
సాక్షి, హైదరాబాద్ : డిజిటల్ కరెన్సీగా పేరుగాంచిన బిట్‌కాయిన్స్ కరెన్సీ ముఠా గుట్టురట్టైంది. బిట్‌కాయిన్స్‌ను నిషేదించినప్పటికీ అక్రమంగా కొందరు చెలామణి చేస్తున్న నేపథ్యంలో నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ. 29లక్షల నగదు, రెండు కార్లను సీజ్ చేసినట్టు తెలుస్తోంది. రూ. కోటి ఎనభై లక్షల విలువచేసే ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనంచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వర్చువల్ కరెన్సీలతో రిస్క్ పొంచి ఉన్నదని ఆర్బీఐ హెచ్చరించింది. కాగా క్రిప్టో కరెన్సీలు చట్టబద్ధం కావని, వీటి వినియోగాన్ని తొలగించాలని బడ్జెట్ ప్రసంగంలో కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment