
టీనేజీ అమ్మాయితో ఎమ్మెల్యే రాసలీలలు.. మీడియా ముందుకు భార్య. న్యాయం జరిగేనా... ?
భార్య ఉండగానే.. టీనేజీ యువతితో సంబంధం నెరిపిన బీజేపీ నేత బాగోతం హాట్ టాపిక్‌గా మారింది. జమ్ము కశ్మీర్ బీజేపీ ఎమ్మెల్యే గగన్ భగత్‌పై ఆయన భార్య మోనికా శర్మ సంచలన ఆరోపణలకు దిగారు. 19 ఏళ్ల ఓ యువతితో అఫైర్ నడపటమే కాకుండా.. రహస్యంగా ఆమె వివాహం చేసుకున్నాడంటూ ఆరోపిస్తూ మోనికా మీడియా ముందుకు వచ్చారు.
సాక్షి, న్యూఢిల్లీ/శ్రీనగర్: ఆర్‌ఎస్ పుర నియోజకవర్గ ఎమ్మెల్యే గగన్.. ఆయన భార్య మోనికా శర్మ జమ్ము బీజేపీ మహిళా విభాగానికి కార్యదర్శి. గగన్ పంజాబ్‌కు చెందిన 19 ఏళ్ల ఓ యువతితో వివాహేతర సంబంధం నడుపుతున్నారని ఆరోపిస్తూ మోనికా శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ‘నా భర్త మంచోడు కాదు. గత కొంతకాలంగా ఓ కాలేజీ యువతితో అఫైర్ నడుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆ అమ్మాయిని రహస్య వివాహం కూడా చేసుకున్నారు. ఇంతకాలం సాక్ష్యాలు లేక ఆగిపోయా. ఇప్పుడు ఈ ఆధారాలతో(ఫోటోలు) మీ ముందుకు వచ్చా. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంపుతామని బెదిరిస్తున్నారు. మీ బిడ్డకు జరుగుతున్న అన్యాయమనుకుని న్యాయం చేయండి’ అని ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షాలకు ఆమె విజ్ఞప్తి చేశారు.
నా భార్య విడాకులడిగింది... అయితే మోనికా ఆరోపణలను గగన్ సింపుల్‌గా తోసిపుచ్చారు. ‘మా మధ్య కొంతకాలంగా మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆమె విడాకులు కోరింది. పిల్లల భవిష్యత్ దృష్ట్యా వద్దని వారించా. ప్రస్తుతం కౌన్సిలింగ్ జరుగుతోంది. అందుకే ఈ ఆరోపణలు’ అని గగన్ చెబుతున్నారు. అయితే కౌన్సిలింగ్ జరుగుతున్న మాట వాస్తవమేనని, కానీ, చెల్లించాల్సిన భరణం కూడా గగన్ ఇవ్వట్లేదని మోనికా చెబుతున్నారు. మరోవైపు పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు భార్యభర్తలు ఇద్దరూ హాజరుకాగా, అదే సమయంలో పార్టీ కార్యాలయం వెలుపల సదరు యువతి తాత నిరసన ప్రదర్శన చేపట్టడం గమనార్హం.
గగన్ చాలా మంచాయన... గత నెల చివర్లో తన కూతురిని గగన్ అపహరించాడంటూ పంజాబ్‌కు చెందిన ఓ మాజీ సైనికాధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువతిని ఎట్టకేలకు రక్షించి మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో యువతి.. ‘గగన్ చాలా మంచి వ్యక్తి అని.. తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని ఆమె అంటోంది. తన తల్లిదండ్రులను ప్రలోభపెట్టి గగన్‌పై ఆరోపణలు, అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారని వెల్లడించటం విశేషం. మరోవైపు గగన్ తనపై కుట్ర జరుగుతోందని.. ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెబుతున్నారు.