సాక్షి,హైదరాబాద్: కర్ణాటక ‘వాల్మీకి’ కుంభకోణంలో బీఆర్‌ఎస్ చెప్పిందే నిజమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు బుధవారం(సెప్టెంబర్11) కేటీఆర్ ‘ఎక్స్’(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. ‘వాల్మీకీ స్కామ్ పైసలే తెలంగాణ కాంగ్రెస్ మొన్నలోక్‌సభ ఎన్నికల్లో వాడింది. గిరిజనుల బాగుకోసం ఖర్చు చేయాల్సిన సొమ్మును ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్న కాంగ్రెస్ నేతలను శిక్షించాలి.
వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ మంత్రి బి.నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన చార్జిషీట్‌లో పేర్కొంది. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్’కు చెందిన రూ.187 కోట్లు ఏకంగా కాంగ్రెస్ మంత్రి చేతులమీదుగా దారిమళ్లాయి. ఆ సొమ్ము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొన్న లోక్‌సభ ఎన్నికల ఫండింగ్ కోసం ఉపయోగించింది’ కేటీఆర్ ట్వీట్‌లో తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇదీ చదవండి.. కబ్జాదారులకు సీఎం రేవంత్ తాజా వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment