
తిరువనంతపురం: కేరళలో ప్రియురాలితో సహా, నలుగురు కుటుంబ సభ్యుల్ని అతి దారుణంగా హత్య చేసిన ‘సైకో కిల్లర్’ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 23 ఏళ్ల అఫాన్ నుంచి కీలక వాంగ్మూలాన్ని నమోదు చేశారు పోలీసులు.
ఈ హత్యలు అనంతరం వెంజరామూడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన అఫాన్.. ఆపై ఆత్మహత్యాయత్నం చేశాడు. పాయిజన్ తీసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఇదంతా పోలీసులకు సరెండర్ అయిన తర్వాత జరగ, ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ నిందితుడి నుంచి స్టేట్ మెంట్ లు తీసుకుంటున్నారు పోలీసులు. అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది అనే కోణంలో ప్రశ్నించగా, తన గర్ల్ ఫ్రెండ్ ను ఎందుకు హత్య చేశాడో వెల్లడించాడు.
ఒంటరిగా ఉండలేను అన్నందుకే..
తన ప్రేయసిని చంపడానికి ‘నేను లేకుండా ఆమె ఒంటరిగా బ్రతకలేదు’’ అనే ఉద్దేశంతోనే హత్య చేయాల్సి వచ్చిందని నిందితుడు పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. కుటుంబాన్ని ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే దానికి సదరు నిందితుడు సమాధానం చెప్పాడు. తన కుటుంబం ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకుందని, అందుకు తానే హత్య చేయాలనుకున్నానని పోలీసులు పేర్కొన్నారు.
అయితే అతని స్టేట్ మెంట్ ను ఇంకా పూర్తిగా నమ్మలేమని, విచారణ జరుగుతుందన్నారు పోలీసులు. అతను చెప్పేదాంట్లో నిజమెంతో ఇంకా దర్యాప్తు చేస్తే కానీ తెలియదన్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారన్నారు. అతని బ్లడ్ శాంపిల్స్ ను మెడికల్ టెస్టు కోసం పంపామన్నారు. అరెస్ట్ చేసి రిమాండ్ కోరతామని, ఈ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు కోసం అతన్ని కస్టడీకి తీసుకుని విచారిస్తామన్నారు.
రూ. 65 లక్షల అప్పు.. ఆపై హత్యలకు ప్లానింగ్
ఈ హత్యలకు ముందు 14 మంది రూ. 65 లక్షల వరకూ అప్పు తీసుకున్నాడు. అనంతరం తాను హత్యలు చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. నిందితుడి కుటుంబ సభ్యుల్లో ఒకరైన 88 ఏళ్ల బామ్మతో పాటు, 13 ఏళ్ల తమ్ముడిని, వరుసకు అత్తయ్య ఆమెను, ఆమె భర్తను, గర్ల్ ఫ్రెండ్ ను హత్య చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment