KTR Tweet
-
ఇచ్చింది కన్నా లాక్కున్నదే ఎక్కువ!.. రేవంత్ పాలనపై కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: నమ్మి నానబొస్తే పుచ్చులు చేతికొచ్చినట్లు ఉంది రేవంత్ రెడ్డి పాలన’’ అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘‘60 ఏళ్ల సమైక్య పాలకుల కన్నా పది నెలల్లోనే అధిక రుణం.. ఎవరి కోసం?. పదేళ్లలో సాధించిన ప్రగతి కన్నా పది నెలలో ఏం సాధించిండ్రని ఈ అప్పులు?. మీ ఆరు గ్యారంటీలు అర్ధ గ్యారంటీలుగా మిగిలి పోయాయి! అప్పులు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి’’ అని ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు.‘‘కట్టింది కన్నా కూల్చిందే ఎక్కువ!. ఇచ్చింది కన్నా లాక్కున్నదే ఎక్కువ!. అర్థం లేని అప్పులు! ఎక్కే దిగే ఢిల్లీ ఫైట్లు!. ఆదాని ముందు పొర్లు దండాలు! ఇదేగా మీ పది నెలల పాలన?. పటిష్టమైన బంగారు రాష్ట్రాన్ని "చేతి"కి అందిస్తే.. భ్రష్టు పట్టిస్తున్నరు’’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.నమ్మి నానబొస్తే పుచ్చులు చేతికొచ్చినట్లు ఉంది రేవంత్ రెడ్డి పాలన 60ఏళ్ల సమైక్య పాలకుల కన్నా పది నెలల్లోనే అధిక రుణం..ఎవరి కోసం?పదేళ్లలో సాధించిన ప్రగతి కన్నా పది నెలలో ఏం సాధించిండ్రని ఈ అప్పులు? మీ ఆరు గ్యారంటీలు అర్థ గ్యారంటీలు గా మిగిలి పోయాయి! అప్పులు మాత్రం ఆకాశాన్ని… pic.twitter.com/A0EQOXYYcC— KTR (@KTRBRS) October 30, 2024 -
‘మూసీ’ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు? కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: మూసీ సుందరీకరణ పేరిట అవినీతి ఆలోచనలు మానుకొని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టాలంటూ లేఖ రాసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ.. మరోసారి ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు.‘‘మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు? రైతు రుణ మాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు?. రైతు బంధు ఎగ్గొట్టి, మూసీ పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు?. మహిళలకు వంద రోజుల్లోనే నెలకు 2500 ఇస్తా అని చెప్పి తప్పించుకు తిరుగుతున్న మోసగాడు ఎవరు?. అవ్వ, తాతలకు నెలకు 4000 ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరు?. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తా అని మాట తప్పిన దగావీరుడు ఎవరు?. మూసి బ్యూటిఫికేషన్ పేరిట 1,500,000,000 కోట్ల లూటిఫికేషన్‌కి తెరతీసిన ఘనుడు ఎవరు?’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.కాగా, మూసీ ప్రక్షాళన కోసం రూ. లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామంటున్న ముఖ్యమంత్రికి రైతు భరోసా, దొడ్డు వడ్లకు బోనస్ ఇచ్చేందుకు డబ్బులు లేవా? అంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ దుయ్యబట్టారు. సీఎం నిర్వహించిన వ్యవసాయ సమీక్షలో దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్, వర్షాకాలంలో రైతు భరోసా వంటి అంశాలపై చర్చించలేదని విమర్శించారు.ఇదీ చదవండి: సర్కార్‌పై సమరానికి సై!గత సీజన్లోనూ రైతులకు వరి ధాన్యంపై బోనస్ చెల్లించకుండా ప్రభుత్వం మోసగించిందని ఆరోపించారు. కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనే ప్రకటనతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. 80 శాతం మంది రైతులు దొడ్డు వడ్లు పండిస్తారని తెలిసి కూడా కేవలం సన్న వడ్లకే ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రకటించడం సరికాదన్నారు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వకుంటే రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని కేటీఆర్ హెచ్చరించారు. -
ఢిల్లీ నుంచి వచ్చి క్షమాపణ చెప్తారా?.. కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ నుంచి రాహుల్, ప్రియాంక వచ్చి క్షమాపణ చెప్పాలంటూ ఎక్స్ వేదికగా మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. అప్పుడు 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని ఫుల్ పేజీ ప్రకటనలు, స్టాంపు పేపర్ల మీద అఫిడవిట్లు’’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. ఇప్పుడు 300 రోజుల తర్వాత, ఒక్క కాంగ్రెస్ నాయకుడు గాని, కార్యకర్త గాని ప్రజలకు సమాధానం చెప్తారా? అంటూ ఆయన ప్రశ్నించారు. అప్పుడు,100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని ఫుల్ పేజీ ప్రకటనలు, స్టాంపు పేపర్ల మీద అఫిడవిట్లు ఇప్పుడు,300 రోజుల తర్వాత, ఒక్క కాంగ్రెస్ నాయకుడు గాని, కార్యకర్త గాని ప్రజలకు సమాధానం చెప్తారా ? ఢిల్లీ నుండి రాహుల్, ప్రియాంక వచ్చి క్షమాపణ చెప్తారా ?… pic.twitter.com/eg4Z0S1Jmv— KTR (@KTRBRS) September 30, 2024 -
ఆ కిటుకేదో సామాన్యులకు చెప్పండి.. రేవంత్ సోదరుడికి కేటీఆర్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘అనుముల తిరుపతి రెడ్డి గారు! ఎల్కేజీ చదివే వేదశ్రీ కి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు!. 50 ఏళ్ల కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది!. 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేల మట్టమైంది!. వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు, అన్ని కాగితాలు ఉన్నా.. పేక మేడల కూల్చివేయబడింది!. తిరుపతి రెడ్డి గారు, క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా.. మీ విషయంలో నోరు మెదపలేదు!’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.‘‘వాల్టా అనుకుంటా.. ఏకంగా మీకు 30 రోజుల టైం ఇచ్చింది! కోర్టులో స్టే సంపాదించుకున్నారు!. ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనామో!. మీ సోదరుడి బల్డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటుకేదో చెప్పండి!’’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.అనుముల తిరుపతి రెడ్డి గారు! LKG చదివే వేదశ్రీ కి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు! 50 ఏళ్ళ కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది! 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేల మట్టమైంది! వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు, అన్ని కాగితాలు ఉన్నా….పేక మేడల… pic.twitter.com/1zIb7cBrCB— KTR (@KTRBRS) September 24, 2024ఇదీ చదవండి: యజమానుల తప్పిదం.. సామాన్యులు బలి! -
కేటీఆర్ ట్వీట్.. మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్
సాక్షి, పెద్దపల్లి జిల్లా: ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతోందంటూ కేటీఆర్ ఎక్స్‌లో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ‘‘ఎమ్మెల్యే అరికెపూడి గాంధీయే తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించారు. మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చినట్టు మేము తలదూర్చం’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.‘‘మీ పార్టీ అంతర్గత సమస్యల్ని మీరు పరిష్కరించుకోవాలి. మా పార్టీపై నెపం వేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు తెలివిగలవారో ప్రజలే చెప్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ ప్రజలందరూ తెలంగాణ ప్రజలే.. వారందరినీ గౌరవిస్తాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తాం’’ అని శ్రీధర్‌బాబు చెప్పారు.‘‘రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచడానికి అందరూ పాలుపంచుకోవాలి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కొన్ని ప్రతిపక్షాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయి. ఎవరు ఏం చేసినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదు’’ అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత.. గణేశ్ ఉత్సవ సమితి Vs పోలీసులు -
‘వాల్మీకి’ స్కామ్‌లో మేం చెప్పిందే జరిగింది: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: కర్ణాటక ‘వాల్మీకి’ కుంభకోణంలో బీఆర్ఎస్ చెప్పిందే నిజమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు బుధవారం(సెప్టెంబర్11) కేటీఆర్ ‘ఎక్స్’(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. ‘వాల్మీకీ స్కామ్ పైసలే తెలంగాణ కాంగ్రెస్ మొన్నలోక్సభ ఎన్నికల్లో వాడింది. గిరిజనుల బాగుకోసం ఖర్చు చేయాల్సిన సొమ్మును ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్న కాంగ్రెస్ నేతలను శిక్షించాలి. వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ మంత్రి బి.నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన చార్జిషీట్లో పేర్కొంది. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్’కు చెందిన రూ.187 కోట్లు ఏకంగా కాంగ్రెస్ మంత్రి చేతులమీదుగా దారిమళ్లాయి. ఆ సొమ్ము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొన్న లోక్‌సభ ఎన్నికల ఫండింగ్ కోసం ఉపయోగించింది’ కేటీఆర్ ట్వీట్లో తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదీ చదవండి.. కబ్జాదారులకు సీఎం రేవంత్ తాజా వార్నింగ్ -
ఇది మతిలేని చర్య.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం రేవంత్ సర్కార్‌కు చేతకాదంటూ ఎక్స్(ట్విటర్) వేదికగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘‘నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకున్నది. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన రూ.20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వభూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తనఖాపెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనికి మధ్యవర్తిగా ఒక మర్చంట్ బ్యాంకర్‌ను పెట్టి వారికి రు.100 కోట్ల కమీషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది అని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ మతిలేని చర్య వల్ల తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటుపడి, కొత్తగా పెట్టుబడులు, పరిశ్రమలు రాక, ఉద్యోగాలు రాక, మన బిడ్డలకు కొలువులు రాకుండా పోయే ప్రమాదం ఉన్నది!’’అంటూ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘కోకాపేట, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. అలాంటి చోట 400 ఎకరాలు ప్రైవేట్ సంస్థలకు తనఖా పెట్టడం అనాలోచిత చర్య. అసలే గత ఏడు నెలలుగా రాష్ట్ర పారిశ్రామికరంగం స్తబ్దుగా ఉంది. కొత్తగా పెట్టుబడులు రావడం లేదు. ఉన్న కంపెనీలు కూడా సరైన ప్రోత్సాహం లేక పక్కచూపులు చూస్తున్నాయి. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కొరకు పరిశ్రమలకు ఇచ్చే భూములు తాకట్టు పెడితే.. కంపెనీలకు ఏమిస్తారు? కొత్తగా మన యువతకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి?’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాని రేవంత్ సర్కార్ ఇప్పుడు నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకున్నది. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన 20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వభూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తనఖాపెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించాలని… pic.twitter.com/E2EWqT0hve— KTR (@KTRBRS) July 10, 2024 -
ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు కేటీఆర్ రిప్లై.. మరోసారి ట్రెండింగ్‌లో హైదరాబాద్
రోజు రోజుకి అభివృద్ధి వైపు పరుగులుపెడుతూ విశ్వనగరంగా విరాజిల్లుతున్న 'భాగ్యనగరం' (హైదరాబాద్) రానున్న రోజుల్లో దేశానికే తలమానికం కానుందా.. అన్నట్లు ఎదుగుతోంది. దీనికి కారణం దిగ్గజ సంస్థలు తమ దృష్టిని హైదరాబాద్ ఆకర్శించడమే! ఇటీవల హైదరాబాద్‌ను ఉద్దేశించి 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) చేసిన ఒక ట్వీట్‌కు మంత్రి 'కేటీఆర్' (KTR) రిప్లై ఇచ్చారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఒక బిల్డింగ్ ప్రాజెక్ట్ గురించి వార్తలు వచ్చినప్పుడు.. గూగుల్ లాంటి అంతర్జాతీయ దిగ్గజం అమెరికా బయట అతిపెద్ద క్యాంపస్ నిర్మించేందుకు ఓ దేశాన్ని ఎంపిక చేసుకుందంటే.. ఇది కేవలం వాణిజ్యానికి సంబంధించినది మాత్రమే కాదు.. అక్కడి భౌగోళిక రాజకీయాలకు ప్రాధాన్యముందని, ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు కేటీఆర్ రిప్లై ఇస్తూ.. డియర్ ఆనంద్ జీ.. ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ హైదరాబాద్‌లో ఉందని మీకు తెలుసా? అంతే కాకుండా యాపిల్, మెటా, క్వాల్కామ్, మైక్రాన్, నోవార్టిస్, మెడ్‌ట్రానిక్, ఊబెర్, సేల్స్‌ఫోర్స్ సంస్థలు గత తొమ్మిదేళ్లల్లో అతిపెద్ద క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయి. అందుకే నేను దీనిని #HappeningHyderabad అని పిలుస్తాను, అంటూ రిప్లై ఇచ్చారు. ఇదీ చదవండి: భారత్ నిర్ణయంతో చైనాకు రూ.50000 కోట్లు నష్టం - ఎలా అంటే? నిజానికి 2015లో కేటీఆర్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న గూగుల్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించారు. ఆ సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆ తరువాత 2022లో ఈ గూగుల్ భవన నిర్మాణానికి ఐటీ మినిష్టర్ కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం సుమారు 30.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గూగుల్ తన క్యాంపస్‌ను హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్మిస్తోంది. ఇందులో దాదాపు 30 వేల మంది ఉద్యోగులు పని చేసేందుకు వీలుగా అత్యాధునిక టెక్నాలజీలు అందుబాటులోకి రానున్నాయి. Dear Anand Ji, Did you know that the World’s Largest campus of Amazon is located in Hyderabad? Also the second largest campuses of Apple, Meta, Qualcomm, Micron, Novartis, Medtronic, Uber, Salesforce and many more have also been setup in Hyderabad in the last 9 years That’s… https://t.co/nPXJtCX24S pic.twitter.com/bozaJYSrrx — KTR (@KTRBRS) November 10, 2023 -
సీఎం కేసీఆర్‌కు వైరల్ ఫీవర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత వారం రోజులుగా వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నారు. వైద్యుల బృందం పర్యవేక్షణలో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ ఎక్స్ (ట్విటర్) ద్వారా వెల్లడించారు. త్వరలోనే కోలుకుంటారని వైద్యులు చెబుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. CM KCR Garu has been suffering from Viral Fever and Cough for the last one week. He is being treated at home by his medical team and is being monitored closely. As per Doctors he should be able to get back to normalcy in a few days — KTR (@KTRBRS) September 26, 2023 -
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ.. మొత్తం 400 కిలో మీటర్లు
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.69 వేల కోట్ల అంచనా వ్యయంతో రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ మెట్రో రైలు కనెక్టివిటీని మొత్తం 400 కి.మీలకు విస్తరించాలని నిర్ణయించినట్లు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు నిర్ణయించినందుకు సీఎం కేసీఆర్‌కి, మంత్రివర్గ సహచరులకు ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే కొత్తగా వచ్చే మెట్రో కారిడార్లను పేర్కొన్నారు. కొత్త మెట్రో కారిడార్లు ఇవే.. ఓఆర్ఆర్ మెట్రో జేబీఎస్ నుంచి తూముకుంట ప్యాట్నీ నుంచి కండ్లకోయ, ఇస్నాపూర్ నుంచి మియాపూర్ మియాపూర్ నుంచి లక్డికాపుల్ ఎల్బీ నగర్ నుంచి పెద్ద అంబర్పేట్ ఉప్పల్ నుంచి బీబీనగర్ తార్నాక నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ ఎయిర్పోర్ట్ నుంచి కందుకూరు (ఫార్మా సిటీ) షాద్‌నగర్ మీదుగా శంషాబాద్ (ఎయిర్పోర్ట్) -
నోటికొచ్చినట్లు మొరుగుతూనే వుంటారు.. పట్టించుకోవద్దు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యానాలు చేయవద్దని విజ్ఞప్తి. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్లు మొరుగుతూనే వుంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు.’ అని ట్వీట్ చేశారు కేటీఆర్. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వాఖ్యానాలు చేయవద్దని విజ్జప్తి అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే వుంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు — KTR (@KTRTRS) October 27, 2022 ఇదీ చదవండి: అర్ధ రూపాయికి కూడా అమ్ముడుపోని వారికి రూ.100 కోట్లా? -
ప్రధాని మోడీ పై కేటీఆర్ సంచలన ట్వీట్
-
బాసర IIIT వద్ద హై టెన్షన్
-
సాక్షి ఎఫెక్ట్: విష్ణువర్ధన్ వైద్యానికి కేటీఆర్ భరోసా
సాక్షి, జన్నారం(ఆదిలాబాద్): చిన్నారి విష్ణువర్ధన్ వైద్యానికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. ఈనెల 28న పసివారికి ప్రాణం పోయండి అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో ప్రచూరితమైన కథనాన్ని కవ్వాల్ గ్రామానికి చెందిన తిరుపతి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసి, ఆదుకోవాలని కోరారు. మంత్రి ఆఫీస్ నుంచి స్పందిస్తూ బాధిత కుటుంబ వివరాలను తెలియజేయాలని గురువారం రీట్వీట్ చేశారు. దీంతో విష్ణువర్ధన్ వైద్యానికి భరోసా లభించినట్లేనని చిన్నారి తండ్రి రమేశ్ తెలిపారు. అదేవిధంగా పలువురు దాతలు ఆన్లైన్ ద్వారా సాయమందించినట్లు ఆయన పేర్కొన్నారు. నీలోఫర్‌కు ‘నెలరోజుల బాబు’ ఖానాపూర్: మండలంలోని సేవ్యానాయక్ తండాకు చెందిన బి.గబ్బర్‌సింగ్, సుమలత దంపతుల నెలరోజుల వ యస్సు గల శిశువు అనారోగ్య పరిస్థితిపై ‘వెంటిలేటర్‌పై నెలరోజుల బాబు’ అనే శీర్షికతో ఈనెల 29న ‘సాక్షి’లో ప్రచూరితమైన కథనానికి ఆరోగ్యశ్రీ అధికారులు స్పందించారు. ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ వినిత్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి ఖానాపూర్ ఆరోగ్యమిత్ర సునీత గ్రామంలోని బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్న చిన్నారిని కుటుంబ సభ్యులు నిర్మల్ నుంచి నిజామాబాద్ తీసుకెళ్లిన ఆరోగ్యం కుదుట పడలేదన్నారు. దీంతో హైదరాబాద్‌లోని నీలోఫర్ రెఫర్ చేశామని ఆరోగ్యమిత్ర సునీత గురువారం ‘సాక్షి’కి తెలిపారు. చదవండి: కేకేకు కోవిడ్ పాజిటివ్ -
స్కూల్‌పై చర్యలు తీసుకోవాలి:కేటీఆర్
-
హరీశ్‌కు కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్: తెలంగాణ భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పుట్టిన రోజును పురస్కరించుకుని టీఆర్ఎస్ నాయకులు శనివారం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హరీశ్‌రావుకు కేటీఆర్ ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. హరీశ్‌రావు సమర్థవంతుడైన నాయకుడని కొనియాడారు. ‘స్పష్టమైన భావప్రకటన, కష్టపడేతత్వం, సమర్థత కలిగిన కొంతమంది నాయకుల్లో ఒకరైన హారీశ్‌రావు గారికి జన్మదిన శుభాకాంక్షల’ని కేటీఆర్ ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ కూడా ట్విటర్ ద్వారా హరీశ్‌రావుకు శుభాకాంక్షలు తెలిపింది. మరోవైపు హరీశ్‌రావు తన నియోజకవర్గం సిద్ధిపేటలో కలియ తిరిగారు. ఇంటింటికీ వెళ్లి అభిమానులను అప్యాయంగా పలకరించారు. బాలింతలకు కేటీఆర్ కిట్లు పంపిణీ చేశారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పోటీ పడ్డారు. Many happy returns of the day to one of our most able, articulate & hardworking leaders @trsharish Garu on his birthday — KTR (@KTRTRS) 3 June 2017 -
వర్షాలు తగ్గగానే ఆ పని చేస్తాం: కేటీఆర్
జంటనగరాల్లో చాలాచోట్ల వర్షాలకు రోడ్లు దారుణంగా దెబ్బతిన్న విషయాన్ని పలువురు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ట్విట్టర్ ద్వారా, ఇంకా పలు రకాలుగా ఏయే ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో తెలిపారు. దాంతో వాటన్నింటికీ కలిపి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చారు. చాలామంది నుంచి హైదరాబాద్‌లో దారుణంగా ఉన్న రోడ్ల పరిస్థితి గురించిన ఫిర్యాదులు వస్తున్నాయని, ఇక మీదట తమ దృష్టి అంతా నగరంలో బాగా పాడైన రోడ్ల మరమ్మతుల మీదే ఉంటుందని ఆయన తెలిపారు. వర్షాలు తమకు కాస్త అవకాశం ఇస్తే ఆ పనులు వెంటనే మొదలుపెడతామని చెప్పారు. Yes, hearing it from many of you; Focus shall be on repairing the heavily damaged roads in Hyderabad. As soon as the rains give us a respite — KTR (@KTRTRS) 15 September 2016 -
హైదరాబాద్‌లో యాపిల్ సొంత కేంద్రం!
♦ డెవలప్మెంట్ సెంటర్ ఆరంభం రేపు... ♦ దీనికోసమే ఇక్కడికి వస్తున్న కంపెనీ సీఈఓ టిమ్‌కుక్ ♦ ఈ సందర్భంగా అతిపెద్ద వార్త వింటారంటూ కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోనే నంబర్-1 కార్పొరేట్ కంపెనీ... టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్‌కుక్ హైదరాబాద్‌కు రానున్నారు. భారత్‌లో తొలిసారిగా అడుగు పెడుతున్న ఆయన... గురువారం హైదరాబాద్‌కు వస్తారు. ఈ సందర్భంగా ఆయన యాపిల్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించే అవకాశముంది. సిటీలో టిమ్‌కుక్ మూడు గంటలపాటు ఉంటారని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు చెప్పారు. ప్రస్తుత టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్‌ను గచ్చిబౌలిలోని టిస్మన్ స్పియర్ భవనంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ భవనంలో 2.50 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నట్టు సమాచారం. అమెరికా వెలుపల సంస్థకు ఇదే తొలి ఫెసిలిటీ కూడా. దీనికోసం యాపిల్ రూ.100 కోట్ల దాకా ఖర్చు చేస్తోంది. యాపిల్ మ్యాప్స్ టెక్నాలజీకి కావాల్సిన సేవలను ఈ కేంద్రం అందిస్తుంది. 2,500 మంది ఉద్యోగులు పనిచేసే వీలుంది. తెలంగాణ ఐటీ మంత్రి కె.తారకరామారావు పర్యవేక్షణలో కంపెనీకి అవసరమైన అనుమతులను వేగంగా మంజూరు చేయటం గమనార్హం. కుక్ వారంరోజుల భారత పర్యటన నిమిత్తం తన ప్రైవేటు జెట్‌లో మంగళవారం అర్థరాత్రి ముంబైకి చేరుకున్నారు. 19న హైదరాబాద్ వచ్చి... అట్నుంచి ఢిల్లీ వెళతారు. 20, 21 తేదీల్లో అక్కడే ఉంటారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారు. మేకిన్ ఇండియా అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చే అవకాశముందని సమాచారం. ఇతర రంగాల్లోనూ యాపిల్ పెట్టుబడులు! టిమ్‌కుక్ రాక నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ... ‘అతి పెద్ద వార్తను మీతో ఎల్లుండి పంచుకోబోతున్నాను. అప్పటి వరకు సస్పెన్స్’ అంటూ మంగళవారం ట్వీట్ చేశారు. కాగా ప్రస్తుతం లీజు కార్యాలయంలో డెవలప్మెంట్ సెంటర్‌ను ఆరంభించినా... సొంత కేంద్రం ఏర్పాటు చేసుకోవాలని యాపిల్ చూస్తోందని, ఈ క్రమంలో ప్రభుత్వం యాపిల్‌కు స్థలాన్ని కేటాయించే అవకాశముందని సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా కేటీఆర్ ఈ ప్రకటన చేయొచ్చని తెలిసింది. అంతేకాక ఈ మధ్య యాపిల్ తన పంథా మార్చుకుని ఇతర రంగాల్లోనూ ఇన్వెస్ట్ చేస్తోంది. ఇటీవలే చైనాలో రైడ్ షేరింగ్ సంస్థ ‘దీదీ’లో బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. చైనాలో యాపిల్ ఐట్యూన్స్‌ను నిషేధించిన నేపథ్యంలో ఆ ప్రభుత్వంతో సాన్నిహిత్యం కోసమే ఈ పెట్టుబడి పెట్టినట్లు భావిస్తున్నారు. అయితే భారత్‌లోనూ కొన్ని పెట్టుబడులను ప్రకటించే అవకాశం లేకపోలేదని ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ మరిన్ని ఊహాగానాలకు అవకాశం కల్పించింది. అవకాశాల విపణి..! ఐఫోన్, ఐప్యాడ్లను విక్రయిస్తున్న యాపిల్... ఇప్పటిదాకా తాను విక్రయిస్తున్న మార్కెట్లలో గరిష్ఠ అమ్మకాల దశకు చేరుకుంది. అక్కడ వృద్ధి ఆశించినంతగా లేదు. దీంతో అభివృద్ధి చెందుతున్న చైనా, భారత్‌లపై ఫోకస్ చేసింది. గతేడాదితో పోలిస్తే 2016 జనవరి-మార్చి త్రైమాసికంలో యాపిల్ అమ్మకాలు దేశంలో 62 శాతం వృద్ధి చెందాయి. యాపిల్ ఉత్పత్తులను కాంట్రాక్ట్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ రూపొందిస్తోంది. ఫాక్స్‌కాన్‌కు భారత్‌లో ప్లాంట్లున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలోనూ ప్లాంటు ఉంది. కాగా యాపిల్ ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా తయారీ కేంద్రాన్ని మహారాష్ట్రలో నెలకొల్పే అవకాశముందని, 1,200 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫెసిలిటీ రానుందని ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి.