సాక్షి, బనశంకరి(కర్ణాటక): బిట్‌కాయిన్ కుంభకోణంతో సతమతమవుతున్న సీఎం బసవరాజ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్పను ఆశ్రయించారు. హైకమాండ్‌తో చర్చిస్తానని యడ్డి అభయం ఇచ్చినట్లు రాజకీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో బిట్‌కాయిన్ స్కాం వెలుగుచూడడంతో కాంగ్రెస్‌పార్టీ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ బీజేపీని ఇరుకునపెడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం ఢిల్లీకి వెళ్లి మరీ పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చినట్లు సమాచారం.
ఇది ముఖ్యమంత్రి కుర్చీకి నీళ్లు తేవచ్చని బొమ్మై ఆదుర్దాతో ఉన్నారు. మంత్రులు, పార్టీ సహాయం తీసుకుని ప్రతిపక్షాల ఆరోపణలకు దీటుగా సమాధానం ఇవ్వాలని యడియూరప్ప సలహా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఎక్కడికక్కడ మంత్రులు బిట్‌కాయిన్ స్కాంలో ప్రత్యారోపణలతో దాడి చేయాలని సీఎం ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment