
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. క్రిప్టో కరెన్సీ విలువ అమాంతం పెరిగిపోతూనే ఉంది. దేశాన్ని ప్రపంచ క్రిప్టో కరెన్సీకి రాజధానిగా మారుస్తానని, క్రిప్టో రిజర్వ్‌ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. దీంతో బిట్‌కాయిన్‌తో సహా.. అనేక క్రిప్టో కరెన్సీల విలువ మరింత పెరిగిపోయింది.
డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో బిట్‌కాయిన్ ధర 91,000 డాలర్లను (సుమారు రూ.80 లక్షలు) దాటింది. ఎక్స్‌ఆర్‌పీ, సోలానా, కార్డానో, ఈథర్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఎంఎస్టీఆర్, కాయిన్, హెచ్ఓఓడీ, ఎంఏఆర్ఏ, ఆర్ఐఓటీ వంటి క్రిప్టో లింక్డ్ స్టాక్‌లు కూడా బుల్లిష్ బిడ్‌లను చూసే అవకాశం ఉంది.
మార్చి 7న ట్రంప్ క్రిప్టో సమ్మిట్‌ను నిర్వహిస్తారని వైట్ హౌస్ శుక్రవారం ప్రకటించడంతో క్రిప్టో ధరలు జీవిత కాల గరిష్టాలకు చేరుకోవడం ప్రారంభించాయి. సమ్మిట్‌కు ప్రముఖ వ్యవస్థాపకులు, సీఈఓలు, క్రిప్టో పరిశ్రమకు చెందిన పెట్టుబడిదారులు హాజరయ్యే అవకాశం ఉంది.
క్రిప్టో కాయిన్స్ విలువలు ఇలా..
భారత కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి 8:55 గంటల సమాయానికి సొలనా కాయిన్ (ఎస్ఓఎల్) విలువ 24 శాతం పెరిగి 175.46 డాలర్లకు చేరుకుంది. ఎక్స్‌ఆర్‌పీ 31 శాతం పెరిగి 2.92 డాలర్లకు, కార్డానో విలువ 1.1 డాలర్లకు చేరింది. డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో క్రిప్టో కాయిన్స్ మాత్రమే కాకుండా.. మార్కెట్లు కూడా పుంజుకున్నాయి.
ఇతర దేశాల్లోనూ క్రిప్టో నిల్వలు

ఈ చొరవ ఇతర దేశాలు ఇలాంటి నిల్వలను అభివృద్ధి చేయడానికి, తద్వారా ప్రపంచ డిమాండ్‌ను పెంచడానికి ప్రేరేపిస్తుంది. పెద్ద సంస్థలు బిట్‌కాయిన్, ఇతర క్రిప్టో ఆస్తులను తమ బ్యాలెన్స్ షీట్‌లలో చేర్చడానికి ఎక్కువ మొగ్గు చూపుతాయని కూడా అంచనా ఉంది. ఇది క్రిప్టోకు మరింత స్వీకరణను తెస్తుంది. క్రిప్టో వ్యవస్థను మరింత స్థిరీకరిస్తుంది. యూఎస్ ప్రభుత్వం క్రిప్టోను ఇంత పెద్ద ఎత్తున స్వీకరించడం దీర్ఘకాలంలో క్రిప్టోపై మరింత నమ్మకాన్ని తీసుకువచ్చేందుకు దోహదపడుతుంది. భారత్‌లోనూ వచ్చే 12 నుండి 18 నెలల్లో క్రిప్టోకు సంబంధించిన స్పష్టమైన నియంత్రణ చట్రాల రూపకల్పన జరగవచ్చు.
- విక్రమ్ సుబ్బరాజ్, సీఈవో, జియోటస్ క్రిప్టో ప్లాట్‌ఫామ్
గమనిక: క్రిప్టోకరెన్సీలో విపరీతమైన రిస్క్ ఉంటుందని తప్పకుండా గుర్తుంచుకోవాలి. కాబట్టి వీటి విలువ ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు పతనావస్థకు చేరుతుందో ఎవరూ ఊహించలేరు. కాబట్టి ఇందులో పెట్టుబడులు పెట్టాలంటే.. దీనిపైన పూర్తి అవగాహన ఉండాలి, లేదా నిపుణులు సలహాలు తీసుకోవడం మంచిది.
ఇదీ చదవండి: 12 మంది.. రూ. 60వేల పెట్టుబడి: పార్లే-జీ ప్రస్థానం గురించి తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment