ఆ కిటుకేదో సామాన్యులకు చెప్పండి.. రేవంత్‌ సోదరుడికి కేటీఆర్‌ డిమాండ్‌ | Ex Minister KTR Tweet On The Demolition Of HYDRA | Sakshi
Sakshi News home page

ఆ కిటుకేదో సామాన్యులకు చెప్పండి.. రేవంత్‌ సోదరుడికి కేటీఆర్‌ డిమాండ్‌

Published Tue, Sep 24 2024 11:17 AM | Last Updated on Tue, Sep 24 2024 1:17 PM

Ex Minister KTR Tweet On The Demolition Of HYDRA

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘అనుముల తిరుపతి రెడ్డి గారు! ఎల్‌కేజీ చదివే వేదశ్రీ కి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు!. 50 ఏళ్ల కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది!. 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేల మట్టమైంది!. వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు, అన్ని కాగితాలు ఉన్నా.. పేక మేడల కూల్చివేయబడింది!. తిరుపతి రెడ్డి గారు, క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా.. మీ విషయంలో నోరు మెదపలేదు!’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

‘‘వాల్టా అనుకుంటా.. ఏకంగా మీకు 30 రోజుల టైం ఇచ్చింది! కోర్టులో స్టే సంపాదించుకున్నారు!. ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనామో!. మీ సోదరుడి బల్‌డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటుకేదో చెప్పండి!’’ అంటూ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి: యజమానుల తప్పిదం.. సామాన్యులు బలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement