bit coins
-
కేరళ పెడ్లర్ అరెస్టు, డ్రగ్స్ సీజ్
బనశంకరి: నగరంలో పెద్దఎత్తున డ్రగ్స్ విక్రయిస్తున్న కేరళ డ్రగ్స్ పెడ్లర్‌ను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి రూ.6.5 లక్షల విలువచేసే 49 గ్రాముల 90 ఎక్స్టసి మాత్రలు, 40 గ్రాముల చరస్, 5 గ్రాముల ఎండీఎంఏ క్రిస్టల్, ల్యాప్‌టాప్, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. హెణ్ణూరు పరిధిలో డ్రగ్స్ అమ్ముతున్నట్లు తెలిసి నిందితుడు మహమ్మద్ రన్నార్ను మంగళవారం నిర్బంధించారు. ఇతను బిట్కాయిన్లను ఉపయోగించి డార్క్ వెబ్ ద్వారా విదేశాల నుంచి డ్రగ్స్‌ను నగరానికి తెప్పించి కాలేజీ విద్యార్థులకు విక్రయించేవాడు. (చదవండి: కడుపులో 11.57కోట్ల కొకైన్..) -
ఇంటర్నెట్లో అండర్ వరల్డ్‌గా డార్క్ వెబ్!
...ఇటీవల కాలంలో బయటపడిన ఈ రెండు ఉదంతాలే కాదు... నగరంలో జరుగుతున్న డ్రగ్స్ దందాలో సగానికి పైగా డార్క్ నెట్ ద్వారానే సాగుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు నెలల క్రితం మహేష్ బ్యాంక్ కేంద్రంగా చోటు చేసుకున్న రూ.12.48 కోట్ల స్కామ్‌లోనూ డార్క్ వెబ్ పాత్ర ఉంది. ఈ నేపథ్యంలోనే దీనిపై పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. హెచ్–న్యూలో పని చేస్తున్న సిబ్బంది, అధికారులకు ఈ కోణంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించడానికీ సన్నాహాలు జరుగుతున్నాయి. సాక్షి హైదరాబాద్: మాదకద్రవ్యమైన ఎల్ఎస్డీ బ్లాట్స్ డార్క్ నెట్ నుంచి ఖరీదు చేసి, నగరంలో విక్రయిస్తున్న షాబాజ్నగర్, కూకట్పల్లి ప్రాంతాలకు చెందిన సయ్యద్ ఆసిఫ్ జిబ్రాన్, పి.తరుణ్‌లను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు గత నెల 24న పట్టుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందా గుట్టును హెచ్–న్యూ ఫిబ్రవరి 26న రట్టు చేసింది. దీనికి సూత్రధారిగా ఉన్న విద్యార్థి నిమ్మగడ్డ సాయి విఘ్నేష్ డార్క్‌నెట్ నుంచి ఎల్ఎస్డీ బ్లాట్స్ ఖరీదు చేసి విక్రయించాడు. అదో ‘అక్రమ’లోకం డార్క్ నెట్ లేదా డార్క్ వెబ్‌తో సమాజానికి, ఏజెన్సీలకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. మాఫియా ప్రపంచంలో మాదిరిగానే ఆన్‌లైన్‌లోనూ అధోజగత్తు ఉంది. కనిపించే అండర్‌వరల్డ్‌లో మాఫియా డాన్లు రాజ్యమేలితే... ఇంటర్నెట్లోని డార్క్‌నెట్/వెబ్‌గా పిలిచే అండర్‌గ్రౌండ్ వెబ్‌లో డ్రగ్స్, ఆయుధాలు, మనుషుల అక్రమ రవాణా వంటి వ్యాపారాలు సాగుతుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటూ అక్రమ దందాలకు డార్క్ వెబ్ అడ్డాగా మారిపోయింది. నిఘాకు చిక్కకుండా ఉండేందుకు... కంప్యూటర్లలో వినియోగించే విండోస్ ఆపరేటింగ్ సిస్టం, వివిధ చిరునామాలతో ఇంటర్నెట్లో ఉండే వెబ్సైట్లు అందరికీ తెలిసినవే. ఇటీవల కాలంలో అనేక ఈ–కామర్స్ వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చి, అగ్గిపెట్టె నుంచి ఆడి కారు వరకు క్రయవిక్రయాలను ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చాయి. వీటి ద్వారా మాదకద్రవ్యాలు, ఆయుధాలు వంటివి విక్రయానికి పెడితే పోలీసు, నిఘా వర్గాలు గుర్తించి పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి నిఘాకు చిక్కకుండా, ‘తమ వినియోగదారుల’ మినహా మిగిలిన వారికి కనిపించకుండా అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాలు ఇంటర్నెట్లోని అండర్ వరల్డ్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. దీన్ని సాంకేతికంగా ‘డీప్ వెబ్’, ‘అండర్‌గ్రౌండ్ వెబ్’, ‘డార్క్ వెబ్’ అని పిలుస్తారు. ‘ఎంట్రీ’ సైతం ఈజీ కాదు.. ఏ వినియోగదారుడైనా విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో ఈ డీప్ వెబ్‌లోకి చొరబడటం సాధ్యం కాదు. ఈ అధోజగత్తులో అడుగుపెట్టాలంటే టెయిల్స్‌గా పిలిచే ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టంను ఇన్స్టాల్ చేసుకోవాలి. దీంతో పాటే టోర్స్ అనే ఆపరేటింగ్ సిస్టం సైతం ఇన్స్టాల్ అవుతుంది. వీటిని తమ కంప్యూటర్లలో ఏర్పాటు చేసుకుంటున్న పెడ్లర్లు తమ దందా కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు కేవలం ల్యాప్‌టాప్, కంప్యూటర్ ద్వారానే యాక్సస్ చేసే డార్క్ వెబ్‌ను ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల నుంచీ ఆపరేట్ చేసేస్తున్నారు. ఇందులో ఉండే అనేక వెబ్సైట్, గ్రూపులను సంప్రదించి డ్రగ్స్, మారణాయుధాల సహా ఏదైనా ఖరీదు చేసేయవచ్చు. పోస్టు లేదా కొరియర్ ద్వారా వచ్చే ఈ ‘మాల్’ను అందుకోవడానికి తప్పుడు చిరునామాలు ఇచ్చి నేరుగా ఆయా ఆఫీసులకు వెళ్లి..నకిలీ ధ్రువీకరణలు చూపించి డెలివరీ తీసుకుంటూ తమ ఉనికి బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బిట్ కాయిన్స్ రూపంలో చెల్లింపులు... డీప్ వెబ్‌లోని వెబ్సైట్లలో ఆర్డర్ ఓ ఎత్తయితే దీనికి సంబంధించిన చెల్లింపులు మరోఎత్తు. ఈ లావాదేవీలు సైతం ఆన్లైన్లోనే క్రిప్టోకరెన్సీగా పిలిచే బిట్‌కాయిన్స్ రూపంలోనే సాగుతాయి. దీనికోసమూ ఇంటర్నెట్లో కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. వాటిలోకి లాగిన్ కావడం ద్వారా ఓ ఖాతా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా నగదు చెల్లించి బిట్ కాయిన్స్‌ను తమ ఖాతాలోకి జమ చేసుకుంటారు. ‘డీప్ వెబ్’లో కొనుగోలు చేసిన ‘మాల్’కు అవసరమైన చెల్లింపులన్నీ ఈ బిట్‌కాయిన్స్ రూపంలోనే చేస్తారు. ఈ వ్యవహారంలో ఎక్కడా విక్రయిస్తున్న, ఖరీదు చేస్తున్న వ్యక్తుల వివరాలు వేరొకరికే కాదు... ఒకరికొకరికీ తెలిసే అవకాశం ఉండదు. హెచ్–న్యూకు చిక్కిన పెడ్లర్స్ ఈ రకంగానే దందా చేస్తూ ఎల్ఎస్డీని ఖరీదు చేసి నగరంలోని వారికి సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. సర్వర్లను కనిపెట్టడమూ అసాధ్యమే ‘డీప్ వెబ్’కు సంబంధించిన సర్వర్లు, వాటి చిరునామాలతో పాటు నిర్వహిస్తున్న వారి వివరాలూ బయటకు తెలిసే అవకాశాలు లేవు. ఇదే అసాంఘిక శక్తులకు కలిసి వస్తున్న అంశంగా మారిపోయింది. ఈ తరహా కేసులు గతంలో ఇతర నగరాల్లో ఎక్కువగా వెలుగులోకి వచ్చినా... ఇటీవల కాలంలో నగరంలోనూ పెరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఇలా ఆర్డర్ చేసిన డ్రగ్స్‌లో కొన్ని విదేశాల నుంచి మరికొన్ని ఉత్తరాది నుంచి వస్తున్నట్లు ఆధారాలు సేకరించామన్నారు. (చదవండి: డీజే.. డ్రగ్స్ రిస్క్!) -
బెళగావిలో ఇక సెగలే
సాక్షి, బెంగళూరు(కర్ణాటక): భిన్న సంస్కృతులకు వేదికైన బెళగావిలోని రెండో అసెంబ్లీ భవనం సువర్ణసౌధ శీతాకాల శాసనసభ సమావేశాలకు ముస్తాబైంది. సోమవారం ఉదయం నుంచి పదిరోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే సీఎం, విపక్ష నేతలు, మంత్రులు సహా ఉన్నతాధికారులు బెళగావికి చేరుకున్నారు. బొమ్మై సీఎం అయ్యాక జరుగుతున్న రెండో అసెంబ్లీ సమావేశాలు కాగా, అనేక ముఖ్య అంశాలతో సర్కారుపై దాడికి విపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. కరోనా సమస్య, మేకెదాటు ఆనకట్ట, బిట్కాయిన్ల స్కాం, వరదల్లో జనం నష్టపోవడం, నిత్యావసర ధరల పెంపు ఇలా అనేక వైఫల్యాలు ఉన్నాయని ప్రతిపక్ష నేతలు ధీమాగా ఉన్నారు. కమీషన్ల ఆరోపణలు.. రాష్ట్ర ప్రభుత్వంలోని కొన్ని శాఖల్లో 40 శాతం కమీషన్ నడుస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సంబంధిత మంత్రులు సమాధానం ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. ప్రజాపనులు, జలవనరుల శాఖలపై ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు వరదమయం అయ్యాయి. అక్కడి ప్రజలకు పరిహారం అందజేయడంతో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తనున్నారు. రాష్ట్రంలో సుమారు 35 వేల ఇళ్లు దెబ్బ తిన్నాయి. ఇప్పటికి రూ.204 కోట్ల పరిహారం విడుదల చేశారు. మత మార్పిడి చట్టం రగడ.. రాష్ట్రంలో మత మార్పిళ్లకు వ్యతిరేకంగా చట్టం తెస్తామని సీఎం ప్రకటించడం వివాదాస్పదమైంది. పలు మత సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ప్రధాన ప్రతిపక్షం కూడా వ్యతిరేకత వ్యక్తం చేసింది. సీఎం బొమ్మై మాత్రం కచ్చితంగా చట్టం చేస్తామని చెబుతున్నారు. తొలిరోజు నుంచే రభస జరిగేలా ఉంది. బెంగళూరు సమీపంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నమేకెదాటు ప్రాజెక్టును ఎందుకు నిర్మించడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఎందుకు అనుమతులను తెచ్చుకోవడం లేదనేది చర్చకొచ్చే అవకాశం ఉంది. మరోవైపు మంగళవారం విడుదల కానున్న 25 ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు ఈ సమావేశాలపై ప్రభావం చూపవచ్చు. చదవండి: ఆమె ఇంట అతడు.. భర్తకు విషయం తెలిసి.. -
బిట్‌కాయిన్ కుంభకోణం: సీఎంకు మాజీ సీఎం.. అభయం..
సాక్షి, బనశంకరి(కర్ణాటక): బిట్‌కాయిన్ కుంభకోణంతో సతమతమవుతున్న సీఎం బసవరాజ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్పను ఆశ్రయించారు. హైకమాండ్‌తో చర్చిస్తానని యడ్డి అభయం ఇచ్చినట్లు రాజకీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో బిట్‌కాయిన్ స్కాం వెలుగుచూడడంతో కాంగ్రెస్‌పార్టీ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ బీజేపీని ఇరుకునపెడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం ఢిల్లీకి వెళ్లి మరీ పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇది ముఖ్యమంత్రి కుర్చీకి నీళ్లు తేవచ్చని బొమ్మై ఆదుర్దాతో ఉన్నారు. మంత్రులు, పార్టీ సహాయం తీసుకుని ప్రతిపక్షాల ఆరోపణలకు దీటుగా సమాధానం ఇవ్వాలని యడియూరప్ప సలహా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఎక్కడికక్కడ మంత్రులు బిట్‌కాయిన్ స్కాంలో ప్రత్యారోపణలతో దాడి చేయాలని సీఎం ఆదేశించారు. -
బిట్‌కాయిన్ కుంభకోణం: వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు..
సాక్షి, బనశంకరి(కర్ణాటక): బిట్‌కాయిన్ కుంభకోణంలో సీసీబీ పోలీసుల విచారణలో రోజూ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. కుంభ కోణానికి కేంద్రబిందువైన శ్రీకృష్ణ అలియాస్ శ్రీకి, పలు వెబ్సైట్లను హ్యాక్ చేసి బిట్‌కాయిన్ కార్యకలాపాలకు ఎలా పాల్పడింది బహిర్గతమైంది. ఐదేళ్ల పాటు బిట్‌కాయిన్ దందాలో భాగస్వామిగా తాజాగా సీసీబీ పోలీసులకు పట్టుబడిన రెండో వ్యక్తి రాబిన్ ఖండేన్వాలా. ఇతడు శ్రీకి దందా పట్ల నోరువిప్పాడు. హ్యాకింగ్ ఎలా చేశారు, ఎవరికి బిట్కాయిన్లను విక్రయించారు, ఈ దందాలో ఎవరెవరు భాగస్వామిగా ఉన్నారు అనే విషయాలపై రాబిన్ ఏడు పేజీల వాంగ్మూలం ఇచ్చాడు. ఎవరీ ఖండేన్వాలా? పశ్చిమబెంగాల్ కు చెందిన రాబిన్ఖండేన్వాలా సీఏ పట్టభద్రుడు కాగా 2012 నుంచి 16 వరకు తండ్రి నిర్వహించే రైస్‌మిల్ చూసుకునేవాడు. 2016లో రాబిన్ సర్వీసెన్ పేరుతో బిట్‌కాయిన్ లావాదేవీలను ప్రారంభించాడు. పలు వెబ్సైట్ల తెరిచి అమ్మకం, కొనుగోళ్లను చేసేవాడు. ఇంతవరకు రూ.50 కోట్లు వ్యవహారాలు నిర్వహించినట్లు తెలిసింది. 2017 ఏప్రిల్‌లో హ్యాకర్ శ్రీకృష్ణ ఆన్లైన్లో పరిచయమయ్యాడు. ఇద్దరు చాటింగ్ చేసుకునేవారు. ఈ సమయంలో శ్రీకృష్ణ తనవద్దనున్న 900 బిట్కాయిన్లు విక్రయించాలని కోరగా, రాబిన్ వాటిని అమ్మి ఆ డబ్బును శ్రీకి అకౌంట్లోకి జమచేశాడు. సుమారు రూ. ఐదారు కోట్ల వ్యవహారాలు నడిపారు. వందలాది కాయిన్ల అమ్మకాలు శ్రీకి గోవాలో పోకర్ ఆన్లైన్ గేమ్ వెబ్సైట్లను హ్యాక్ చేశాడని రాబిన్ చెప్పాడు. అలా శ్రీకి కోట్లాది రూపాయలను దోచుకుని గోవాలో విలాసాలు చేసేవాడు. 2017 నుంచి అనేక వెబ్సైట్లను హ్యాక్ చేసిన శ్రీకి 130 బిట్కాయిన్లను రాబిన్ ఖండేన్వాలాకు ఇచ్చాడు. దీనిని విక్రయించి రూ.3.48 కోట్ల నగదును 50 మందికి పైగా అకౌంట్లలోకి జమచేశాడు. మిగిలిన డబ్బును శ్రీకి జల్సాలకు చెల్లించాడు. శ్రీకి హ్యాక్ చేయడానికి యాపిల్ మ్యాక్‌బుక్ ప్రొ ల్యాప్‌టాప్‌ను వినియోగించేవాడు. హవాలా ద్వారా రూ.4.98 కోట్లు 2017లో శ్రీకృష్ణ ఇరిడియం టోకెన్లను అందించి రాబిన్ ద్వారా అమ్మేయించాడు. 2018లో బెంగళూరు కు వచ్చినప్పుడు శ్రీకి హ్యాకర్ అని తెలిసిందని విచారణలో చెప్పాడు. ఒక హోటల్లో శ్రీకి, మహమ్మద్ నలపాడ్ తదితరులు తనను కలిశారని తెలిపాడు. బిట్కాయిన్ల గురించి చర్చ జరిపామని, కొద్దినెలల తరువాత ఓ కేసులో నలపాడ్ అరెస్టయ్యాడు. ఈ సమయంలో శ్రీకికి తన ఇంట్లో ఐదురోజులు ఆశ్రయం ఇచ్చానని, ఈ సమయంలో ఢిల్లీ, చండీఘడ్, జైపూర్, ముంబై తదితరాలకు వెళ్లినట్లు రాబిన్ చెప్పాడు. 2018లో శ్రీకి అడగడంతో 30 బిట్కాయిన్లను బదిలీ చేశానని, సుజయ్, సునీశ్, ప్రసిద్ధ్ శెట్టి, సురేశ్ అనే వారిని పరిచయం చేశాడన్నారు. శ్రీకి కి నగదు కావాలనడంతో హైదరాబాద్ అభిషేక్ ద్వారా హవాలా మార్గంలో మొత్తం రూ.4.98 కోట్ల నగదు పంపించానని వివరించాడు. బిట్‌కాయిన్ నిందితులను వదలం : సీఎం శివాజీనగర: బిట్ కాయిన్ స్కామ్‌ను బయటికి తీసుకురావడం, విచారణ చేపట్టింది మేమే. ఇందులో ఎంతటి బలమైన వ్యక్తులున్నా శిక్షిస్తాం అని సీఎం బొమ్మై చెప్పారు. ఆదివారం విధానసౌధ ముందు నెహ్రూ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించిన తరువాత మాట్లాడారు. ఈ కేసులు ఈడీ, సీబీఐకి అప్పగించాము. వారు కోరిన సమాచారాన్ని అందించాము. 2018లో కాంగ్రెస్ సర్కారు నిందితుడు శ్రీకృష్ణను విచారించి ఉంటే అన్ని విషయాలూ బహిరంగమయ్యేవి. ఈ కేసు విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం. ఎక్కడ మోసం జరిగినా చర్యలు తీసుకొంటాము అని చెప్పారు. నన్ను వదిలేయండి: నలపాడ్ బిట్‌కాయిన్ స్కామ్‌లో నా పాత్ర లేదు, అనవసరంగా నా పేరును ప్రస్తావించి వేధించవద్దు అని కాంగ్రెస్ నేత మహమ్మద్ నలపాడ్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ 2021 జనవరిలో బిట్ కాయిన్ కేసు బయటికి వచ్చింది. దీంతో నాకు సంబంధం ఉంటే ఎప్పుడో అరెస్టు చేసేవారు కదా అని అన్నారు. యూబీ సిటీలో గొడవ కేసులో 117 రోజులు జైలులో ఉన్నాను, మా నాన్న హ్యారిస్ ఎమ్మెల్యే కాబట్టి నాపై కొందరు బురదచల్లుతున్నారు అని అన్నారు. నన్ను, నా కుటుంబాన్ని వదిలేయండి అని కోరారు. -
ప్రతిపక్షాల ఆరోపణలపై ప్రధానితో చర్చించా: సీఎం బొమ్మై
సాక్షి, బనశంకరి(కర్ణాటక): బిట్‌కాయిన్ ఆరోపణల గురించి ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ప్రస్తావించగా దీని గురించి పట్టించుకోరాదని, ప్రజల కోసం సమర్థంగా పనిచేయాలని సలహా ఇచ్చారని సీఎం బసవరాజ బొమ్మై తెలిపారు. గురువారం ఢిల్లీలో ప్రధానితో సుమారు అర్దగంటకు పైగా సమావేశమై పలు అంశాలను చర్చించారు. అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడారు. బిట్‌కాయిన్ కేసు గురించి ప్రధాని వద్ద ప్రస్తావించగా, దీని గురించి పట్టించుకోవలసిన అవసరం లేదని సలహా ఇచ్చారన్నారు. డిసెంబరులో నాలుగు కార్యక్రమాల ప్రారంభానికి రాష్ట్రానికి ప్రధానిని ఆహ్వానించానని, సమయం చూసుకుని తేదీని ఖరారు చేస్తామని తెలిపారు. సీఎంగా వందరోజుల్లో తీసుకున్న నిర్ణయాలను ప్రధానికి తెలియజేశానని, సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. జేపీ నడ్డాతో చర్చలు.. పార్టీ అధినేత జేపీ నడ్డాను ఆయన నివాసంలో సీఎం బొమ్మై, కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషితో వెళ్లి అర్ధగంట పాటు చర్చించారు. మీడియా దృష్టికి రాకుండా ఈ సమావేశం జరగడంతో కుతూహలం నెలకొంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు, త్వరలో జరిగే 25 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు, బీబీఎంపీ, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులు చర్చకు వచ్చాయి. సీఎం బెంగళూరుకు తిరిగివచ్చాక రాజకీయంగా పలు మార్పులు జరిగే అవకాశం లేకపోలేదని సమాచారం. మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులు మారే చాన్సుందని పార్టీ వర్గాల కథనం. నా కొడుకు ఉన్నా వదలద్దు: కోళివాడ.. బిట్‌కాయిన్ స్కాంలో ఎంత పెద్దవారున్నా వదలవద్దని, కాంగ్రెస్ నేత, మాజీ స్పీకర్ కేబీ కోళివాడ డిమాండ్ చేశారు. ఆయన గురువారం రాణి బెన్నూరులో విలేకర్లుతో మాట్లాడుతూ బిట్‌కాయిన్ అనేది పెద్ద నేరం. ఈ నేరంలో నా కొడుకు, సీఎం కొడుకులు ఉన్నా విడిచిపెట్టవద్దు, కఠినంగా శిక్షించాలి. నిందితులు ఏ పార్టీ వారు అన్నది చూడవద్దు అని చెప్పారు. ఈ దందాలో కోళివాడ కుమారుని పాత్ర ఉందని ఆరోపణలు రావడంతో స్పందించారు. మాపై బురదచల్లే పని: డీకే.. శివాజీనగర: బిట్‌కాయిన్ స్కామ్‌లో కాంగ్రెస్‌పై బురద చల్లుతున్నారు. మా వద్దా ఆధారాలున్నాయి. తగిన సమయంలో బహిరంగ పరుస్తామని కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్ తెలిపారు. విధానసౌధలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్కామ్‌లో కాంగ్రెస్‌వారి పిల్లలు ఉంటే అరెస్టు చేయాలన్నారు. -
బిట్ కాయిన్ ద్వారా టెస్లా కార్ల కొనుగోలుకు అనుమతి : ఎలాన్ మాస్క్
-
బిట్ కాయిన్స్ పేరుతో రూ.60 లక్షలు స్వాహా
హిమాయత్‌నగర్: ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగులైన భార్యాభర్తలను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు బిట్ కాయిన్స్‌గా పిలిచే క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పేరుతో రూ.60 లక్షలు కాజేశారు. బాధితులు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అమీర్‌పేటకు చెందిన వంశీమోహన్ దంపతులు ‘జిప్‌బిట్’ యాప్ ద్వారా బిట్ కాయిన్స్ క్రయవిక్రయాలు చేస్తుంటారు. దీని ద్వారానే పరిచయమైన ఓ వ్యక్తి తన ద్వారా పెట్టబడిపెడితే అధిక లాభాలు వచ్చేలా చేస్తానని ఎర వేశాడు. ఇద్దరూ కలిసి అతడి ద్వారా రూ.10 లక్షల ఇన్వెస్ట్ చేశారు. ప్రపంచ మార్కెట్లో బిట్ కాయిన్ విలువ పెరుగుతున్నప్పటికీ... వీరి కాయిన్స్ వివరాలు తెలియట్లేదు.దీంతో అనుమానం వచ్చి ఆ వ్యక్తిని మరోసారి సంప్రదించగా, మీ కాయిన్లు భద్రమని, ప్రస్తుత పరిస్థితుల్లో రూ.50 లక్షలకు పైగా వెచ్చించి కాయిన్స్ ఖరీదు చేస్తేనే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికాడు. దీంతో వారు అతడు చెప్పిన మొత్తం ఇన్వెస్ట్ చేశారు. ఇందులో కొంత జిప్‌బిట్ యాప్ ద్వారా, మిగిలింది ముంబై, పూణే నగరాలకు చెందిన పలు బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశారు. లాభాలు రాకపోవడంతో సదరు వ్యక్తితో చాటింగ్ చేయగా, కచ్చితంగా లాభం వచ్చిందని, ఆన్లైన్లో కాయిన్ వాల్యూ చూసుకోవాలని సూచించాడు. ఆ తర్వాత అతడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయామని గ్రహించి శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. చదవండి: దారుణం: తుపాకీ గురిపెట్టి లైంగిక వేధింపులు -
అది ఎలన్ మస్క్‌కే సాధ్యం!
న్యూయార్క్: లక్షల కోట్లు సంపాదించాలన్న.. అలాంటి లక్షల కోట్లను క్షణాల్లో ముంచేయాలన్న టెస్లా సీఈవో ఎలన్ మస్క్ చేసే ఒక్క ట్వీట్ చాలు. ఈ మధ్య క్రిప్టోకరెన్సీ ఫేట్‌ను మార్చేస్తున్న ఈ టెక్ బిలియనీర్.. తాజాగా చేసిన ఓ చిలిపి పని వైరల్ అవుతోంది. అడల్ట్ క్రిఫ్టో కరెన్సీ కోసం మస్క్ పోస్ట్ చేసిన ట్వీట్లు డిజిటల్ కరెన్సీ మార్కెట్లో అలజడిని సృష్టించాయి. తాజాగా మస్క్ చేసిన రెండు ట్వీట్లతో పోర్న్-థీమ్డ్ క్రిప్టో కరెన్సీ కమ్రాకెట్ కాయిన్ విలువ ఒకే రోజులో 352 శాతానికి పెరిగింది. అది కూడా ప్రారంభంలో కేవలం పది నిమిషాల్లో నాలుగు వందల రెట్లు పెరిగి.. నిదానంగా 352 శాతం దగ్గర ముగియడం విశేషం. ముందుగా ఎలన్ మస్క్ ‘కెనడా, యుఎస్ఎ, మెక్సికో’ అర్థం వచ్చేలా ఒక ట్వీట్ చేశాడు. దీంతో ఈ మూడు దేశాల మొదటి అక్షరంతో ప్రారంభమయ్యే క్రిప్టోకరెన్సీలను సూచిస్తున్నారని నెటిజన్స్ అర్థం చేసుకున్నారు. ఆ మరుసటి రోజు అడల్ట్ సిగ్నేచర్స్‌తో చేసిన ట్వీట్స్ ఈ పోర్న్ థీమ్డ్ క్రిఫ్టో కరెన్సీ విలువ దూసుకుపోతోందని స్పష్టత ఇచ్చాడు. చదవండి: స్పేస్ఎక్స్కి ఇండియాలో ఎదురుదెబ్బ Canada USA Mexico — Elon Musk (@elonmusk) June 4, 2021 కమ్రాకెట్.. అడల్ట్ ఇండస్ట్రీకి సపోర్ట్‌గా పుట్టుకొచ్చిన క్రిప్టోకరెన్సీ. దీనితో పాటే కమ్మీ, కమ్మీన్స్ అనే మరో రెండు క్రిఫ్టో కాయిన్స్ చెలామణిలో ఉన్నాయి. ఎలన్ మస్క్ ట్వీట్స్ తర్వాత వాటి విలువలు కూడా 45 శాతం, 19 శాతం పెరగడం విశేషం. అసలే క్రిప్టోకరెన్సీ మార్కెట్ అంటేనే గందరగోళం.. ఎలోన్ మస్క్ తన ట్వీట్లతో ఆ మార్కెట్‌ను మరింత గందరగోళంగా మార్చేస్తూ వస్తున్నాడు. 💦🚀 –> 🌙 — Elon Musk (@elonmusk) June 5, 2021 -
ఖతర్నాక్ హ్యాకర్.. భారీగా నగదు చోరీ
బెంగళూరు : శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులకు పట్టుబడిన అంతర్జాతీయ హ్యాకర్ శ్రీకృష్ణ అలియాస్ శ్రీ జల్సా జీవితం కోసం బిట్‌కాయిన్ అకౌంట్‌ను హ్యాక్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం అతడు పరప్పన సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్నాడు. ఇతని ఖాతాలో రూ.9 కోట్లు విలువ చేసే 31 బిట్కాయిన్లను సీజ్ చేశారు. సీసీబీ విచారణలో నిర్ఘాంతపోయే నిజాలు వెలుగుచూశాయి. అంతర్జాతీయ స్థాయి వెబ్సైట్లతో పాటు వేర్వేరు దేశాల పోకర్‌గేమ్స్ వెబ్సైట్లలోని ఖాతాల్లోకి చొరబడి క్రిప్టో కరెన్సీలైన బిట్ కాయిన్, వైఎఫ్ఏ తదితరాలను దొంగించినట్లు కనిపెట్టారు. పోలీసులకు పట్టుబడిన శ్రీకృష్ణ అనుచరులు సునీశ్ శెట్టి, ప్రసిద్ శెట్టి, సంజయ్, హేమంత్ ముద్దప్ప, రాబిన్ ఖండేల్వాల్ ఇతరులతో కలిసి పోకర్ గేమింగ్ వెబ్సైట్లను హ్యాక్ చేసి డేటాను చోరీచేసి ఆ డేటాను తమ గేమింగ్ వెబ్సైట్ కోసం వినియోగించేవారు. ఇప్పటి వరకు మూడు బిట్‌కాయిన్ ఎక్సే్ఛంజిలను, 10 పోకర్ వెబ్సైట్లు, 4 సాధారణ వెబ్సైట్లను హ్యాచ్ చేసినట్లు గుర్తించారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌కి కన్నం బెంగళూరు కేంద్రంగా హ్యాకర్ శ్రీకృష్ణ ప్రముఖ హోటళ్లు, రిసార్టుల్లో బస చేసేవాడు. దోచుకున్న బిట్కాయిన్లను తమ ఖాతాల్లోకి మళ్లించి ముఠాతో కలిసి నగదుగా మార్చుకునేవాడు. డార్క్‌నెట్ వెబ్సైట్ల గుండా విదేశాల నుంచి డ్రగ్స్‌ను ఈ బిట్కాయిన్ల ద్వారానే కొనేవాడు. 2019లో అక్రమంగా ధన సంపాదనకు కర్ణాటక ప్రభుత్వ ఇ–ప్రొక్యూర్మెంట్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి కోట్లాది ధనాన్ని తన అనుచరుల అకౌంట్లకు జమ చేశారని పోలీసుల విచారణలో వెలుగుచూసింది. కాగా, రూ.9 కోట్ల విలువైన 31 బిట్కాయిన్లను పోలీసులు సీజ్ చేశారు. అతని లావాదేవీలు, ఖాతాలపై విచారణ జరుపుతున్నారు. -
క్రిప్టోకరెన్సీ అంటే కఠిన చర్యలు
న్యూఢిల్లీ: బిట్ కాయిన్, ఎథేరియం, రిపిల్, కార్డోనో వంటి క్రిప్టోకరెన్సీ కార్యకలాపాలు ఏవైనా భారత్‌లో కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్ మంత్రిత్వశాఖల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రైవేటు క్రిప్టోకరెన్సీలను దేశంలో నిషేధించాలని సూచించిన కమిటీ, దేశంలో ఈ తరహా కార్యకలాపాలు నిర్వహించే వారిపై జరిమానాలు విధించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. క్రిప్టోకరెన్సీల నియంత్రణ, నిషేధానికి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావాలని కూడా కమిటీ సిఫారసు చేసింది. ఇందుకు సంబంధించి ‘ది బ్యానింగ్ ఆఫ్ క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు, 2019’ పేరుతో ఒక ముసాయిదా బిల్లును కూడా కమిటీ సిఫారసు చేసింది. క్రిప్టోకరెన్సీపై ఎటువంటి విధానాలను అవలంభించాలనే అంశంపై సిఫారసులు చేయడానికి కేంద్రం 2017 నవంబర్ 2న కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ కార్యదర్శి, సెబీ చైర్మన్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ సభ్యులు. ‘‘ప్రైవేటు క్రిప్టోకరెన్సీతో ఇబ్బం దులు పొంచి ఉన్నాయి. ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు ఉంటాయి. సామాన్యులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం అధికం’’ అని సోమవారం విడుదలైన నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,116 క్రిప్టోకరెన్సీలు ఉన్నాయి. వీటి మార్కెట్ విలువ 119.46 బిలియన్ డాలర్లు. తాజాగా కమిటీ నివేదిక, ముసాయిదా బిల్లులను సంబంధిత అన్ని శాఖలు పరస్పర సంప్రతింపుల ద్వారా సమీక్షిస్తాయి. తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేస్తాయి. కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుంది. -
అజ్ఞాతంలో ఉన్నా పసిగట్టారు
సాక్షి, సిటీబ్యూరో: బిట్ కాయిన్స్‌గా పిలిచే క్రిప్టో కరెన్సీ పేరు వాడుకుని నగరంలో భారీ మోసానికి పాల్పడిన గర్దాస్ రమేష్‌పై బెంగళూరులోనూ మల్టీ లెవల్ మార్కెటింగ్‌కు పాల్పడ్డాడు. మూడేళ్ళ క్రితం కేసు నమోదు చేసిన అక్కడి అశోక్‌నగర్ పోలీసులు రమేష్‌తో పాటు ముగ్గురు హైదరాబాదీయుల్ని అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్ తీసుకున్న రమేష్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. దీంతో ఇతడిపై నాన్–బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. అతడి ఆచూకీ తెలుసుకున్న వచ్చిన బెంగళూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేసి తీసుకువెళ్ళారు. సోమవారం అక్కడి న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. గర్దాస్ రమేష్‌ను గత ఏడాది హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. తాజాగా మరో నాలుగు కేసులు నమోదు కావడంతో ఇప్పటి వరకు ఇతడిపై రిజిస్టర్ అయిన కేసుల సంఖ్య 18కి చేరింది. వీటిలో నాలుగింటిలో రమేష్ ఇంకా వాంటెడ్‌గా ఉన్నాడు. బోయిన్పల్లి కేంద్రంగా కాయినెక్స్‌ట్రేడింగ్ పేరుతో విదేశాల నుంచి నిర్వహిస్తున్నట్లు ఓ నకిలీ వెబ్సైట్ సృష్టించిన రమేష్ దీని ఆధారంగా రంగంలోకి దిగాడని పోలీసులు గుర్తించారు. దీంతో పాటు నలుగురు దళారుల్ని ఏర్పాటు చేసుకుని పలువురిని ఆకర్షించాడు. తమ స్కీముల్లో పెట్టుబడి పెడితే కనిష్టంగా 134 రోజుల నుంచి గరిష్టంగా 500 రోజుల్లో ఆ మొత్తం రెట్టింపు అవుతుందని ప్రచారం చేసుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 1200 మంది నుంచి రూ.10 కోట్లకు పైగా వసూలు చేసి నిండా ముంచాడు. ప్రధాన సూత్రధారి రమేష్‌తో సహా ఐదుగురు నిందితుల్ని హైదరాబాద్ పోలీసులు గత ఏడాది అరెస్టు చేశారు. ఇతడి విచారణ నేపథ్యంలో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కామారెడ్డి జిల్లా దొనకొండకు చెందిన గర్దాస్ రమేష్ 25 ఏళ్ళ క్రితం నగరానికి వలసవచ్చాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పలు మోసాలు చేశాడు. వాటికి కొనసాగింపుగా బెంగళూరులో వన్ కాయిన్ అనే క్రిప్టో కరెన్సీ పేరుతో మోసం చేశాడు. దీంతో ఇతడితో పాటు కట్టంగూరి వెంకట్‌రెడ్డి, పల్లా కుమార్ యాదవ్, పోతు కనకరాజు తదితరులపై అక్కడి అశోక్‌నగర్ ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టు అయిన వీరు బెయిల్‌పై బయటకు వచ్చి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కేసు వాయిదాలకు హాజరుకాకపోవడంతో వీరిపై న్యాయస్థానం ఎన్బీడబ్ల్యూలు జారీ చేసింది. అయినప్పటికీ వీరి ఆచూకీ చిక్కకపోవడంతో అశోక్‌నగర్ పోలీసులు ముమ్మరంగా గాలించారు. చివరకు శనివారం ప్రధాన నిందితుడు గర్దాస్ రమేష్‌ను కనిపెట్టి అరెస్టు చేసి తీసుకువెళ్ళారు. మరోపక్క గత ఏడాది ఇతగాడిపై విశాఖపట్నంలోని గాజువాక ఠాణాలో రెండు కేసులు నమోదయ్యాయి. తాజాగా బోయిన్‌పల్లిలో మరో రెండు రిజిస్టర్ అయ్యాయి. ఈ నాలుగింటిలోనూ రమేష్ వాంటెడ్‌గా ఉండటంతో పీటీ వారెంట్‌పై తీసుకువచ్చి అరెస్టు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. -
సైట్లోనే సీయింగ్!
‘బిట్ కాయిన్స్’ ముఠా చేతిలో మోసపోయిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శని–ఆదివారాల్లో ఈ ముఠా చేతిలో దగాపడిన మరో 20 మంది టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి రమేష్ బిట్ కాయిన్స్ కోసం బోగస్ ఖాతాలు తెరిచాడు. వీటిలోనే రాబడి చూపించి జనాలను ఆకర్షించాడు. పెట్టుబడితో పాటు లాభాలు, కమీషన్లను సైతం బోగస్ వెబ్సైట్లో చూపించి బురిడీ కొట్టించాడు. సాక్షి, సిటీబ్యూరో: దేశ వ్యాప్తంగా నిషేధం ఉన్నప్పటికీ నగరంలో అప్పుడప్పుడు మల్టీ లెవల్ మార్కెంటింగ్ (ఎంఎల్ఎం) వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందాలో తొలుత చేరిన వారు భారీగా లాభపడటం... ఆఖరులో చేరిన వారు నష్టపోవడం పరిపాటి. అయితే క్రిప్టో కరెన్సీ పేరుతో, కాయినెక్స్‌ట్రేడింగ్.కామ్ వెబ్సైట్ ముసుగులో స్కీ(స్కా)మ్స్ నడిపిన రమేష్ చేతిలో మాత్రం మొదటి నుంచి ఆఖరి వరకు అందరూ నష్టపోగా, కేవలం అతడితో పాటు ప్రధాన దళారులు నలుగురు మాత్రమే లాభపడ్డారు. పెట్టుబడితో పాటు లాభాలు, కమీషన్లను సైతం బోగస్ వెబ్సైట్లో చూపించడమే దీనికి కారణం. ఇప్పటి వరకు నమోదైన 10 కేసుల్లోనే బాధితులు నష్టపోయిన మొత్తం రూ.కోట్లల్లో ఉంది. ఈ ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం విదితమే. శని–ఆదివారాల్లో ఈ ముఠా చేతిలో మోసపోయిన మరో 20 మంది టాస్క్‌ఫోర్స్‌ను ఆశ్రయించారు. వీరిలో కరీంనగర్, మంథని, విశాఖపట్నం, ఒంగోలు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. వీరందరినీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బోయిన్పల్లి ఠాణాకు పంపారు. బోగస్ వెబ్సైట్లో ప్రత్యేక ఖాతాలు... స్కామ్‌కు పథకం రూపొందించిన రమేష్ ముంబైకి చెందిన సీబీ ఆన్లైన్ సంస్థకు రూ.లక్ష చెల్లించడం ద్వారా వారితో కాయినెక్స్‌ట్రేడింగ్.కామ్ వెబ్‌సైట్‌తో పాటు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయించాడు. దీని నిర్వహణ కోసం ప్రతి నెలా వారికి రూ.25 వేల చొప్పున చెల్లిస్తున్నాడు. సీబీ సంస్థకు చెందిన సునీల్ చౌహాన్, మోహన్ ఈ సైట్లో ఆకర్షనీయమైన స్కీములు ప్రకటించడంతో పాటు పెట్టుబడి పెట్టిన ప్రతి వ్యక్తికీ ఓ ప్రత్యేక ఖాతా రూపొందించి ఇచ్చే సౌలభ్యం కల్పించారు. బాధితుల నుంచి పెట్టుబడులన్నీ నగదు రూపంలోనే తీసుకున్న రమేష్ వాటిని డాలర్లుగా మార్చి క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు నమ్మించాడు. అందుకు అయ్యే ఎక్స్ఛేంజ్ మొత్తాన్నీ వారి నుంచే వసూలు చేశాడు. ఇన్వెస్టర్ పేరుతో తమ వెబ్సైట్ కేంద్రంలో ఓ ఖాతా తెరుస్తామంటూ చెప్పడంతో పాటు వారికి ఓ ప్రత్యేక యూజర్ ఐడీ, పాస్వర్డ్ కేటాయించేవాడు. వీటి ద్వారా లాగిన్ అయిన వారికి తన ఖాతాలో ఉన్న బిట్‌కాయిన్స్, వాటి విలువను చూసుకునే అవకాశం ఉండేది. ఆ వ్యక్తి పెట్టిన పెట్టుబడి, వచ్చిన లాభం, ఎంఎల్‌ఎంలో ఓ వ్యక్తిని చేర్చగా వచ్చిన కమీషన్ ఇలా అన్నీ ఇందులోనే చూపిస్తూ కనికట్టు చేశాడు. ఈ కేసులో సీబీ ఆన్లైన్ సంస్థకు చెందిన సునీల్ చౌహాన్, మోహన్‌లను నిందితులుగా చేర్చారు. ‘భయంకరమైన’ లాభాలంటూ.. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టడానికి ప్రజలను ఆకర్షించేందుకు రమేష్ 12 వేర్వేరు స్కీములు రూపొందించాడు. వీటికి బేసిక్, స్టాండర్డ్, బ్రాంజ్, సిల్వర్ ప్లాన్స్‌తో పాటు గోల్డెన్, ప్లాటినం, రాయల్, ప్రీమియం, డైమండ్, ఇన్ఫినిటీ, ఎక్స్పర్ట్, ఎలైట్ ట్రేడ్ అంటూ పేర్లు పెట్టాడు. ఒక్కో దాంట్లో రోజుకు .4 శాతం నుంచి 10 శాతం వరకు బోనస్ వస్తుందని, కనిష్టంగా 134 రోజుల (ఎలైట్ ట్రేడ్) నుంచి గరిష్టంగా 500 రోజుల్లో (బేసిక్ ప్లాన్) పెట్టుబడి రెట్టింపు అవుతుందని నమ్మించాడు. ఈ స్కీముల్లో 100 అమెరికన్ డాలర్ల నుంచి 5 లక్షల డాలర్ల వరకు పెట్టుబడికి ఆస్కారం ఉందంటూ ప్రచారం చేయడంతో పాటు దీనికోసం 10 నిమిషాల నిడివితో ఓ షార్ట్‌ఫిల్మ్ కూడా రూపొందించాడు. ఇందులో తొలుత బిట్‌కాయిన్ వివరాలు చెబుతూ దానిపై బిల్‌క్లింటన్ వరకు పలువురి అభిప్రాయాలను చూపించాడు. ఆపై తన స్కీమ్స్‌ను ప్రచారం చేస్తూ రండి త్వరగా కోటీశ్వరులుకండి అంటూ ఆకర్షించాడు. కస్టమర్లను తీసుకువచ్చిన ప్రధాన దళారులైన సత్తయ్య, వెంకటేష్, హరిగోపాల్, శ్రీనివాస్‌లకు మాత్రం 10 శాతం చొప్పున కమీషన్లు ఇస్తూ వచ్చాడు. 30 మంది బయటకు వస్తేనే... ఈ గ్యాంగ్ గతేడాది మార్చి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని 1200 మంది నుంచి రూ.10 కోట్ల వరకు మోసం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. అయితే ఇప్పటి వరకు నమోదైన 10 కేసుల్లోనే బాధితులు నష్టపోయింది రూ.1.37 కోట్లుగా ఉంది. ఎల్బీనగర్కు చెందిన బాల్‌రాజ్ రూ.1.89 లక్షలు, బోయిన్‌పల్లికి చెందిన రమేష్ గుప్త రూ.33.5 లక్షలు, ఆసిఫ్‌నగర్‌కు చెందిన జగ్గారావు రూ.18.71 లక్షలు, చిక్కడపల్లికి చెందిన అభినవ్‌కుమార్ రూ.3.5 లక్షలు, మియాపూర్ వాసి కృష్ణ రూ.9.37 లక్షలు, మీర్‌పేటకు చెందిన ప్రభాకర్‌రావు రూ.15.6 లక్షలు, సంగారెడ్డికి చెందిన పూవింత్రన్ రూ.21.74 లక్షల చొప్పున మోసపోయారు. శని–ఆదివారాల్లో మరో రూ.కోటికి పైగా నష్టపోయిన 20 మంది టాస్క్‌ఫోర్స్‌ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే రమేష్ గ్యాంగ్ బాధితులు నేరుగా టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఆశ్రయించాలని కోరుతున్నారు. స్థలాలు, కార్లు ఖరీదు... ఈ దందాలో వచ్చిన డబ్బులో భారీగా కమీషన్లు చెల్లించడమేగాక మిగిలిన దాంట్లో కొంత మొత్తాన్ని రమేష్ రియల్ ఎస్టేట్ రంగం వైపు మళ్లించాడు. రూ.1.23 కోట్లు వెచ్చించి నాలుగు ప్రాంతాల్లో స్థలాలు ఖరీదు చేశాడు. ఈ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బోయిన్‌పల్లిలోని అతడి జీఆర్ఎం ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంతో పాటు రమేష్, ఇతడి బంధువైన మరో నిందితుడు శ్రీనివాస్ తదితరుల నుంచి రూ.29.2 లక్షలు రికవరీ చేశారు. రూ.26.4 లక్షల విలువైన రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన మొత్తాన్ని సైతం రికవరీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకుగాను నిందితులను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణ యించారు. ఈ ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు, ఎస్సైలు బి.శ్రవణ్‌కుమార్, పి.చంద్రశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్, కేఎస్ రవిలను కమిషనర్ అంజనీ కుమార్ ప్రత్యేకంగా అభినం దించారు. వీరికి నగదు రివార్డులు ఇవ్వనున్నారు. -
బిట్‌కాయిన్స్ కరెన్సీ ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్ : డిజిటల్ కరెన్సీగా పేరుగాంచిన బిట్‌కాయిన్స్ కరెన్సీ ముఠా గుట్టురట్టైంది. బిట్‌కాయిన్స్‌ను నిషేదించినప్పటికీ అక్రమంగా కొందరు చెలామణి చేస్తున్న నేపథ్యంలో నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ. 29లక్షల నగదు, రెండు కార్లను సీజ్ చేసినట్టు తెలుస్తోంది. రూ. కోటి ఎనభై లక్షల విలువచేసే ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనంచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వర్చువల్ కరెన్సీలతో రిస్క్ పొంచి ఉన్నదని ఆర్బీఐ హెచ్చరించింది. కాగా క్రిప్టో కరెన్సీలు చట్టబద్ధం కావని, వీటి వినియోగాన్ని తొలగించాలని బడ్జెట్ ప్రసంగంలో కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే. -
బిట్‌కాయిన్స్‌తో జాగ్రత్త!!
న్యూఢిల్లీ: బిట్‌కాయిన్స్ వంటి క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని క్రెడిట్ కార్డుల సంస్థ ఎస్బీఐ కార్డు తమ యూజర్లను హెచ్చరించింది. వీటిలో ఇన్వెస్ట్ చేసేవారు క్రిప్టోకరెన్సీలతో ఉండే రిస్కులను కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. దేశీయంగా రెండో అతి పెద్ద క్రెడిట్ కార్డుల సంస్థ అయిన ఎస్బీఐ కార్డుకు దాదాపు 50 లక్షల పైచిలుకు యూజర్లు ఉన్నారు. ‘దేశీయంగా, అంతర్జాతీయంగా బిట్‌కాయిన్స్ విషయంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలు, వర్చువల్ కరెన్సీల్లో లావాదేవీలు నిర్వహించేటప్పుడు వాటి మూలంగా తలెత్తే ఆర్థికపరమైన, భద్రతాపరమైన, చట్టపరమైన రిస్కులు, కస్టమర్స్ ప్రయోజనాల పరిరక్షణలో ఎదురయ్యే సమస్యలు మొదలైనవి దృష్టిలో ఉంచుకోవాలి‘ అని తమ యూజర్లకు పంపిన సందేశంలో ఎస్బీఐ కార్డ్ పేర్కొంది. మరో బ్యాంకు సిటీ ఇండియా ఇప్పటికే తమ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా బిట్కాయిన్లు, క్రిప్టో కరెన్సీల కొనుగోలు, ట్రేడింగ్‌ని అనుమతించరాదని నిర్ణయించిన విషయాన్ని ఎస్బీఐ కార్డ్ ప్రస్తావించింది. క్రిప్టో కరెన్సీల విషయంలో హెచ్చరించినప్పటికీ.. క్రెడిట్ కార్డుల ద్వారా వాటిల్లో ఇన్వెస్ట్ చేయకుండా ఎస్బీఐ కార్డ్ మాత్రం నిషేధం విధించకపోవడం గమనార్హం. క్రిప్టో కరెన్సీ స్కీములు, బిట్‌కాయిన్స్ వంటి వర్చువల్ కరెన్సీల్లో లావాదేవీల నిర్వహణకు ఎవరికీ లైసెన్సులు ఇవ్వలేదంటూ రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే ఆర్థిక సంస్థలు, సామాన్య ప్రజానీకానికి వెల్లడించిన సంగతి తెలిసిందే. -
బిట్ కాయిన్.. బంగారు కొండ
కొంతకాలంగా సంచలనం సృష్టిస్తున్న వర్చువల్ కరెన్సీ బిట్‌కాయిన్. కేవలం సంక్లిష్టమైన ప్రోగ్రామింగ్ కోడ్ల ఆధారంగా రూపొందే క్రిప్టో కరెన్సీల జాబితా లోదే ఇది కూడా. కానీ ప్రతి లావాదేవీ నిక్షిప్తమయ్యే బ్లాక్‌చెయిన్, నిర్ణీతంగా మాత్రమే అందుబాటులో ఉండడం, యజమానుల వివరాలు రహస్యంగా ఉండడం, ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు కరెన్సీగా మార్పిడికి అంగీకరించడంతో డిమాండ్ బాగా పెరిగిపోయింది. 2010లో ఆమోదిత లావాదేవీలు మొదలైనా.. 2015 నుంచి జైత్రయాత్ర చేసింది. దీని విలువ ఏకంగా కొన్ని లక్షల రెట్లు పెరిగిపోయింది. ఏమేం కొనొచ్చు? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు బిట్‌కాయిన్‌ను కరెన్సీగా అంగీకరిస్తున్నాయి. లావాదేవీ జరిగిన సమయంలో బిట్‌కాయిన్ విలువ ఆధారంగా ఈ కరెన్సీ మార్పిడి ఉంటుంది. మైక్రోసాఫ్ట్, డెల్, వర్జిన్ గెలాక్టిక్, హాలిడే ఇన్, సబ్వే, దిపైరేట్స్ బే, బ్లూమ్‌బర్గ్, అమెరికా డిష్ నెట్వర్క్ వంటి ప్రముఖ సంస్థలతో పాటు వందలాది ఆన్లైన్ షాపింగ్ సైట్లలో బిట్‌కాయిన్‌తో లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఉండేవి 2,10,00,000 మాత్రమే అత్యంత క్లిష్టమైన ప్రోగ్రామింగ్ కోడ్లతో బిట్‌కాయిన్‌ను సృష్టిస్తారు. ఇలా కోడ్లను ఛేదించేవారిని బిట్‌కాయిన్ మైనర్లు అంటారు. ఒక రకంగా చెప్పాలంటే వజ్రాల్లా బిట్కాయిన్లను తవ్వి తీసేవారన్న మాట. దీని బేస్ ప్రోగ్రామ్ ప్రకారం.. మొత్తంగా 2.1 కోట్ల బిట్కాయిన్లను మాత్రమే సృష్టించగలరు. దీనివల్ల కూడా వీటికి ఇంత డిమాండ్. ఇది బిట్‌కాయిన్ వికీ.. బిట్‌కాయిన్ చరిత్ర, కొనుగోళ్ల నుంచి ప్రస్తుత ధర దాకా సమాచారం అందించేందుకు ఏకంగా వికీపీడియా తరహాలో ఓ వెబ్సైట్ ఉంది. ఈ వెబ్‌సైట్‌ను ‘బిట్‌కాయిన్ వికీగా’ పిలుస్తారు. ఇందులో బిట్కాయిన్ల వినియోగం, అమ్మకం, కొనుగోళ్లు, నెట్వర్క్, దాని భద్రతకు తీసుకుంటున్న చర్యలు వంటి వివరాలన్నీ ఉంటాయి. బిట్‌కాయిన్ మొదటి రిటైల్ లావాదేవీ: 2010 మే 22 నాటి ధర: 25 పైసలు (0.004 డాలర్లు) బిట్‌కాయిన్ గరిష్ట ధర నమోదైన రోజు: 2017 డిసెంబర్ 16 ఆ రోజున విలువ: రూ. 12,20,738(19,194 డాలర్లు) 2018 జనవరి 30 నాటికి ఒక్కో బిట్‌కాయిన్ విలువ రూ. 7,14,228 (11,230 డాలర్లు) ఏడున్నరేళ్లలో బిట్‌కాయిన్ విలువ పెరుగుదల శాతం..: 30 లక్షల రెట్లు రెండు పిజ్జాలు.. 714 కోట్లు బిట్‌కాయిన్‌తో మొట్టమొదట కొనుగోలు చేసిన వస్తువేమిటో తెలుసా.. పిజ్జా. 2010 మే 22న లాజ్లో హనైజ్ అనే బిట్ కాయిన్ మైనర్ డోమినోస్ సంస్థ నుంచి రెండు పిజ్జాలు కొన్నారు. ఆ పిజ్జాల ధర 41 డాలర్లు (సుమారు రూ.2,500). ఈ సొమ్ము కింద 10,000 బిట్కాయిన్లు చెల్లించారు. ప్రస్తుతం 10 వేల బిట్కాయిన్ల విలువ మన కరెన్సీలో రూ. 714 కోట్లపైమాటే! ఈ లావాదేవీకి గుర్తుగా ఏటా మే22న ‘బిట్‌కాయిన్ పిజ్జా డే’గా జరుపుకొంటున్నారు. సామ్సంగ్, మోటొరోలా కంపెనీలు సృష్టించాయా? సతోషి నకమొటో’ బిట్‌కాయిన్‌ను సృష్టించినది ఎవరనేది ఇప్పటివరకు తేలక పోవడం గమనార్హం. తొలి బిట్‌కాయిన్ మైనర్ ‘సతోషి నకమోటో’ అనే మారుపేరుతో 2008లో బిట్‌కాయిన్‌ను సృష్టించారు. అసలు ఆ వ్యక్తి ఎవరనే వివరాలేవీ తెలియవు. తర్వాత మరికొందరు మైనర్లు కలసి బిట్కాయిన్లను సృష్టించడం మొదలు పెట్టారు. అయితే బిట్‌కాయిన్‌ను నాలుగు పెద్ద కంపెనీలు సామ్సంగ్, తొషిబా, నకమిచి, మోటోరోలా కలసి సృష్టించాయనే ప్రచార ముంది. ఈ 4 కంపెనీల పేర్లలోని తొలి అక్షరాలను తీసుకునే.. ‘సతోషి నకమొటో’ పేరుతో తొలి మైనర్ వ్యవహరించారని చెబుతుంటారు. కానీ ఎవరూ నిర్ధారించలేదు. -
క్రిప్టో కరెన్సీలకు చట్టబద్ధత లేదు: జైట్లీ
న్యూఢిల్లీ: బిట్‌కాయిన్స్ వంటి క్రిప్టో కరెన్సీలకు చట్టబద్ధత లేదని, వీటి వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుం దని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రస్తుతం వర్చువల్ కరెన్సీలను నియంత్రించే చట్టాలేమీ దేశీయంగా లేవని, ఈ తరహా కరెన్సీల లావాదేవీలకు ఆర్బీఐ ఏ కంపెనీకి అనుమతులివ్వలేదని జైట్లీ గతేడాది పార్లమెంటుకు తెలిపిన సంగతి తెలిసిందే. -
బిట్‌కాయిన్‌కు పగ్గాలు!
ముంబై: భారీగా విస్తరిస్తున్న బిట్‌కాయిన్స్ వంటి క్రిప్టోకరెన్సీలను నియంత్రించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా రిజర్వ్ బ్యాంక్, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతో సంప్రతింపులు జరుపుతోంది. క్రిప్టోకరెన్సీలపై చట్టపరమైన పర్యవేక్షణకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా సెబీ చైర్మన్ అజయ్ త్యాగి ఈ విషయాలు తెలిపారు. ‘ఆర్బీఐ, సెబీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ బిట్కాయిన్ల అంశాన్ని పరిశీలిస్తోంది. కమిటీలో ఆర్థిక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల అధికారులు కూడా ఉన్నారు. దేనికైనా ఒక ప్రక్రియ లేదా చట్టం ఉండాలి. అప్పుడే చర్యలు తీసుకోవడం సాధ్యపడుతుంది‘ అని ఆయన చెప్పారు. వర్చువల్ కరెన్సీ వల్ల ఇప్పటిదాకా వ్యవస్థాగతమైన సమస్యలేమీ రాలేదని, అలాగని దీన్ని పట్టించుకోకుండా ఉండలేమని త్యాగి పేర్కొన్నారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీని ప్రోత్సహించాలి.. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ లాంటి సాంకేతికతను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీన్ని నియంత్రణ సంస్థలు అలక్ష్యం చేయరాదని ఆయన పేర్కొన్నారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారంగానే బిట్కాయిన్లు తదితర క్రిప్టోకరెన్సీల లావాదేవీలు జరుగుతుంటాయి. మనీలాండరింగ్, ఉగ్రవాద సంస్థలకు నిధులు చేరవేయడం తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు కూడా ఉపయోగపడే రిస్కులున్న బిట్కాయిన్ల వంటి క్రిప్టోకరెన్సీలను ఆర్బీఐ సహా ఇతరత్రా ఏ నియంత్రణ సంస్థా ఆమోదించలేదు. అయితే, బిట్‌కాయిన్ విలువ ఏకంగా రూ. 10 లక్షలకి చేరిన నేపథ్యంలో అనేక మంది ఇన్వెస్టర్లు కోట్ల రూపాయలు గడించారంటూ వస్తున్న వార్తలు నియంత్రణ సంస్థలను కలవరపరుస్తున్నాయి. ‘క్రిప్టో’ కుబేరుడు అమితాబ్ బచ్చన్.. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ తాజాగా క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడుల్లోనూ స్టార్‌గా నిల్చారు. క్రిప్టోకరెన్సీకి సంబంధించి ఆయన గతంలో ఒక కంపెనీలో చేసిన ఇన్వెస్ట్మెంట్ విలువ ప్రస్తుతం అనేక రెట్ల రాబడులు అందించడమే ఇందుకు నిదర్శనం. 2015లో అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ సింగపూర్ సంస్థ మెరీడియన్ టెక్‌లో భాగమైన జిద్దుడాట్‌కామ్‌లో 2,50,000 డాలర్లు ఇన్వెస్ట్ చేశారు. అప్పట్లో ఇది క్లౌడ్ స్టోరేజి, ఈ–డిస్ట్రిబ్యూషన్ స్టార్టప్ సంస్థగా కార్యకలాపాలు సాగించేది. ప్రస్తుతం ఇది బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారిత సర్వీసులను, క్రిప్టోకరెన్సీలో సూక్ష్మరుణాలు అందించే సంస్థగా రూపాంతరం చెందింది. దీన్ని ఇటీవలే లాంగ్‌ఫిన్ సంస్థ కొనుగోలు చేసింది. జిద్దులో పెట్టుబడులకు ప్రతిగా బచ్చన్‌లకు లాంగ్‌ఫిన్‌లో 2,50,000 షేర్లు లభించాయి. నాస్డాక్లో లిస్టయిన లాంగ్‌ఫిన్ కంపెనీ షేర్లు భారీ పెరగడంతో బచ్చన్ల పెట్టుబడుల విలువ 2,50,000 డాలర్ల నుంచి 1.75 కోట్ల డాలర్లకు ఎగబాకింది. -
ఈక్విటీ, బిట్‌కాయిన్స్ నుంచి పోటీ..!
ముంబై /న్యూయార్క్: అంతర్జాతీయంగా పసిడికి ప్రస్తుతం ప్రధానంగా ఈక్విటీలు, బిట్ కాయిన్ నుంచి గట్టి పోటీ ఏర్పడుతోందన్నది విశ్లేషకుల మాట. అందుకే రెండు వారాల పురోగతికి బ్రేక్ పడింది. అంతర్జాతీయ న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్ఛంజ్ నైమెక్స్‌లో ధర ఔన్స్ (31.1గ్రా)కు ఆరు డాలర్లు తగ్గి 1,288 డాలర్ల వద్ద ముగిసింది. ఒకపక్క ఈక్విటీ మార్కెట్ల పరుగు కొనసాగుతుండగా, మరోపక్క బిట్‌కాయిన్ శుక్రవారం ఆల్‌టైమ్ హై 8,470.7 డాలర్ల స్థాయిని తాకింది. మరో క్రిప్టోకరెన్సీ ఇథీరియం ధర కూడా గరిష్టస్థాయి 485.19 డాలర్లను తాకడం గమనార్హం. ఈ రెండు కరెన్సీల విలువలు ఈ ఒక్క వారంలో దాదాపు 40 శాతం లాభపడ్డాయి. రానున్న వారంలో ఈక్విటీ విలువలతో పాటు క్రిప్టోకరెన్సీ విలువల ప్రభావం కూడా పసిడిపై ఉంటుందన్న విశ్లేషణలు ఉన్నాయి. కన్సాలిడేషన్ దిశగా..! ప్రస్తుతం 50 డాలర్ల శ్రేణిలో పసిడి కన్సాలిడేట్ అవుతోందని టెక్నికల్ అనలిస్టులు చెబుతున్నారు. ఇటీవల అమెరికా ఫెడ్ సమావేశ వివరాలకు సంబంధించిన ‘మినిట్స్’ తాజా సమీక్షా వారంలో విడుదల కావడం... దీని ప్రకారం అమెరికా ద్రవ్యోల్బణం లక్ష్యాలకు అనుగుణంగా పెరగడం లేదన్న ఫెడ్ భయాలు.. ఈ నేపథ్యంలో ఫండ్ రేటు (ప్రస్తుతం 1–1.25 శాతం) ఇప్పట్లో పెంచే అవకాశం లేదన్న విశ్లేషణలు... వీటన్నిటికీ తోడు ఆరు కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ ఐదు నెలల కనిష్ట స్థాయికి పతనం (93.61 నుంచి 92.72) కావటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. డాలర్ పతనమైతే పసిడి బలపడుతుందన్న సాధారణ ధోరణికి భిన్నమైన ఫలితం గతవారం పసిడిలో ఏర్పడింది. అయితే 1,250 డాలర్ల స్థాయి లోపునకు పడిపోయేంత వరకూ పసిడి ఫండమెంటల్స్ పటిష్టంగానే ఉన్నట్లు భావించవచ్చనేది నిపుణుల అంచనా. అమెరికా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, ఉత్తర కొరియా సహా ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం పసిడిది బులిష్ ధోరణే అన్న అంచనాలకు బలాన్నిస్తాయని వారు చెబుతున్నారు. పన్నులకు సంబంధించి అమెరికా తీసుకునే చర్యలు పసిడి కదలికలను నిర్దేశించే అంశాల్లో ముఖ్యమైనవి. 1,310 డాలర్లు, 1,325 డాలర్లు పసిడికి కీలకమని, ఈ నిరోధాన్ని దాటితే తిరిగి పుత్తడి పూర్తిస్థాయిలో బులిష్ జోన్లోకి వచ్చినట్లేనని వారు పేర్కొంటున్నారు. దేశంలోనూ డౌన్... అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ ప్రభావం దేశీ ఫ్యూచర్స్ మార్కెట్‌పైనా కనబడుతోంది. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్– ఎంసీఎక్స్‌లో వారంలో పసిడి ధర రూ.310 తగ్గి రూ.29,380కి చేరింది. ఇక ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా ధర స్వల్పంగా రూ.20 తగ్గింది. 99.9 స్వచ్ఛత రూ.20 తగ్గి రూ. 29,590 వద్ద ముగియగా, 99.5 స్వచ్ఛత ధర సైతం అదే స్థాయిలో పడిపోయి రూ.29,440కి పడింది. ఇక వెండి ధర కేజీకి రూ. 255 పడిపోయి రూ. 39,335 వద్ద ముగిసింది. కాగా డాలర్ మారకంలో రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో వారంలో 46 పైసలు బలపడి 64.55కు చేరింది. -
పార్లమెంటులో... ‘బిజినెస్’
సామాజిక సేవపై రూ.5,857 కోట్లు 400 కంపెనీల వ్యయం న్యూఢిల్లీ: కార్పొరేట్ సామాజిక బాధ్యత పథకం (సీఎస్ఆర్) కింద 400 కంపెనీలు రెండేళ్ల కాలంలో రూ.5,857 కోట్లను ఖర్చు చేశాయి. ఈ విషయాన్ని కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభకు వెల్లడించారు. కంపెనీల చట్టం –2013 కింద నిర్దేశిత స్థాయిలో లాభాలను ఆర్జించే కంపెనీలు తమ మూడేళ్ల సగటు వార్షిక లాభాల్లో రెండు శాతాన్ని సామాజిక బాధ్యత కింద వివిధ కార్యక్రమాల కోసం ఖర్చు చేయాలన్న నిబంధన ఉంది. ఈ నిబంధన 2014 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. 2015–16 సంవత్సరంలో 172 కంపెనీలు నిబంధనల మేరకు రూ.2,660 కోట్లను సామజిక సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేయాల్సి ఉండగా రూ.3,360 కోట్లను వెచ్చించాయి. 2014–15లో 226 కంపెనీలు రూ.2,497 కోట్లను వ్యయం చేశాయి. కానీ, నిబంధనల మేరకు రూ.3,499 కోట్లను ఖర్చు చేయాల్సి ఉంది. సామాజిక బాధ్యత పథకాన్ని అమలు చేసే విషయంలో కంపెనీల దుర్వినియోగంపై తమ శాఖకు ఎటువంటి సమాచారం లేదని మంత్రి పేర్కొన్నారు. బిట్ కాయిన్లు చట్ట వ్యతిరేకం: కేంద్రం బిట్ కాయిన్లు తరహా వర్చువల్ కరెన్సీ (డిజిటల్ రూపంలో ఉండేవి) వినియోగం చట్ట విరుద్ధమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిని ఆర్బీఐ గుర్తించలేదని, వీటి కొనుగోళ్లు, లావాదేవీలు మనీలాండరింగ్ వ్యతిరేక చట్టం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంది. వర్చువల్ కరెన్సీ వాడకం వల్ల తలెత్తే ఆర్థిక, చట్టపరమైన, భద్రతా ముప్పు గురించి ట్రేడర్లను, వాటిని వినియోగించేవారిని ఆర్బీఐ ఇప్పటికే హెచ్చరించిట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపారు. చెల్లింపుల కోసం బిట్ కాయిన్ తరహా వర్చువల్ కరెన్సీల సృష్టికి ఏ సెంట్రల్ బ్యాంకు కూడా అనుమతించలేదన్నారు. నిర్వహణ లాభాల్లోకి ఎయిర్ ఇండియా! ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించే ఆలోచనేదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.300 కోట్ల మేర నిర్వహణ పరమైన లాభాలను ఆర్జించనుందని పౌర విమానయాన శాఖా సహాయ మంత్రి జయంత్ సిన్హా రాజ్యసభకు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా సంస్థ నిర్వహణ పరమైన నష్టాలు తగ్గుతూ వస్తున్నాయని, అవే లాభాలుగా మారుతున్నాయన్నారు. మూడేళ్లుగా నష్టాల్లోనే 43 కేంద్ర సంస్థలు మూడేళ్లుగా (2013–16) 43 కేంద్ర సంస్థలు (సీపీఎస్ఈ) నష్టాలతోనే ప్రయాణాన్ని సాగిస్తున్నాయి. ఈ జాబితాలో ఎయిర్ ఇండియా, బీఎస్ఎన్ఎల్, బ్రిటిష్ ఇండియా కార్పొరేషన్, హిందుస్థాన్ యాంటీబయోటిక్స్ వంటి దిగ్గజ సంస్థలు సైతం ఉన్నాయి. లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా భారీ పరిశ్రమల శాఖ మంత్రి బాబుల్ సుప్రియో ఈ విషయం తెలిపారు. వనరుల కొరత, సామర్థ్యాన్ని తక్కువగా వినియోగించుకోవడం, తీవ్రమైన పోటీ, నిర్వహణ లోపం ఇందుకు కారణాలని వివరించారు.