారం కాకూడదనే ఉద్దేశ్యంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
కాలేజీ విద్యార్థి హత్యలో బిగ్ ట్విస్ట్.. మూడు రోజుల ముందే స్కెచ్ వేసి..
ఢిల్లీ: దేశ రాజధానిలో దారుణం జరిగింది. కాలేజీ విద్యార్థిని(25)ని ఓ యువకుడు ఇనుప రాడ్డుతో బాది హతమార్చాడు. దీంతో బాధితురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఢిల్లీ మాలవీయ నగర్‌లోని అరబిందో కాలేజీ వద్ద ఉన్న పార్క్‌లో జరిగింది. బాధితురాలిని కమల నెహ్రూ కాలేజీ విద్యార్థినినిగా గుర్తించారు. మూడు రోజుల ముందే పథకం ప్రకారం నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడిని ఇర్ఫాన్‌గా గుర్తించారు. బాధితురాలు ఇర్పాన్ ప్రేమించుకున్నారు. కానీ ఇర్ఫాన్‌కు సరైన ఉద్యోగం లేని కారణంగా వివాహానికి బాధితురాలు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. అప్పటి నుంచి యువతి ఇర్పాన్‌తో మాట్లాడటం మానేసింది. స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పనిచేసే ఇర్ఫాన్.. తన తమ్ముడికి కూడా వివాహం కుదరడంతో అవమానానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. పక్కా పథకంతో.. బాధితురాలు మాట్లాడకపోయేసరికి ఆగ్రహానికి గురైన ఇర్ఫాన్.. ఏదో ఒకటి తేల్చుకోవాలని అనుకున్నాడు. ప్రియురాలు రోజూ స్టెనోగ్రఫీ ట్రైనింగ్‌కు వెళుతుందని ముందే తెలిసి మూడు రోజుల ముందే పథకం పన్నాడు. పార్కుకు పిలిచి ప్రేమ వ్వవహారంపై ప్రశ్నించాడు. కానీ బాధితురాలు ఒప్పుకోకపోయేసరికి విచక్షణ కోల్పోయాడు. బాధితురాలిని ఇనుప రాడ్డుతో తలపై బాది హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు ఈ ఏడాదే డిగ్రీ పూర్తి చేసుకుని మాలవీయ నగర్లో స్టెనోగ్రఫీ కోచింగ్‌కి బయటకు వచ్చిందని పోలీసులు తెలిపారు. 'మాలవీయ నగర్‌లోని అరబిందో కాలేజీ వద్ద ఉన్న పార్క్‌లో ఓ బాలిక మృతదేహం పడి ఉందని మాకు సమాచారం వచ్చింది. బాధితురాలు తన ఫ్రెండ్‌తో కలిసి పార్కుకు వచ్చినట్లు తెలుస్తోంది. యువతి తలకు బలమైన గాయం తగిలింది. ఆమె మృతదేహం పక్కనే ఇనుప రాడ్డు పడి ఉంది.' అని ఢిల్లీ డీసీపీ చందన్ చౌధరి తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్పందించారు. నాగరికత ఉన్న దేశ రాజధానిలో ఓ అమ్మాయిని కొట్టి చంపారు. ఢిల్లీలో రక్షణ కరవైంది. ఇది ఎవరికీ పట్టింపు లేదు. కేవలం వార్తాపేపర్లలో మాత్రం అమ్మాయిల పేర్లు మారుస్తున్నారు. నేరాలు ఆగడం లేదని ట్వీట్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించనట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుని కోసం గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉరిశిక్ష ఒక్కటే సరైనది.. ఈ దారుణ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనలో నిందితునికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతకు మించి ఏదైనా తక్కువేనని బాధితురాలి తండ్రి అన్నారు. తనకు ఉన్నది ఒక్కతే కూతురని చెప్తూ విలపించారు. #WATCH | Woman murdered in Malviya Nagar | "We need death penalty for the accused, nothing less. I had only one daughter…I won’t leave him”, father of the victim breaks down pic.twitter.com/TEQkhiqRwf — ANI (@ANI) July 28, 2023 ఇదీ చదవండి: ప్రొఫెసర్ ఘాతుకం.. తోటి ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులు.. -
కాలేజీ కుర్రాళ్ల రహస్య ‘స్టార్టప్’.. బండారం బయటపడిందిలా..
కుర్రాళ్లు చదువుకునేందుకు కాలేజీలో చేరుతారు. అలా కాలేజీలో చేరిన కుర్రాళ్లు బాగా చదువుకోవాలని అటు అధ్యాపకులు, ఇటు తల్లిదండ్రులు పరితపిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో కుర్రాళ్లు దారితప్పుతుంటారు. అలా నేర సంబంధమైన కార్యకలాపాల్లోకి అడుగు పెడుతుంటారు. తాజాగా ఇటువంటి ఉదంతం కర్నాటకలోని శివమొగ్గలో చోటుచేసుకుంది. అద్దెకు ఇల్లు తీసుకుని.. కర్నాటకలోని శివమొగ్గకు చెందిన ఒక కుర్రాడు తాను ఉంటున్న అద్దె ఇంటిలోనే గంజాయి మొక్కలు పెంచడం ప్రారంభించాడు. తరువాత వాటిని అక్రమంగా విక్రయిస్తున్నాడు. ఈ ఉదంతంలో పోలీసులు తమిళనాడు, కేరళకు చెందిన ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేశారు. వీరంతా హైటెక్ పద్ధతిలో గంజాయి సాగు చేసిన గంజాయిని అక్రమంగా విక్రయిస్తున్నారు. ఇద్దరు విద్యార్థులు గంజాయి కొనుగోలుకు రాగా.. కర్నాటక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడిని తమిళనాడులోని కృష్ణాగిరి నివాసి విఘ్నరాజ్గా గుర్తించారు. ఇతను ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. అతను తాను ఉంటున్న ఇంటిలో గంజాయి సాగు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. శివమొగ్గ పోలీసు అధికారి జీకే మిథున్ కుమార్ మాట్లాడుతూ.. నిందితుడు గత మూడున్నర నెలలుగా గంజాయి క్రయవిక్రయాల్లో పాల్గొంటున్నాడన్నారు. ఇతనికి కేరళకు చెందిన వినోద్ కుమార్, తమిళనాడుకు చెంది పండీదోరాయ్కు సహకరిస్తున్నారని, ఈ ముగ్గురినీ అరెస్టు చేశామన్నారు. విఘ్నరాజ్ ఇంటికి గంజాయి కొనుగోలుకు ఈ ఇద్దరు కుర్రాళ్లు రాగా, వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. పలు మత్తు పదార్థాలు స్వాధీనం పోలీసులు నిందితుని ఇంటిపై దాడి చేసి 277 గ్రాముల గంజాయి, 1.63 కిలోల పచ్చి గంజాయి, 10 గ్రాముల చెరస్, గంజాయి విత్తనాల బాటిల్, 19 వేల రూపాలయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: రెండో పెళ్లికి పసిపిల్లలు అడ్డొస్తున్నారని.. -
Viral Video:అమ్మాయితో పెట్టుకుంటే అంతే మరి.. సరదా తీరిందా?
బైక్, కారు వంటి వాహనాలు నడపడం చాలా సులువని అందరూ అనుకుంటారు. కానీ అందుకు ఎంతో శిక్షణ అవసరం. ఎక్కువగా బండి నడపడం వచ్చిన వాళ్ల దగ్గర డ్రైవింగ్ నేర్చుకుంటారు. లేదంటే ప్రత్యేకంగా డ్రైవింగ్ స్కూల్స్ కూడా ఉంటాయి. అయితే అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు డ్రైవింగ్ నేర్పించడం అంతా ఈజీ కాదని భావిస్తుంటారు. మహిళలు రోడ్డు మీద బండి నడపడం చూసిన కొంతమంది భయపడుతుంటారు. ఇప్పుడీ వార్త చదివితే.. ఈ విషయం నిజమేననిపిస్తుంది. అసలేం జరిగిందంటే.. కాలేజీ గ్రౌండ్లో ఓ యువకుడు మరో విద్యార్థినికి టూ వీలర్ నడపడం నేర్పించేందుకు రెడీ అయ్యారు. యువతిని ముందు కూర్చొబెట్టి వెనకాల అతడు కూర్చున్నాడు. ఇద్దరు కలిసి మెల్లగా కొంతదూరం వెళ్లారు. అక్కడే కథ అడ్డం తిరిగింది. బ్రేక్ బదులు స్కూటీ ఎక్సలేటర్‌ను యువతి ఒక్కసారిగా పెంచడంతో బండి రెండు మూడు వంకర్లు తిరుగుతూ ముందుకు వెళ్లింది. అబ్బాయి బండిని ఆపేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఇంకేముంది చివరికి ఇద్దరు బొక్కబొర్లా పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు స్పందిస్తూ.. అమ్మాయిలకు డ్రైవింగ్ నేర్పడం అంతా ఈజీ కాదు బ్రో. సరదా తీరిందా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది అమ్మాయిలను ఎప్పుడూ గుడ్డిగా నమ్మకూడదని ఇలాగే రోడ్డుపై పడేస్తారు. ఇలాంటివి జరిగినప్పుడే డ్రైవింగ్ చేస్తున్న అమ్మాయిలను చూస్తే భయమేస్తోంది. వాళ్లకు డిస్టెన్స్ మెయింట్ చేయడం బెటర్’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by SAKHT LOGG 🔥 (@sakhtlogg) -
విజయవాడలో బాలోత్సవం పండుగ (ఫొటోలు)
-
స్నేహితుడి ఎదుటే విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
కాంచీపురం: కళాశాల విద్యార్థినిని బెదిరించి ఆమె స్నేహితుడి ఎదుటే ఐదుగురు దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని కాంచీపురం సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. బెంగళూరు–పుదుచ్చేరి రహదారి పక్కనున్న ప్రైవేట్ స్కూల్ ఆవరణలో బాధితురాలు తన స్నేహితుడితో మాట్లాడుతోంది. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఐదుగురు వ్యక్తులు వారిని ముట్టడించారు. చంపుతామని బెదిరిస్తూ స్నేహితుడు చూస్తుండగానే ఆ విద్యార్థినిపై అత్యాచారానికి వడిగట్టారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని బాధితురాలు, ఆమె స్నేహితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కర్రలతో కొట్టుకున్న ప్రైవేటు కాలేజ్ విద్యార్థులు.. వీడియో వైరల్
సాక్షి, ఖమ్మం: నగరంలోని ఓ ప్రైవేటు కళాశాల స్టూడెంట్స్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సీనియర్, జూనియర్ విద్యార్థులు కొట్టుకున్నారు. ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నారు. కాలేజీ నుంచి విద్యార్థులు బయటకు వస్తున్న సమయంలో గొడవ జరిగింది. జూనియర్లు కాపుకాసి సీనియర్ విద్యార్థిని చితకబాదారు. జూనియర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో సీనియర్ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో యువకుడిని వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఓ విషయంలో తెలెత్తిన వివాదం కారణంగా ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం. గాయపడిన విద్యార్థి ఓ కార్పొరేటర్ కొడుకుగా తెలుస్తుంది. పట్టపగలే విద్యార్థులు కర్రలతో దాడి చేసుకోవడం వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. కాగా విద్యార్థులు కొట్టుకున్న దృశ్యాలు కళాశాల గేట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. చదవండి: సంగారెడ్డిలో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం.. చిరుత చిక్కిందిలా! -
క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యం.. కాలేజీ విద్యార్థిని బలి
సాక్షి, బెంగళూరు(బనశంకరి): క్రేన్‌డ్రైవర్ నిర్లక్ష్యానికి విద్యార్థిని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కళాశాలనుంచి ఇంటికి వెళ్తుండగా క్రేన్ ఢీకొని గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నూర్‌పీజా అనే విద్యార్థిని మృతి చెందింది. వివరాలు.. వైట్‌ఫీల్డ్ సమీపంలోని కన్నమంగల నివాసి నూర్‌పీజా(19) ఈనెల 2న ఇంటికి కాలినడకన బయల్దేరింది. కన్నమంగల గేట్ వద్ద ఓ క్రేన్‌ను డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ వచ్చి నూర్‌పీజాను ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చించగా రెండురోజులపాటు చావుబతుకుల మధ్య పోరాడుతూ శుక్రవారం మృతి చెందింది. క్రేన్ యజమాని పెరియస్వామిపై యువతి తండ్రి రెహమాన్‌ఖాన్ వైట్‌ఫీల్డ్‌పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: (Hyderabad: ప్రాణం తీసిన వేగం.. ఇద్దరు బీబీఏ విద్యార్థుల దుర్మరణం) -
షాకింగ్ ఘటన.. కాలేజీ విద్యార్థిని ఈడ్చుకెళ్లిన ఆటో డ్రైవర్, వీడియో వైరల్
ముంబై: మహారాష్ట్రలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పట్టపగలే నడిరోడ్డుపై కాలేజీ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ క్రూరంగా ప్రవర్తించాడు. ఈ ఘోరం సీఎం ఏక్నాథ్ షిండే నియోజకవర్గం థానే నగరంలో చోటుచేసుకోవడం గమనార్హం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. వివరాలు 21 ఏళ్ల యువతి కళాశాలకు వెళ్తుండగా రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఆటో డ్రైవర్ అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. దీంతో యువతి అతినిపై ఎదురు తిరిగి ప్రశ్నించగా.. అతడు ఆమె చేతిని పట్టుకొని లాగాడు. తరువాత నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా యువతి అతడిని వదిలిపెట్టలేదు. ఆటో తీసి పరారవుతుండగా అతడి చేతిని గట్టిగా పట్టుకుంది. అయితే ఆటో డ్రైవర్ యువతిని అలాగే 500 మీటర్లు తన బండితోపాటు ఈడ్చుకెళ్లాడు. అనంతరం ఆమెను ఓ చోట కింద పడేసి అక్కడి నుంచి పారిపోయాడు. యువతిని గమనించిన స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆటోరిక్షా డ్రైవర్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: రూ. 9 లక్షల లోన్ కట్టాలని బ్యాంక్ నోటీస్.. గంటల్లోనే అదృష్టం తలుపు తట్టింది Shocking! In CM’s constituency by an autodriver. HM should resign.#Maharashtra https://t.co/dL5JV3kMip — Shraddhey (@shraddhey) October 14, 2022 -
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని రైలు కిందకు తోసేసి..
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. 20 ఏళ్ల కాలేజీ విద్యార్థినిని ఓ ఆకతాయి కదులుతున్న రైలు కిందకు తోసేశాడు. థామస్ మౌంట్ రైల్వే స్టేషన్లో గురవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. అమ్మయి చెన్నై బీచ్‌కు వెళ్లే రైలు కోసం ఎదురుచూస్తున్న సమయంలో నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఘటనకు ముందు యువతికి, నిందితుడికి మధ్య వాగ్వాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కోపంతో ఉన్న నిందితుడు రైలు ప్లాట్‌ఫైంకి రావడం చూసి ఆమెను తోసేశాడని చెప్పారు. నిందితుడ్ని అలందూర్‌కు చెందిన సతీశ్‌గా(23) గుర్తించారు పోలీసులు. అతను రిటైర్డ్ ఎస్ఐ కుమారుడని వెల్లడించారు. ఎనిమిదో తరగతిలోనే చదువు ఆపేశాడని, చాలా కాలంగా యువతి వెంట పడుతున్నట్లు తెలిపారు. యువతికి నిశ్చితార్థం.. మృతి చెందిన యువతిని సత్యగా గుర్తించారు పోలీసులు. ఆమె తల్లి హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారని తెలిపారు. సత్యకు గతనెలలోనే నిశ్ఛితార్థం జరిగినట్లు వెల్లడించారు. ఆమె తల్లి సహా కుటుంబసభ్యులంతా పోలీస్ శాఖలోనే ఉద్యోగాలు చేస్తున్నట్లు వివరించారు. చదవండి: టీచర్ బ్రేకప్ చెప్పిందని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి -
కాలేజ్ వద్ద డ్రాప్ చేస్తానని నమ్మించి.. కొంచెం దూరం వెళ్లాక..
కెలమంగలం(బెంగళూరు): బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థినిని కళాశాల వద్ద దించుతానని నమ్మించి తీసుకెళ్తూ కళాశాల వద్ద దించకపోవడంతో కిందకు దూకిన విద్యార్థినికి తీవ్రంగా గాయపడిన ఘటన కెలమంగలం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. కెలమంగలం సమీపంలోని మంజళగిరి గ్రామానికి చెందిన 18 ఏళ్ల విద్యార్థిని కెలమంగలం సమీపంలోని పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతోంది. శనివారం ఉదయం బస్టాప్ వద్ద బస్సుకోసం వేచియుండగా ఆ మార్గంలో బైక్‌పై వచ్చిన ఓ యువకుడు కళాశాల వద్ద వదలిపెడుతానని నమ్మించి విద్యార్థినిని బైక్‌పై ఎక్కించుకున్నాడు. కొంచెం దూరం వెళ్లాక ఎవరూ లేని ప్రదేశంలో తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆ విద్యార్థిని బైక్‌పై నుంచి కిందకు దూకేసింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. చదవండి: మూడేళ్ల క్రితం పెళ్లి.. రెండేళ్ల పాప.. భార్యతో గొడవపడి.. -
అమ్మానాన్న ప్లీజ్ నన్ను క్షమించండి.. నాకు వేరే దారి లేదు
ఎచ్చెర్ల క్యాంపస్: కుమార్తెపైనే గంపెడు ఆశలు పెట్టుకుని కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. చదువులో ఎప్పుడూ ముందుండే తమ కుమార్తె ఇక లేదని తెలిసి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మంగళవారం ఎచ్చెర్ల మండలం అంబేడ్కర్ గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొందూరు మండలం తండ్యాంమెట్ట (మన్నెపేట)కు చెందిన దంపతులు దుంగ భూలోక, భారతిలు విశాఖలో వలస కూలీలుగా పనిచేస్తున్నారు. కుమారుడు నవీన్ ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేస్తుండగా, కుమార్తె కరిష్మా(17) ఎచ్చెర్లలోని అంబేడ్కర్ గురుకులం (పాఠశాల/కళాశాల)లో ఇంటర్మీడియెట్(బైపీసీ) ప్రథమ సంవత్సరం చదువుతోంది. చదువులో చురుగ్గా ఉంటే కరిష్మా ఆరో తరగతి నుంచి ఇక్కడే చదువుతూ త్వరలో జరిగే పబ్లిక్ పరీక్షలతో పాటు నీట్, అగ్రికల్చర్ సెట్లకు సైతం సిద్ధమవుతోంది. ఇటీవలే చెవి నొప్పి అంటూ ఇంటికి వెళ్లి చికిత్స చేయించుకుని ఆదివారం మళ్లీ పాఠశాలకు చేరుకుంది. స్టడీ అవర్స్‌లో భాగంగా ఉదయం ఐదు గంటలకే నిద్ర లేచి 5.30 గంటలకు తరగతి గదికి చేరుకుంది. కొద్దిసేపటికే ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థినులు ఆరు గంటలకు తరగతి గదికి చేరుకోగా కరిష్మా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా ఎస్సై కె.రాము ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా విద్యార్థిని మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలం వద్ద ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. విశాఖ నుంచి తల్లిదండ్రు లు, సోదరుడు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. తహశీల్దార్ సనపల సుధాసాగర్ గురుకులాన్ని పరిశీలించారు. కారణం అదేనా.. గురుకులం పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు విజయనగరం నుంచి కారులో రాకపోకలు సాగిస్తున్నారు. కారు డ్రైవర్ ఈ విద్యార్థినిని కొంతకాలంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు సైతం చెప్పినట్లు తెలిసింది. అప్పట్లో తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థినికి ఉపాధ్యాయులు కౌన్సెలింగ్ ఇవ్వడం, డ్రైవర్‌ను ఉపాధ్యాయురాలు తొలగించడం జరిగాయి. ఈ క్రమంలోనే తోటి విద్యార్థులు కామెంట్లు చేయటం, విద్యార్థిని వ్యక్తిగతంగా రాస్తున్న డైరీ పరిశీలించి సోమవారం ఉపాధ్యాయురాలు మందలించటం వంటివి చోటుచేసుకున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యుల ఆగ్రహం.. విద్యార్థిని ఆత్మహత్య విషయంలో గురుకుల యాజమాన్యం తీరుపై కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము రాకుండానే మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించటం, విద్యార్థుల తల్లిదండ్రులను సైతం అనుమతించని గురుకులంలోకి డ్రైవర్‌ను రానివ్వడం, గతంలో వివాదం తలెత్తినప్పుడు డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటం వంటి అంశాలను లేవనెత్తుతున్నారు. పోలీసులు మాత్రం తాము వచ్చి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాకే మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు చెబుతున్నారు. నన్ను క్షమించండి అంటూ సూసైడ్ లేఖ.. విద్యార్థి రాసిన సూసైట్ నోట్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు, పోలీసుల కేసు నమోదుకు భిన్నంగా నోట్ ఉండటం గమనార్హం. సూసైట్ నోట్ పరిశీలిస్తే.. ‘అమ్మా, నాన్నా, అన్నా.. నన్ను దయచేసి క్షమించండి. మిమ్మల్ని వదిలి వెళ్లటం బాధగా ఉంది. నాకు వేరే దారిలేదు. మీ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాను. దేవుడు ధృడమైన సంకల్పం ఇవ్వలేదు. నేను, డ్రైవర్ సాయి ఇద్దరం ఇష్టపడ్డాం. ఆయన నా వల్ల ఉద్యోగం కోల్పోయారు. నా మృతికి ఎవ్వరూ కారణం కాదు. రేపు అనేది ఎలా ఉంటుందో తెలియదు..’ ఇదీ సూసైడ్ నోట్ సారాంశం. ముగ్గురిపై కేసు నమోదు.. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గురుకులం ప్రిన్సిపాల్ కె.ఉషారాణి, ఇంగ్లీష్ టీచర్ భవానీ, ఈమె పూర్వపు కారు డ్రైవర్ సురేష్ (సాయి)పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.రాము చెప్పారు. ముగ్గురు సస్పెండ్... శాఖాపరంగా సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీ చర్యలు చేపట్టారు. ప్రిన్సిపాల్ కె.ఉషారాణి, ఇంగ్లీష్ టీచర్ భవానీ, హౌస్ (క్లాస్ టీచర్) మంజులను సస్పెండ్ చేసినట్లు జిల్లా అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సమన్వయకర్త యశోధలక్ష్మి తెలిపారు. ప్రస్తుత వైస్ ప్రిన్సిపాల్ రాధికకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఇది కూడా చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఏడాది కాగానే భర్త అలా చేస్తూ.. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
కేరళ పెడ్లర్ అరెస్టు, డ్రగ్స్ సీజ్
బనశంకరి: నగరంలో పెద్దఎత్తున డ్రగ్స్ విక్రయిస్తున్న కేరళ డ్రగ్స్ పెడ్లర్‌ను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి రూ.6.5 లక్షల విలువచేసే 49 గ్రాముల 90 ఎక్స్టసి మాత్రలు, 40 గ్రాముల చరస్, 5 గ్రాముల ఎండీఎంఏ క్రిస్టల్, ల్యాప్‌టాప్, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. హెణ్ణూరు పరిధిలో డ్రగ్స్ అమ్ముతున్నట్లు తెలిసి నిందితుడు మహమ్మద్ రన్నార్ను మంగళవారం నిర్బంధించారు. ఇతను బిట్కాయిన్లను ఉపయోగించి డార్క్ వెబ్ ద్వారా విదేశాల నుంచి డ్రగ్స్‌ను నగరానికి తెప్పించి కాలేజీ విద్యార్థులకు విక్రయించేవాడు. (చదవండి: కడుపులో 11.57కోట్ల కొకైన్..) -
కాలేజీకి వెళ్లిన యువతి మిస్సింగ్.. తిరిగి ఇంటికి రాకపోవడంతో..
మదనపల్లె టౌన్(చిత్తూరు జిల్లా): మండల పరిధిలో కళాశాల విద్యార్థిని అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం మేరకు, మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ వైఎస్సార్ కాలనీకి చెందిన మౌనిక(19), స్థానిక కోమటివాని చెరువు సమీపంలోని కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఈ నెల 19న కళాశాలకు వెళ్లిన విద్యార్థిని తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆదివారం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు ఎస్ఐ -9440796741కు సమాచారం ఇవ్వాలని కోరారు. చదవండి: ప్రేమించిన యువతి ఫోన్ స్విచ్ ఆఫ్.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య.. -
విద్యార్థినిపై లైంగిక దాడి చేసి వీడియో తీసి.. ఆ తర్వాత..
లక్నో: దేశంలో మహిళలు, యువతులపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై దాడులను ఎదుర్కొనేందుకు ఎన్ని చట్టాలను అమలు చేస్తున్నా కొందరు మానవ మృగాలు మాత్రం మారడంలేదు. పోలీసుల నిఘా ఉన్నప్పటికీ దేశంలో ప్రతీ రోజు ఏదో ఒక చోట మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. యూపీలోని ఆగ్రా జిల్లాలో ఆదివారం సాయంత్రం ఓ కాలేజీ విద్యార్థిని ఆటోలో ఇంటికి తిరిగి వస్తోంది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ ఆమెపై కన్నేశాడు. వెంటనే తన స్నేహితులకు సమాచారం అందించాడు. దీంతో మరో ఇద్దరు అతడితో కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా, ముగ్గురు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడి చేయడమే కాకుండా.. బాధితురాలిని దారుణంగా కొట్టి.. అత్యాచారానికి సంబంధించిన వీడియోను రికార్డు చేశారు. ఈ విషయం బయటకు చెబితే వీడియోను బయటకు రిలీజ్ చేస్తామని బెదిరించినట్టు ఆమె తెలిపింది. వారి బారి నుండి బయట పడిన బాధితురాలు ఎత్మాద్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను భూరా యాదవ్, యశ్‌పాల్‌గా గుర్తించి వారిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని త్వరలోనే అతడిని కూడా అరెస్ట్ చేస్తామని ఎస్పీ సత్యజిత్ గుప్తా పేర్కొన్నారు. కాగా నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. -
విద్యార్థినిని రోజు కాలేజీకి తీసుకెళ్తూ.. ప్రేమ పేరుతో నమ్మించి..
యశవంతపుర: విద్యార్థినిని రోజు కాలేజీకి తీసుకెళ్తున్న కారు డ్రైవర్ ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకున్న ఘటన విజయపుర జిల్లా జాలగేరి గ్రామంలో జరిగింది. విజయపురలో ఒక కుటుంబం వద్ద కారు డ్రైవర్‌గా పని చేస్తున్న సోమలింగ ఆ కుటుంబానికి చెందిన అక్షతను రోజూ బైక్‌పై కాలేజీ వద్ద వదిలేవాడు. ఈ సమయంలో మాయమాటలు చెప్పి ఆమెతో ప్రేమాయణం మొదలుపెట్టాడు. అయితే సోమలింగకు పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. బీకాం పూర్తి చేసిన అక్షత మేజర్ కావడంతో ఇటీవల ఇద్దరూ పెళ్లి చేసుకుని రిజిస్ట్రార్ ఆఫీసులో కూడా నమోదు చేసుకున్నారు. సోమలింగ, అతని మొదటి భార్యతో కలిసి అన్యోన్యంగా జీవిస్తానని అక్షత చెప్పడం గమనార్హం. పుట్టింటి నుంచి హాని ఉందని ఆదివారం జిల్లా ఎస్పీకి రక్షణ కోసం విజ్ఞప్తి చేసింది. ఈ తతంగం చూసి జిల్లావాసులు ఆశ్చర్యపోయారు. -
Hubli: కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
హుబ్లీ (బెంగళూరు): కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ధార్వాడలో వెలుగు చూసింది. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ధార్వాడలోని ఓ ప్రాంతానికి చెందిన కళాశాల విద్యార్థిని అదే ప్రాంతానికి చెందిన ఐదుగురు యువకులు మాయమాటలు చెప్పి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారని ధార్వాడ టౌన్ పోలీసులు తెలిపారు. చదవండి: (భర్త, కుమార్తెను వదిలి ప్రియుడితో వెళ్లిపోయి.. ఆది పరాశక్తి అవతారంలో) -
ఉపాధ్యాయుడి మందలింపు.. ఆత్మహత్యకు ప్రేరేపితం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: పాఠశాలలో ఉపాధ్యాయుడు మందలించినంత మాత్రాన దాన్ని విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి కారణంగా చూడలేమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 306 వర్తించజాలదని పేర్కొంది. రాజస్థాన్‌లోని నేవ్‌త్ గ్రామంలో సెయింట్ గ్జేవియర్స్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి 26.4.2018న ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడు రోజుల అనంతరం స్కూలు పీఈటీ వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ విద్యార్థి తల్లి పోలీసులను ఆశ్రయించారు. స్కూలు పీఈటీ జియో వేధింపుల కారణంగానే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని, సూసైడ్ నోట్లో ఈ విషయాన్ని పేర్కొన్నాడని ఫిర్యాదులో తెలిపారు. మూడు పేజీల సూసైడ్ నోట్లో తొలి పేజీలో తన వస్తువులు సోదరుడుకి ఇవ్వాలని, రెండో పేజీలో న్యాయం కావాలని, మూడో పేజీలో జియో సార్‌కు ధన్యవాదాలు అని విద్యార్థి రాసినట్లు తెలిపారు. పోలీసులు ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. దీంతో ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పిటిషన్ కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం మంగళవారం జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కృష్ణమురారిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. చదవండి: (కోవిడ్ విధుల్లోని అంగన్ వాడీలకు 50 లక్షల బీమా) ‘‘దేశంలో ఆత్మహత్య నేరం కాదు. కానీ ఆత్మహత్యాయత్నం సెక్షన్ 309 ప్రకారం నేరంగా పరిగణిస్తాం. ఆత్మహత్యకు ప్రేరణ కూడా ఐపీసీ సెక్షన్ 306 కింద నేరంగా పరిగణిస్తాం. సెక్షన్ 306 ప్రకారం... ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తికి పదేళ్ల వరకూ జైలు, జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రస్తుత విద్యావిధానంలో విద్యార్థిని మందలించడంపై ఎలాంటి చట్టాలు లేవు.. కానీ విద్యార్థి క్రమశిక్షణారాహిత్యాన్ని ఉపాధ్యాయుడు, పాఠశాల అథారిటీలు ఉపేక్షించజాలవు. ఇది ఉపాధ్యాయుడి బాధ్యత మాత్రమే కాదు విద్యా హక్కు చట్టం సెక్షన్ 24 (ఈ) ప్రకారం తల్లిదండ్రులు, గార్డియన్లతో ఉపాధ్యాయుడు విద్యార్థి హాజరు, క్రమశిక్షణ, చదువు గురించి సమావేశం కావాలి. విద్యార్థి తరచూ తరగతులకు గైర్హాజరు కావడాన్ని గుర్తించిన ఉపాధ్యాయుడు మందలించడంతోపాటు ప్రిన్సిపల్ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. అంతకుమించి ఏమీ చేయలేదు. అందువల్ల సూసైడ్‌నోట్‌ను దీనికి ఆపాదించాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొంటూ హైకోర్టు ఆదేశాలు కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పు సందర్భంగా అర్నాబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రస్తావించింది. సూసైడ్ అనే పదానికి ఐపీసీలో నిర్వచనం లేదని, సాధారణ నిఘంటువులో మాత్రం స్వీయహత్య (సెల్ఫ్ కిల్లింగ్ ) అని ఉంటుందని పేర్కొంది. అంటే తననుతాను చంపుకొనే లక్ష్యాన్ని సాధించడానికి అనుసరించిన మార్గాలతో సంబంధం లేకుండా చేపట్టిన చర్యగా ధర్మాసనం అభివర్ణించింది. చదవండి: ('సరిహద్దుల్లో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాం') -
దారుణం: అందరూ చూస్తుండగానే శ్వేతను చంపేశాడు
సాక్షి, చెన్నై: ప్రేమోన్మాదానికి గురువారం చెన్నైలో మరో యువతి బలైంది. తనను ప్రేమించడం లేదన్న ఆగ్రహంతో పట్టపగలు అందరూ చూస్తుండగానే ఆమె మీద ఉన్మాది దాడి చేసి.. గొంతు భాగంలో పలుమార్లు కత్తితో పొడిచాడు. ఆపై తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తాంబరం రైల్వే స్టేషన్ ఆవరణలో సాయంత్రం మూడు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఇతర ప్రయాణికులు రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న ఆ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రేమించ లేదన్న ఆగ్రహంతోనే.. క్రోంపేట జీహెచ్ ఆస్పత్రిలో చికిత్స ఫలించక కాసేపటికి ఆ యువతి మరణించింది. మెరుగైన చికిత్స నిమిత్తం ఉన్మాదిని రాజీవ్‌గాంధీ జీహెచ్‌కు తరలించారు. ఆ యువతి ఐడీకార్డు ఆధారంగా క్రోంపేటకు చెందిన శ్వేతగా గుర్తించారు. ఆ యువకుడి పేరు రామచంద్రన్‌గా తేలింది. క్రోంపేటలో ఉంటున్న శ్వేత.. తాంబరం రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలోని ఎంసీసీ కళాశాలలో మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్ కోర్సు రెండో సంవత్సరం చదువుతోంది. కొంతకాలంగా రామచంద్రన్ ప్రేమ ప్రేరిట శ్వేతను వేధిస్తున్నట్లు సహచర విద్యార్థినులు పోలీసుల దృష్టికి తెచ్చారు. చదవండి: (అత్యాచారం చేసి పదో అంతస్తు నుంచి తోసేశాడు) అలాగే, రైల్వేస్టేషన్ పరిసరాల్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇక, ఆస్పత్రిలో స్పృహలోకి వచ్చిన రామచంద్రన్‌ను విచారించగా, తామిద్దరం ప్రేమికులుగా పేర్కొనడం గమనార్హం. నాగపట్నంకు చెందిన రామచంద్రన్ చెన్నై శివారులోని ఓ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 2019లో నాగపట్నం నుంచి వస్తుండగా శ్వేతతో తనకు రైలులో పరిచయం ఏర్పడినట్లు వెల్లడించాడు. హఠాత్తుగా తనను దూరం పెట్టడంతోనే ఈ ఘాతకానికి పాల్పడినట్లు రామచంద్రన్ వాంగ్ములం ఇచ్చాడు. కాగా, గతంలో నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో స్వాతి అనే టెక్కిని ఇదే రకంగా ఓ ప్రేమోన్మాది నరికి చంపిన విషయం తెలిసిందే. చదవండి: (వందల కోట్ల రూపాయల ఆస్తి.. వృద్ధుల కిడ్నాప్) -
యూపీలో మరో దారుణం.. నగ్నంగా రోడ్డుపై విద్యార్థిని
షాజహాన్‌పూర్: ఒక విద్యార్థిని దాదాపు 60% కాలిన గాయాలతో, నగ్నంగా రోడ్డు పక్కన పడిపోయి ఉన్న ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానందకు చెందిన ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలలో ఆమె బీఏ రెండో సంవత్సరం చదువుతోందని పోలీసులు తెలిపారు. ఆ విద్యార్థినిని ఆసుపత్రిలో చేర్చామని, ప్రస్తుతం ఆమె ఏ వివరాలు వెల్లడించే స్థితిలో లేదని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతు న్నామని ఎస్పీ ఆనంద్ వెల్లడించారు. ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఆ విద్యార్థిని దుస్తులు కనిపించలేదన్నారు. ముఖం, మెడ, ఛాతి తదితర భాగాల్లో కాలిన గాయాలున్నాయని, మెడ భాగంలో వాపు ఉందని వైద్యులు వెల్లడించారు. తండ్రితో పాటు సోమవారం ఉదయం కళాశాలకు వెళ్లిన యువతి మళ్లీ తిరిగి రాలేదు. మూడు గంటలకు కాలేజీ సమయం ముగిసిన తరువాత తన కోసం కాలేజ్ గేట్ వద్ద ఎదురు చూశానని, అయితే, తను రాలేదని ఆమె తండ్రి పోలీసులకు తెలిపారు. సాయంత్రం ఆరు తరువాత లక్నో– బరేలీ జాతీయరహదారి పక్కన పడిపోయి ఉన్న విషయం, పోలీసులు ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందన్నారు. స్వామి చిన్మయా నందకు చెందిన ముముక్షు ఆశ్రమ్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వామి సుఖ్‌దేవానంద పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలో ఆ విద్యార్థిని చదువుతోంది. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి
పెనుకొండ: మండలంలోని కొండంపల్లి సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హిమబిందు (20) అనే ఇంజనీరింగ్ విద్యార్థిని దుర్మరణం చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకెళితే.. కొత్తచెరువు మండలం ఎర్రబల్లికి చెందిన భాస్కరరెడ్డి వ్యవసాయంతో పాటు, ఆటో నడుపుతూ కుమార్తెను ఇంజనీరింగ్ చదివిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా ప్రభావంతో కుమార్తె ఇంటి వద్దే ఉండగా విద్యార్థిని అనారోగ్యంగా ఉండటంతో పెనుకొండకు చికిత్స నిమిత్తం ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యలో బండ్లపల్లికి చెందిన బాలాజీ, చెర్లోపల్లికి చెందిన ముత్యాలప్పలు ఆటోలో పెనుకొండకు ఎక్కారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో కొండంపల్లి సమీపంలోని బీఈడీ కళాశాల వద్దకు రాగానే పెనుకొండ నుంచి వేగంగా వచ్చిన ఇండికా కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హిమబిందు అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని తండ్రి భాస్కరరెడ్డి, ముత్యాలప్పను పోలీసులు అనంతపురానికి తరలించారు. బాలాజీ స్వల్పగాయాలతో బయట పడ్డాడు. హిమబిందు మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. కారు యజమాని లక్ష్మీనారాయణ మందు సేవించి వేగంగా కారును నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఏమైందమ్మా..
అసలే ఆడపిల్ల. అమాయకత్వం... బిడియం... సున్నితత్వం... సహజం. ఆమె మనసును ఏ విషయం గాయపరిచిందో... ఎందుకు అవమానంగా భావించిందో... కానీ ప్రాణాలకు తెగించింది. ఏకంగా మూడో అంతస్తునుంచి దూకేసింది. కాళ్లు చేతులు విరిగి ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కళాశాల యాజమాన్య తీరుపై ఆగ్రహంతో ఆమె బంధువులు గురువారం ఆందోళన చేపట్టడంతో ఆసలు విషయం వెలుగు చూసింది. ఈ సంఘటనను ఎందుకు గుట్టుగా ఉంచాల్సి వచ్చిందో... విచారణ చేపడితేనే వెలుగు చూసేది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: చదువుకోవాలన్న ఆశ... ఉన్నత స్థానానికి చేరుకోవాలన్న లక్ష్యం... కుటుంబానికి బాసటగా నిలవాలన్న కోరిక.. ఆమెను కన్నవారికి దూరంగా ఉన్నా చదువుకోవాలన్న ఆకాంక్షను పెంచాయి. ఆ సమయంలో ఆమెకు అండగా నిలబడాల్సింది... సరైన దారిలో నడిపించాల్సింది ఉపాధ్యాయులే. తెలిసీ తెలియని వయసులో పిల్లలు ఏదైనా పొరపాటు చేసినా సున్నితంగా మందలించి, వారికి నచ్చజెప్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సింది కూడా వారే. కానీ ర్యాంకుల కోసం, ఫీజుల కోసం మాత్రమే ఆలోచించే కొన్ని విద్యాసంస్థల నిర్వాహకులు, వాటిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. ఫలితంగా విద్యార్థుల ఆత్మహత్యలు నిత్యకృత్యమైపోయాయి. కారణమేతైనా కావచ్చు గానీ ఓ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించడం... ఆమె ఆస్పత్రిలో కన్నుమూయడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలేం జరిగిందంటే... సాలూరు మండలం నెలిపర్తి పంచాయతీ ఎన్ఆర్ఆర్ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం అగ్రికల్చరల్ డిప్లొమా చదువుతు బోనంగి అఖిల కళాశాల మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ నెల 25న జరిగిన ఈ సంఘటనను బయటకు రానివ్వకుండా కళాశాల యాజమాన్యం చాలా జాగ్రత్త పడింది. వార్డెన్ వేధింపుల కారణంగా ఆమె ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఆమె తల్లిదండ్రులు చెబుతుండగా దొంగతనం చేసి దొరికిపోయినందువల్ల అవమానంగా భావించి ఇలాంటి పని చేసుంటుందని కళాశాల నిర్వాహకులు చెబుతున్నారు. అయితే విషయం బయటకు చెప్పొద్దని జరిగిన సంఘటనను దాచి ఉంచితే అదనపు మార్కులు వేస్తామని కళాశాల నిర్వాహకులు బాధితురాలిని మభ్యపెట్టడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధితురాలి చిన్నాన్న రామకృష్ణ గురువారం సాలూరు వచ్చి కళాశాల ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బంధువులు ఏమంటున్నారంటే... తెర్లాం మండలం ఎన్.బూర్జివలసకు చెందిన బోనంగి శంకర్రావు కుమార్తె బోనంగి అఖిల సాలూరు మండలంలోని నెలిపర్తి ఎన్ఆర్ఆర్ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ ప్రైవేట్ కళాశాలలో వసతి గృహాంలో ఉంటూ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 21వ తేదీన తోటి విద్యార్థినికి చెందిన పుస్తకం. దుస్తులను ఆమెకు తెలియకుండా అఖిల తీసుకుందని, ఆ విషయాన్ని గమనించి దండించామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కానీ ఆ తరువాత మరో విద్యార్ధినికి చెందిన వెయ్యి రూపాయలు కనిపించకపోవడంతో వాటిని కూడా అఖిల తీసేసిందన్న ముద్రవేశారు. ఎవరి వస్తువులు పోయినా ఆమెనే అనుమానించడం మొదలుపెట్టారు. ఈ సంఘనలతో ఆమె తీవ్రంగా కలతచెందింది. ఈ నెల 25వ తేదీ సాయంత్రం వసతి గృహం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకుందని బాలిక తండ్రి, బంధువులు అంటున్నారు. అంతేకాదు ఎవరడిగినా కాలు జారి పడి నట్లు చెప్పాలని లేదంటే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని, అబద్ధం చెబితే ప్రాక్టికల్స్‌లో అదనపు మార్కులు కలుపుతామని కళాశాల యాజమాన్యం ఆమెకు ఎరవేశారని వారు ఆరోపించారు. అదే రోజు రాత్రి 8 గంటలకు తమకు సమాచారం ఇచ్చారని, విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో తీసుకొచ్చి విడిచిపెట్టి వెళ్లిపోయారని తాము అక్కడినుంచి విశాఖ కేజీహెచ్‌కు తీసుకు వెళ్ళామని ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి ప్రాణాలు వదిలిందని కన్నీరు మున్నీరయ్యారు. అఖిల తండ్రి శంకర్రావు, బాబాయ్ రామకృష్ణతో పాటు కుటుంబ సభ్యులు కళాశా>ల వద్ద గురువారం ఆందోళనకు దిగారు. అఖిల ఆత్యహత్యాయత్నానికి కారణమైన వార్డెన్‌ను శిక్షించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. నాపై ఆరోపణలు సరికాదు అఖిల దొంగ అని మేం ఎప్పుడూ ఆరోపణలు చేయలేదు. తోటి విద్యార్ధిని వస్తువులను ఆమె అనుమతిలేకుండా తీయడం తప్పు, మరెప్పుడు అలా చేయవద్దని చెప్పాను. అంతకు మించి మరే విధంగానూ అఖిలను వేధించలేదు. నాపై ఆరోపణలు చేయటం సరికాదు. – ఆమని, వార్డెన్ అపరాధ రుసుం చెల్లించాలని భయపెట్టాం.. అభిల తన పుస్తకం, బట్టలు దొంగలించిందని ఓ విద్యార్థిని, వార్డెన్ ఆమని నా వద్దకు వచ్చి ఫిర్యాదు చేశారు. అఖిలను అడిగితే తానే వాటిని తీసినట్లు ఒప్పుకుంది. ఇంకెప్పుడూ అనుమతి లేకుండా ఇతరుల వస్తువులు తీయకూడదని మందలించాం. అపరాధ రుసుం చెలించాలని భయపెట్టాం. ఆ మాత్రానికే బిల్డింగ్‌పై నుంచి దూకేస్తుందా... వార్డెన్ వేధింపులనేది అవాస్తవం. అఖిల ఆత్మహత్యాయత్నానికి వేరే కారణాలు ఉండవచ్చు. – ఎం,నరేంద్రబాబు, కళాశాల ప్రిన్సిపాల్. -
అరెరె.. పట్టు జారె..
శ్రావణ శుక్రవారం నగరంలోని కొన్ని కళాశాలలు, పాఠశాలలకు సెలవు ఇవ్వడంతో విద్యార్థులు ఆటవిడిపు కోసం సంజీవయ్య పార్కుకు వచ్చి సరదాగా గడిపారు. ఓ మిత్ర బృందం మాత్రం చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ పార్కులోని కొలను గట్లపై గెంతులేశారు. ఒక విద్యార్థి ఇవతలి గట్టు నుంచి అవతలి గట్టుకు దూకుతూ కేరింతలు కొట్టాడు. ఒకసారి బాగానే దాటినా.. రెండోసారి మాత్రం పట్టుతప్పి నీటిలో పడిపోయాడు. ఈ దృశ్యాలు ‘సాక్షి’ కెమెరా బందించింది. – ఫొటోలు: ఎ. సురేష్‌కుమార్ -
బావిలో దూకి విద్యార్థిని ఆత్మహత్య
అన్నానగర్: దిండుగల్‌లో బుధవారం బావిలో దూకి కళాశాల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దిండుగల్‌లో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. దిండుగల్ ఆర్‌ఎంకాలనీ 12వ వీధికి చెందిన ధనశేఖరన్. ఇతని భార్య ఈశ్వరి. వీరి కుమార్తె సెవ్వంది (19). ఈమె దిండుగల్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదివేది. కొన్ని సంవత్సరాల ముందు ధనశేఖరన్ మృతి చెందాడు. అనంతరం కూలీపనులు చేస్తూ బంధువుల సహా యంతో కుమార్తెని ఈశ్వరి చదివిస్తోంది. ఈ క్రమంలో సెవ్వంది తరచూ తల్లి, బంధువుల వద్ద గొడవపడేది. కొన్ని సార్లు ఆత్మహత్యకి యత్నించినట్లు తెలిసింది. ఈ స్థితిలో కొన్ని రోజుల ముందు సెవ్వంది ఇంట్లో టీవీ చూస్తుండగా ఆమెను ఈశ్వరి మందలించింది. దీంతో ఆమె తల్లితో గొడవపడి ఇంటి నుంచి బయటకి వెళ్లింది. చాలాసేపైనా సెవ్వంది తిరిగి రాకపోవడంతో ఈశ్వరి కూతురి కోసం వెతికింది. కాని ఆమె ఆచూకీ తెలియలేదు. అనంతరం దిండుగల్ పోలీసుస్టేషన్లో ఈశ్వరి ఫిర్యాదు చేసింది. ఈ స్థితిలో బుధవారం ఈశ్వరి ఇంటి సమీపంలో ఉన్న బావిలో సెవ్వంది శవంగా తేలింది. ఇది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దిండుగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో సెవ్వంది తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన ఆమె బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమించకుంటే యాసిడ్ పోస్తా!
తమిళనాడు, టీ.నగర్: ప్రేమించలేదన్న ఆగ్రహంతో ముఖంపై యాసిడ్ పోస్తానని కళాశాల విద్యార్థినిని బెదిరించిన యువకుడిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై రాయపురానికి చెందిన 19 ఏళ్ల యువతి. గతంలో ఆమె కేకేనగర్‌లో నివశిస్తుండగా అదే ప్రాంతానికి చెందిన మెకానిక్ వీరపాండి (23) ఆమెను ప్రేమిస్తూ వచ్చినట్లు సమాచారం. పరిచయమైన కొద్ది రోజులకే అతని ప్రవర్తనపై విసిగిన యువతి వీరపాండితో మాట్లాడడం మానేసింది. దీంతో సదరు యువతి ఇల్లు మార్చుకుని రాయపురానికి చేరుకుంది. ఇలావుండగా యువతి కళాశాలకు వెళుతున్నట్లు తెలుసుకున్న అతను అక్కడికి వెళ్లి ఆమెను ప్రేమించాల్సిందిగా ఒత్తిడి తెచ్చాడు. అతని వేధింపులు తాళలేఖ యువతి హెచ్చరించి పంపేసింది. ఇలావుండగా మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో యువతి ఒంటరిగా ఇంట్లో ఉండగా అక్కడికి వెళ్లిన వీరపాండి ఆమెతో తనను ప్రేమించాలని, లేకుంటే యాసిడ్ ముఖం మీద పోస్తానని బెదిరించి వెళ్లాడు. దీంతో యువతి తన తల్లిదండ్రులతో రాయలనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వీరపాండిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ సమయంలో అతను యాసిడ్ దాడి చేస్తానని బెదిరించినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి జైలులో నిర్బంధించారు. -
వైరల్ వీడియో : హీరోయిన్స్‌కు ధీటుగా..
సుస్మీతా సేన్, సంజయ్ కపూర్లు జంటగా వచ్చిన ‘సిర్ఫ్ తుమ్’ సినిమాలోని ‘దిల్బర్.. దిల్బర్’ పాట గుర్తుందా..? అప్పట్లో ఈ సాంగ్ ఓ సెన్షేషన్‌ని క్రియేట్ చేసింది. ఈ మధ్య కాలంలో జాన్ అబ్రహాం హీరోగా వచ్చిన ‘సత్యమేవ జయతే’లో కూడా ఈ పాటను రిమేక్ చేశారు. నోరా ఫతేహీ బెల్లీ స్టేప్పులతో ఈ పాటకు మరోసారి క్రేజ్ పెంచేశారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ డ్యాన్సర్ సుస్మీతా సేన్‌కి, నోరాకు గట్టి పోటీ ఇస్తున్నాడు. బెల్లీ మూవ్మెంట్లో నోరానే కాదు ఐటమ్ గర్ల్స్ అందరూ తన ముందు దిగదుడుపే అంటున్నాడు ఈ కాలేజీ యువకుడు. ‘దిల్బర్’ సాంగ్‌కు ఈ అబ్బాయి వేసిన స్టేప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ యువకుడి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ సారి ఈ వీడియో చూడండి. -
ఐటమ్ గర్ల్స్‌కు ధీటుగా..
-
ఒక్క ఫోటో జీవితాన్నే మార్చేసింది
కొచ్చి : ఒక్క ఐడియా.. జీవితాన్నే మార్చేస్తుంది అనే మాట వినే ఉంటారు. కానీ అప్పుడప్పుడు ఫోటోలు కూడా జీవితాలను మారుస్తాయి. ఇందుకు నిదర్శనంగా నిలిచింది కేరళ అమ్మాయి హానాన్ హమీద్(19). కేవలం ఒక్క ఫోటో హానాన్ జీవితంలోని కష్టాలను దూరం చేయడమే కాక సినిమా అవకాశాన్ని కూడా తెచ్చి పెట్టింది. వివరాల ప్రకారం.. తోడుపుజ్హాలోని అల్ అజహర్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో బీఎస్సీ కెమిస్ట్రీ మూడో సంవత్సరం చదువుతున్న హానాన్కు చదువు అంటే చాలా ఇష్టం. కానీ కుటుంబ పరిస్థితులు అందుకు సహకరించకపోవడంతో చేపలు అమ్మే అవతారం ఎత్తింది. అలా సంపాదించిన డబ్బుతోనే చదువు కొనసాగిస్తుంది. ఈ క్రమంలో హానాన్ కాలేజీ యూనిఫామ్‌లో ఉండి చేపలు అమ్ముతుండగా తీసిన ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో హానాన్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. సోషల్ మీడియాలో హానాన్ ఫోటోలను చూసిన ప్రముఖ మలయాళి దర్శకుడు అరుణ్ గోపి తన తదుపరి చిత్రం ‘ఇరుపథియోన్నమ్ నొట్టాండు’లో హానాన్కు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా హానాన్ మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫోటోలు చూసిన కొందరు నెటిజన్లు మాత్రం హానాన్ ఇప్పటికే మోహన్‌లాల్ చిత్రంలో నటిస్తుందని, కేవలం సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి పనులు చేస్తున్నట్లు విమర్శించారు. దాంతో హానాన్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి తన కష్టాల గురించి చెప్పడంతో ఇంతకు ముందు ఆమెను విమర్శించిన వారే ఇప్పుడు పొగడ్తలతో ముంచేత్తుతున్నారు. హనన్ నేపధ్యం... త్రిసూర్ మదవానాలో ఒక చిన్న ఇంట్లో అద్దెకుంటున్నారు హనన్. ప్రతిరోజు ఉదయం 3 గంటలకే తన రోజు ప్రారంభమవుతుంది అంటున్నారు హనన్. ‘రోజు ఉదయం మూడు గంటలకు లేచి, ఒక గంట చదువుకుంటాను. అనంతరం నా సైకిల్ మీద దగ్గరలోని చేపల మార్కెట్‌కు వెళ్తాను. అక్కడ చేపలు కొని, వాటిని కడిగించి, కట్ చేయించి తీసుకువస్తాను. తర్వాత ఇంటికి వచ్చి, ఇక్కడి నుంచి 60 కిమీ దూరాన ఉన్న కాలేజికి వెళ్తాను. కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఉదయం తెచ్చిన చేపలను పాలరివట్టం-తామ్మనాం జంక్షన్ వద్ద అమ్ముతాను’ అని తెలిపారు. అంతేకాక సోషల్ మీడియాలో తన గురించి వస్తోన్న కామెంట్ల గురించి స్పందిస్తూ ‘నేను నా ఏడో తరగతి నుంచి ఇలాంటి కష్టాలు అనుభవిస్తునాన్ను. ఆ రోజు నుంచి నేటి వరకూ నేను ఏదో ఒక పని చేసి నన్ను నేను పోషించుకుంటున్నాను. ఇంతవరకూ ఎవరి దగ్గర చేయి చాచలేదు. కానీ జనాలు నా గురించి పూర్తిగా తెలుసుకోకుండానే నన్ను విమర్శిస్తున్నారు. నన్ను అబద్దాల కోరు అంటున్నారు. ఇప్పటి వరకూ ఎన్నో పనులు చేశాను. వాటిల్లో చేపలు అమ్మడం కూడా ఒకటి’ అని తెలిపారు. పత్రికల్లో హానాన్ గురించి చదివిన తర్వాత ఇంతకు ముందు ఆమెను తిట్టిన వారే ఇప్పుడు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వీరిలో కేరళ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నిథాల కూడా ఉన్నారు. ఈ విషయం గురించి ఆయన ‘పేపర్లో హనన్ గురించి చదివినప్పుడు చాలా ఉద్వేగానికి గురయ్యాను. కష్టాలకు కృంగి పోకుండా జీవితాన్ని నెట్టుకొస్తోంది. బతకడం కోసం తీవ్రంగా కష్ట పడుతుంది. చాలా మందికి తాను ఆదర్శం. తన పట్టుదలకు నా సాల్యుట్’ అంటూ మెచ్చుకున్నారు. హానాన్ గురించి తెలిసిన తర్వాత ప్రస్తుతం ఆమె చదువుతున్నా కాలేజీ యాజమాన్యం ఆమెకు సాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఇక మీదట ఆమె చదువుకయ్యే ఖర్చును భరించడమే కాకా ఆమెకు ఉచితంగా వసతి సౌకర్యాన్ని కూడా కల్పించనున్నట్లు ప్రకటించింది. -
టీనేజీ అమ్మాయితో ఎమ్మెల్యే రాసలీలలు
భార్య ఉండగానే.. టీనేజీ యువతితో సంబంధం నెరిపిన బీజేపీ నేత బాగోతం హాట్ టాపిక్‌గా మారింది. జమ్ము కశ్మీర్ బీజేపీ ఎమ్మెల్యే గగన్ భగత్‌పై ఆయన భార్య మోనికా శర్మ సంచలన ఆరోపణలకు దిగారు. 19 ఏళ్ల ఓ యువతితో అఫైర్ నడపటమే కాకుండా.. రహస్యంగా ఆమె వివాహం చేసుకున్నాడంటూ ఆరోపిస్తూ మోనికా మీడియా ముందుకు వచ్చారు. సాక్షి, న్యూఢిల్లీ/శ్రీనగర్: ఆర్ఎస్ పుర నియోజకవర్గ ఎమ్మెల్యే గగన్.. ఆయన భార్య మోనికా శర్మ జమ్ము బీజేపీ మహిళా విభాగానికి కార్యదర్శి. గగన్ పంజాబ్‌కు చెందిన 19 ఏళ్ల ఓ యువతితో వివాహేతర సంబంధం నడుపుతున్నారని ఆరోపిస్తూ మోనికా శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ‘నా భర్త మంచోడు కాదు. గత కొంతకాలంగా ఓ కాలేజీ యువతితో అఫైర్ నడుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆ అమ్మాయిని రహస్య వివాహం కూడా చేసుకున్నారు. ఇంతకాలం సాక్ష్యాలు లేక ఆగిపోయా. ఇప్పుడు ఈ ఆధారాలతో(ఫోటోలు) మీ ముందుకు వచ్చా. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంపుతామని బెదిరిస్తున్నారు. మీ బిడ్డకు జరుగుతున్న అన్యాయమనుకుని న్యాయం చేయండి’ అని ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షాలకు ఆమె విజ్ఞప్తి చేశారు. నా భార్య విడాకులడిగింది... అయితే మోనికా ఆరోపణలను గగన్ సింపుల్‌గా తోసిపుచ్చారు. ‘మా మధ్య కొంతకాలంగా మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆమె విడాకులు కోరింది. పిల్లల భవిష్యత్ దృష్ట్యా వద్దని వారించా. ప్రస్తుతం కౌన్సిలింగ్ జరుగుతోంది. అందుకే ఈ ఆరోపణలు’ అని గగన్ చెబుతున్నారు. అయితే కౌన్సిలింగ్ జరుగుతున్న మాట వాస్తవమేనని, కానీ, చెల్లించాల్సిన భరణం కూడా గగన్ ఇవ్వట్లేదని మోనికా చెబుతున్నారు. మరోవైపు పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు భార్యభర్తలు ఇద్దరూ హాజరుకాగా, అదే సమయంలో పార్టీ కార్యాలయం వెలుపల సదరు యువతి తాత నిరసన ప్రదర్శన చేపట్టడం గమనార్హం. గగన్ చాలా మంచాయన... గత నెల చివర్లో తన కూతురిని గగన్ అపహరించాడంటూ పంజాబ్‌కు చెందిన ఓ మాజీ సైనికాధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువతిని ఎట్టకేలకు రక్షించి మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో యువతి.. ‘గగన్ చాలా మంచి వ్యక్తి అని.. తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని ఆమె అంటోంది. తన తల్లిదండ్రులను ప్రలోభపెట్టి గగన్పై ఆరోపణలు, అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారని వెల్లడించటం విశేషం. మరోవైపు గగన్ తనపై కుట్ర జరుగుతోందని.. ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెబుతున్నారు. -
లవ్ లెటర్ చించేశాడని పెట్రోల్ పోసి నిప్పంటించాడు
అర్ధవీడు(గిద్దలూరు): ఓ యువతికి ఇచ్చిరమ్మన్న లవ్ లెటర్‌ను చించేశాడనే కోపంతో పాఠశాల విద్యార్థిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణం శనివారం ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. అర్ధవీడు మండలం అంకభూపాలేనికి చెందిన మెట్ల శేఖర్, వెంకటలక్ష్మమ్మ దంపతుల కుమారుడు రవితేజ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం భోజనం తరువాత స్కూలులో నిరుపయోగంగా ఉండే గదిలోంచి రవితేజ పెద్దగా కేకలు వేయడంతో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు పరుగున అక్కడికి వెళ్లారు. మంటల్లో కాలుతున్న రవితేజ ఒంటిపై దుప్పటి కప్పి నీళ్లు చల్లి మంటలార్పారు. అనంతరం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. ఘటనపై అనుమానాలెన్నో... గాయపడిన రవితేజ కంభం ప్రభుత్వ వైద్యశాలలో విలేకర్లతో మాట్లాడుతూ తాను మూత్ర విసర్జన కోసం పాఠశాల బయటకి రాగా రంజిత్ అనే ఇంటర్ విద్యార్థి తనకు ఒక చీటీ (లవ్‌లెటర్)ఇచ్చాడని, స్కూలు ప్రాంగణంలోనే ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే ఓ యువతికి ఇచ్చిరమ్మన్నాడని చెప్పాడు. తాను ఆ కాగితాన్ని చించి వేయడంతో రంజిత్ తన వెంట తెచ్చుకున్న బాటిల్లోని పెట్రోల్‌ను తనపై పోసి, నిప్పంటించాడని తెలిపాడు. ఇదిలా ఉండగా రవితేజ ఇంటి నుంచే పెట్రోలు తెచ్చుకున్నాడని, తనే కాల్చుకొని ఉండొచ్చని స్కూలు హెచ్ఎం వెంకటేశ్వర్లు చెబుతుండటం అనుమానాలకు తావిస్తోంది. ఆయన మాటలను బాధితుడి తల్లిదండ్రులు ఖండిస్తున్నారు. తమ కుమారుడికి ఏదైనా జరిగితే టీచర్లే బాధ్యత వహించాలని చెప్పారు. నిందితుడి గుర్తింపు.. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ రవీంద్రారెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నిందితుడు అదే ప్రాంగణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదవుతున్న మాదార్సు రంజిత్‌కుమార్‌గా గుర్తించారు. సీఐ భీమానాయక్ నిందితుడిని అదుపులోకి తీసుకుని మార్కాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా పెట్రోల్ రంజిత్ పోశాడా.. రవితేజ తెచ్చాడా..? లేదా ఆ యువతిపై పోసేందుకు రంజితే తెచ్చాడా..? అనే అంశాలపై విచారణ చేస్తున్నారు. -
జెస్నా కోసం ఇడుక్కీ అడవుల్లో..
తిరువనంతపురం : ఈ ఏడాది మార్చి 22న అదృశ్యమైన కాలేజీ విద్యార్థిని జెస్నా మారియా జేమ్స్ ఆచూకీ కోసం కేరళ పోలీసులు ఇడుక్కి అడవుల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జెస్నా ఆచూకీ ఇంతవరకూ తెలియకపోవడంతో సోషల్ మీడియా వేదికగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం దర్యాప్తు వేగవంతం చేయాలని పోలీసులని ఆదేశించింది. కొట్టాయం ఎస్పీ హరిశంకర్ మాట్లాడుతూ.. జెస్నా కుటుంబం అభ్యర్థన మేరకు సుమారు 400 మంది అటవీ, పోలీసు అధికారులు కలిసి ఆమె కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు(మంగళవారం) ఉదయం నుంచి జెస్నా ఆచూకీ కోసం పది బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయన్నారు. ఎరుమలి, ముందక్కాయం, కుట్టికానమ్ అటవీ ప్రాంతాల్లో ఆమె కోసం వెదుకుతున్నట్లు వెల్లడించారు. కాగా, గత నెల 28వ తేదీన తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు, పడవేరి జాతీయ రహదారి సమీపంలోని అటవీ ప్రాంతంలో సజీవ దహనమైన స్థితిలో యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతురాలి వయస్సు, శరీరపు కొలతలను బట్టి ఆమె జెస్నా అయి ఉండొచ్చని పోలీసులు భావించారు. ఈ మేరకు కాంచీపురం జిల్లా పోలీసు కమిషనర్ సంతోష్ అదమని కేరళ పోలీసులకు సమాచారం ఇచ్చారు. జెస్నా అదృశ్యమై 50 రోజులు దాటినా ఇంతవరకు ఆచూకీ లేని పరిస్థితుల్లో, ఆమె ఆచూకీ తెలిపిన వారికి రూ. 2 లక్షలు బహుమానాన్ని కేరళ పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఈమె ఆమేనా..?
సాక్షి ప్రతినిధి, చెన్నై: కాంచీపురం సమీపంలో సజీవ దహనమైన యువతి కేరళలో అదృశ్యమైన కాలేజీ విద్యార్థినిగా పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కేరళ రాష్ట్రం పత్తనమదిట్ట జిల్లాకు చెందిన జష్టా అనే యువతి పంజారపల్లిలోని కళాశాల్లో రెండో సంవత్సరం చదువుతోంది. ఈ ఏడాది మార్చి 22 నుంచి జష్టా అదృశ్యమైంది. దీనిపై ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె కోసం గాలించారు. జష్టా అదృశ్యమై 50 రోజులు దాటినా ఇంతవరకు ఆచూకీ లేని పరిస్థితుల్లో, ఆమె ఆచూకీ తెలిపిన వారికి రూ.2లక్షలు బహుమానాన్ని కేరళ పోలీసులు ప్రకటించారు. గత 28వ తేదీన తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు, పడవేరి జాతీయ రహదారి సమీపంలోని అటవీ ప్రాంతంలో సజీవ దహనమైన స్థితిలో యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ మృతురాలి వయస్సు, శరీరపు కొలతలను బట్టి ఆమె జష్టా అయిఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాంచీపురం జిల్లా పోలీసు కమిషనర్ సంతోష్ అదమని కేరళ పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
కళాశాలకు వెళ్తూ తిరిగిరాని లోకాలకు..
సాక్షి, రెబ్బెన(ఆసిఫాబాద్): కళాశాలకు వెళ్తున్న అమ్మా.. అంటూ ఇంట్లో నుంచి బయలు దేరిన విద్యార్థిని మరు నిమిషమే మృత్యువు లారీ రూపంలో కబలించింది. అప్పటి వరకు నోరారా అమ్మా అని పిలిచిన కొడుకు క్షణంలోనే విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లి గుండెలవిసెలా రోదించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. శనివారం ఉదయం రెబ్బెన మండలంలోని దేవులగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవులగూడకు చెందిన అజ్మీర సాయిక్రిష్ణ (19) అనే విద్యార్థి దుర్మరణం చెందాడు. వివరాల్లో వెళితే.. దేవులగూడకు చెందిన అజ్మీర తుకారం, అనుషాబాయిల రెండో సంతానం అయిన అజ్మీర సాయిక్రిష్ణ ఎంఎల్టీ పూర్తి చేసి మంచిర్యాలలో అప్రెంటిస్ చేస్తున్నాడు. ప్రతీరోజు బైక్‌తో ఇంటి నుంచి బయలు దేరి ప్రధాన రోడ్డు పక్కన మామ లావుడ్య వినయ్‌కుమార్ హోటల్ వద్ద వాహనాన్ని ఉంచి కళాశాలకు వెళ్లేవాడు. శనివారం సైతం మంచిర్యాలకు వెళ్తున్నా అని ఇంట్లో చెప్పి ద్విచక్ర వాహనంపై వినయ్‌కుమార్ హోటల్‌కు బయలు దేరారు. సరిగ్గా అదే సమయంలో మంచిర్యాల వైపు నుంచి ఆసిఫాబాద్ వైపు వెళుతున్న లారీ డ్రైవర్ అజాగ్రత్తగా అతివేగంతో వాహనాన్ని నడుపుతూ ఎదురుగా వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో బైక్ ఆదుపు తప్పి బోల్తాపడటంతో సాయిక్రిష్ణపై నుంచి లారీ దూసుకుపోయింది. దీంతో తీవ్రగాయాలపాలైన సాయిక్రిష్ణ అక్కడిక్కడే మృతిచెందాడు. అప్పటి వరకు కళ్ల ముందే తిరిగిన కొడుకు ఒక్క నిమిషం వ్యవధిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందటాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. మృతదేహంపై పడి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి మామ వినయ్‌కుమార్ అందించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై మల్లయ్య తెలిపారు. -
పరీక్ష రాయనివ్వలేదని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
ఘట్కేసర్/కీసర: కళాశాల యాజమాన్యం వేధింపులతో ఓ కాలేజీ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలోని ఎస్వీ నగర్లో నివాసం ఉండే రావి నాగేందర్‌రెడ్డి కుమారుడైన అభిషేక్ రెడ్డి(20) ఘట్కేసర్ మండలంలోని అవుశాపూర్ విజ్ఞాన్‌భారతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. 50 శాతం మాత్రమే హాజరు ఉండటంతో అతన్ని కళాశాల యాజమాన్యం పరీక్షలు రాయడానికి అనుమతించలేదు. దీంతో మనస్తాపం చెందిన అభిషేక్ రోజూలాగానే బుధవారం కాలేజీకి బయలుదేరాడు. కానీ సాయంత్రమైనా ఇంటికి రాలేదు. కాగా, గురువారం నగరంలోని ఆళ్లగడ్డ వద్ద రైలు ట్రాక్‌పై గుర్తు తెలియని శవం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలంలో మృతుని వద్ద లభించిన ఆధారాలతో అభిషేక్‌గా పోలీసులు గుర్తించారు. శవాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కళాశాల యాజమాన్యం హాజరు విషయంలో చేసిన వేధింపుల కారణంతోనే అభిషేక్ ఆత్యహత్య చేసుకున్నాడని మృతుని కుటుంబసభ్యులు ఆరోపించారు. మృతుని కుటుంబ సభ్యులది యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట సమీపంలోని గ్రామం. పిల్లల చదువు నిమిత్తం నగరానికి వచ్చారు. -
మోదీజీ అతడ్ని కఠినంగా శిక్షించండి!
న్యాయం చేయాలంటూ ప్రధానికి విద్యార్థిని లేఖ సాక్షి, లక్నో : బీజేపీ పాలితరాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లోనూ మహిళలపై అరాచకాలు తగ్గడం లేదు. రోజు ఏదో ఓ మూల బాలికలు, మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఓ కాలేజీ విద్యార్థిని తన ఆవేదను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు. తనను రక్షించాలని కోరుతూ ప్రధానికి ఓ యువతి మోదీకి లేఖ రాశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ముజఫర్ నగర్‌కు చెందిన ఓ కాలేజీ విద్యార్థినిని గత ఏడాది కాలం నుంచి ఓ ఆకతాయి వేధింపులకు గురిచేస్తున్నాడు. ఎన్నోసార్లు చెప్పి చూసినా యువకుడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో బాధితురాలు ఆందోళన చెందుతున్నారు. తనకు న్యాయం చేయాలని, తనను వేధిస్తోన్న యువకుడిని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేస్తూ మోదీకి బాధిత విద్యార్థిని ఓ లేఖ రాశారు. ఏడాది నుంచి తనవెంట పడి ఓ యువకుడు వేధిస్తున్నాడని, ఇంటి నుంచి బయటకు రావాలంటే భయమేస్తుందని లేఖలో ఆమె పేర్కొన్నారు. ఎలాగైనా తనను వేధిస్తున్న యువకుడిపై కఠిన చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు. ఈ లేఖపై యూపీ అధికారులు స్పందించాల్సి ఉంది. -
పరిచయస్తుడే ప్రాణం తీశాడా?
మొబైల్ కాల్స్‌పై పోలీసుల దృష్టి తృప్తిమయి హత్య కేసులో పురోగతి బరంపురం : బరంపురం కళ్లికోట్ వర్సిటీ విద్యార్థి తృప్తిమయి పండా హత్య కేసులో ఆశించిన రీతిలో పురోగతి కనిపిస్తోంది. బాగా తెలిసినవారే హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఛత్రపూర్‌కు చెందిన తృప్తిమయి పండా స్థానిక అనంత నగర్‌లోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. గత నెల 25న రాత్రి బయటకు వెళ్లిన తర్వాత తిరిగి రాలేదు. ఆంధ్ర ప్రదేశ్‌లోని సోంపేట, బారువ మధ్య గల బేసిరామచంద్రపురం జాతీయ రహదారి పక్కన రక్తపు మడుగులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. హ త్య జరిగిన వారం రోజులైనా నిందితులను గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. ఈ కేసు ఆంధ్ర, ఒడిశా పోలీసులకు సవాల్‌గా మారింది. సీసీ కెమెరాలో కారు తృప్తిమయి పండా హత్య కేసుకు సంబంధించి పోలీసులకు కీలకమైన ఆధారం లభించిందని తెలిసింది. తృప్తిమయి పండా ప్రయాణిస్తున్న కారు ఒడిశా సరిహద్దు దాటుతున్నట్లు గిరిసిలా చెక్‌పోస్ట్‌లోని సీసీ కెమెరాలో నమోదైంది. ఘటన జరిగిన రోజున గిరిసిలా చెక్‌పోస్ట్‌లోని సీసీ కెమెరాల ఫుట్టేజీలు గంజాం పోలీసులు సేకరించినట్లు సమాచారం. దీనికి సంబంధించి వివరాలు తెలిపేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. వివరాలు వెల్లడిస్తే దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని పోలీసులు తెలిపారు. ఫోన్ కాల్స్ సేకరణ విద్యార్థి హత్య కేసు మిస్టరీ ఛేదించడానికి ఆంధ్ర, ఒడిశా పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల పోలీసులు ఆధారాల సేకరణలో మునిగిపోయారు. ఆమె ఫోన్ కాల్స్ లిస్ట్‌ను ఆంధ్ర పోలీసులు సేకరించినట్లు తెలిసింది. తృప్తిమయి ఎవరితో మాట్లాడింది, ఎవరి నుంచి కాల్స్ వచ్చాయి, ఆఖరి ఫోన్ ఎవరు చేశారని ఆరా తీస్తున్నారు. ఆమె చివరి ఫోన్ కాల్ ఎవరికి చేసిందని ఆరా తీస్తున్నారు. తెలిసినవారే హంతకులు? విద్యార్థిని తృప్తిమయితో బాగా పరిచయం ఉన్న వారే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రేమ వ్యవహారం కారణమనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు ఆలస్యమైతే నిందితులు రాష్ట్రం నుంచి పారిపోయే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. విద్యార్థిని హత్య కేసు ఇరు రాష్ట్రాల పోలీసులకు సవాల్‌గా మారింది. -
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా
చెన్నై: సెల్ఫీ తీసుకోవడానికి యత్నించగా పొరపాటుగా గుంతలో పడి కళాశాల విద్యార్థి మృతిచెందాడు. ఈ విషాద ఘటన కోయంబత్తూరు సమీపంలో చోటు చేసుకుంది. కోయంబత్తూరు సమీపంలోని పీలమేడు ప్రాంతానికి చెందిన కార్పెంటర్ రవి కుమారుడు హరికిషోర్. ఇతడు అదే ప్రాంతంలోని ప్రైవేటు కళాశాలలో బీకాం మూడో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం స్నేహితులతో కలసి కళాశాల సమీపంలో ఉన్న రాళ్ల క్వారీకి వెళ్లాడు. అక్కడున్న చెరువులో మిత్రులు స్నానం చేయడానికి దిగారు. ఈత రాకపోవడంతో హరికిషోర్ అక్కడున్న రాయిపై కూర్చొన్నాడు. ఆ సమయంలో హరికిషోర్ తన సెల్ఫోన్లో ఫొటోలు తీస్తున్నాడు. తరువాత సెల్ఫీ తీసుకుంటూ ఉండగా రాయిపై నుంచి జారి గుంతలో పడ్డాడు. అందులో నీళ్లు నిండుగా ఉండడంతో మునిగిపోయి మృతి చెందాడు. సహచరులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. రెండు గంటలు శ్రమించిన తరువాత హరికిషోర్ మృతదేహాన్ని వెలికి తీశారు. సంఘటనపై పీలమేడు పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
గుండెపోటుతో విద్యార్థి మృతి
తుంగతుర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ విద్యార్ధి మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. కొంతకాలంగా హృద్రోగంతో బాధపడుతున్నరవి మంగళవారం ఉదయం కళాశాలకు వచ్చాడు. తరగతికి వెళ్లే లోపు.. కాలేజీ ఆవరణలో కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు. దీంతో కళాశాలలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
పారిశుధ్య ‘వేత్త’
జార్ఖండ్‌లో బిఎ చదివే కాలేజీ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుందంటే కారణం... ఏ ప్రేమో, పరీక్షల్లో తప్పడమో కాదు... ఆమె ఇంట్లో టాయిలెట్ లేకపోవడం. ఇటీవల జరిగిన ఈ సంఘటన దేశంలో మరుగుదొడ్ల అవసరం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఓ ఉదాహరణ. ‘‘ఒక్క ఫోన్ కాల్‌తో టాయిలెట్ కట్టించి ఇచ్చే కార్యక్రమం మేం చేపట్టడానికి ఇలాంటి సంఘటనలే కారణం’’ అంటారు రవికుమార్ రెడ్డి. పల్లె వెలుగు కోసం... టాయిలెట్ కావాల్సిన వారికి టోల్‌ఫ్రీ నెంబరు అనే వినూత్న ఆలోచనకు రూపమిచ్చిన రవిరెడ్డి (55) జన్మస్థలం నెల్లూరు. కొన్నేళ్ల క్రితమే హైదరాబాద్ వచ్చేశారు. వృత్తిరీత్యా చార్టెర్డ్ అకౌంటెంట్. చిన్న తనం నుంచీ గ్రామీణ ప్రాంతాల పట్ల మక్కువ కలిగిన ఆయన పల్లెలో పారిశుధ్ధ్య పరిస్థితులను మెరుగుపరచడానికి తన వంతు చేయూతను అందించే రీడ్స్ సంస్థలో 1989లో ప్రవేశించారు. ‘‘సెంట్రల్ గవర్నమెంట్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో మానిటరింగ్ ఏజెన్సీగా పనిచేసిన సమయంలో ఒరిస్సా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక... ఇలా పలు రాష్ట్రాల్లోని పల్లె ప్రాంతాలను తిరిగాను. ఆ అనుభవంతో పల్లెటూర్లలో పారిశుధ్ధ్యం, రక్షిత మంచినీరు... అత్యవసరమైన అంశాలుగా గుర్తించాను. 2004లో రీడ్స్ సారథ్య బాధ్యతలు చేపట్టాక, నా అనుభవాన్ని ఉపయోగించి పల్లె వాసులకు ఉపయుక్తమైన కార్యక్రమాలు ప్రారంభించాను’’ అని వివరించారు రవిరెడ్డి. సేఫ్ వాటర్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆయన మొబైల్ వాటర్ ట్రీట్మెంట్ యూనిట్స్‌ను కూడా పరిచయం చేశారు. చేతుల్ని శుభ్రపరచుకునే విషయంలో చిన్నారుల్లో అవగాహన కలిగించడానికి దేశవ్యాప్తంగా 7వేల స్కూల్స్‌ను సందర్శించారు. అలాగే గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు ఎన్నో ఉన్నా అవి అందుబాటులోకి రాకపోవడాన్ని గుర్తించిన ఆయన ఆ దిశగా కూడా తన వంతు కృషి చేస్తూ పలు అంతర్జాతీయ, జాతీయ కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. ‘‘రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది నాకు వ్యక్తిగతంగా అత్యంత ఇష్టమైన వ్యాపకం. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు దొరికే ఖాళీ సమయంలో సగం సద్వినియోగమైతే చాలు... దేశం సుసంపన్నమైపోవడానికి’’ అంటారు రవిరెడ్డి. ఈ అంశంలో ఆయన కృషిని గౌరవిస్తూ... అమెరికాకు చెందిన సెంటినల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను అందించింది. స్వచ్ఛ భారత్... స్ఫూర్తిగా... దేశంలో దాదాపు 13 కోట్ల ఇళ్లకు మరుగుదొడ్లు లేని నిజాన్ని ఇటీవల జరిగిన సర్వే వెల్లడి చేయడంతో కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచింది. స్వచ్ఛభారత్ ను ప్రకటించి పెద్ద యెత్తున ప్రచారం చేస్తోంది. అయితే మరుగుదొడ్లు లేని వారిలో 11 కోట్లకు పైగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారే. వీరికి ఈ ప్రచారమేమిటో, మరుగుదొడ్డి నిర్మాణంలో ప్రభుత్వం అందించే సహకారం ఏమిటో తెలిసేదెలా? ఈ పరిస్థితిని గుర్తించిన రీడ్స్... ఈ విషయంలో గ్రామీణులకు అవగాహన పెంచడానికి సిద్ధమైంది. సంస్థ ప్రకటించిన టోల్‌ఫ్రీ నెంబరుకు ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు, తమ ప్రతినిధులే స్వయంగా సదరు వ్యక్తిని కలిసి టాయిలెట్ నిర్మాణంలో ఆ వ్యక్తి ఎదుర్కొంటున్న సాధక బాధకాలేమిటో తెలుసుకుంటారు. ప్రభుత్వం నుంచి ఎంత మేరకు సహాయం పొందవచ్చో వివరిస్తారు. అధికారులకు అవసరార్ధులకు మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరిస్తామని, నిర్మాణపరమైన సాంకేతిక సహకారం కూడా అందిస్తామని రవిరెడ్డి చెప్పారు. మరుగుదొడ్డి నిర్మాణంలో గ్రామీణులకు సహకరించేందుకు యునిసెఫ్‌తో కలిసి రీడ్స్ (రూరల్ ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ) స్వచ్ఛంద సంస్థ తరపున ఆయన గుంటూరు జిల్లా, సత్తెనపల్లిలో ఇటీవలే టోల్ ఫ్రీ నెంబరు (040 911200) ను ఏర్పాటు చేయడం విశేషం. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఒక్క జిల్లాలోనే అమలు చేస్తున్న ఈ కార్యక్రమం భవిష్యత్తులో తెలుగురాష్ట్రాల వ్యాప్తంగా చేపట్టాలని యోచిస్తున్నామన్నారాయన. కేంద్ర ప్రభుత్వం ఆశించినట్టుగా 2019 కల్లా దేశంలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలంటే అంతటి బృహుత్తర లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని అంటున్నారాయన. - ఎస్.సత్యబాబు సంకల్పం -
విద్యార్థినిపై డాక్టర్, కానిస్టేబుళ్ల అత్యాచారం!
రాయ్‌పూర్: ఓ కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఆరోపణలతో చత్తీస్‌ఘడ్‌లోని దుర్గ్ జిల్లాలో ఓ ప్రభుత్వ వైద్యుడు, ఇద్దరు కానిస్టేబుళ్లు గురువారం అరెస్టయ్యారు. లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ గౌతం పండిట్‌తో పాటు కానిస్టేబుళ్లు చంద్రప్రకాశ్ పాండే, సౌరబ్ భక్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలలోకి వెళితే గత సంవత్సరం జూన్ 19న రోడ్డు ప్రమాదంలో గాయపడిన 22 ఏళ్ల విద్యార్థిని లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరింది. ఆ సమయంలో డాక్టర్‌తోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆ సన్నివేశాలను చిత్రీకరించారు. ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తరువాత కూడా కానిస్టేబుళ్లు ఇద్దరూ వేధించడం మొదలు పెట్టారు. వీడియో చూపించి బెదిరిస్తూ, ఆమెను శారీరకంగా వాడుకుంటున్నారు. మంగళవారం కూడా ఆమెను నగర శివార్లలోకి తీసుకువెళ్లారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరంచడంతో పోలీసులు పారిపోయారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో నగర శివారులోని ఒక పవర్ హౌస్ వద్ద విద్యార్థినిని చూసిన పోలీసులు ప్రశ్నించారు. ఆమె మొత్తం జరిగిన సంఘటనను పోలీసులకు వివరించింది. విద్యార్థిని, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆ డాక్టర్‌ను, ఇద్దరు పోలీసులను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ రాజేష్ అగర్వాల్ చెప్పారు. -
ఒత్తిడి వల్లే విద్యార్థి ఆత్మహత్యాయత్నం
విజయనగరం అర్బన్: పట్టణంలోని ఓ కార్పొరేట్ కళాశాల విద్యార్థి బుధవారం చేసిన ఆత్మహత్యాయత్నం కళాశాల యాజమాన్యం, విద్యార్థుల మధ్య గొడవకు దారితీసింది. సంఘటన జరిగిన 12 గంటల వరకు ఇటు పోలీసులకుగాని సంబంధిత ఇంటర్ పర్యవేక్షణాధికారికిగాని కళాశాల యాజమాన్యం తెలపకపోవడం పలు అనుమానాలకు దారితీసింది. దీంతో విద్యార్థుల సంఘం గురువారం కళాశాలకు చేరుకుని నిరసన చేపట్టారు. కళాశాల ప్రాంగణంలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకుంటే యాజమాన్యం కనీసం స్పందించక పోవడం దారుణమంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. కళాశాల బోధనా తరగతుల నుంచి విద్యార్థులను సేకరించి కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. యాజమాన్య సిబ్బంది, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య రభస జరిగింది. పోలీసుల చొరవతో యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ ఇవ్వడం వల్ల విద్యార్థులు వెనక్కి తగ్గారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ బోధనాతరగతుల విరామ సమయంలో ఈ సంఘటన జరిగిందని, విద్యార్థికి అవసరమైన వైద్యచికిత్సను కళాశాల యాజమాన్యం చేయిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్ధులు మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం ఒత్తిడి చదువుల వల్లే జూనియర్ ఇంటర్ విద్యార్థి శ్రీనివాస్ ఆత్మహత్యా యత్నం చేశాడని చెప్పారు. కొద్దిరోజులుగా మార్కుల విషయం లో విద్యార్థి తల్లిదండ్రులు కూడా మందలించడం వల్ల మానసికంగా కుంగిపోయాడన్నారు. విచారణ చేపట్టిన ఇంటర్ ఆర్ఐఓ బాబాజీ కార్పొరేట్ కళాశాల ప్రాంగణంలో జరిగిన విద్యార్థి ఆత్మహత్యాయత్నం సంఘటనపై ఇంటర్మీడియట్ ప్రాంతీయ తనిఖీ అధికారి ఎల్‌ఆర్‌బాబాజీ గురువారం విచారణ చేపట్టారు. బాధిత విద్యార్థి మానసిక పరిస్థితి, ప్రవర్తనాతీరు, యాజమాన్య సిబ్బంది, అధ్యాపకుల ఒత్తిళ్లకు చెందిన పలు అంశాలపై తోటి విద్యార్థుల నుంచి లిఖిత పూర్వకంగా అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా బాబాజీ మాట్లాడుతూ విద్యార్థుల నుంచి లిఖిత పూర్వకంగా సేకరించిన అభిప్రాయాల నివేదికను కలెక్టర్ ఎంఎంనాయక్, ఇంటర్మీడియెట్ పాలన ఉన్నతాధికారులకు పంపామని చెప్పారు. బాధిత విద్యార్థిపై ఒత్తిడి ఉన్నట్లు రుజువవుతోందన్నారు. ఒత్తిడి చదువులపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆరా..! విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకున్న కార్పొరేట్ కళాశాల నిర్వాకంపై చైల్డ్ వెలే ్ఫర్ కమిటీ శుక్రవారం ఆరా తీసింది. జిల్లా కమిటీ చైర్పర్సన్ కేసలి అప్పారావు కళాశాలకు వచ్చి సంఘటన పూర్వాపరాలను తెలుసుకున్నారు. విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి చదువులను ప్రేరేపించకూడదని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసనాయుడుకు సూచించా రు. సంఘటన వివరాలను లిఖితపూర్వకంగా యాజమాన్యం నుంచి తీసుకున్నారు. కోలుకుంటున్నవిద్యార్థి విజయనగరం క్రైం: పట్టణంలోతోటపాలెంలో ఓ ప్రైవేటు ఇంటర్ మీడియట్కళాశాల మేడపైనుంచి దూకినవిద్యార్థి ఎం.శ్రీనివాస్ ప్రైవేటుఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. బాధితులనుంచి ఫిర్యాదురాకపోవడంతో కేసు నమోదు చేయలేదని సీఐ కె.రామారావు తెలిపారు. -
విద్యార్ధిని అనుమానాస్పద మృతి
-
కాలేజ్ విద్యార్ధిని అదృశ్యం
-
మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి మూడేళ్లు జైలు
థానే: మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేసిన కేసులో ఓ కాలేజీ విద్యార్థికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. థానే అడిషనల్ సెషన్స్ జడ్జి వీవీ విర్కార్ ఈ మేరకు తీర్పునిచ్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. థానేలో యోగేష్ గోవింద్ సోలంకి అనే విద్యార్థి, మరో 14 ఏళ్ల విద్యార్థిని ఒకే ప్రాంతంలో నివాసం ఉండేవారు. ఆ అమ్మాయితో సన్నిహితంగా మెలిగిన సోలంకి.. మూడేళ్ల క్రితం పెళ్లి పేరుతో ఆమెను రాజ్‌కోట్ తీసుకెళ్లాడు. అనంతరం ఆ అమ్మయి బంధువులు సోలంకిపై మైనర్ బాలికను అపహరించడం, అత్యాచారం చేయడం వంటి నేరాలు కింద కేసు పెట్టారు. నిందితుడు నేరం చేసినట్టు రుజువు కావడంతో న్యాయస్థానం శిక్ష విధించింది. -
కళాశాల బస్సు ఢీకొని విద్యార్థిని మృతి
కామారెడ్డిటౌన్/సదాశివనగర్/గాంధా రి, న్యూస్‌లైన్: సదాశివనగర్ మండలం దగ్గి గ్రామశివారులో ప్రధాన రహదారిపై బుధవారం ఉదయం కళాశాల బస్సు ఢీకొని గాంధారి మండలం వజ్జపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని కాట్యాడ శృతి (12) మృతిచెందింది. శృతి కామారెడ్డికి వె ళ్లేందుకు సైకిల్‌పై దగ్గి ప్రధాన రోడ్డుకు వస్తుండగా ఎదురుగా వచ్చిన కామారెడ్డికి చెందిన జ్ఞానదీప్ జూనియ ర్ కళాశాలకు చెందిన (ఏపీ 25డబ్ల్యూ 5383) నంబరు బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శృతి ఎగిరిపడడ ంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉం డంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెంది ంది. శృతి కామారెడ్డి పట్టణంలోని ఆర్కిడ్స్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. ప్రతిరోజు పాఠశాలకు వెళ్ల్లేందు కు వజ్జపల్లి నుంచి దగ్గి రోడ్డు వరకు సైకిల్‌పై వచ్చి, అక్కడ సైకిల్ పెట్టి బస్సులో కామారెడ్డికి పాఠశాలకు వెళ్తుండేది. కుమార్తె మృతితో తల్లిదండ్రులు రాజేం దర్రావ్, లక్ష్మీబాయి విలపించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గ్రామస్తుల ఆగ్రహం.. తమ బస్సు వల్లే విద్యార్థిని మృతి చెంది నా కళాశాలకు చెందిన యాజమాన్యం స్పందించకపోవడంతో వజ్జపల్లి గ్రామస్తులు, బంధువులు కామారెడ్డి పట్టణంలోని జ్ఞానదీప్ కళాశాల యాజమాన్యం పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో కళాశాల సిబ్బందితో ఏరి యా ఆస్పత్రిలో వాగ్వాదానికి దిగారు. యాజమాన్యం స్పందించకపోవడంతో జీవదాన్ ఆస్పత్రి సమీపంలో ఉన్న కళాశాల వద్దకు వెళ్లి ఆఫీస్ చాంబర్లో ఉన్న కంప్యూటర్, బీరువాలు, కిటీకీల, అద్దా లు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. పోలీ సులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కళాశాల యా జమాన్యం తరపున కొందరు వ్యక్తులు వచ్చి గ్రామస్తులతో మాట్లాడారు. నష్టపరిహారం చెల్లించడానికి అంగీకరించడంతో సమస్య సద్దుమణిగింది. పోస్టుమార్టం అనంతరం గ్రామస్తులు గ్రామానికి వెళ్లిపోయారు.