
బనశంకరి: నగరంలో పెద్దఎత్తున డ్రగ్స్ విక్రయిస్తున్న కేరళ డ్రగ్స్ పెడ్లర్‌ను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి రూ.6.5 లక్షల విలువచేసే 49 గ్రాముల 90 ఎక్స్‌టసి మాత్రలు, 40 గ్రాముల చరస్, 5 గ్రాముల ఎండీఎంఏ క్రిస్టల్, ల్యాప్‌టాప్, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. హెణ్ణూరు పరిధిలో డ్రగ్స్ అమ్ముతున్నట్లు తెలిసి నిందితుడు మహమ్మద్ రన్నార్‌ను మంగళవారం నిర్బంధించారు. ఇతను బిట్‌కాయిన్లను ఉపయోగించి డార్క్ వెబ్ ద్వారా విదేశాల నుంచి డ్రగ్స్‌ను నగరానికి తెప్పించి కాలేజీ విద్యార్థులకు విక్రయించేవాడు.
(చదవండి: కడుపులో 11.57కోట్ల కొకైన్..)