సాక్షి,హైదరాబాద్: ప్రధాని మోదీ సబర్మతి రివర్‌ను శుభ్రం చేసుకోవచ్చు. మేం మాత్రం మూసీని శుభ్రం చేసుకోవద్దా? అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌లో కుటుంబ డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా డిజిటల్ కార్డ్‌లు మూసీ సుందరీకరణ,కూల్చివేతలపై సంచలన వ్యాఖ్యలపై చేశారు.
30 శాఖల దగ్గర ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి డిజిటల్ కార్డ్‌లను రూపొందించాం. అన్ని చోట్ల అద్యయనం చేసి డిజిటల్ కార్డ్‌లను తయారు చేశాం. ప్రతి పేదవాడికి రేషన్ కార్డ్‌లను ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నాం. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు కార్డ్ ఇవ్వాలి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డ్ ఇవ్వాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత బస్తీల్లో కుటుంబాలు పెరిగాయి. కొత్తగా కార్డ్‌లు లేకపోవడంతో పదకాలు అందలేదు. ప్రతి పేదవాడికి రేషన్ కార్డ్‌లు అందిస్తాం. ప్రజల సంక్షేమం కోసమే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్‌లు. రేషన్ కార్డ్‌లు ఇవ్వడం లేదనే కేసీఆర్‌ను ప్రజలు ఇంటికి పంపించారు. రేషన్ కార్డ్‌లు ఇవ్వాలని అన్నీ జిల్లాల నుంచి రిక్వెస్ట్‌లు పంపారు.
డిజిటల్ కార్డ్‌లో ఫ్యామిలీ వివరాలు ఉంటాయి. అన్నీ పథకాలు ఒకటే కార్డ్ అదే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్. ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ సంబంధించిన వివరాలన్నీ అందులో ఉంటాయి. పేర్లు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. గ్రామాల నుంచి ఉపాధి కోసం పట్టణాలు, నగరాలకు వచ్చిన పేదలు ఉన్న ప్రాంతంలోనే రేషన్ తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. ముందుగా నియోజకవర్గానికి రెండు చోట్ల దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నాం. దీనిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు సరిదిద్దుతాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
బీజేపీ,బీఆర్‌ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేస్తున్నాం. తాగునీరు అందించే చెరువుల్లో ఫాంహౌస్ కట్టుకున్నారు. సబితా ఇంద్రారెడ్డి ఫాంహౌస్ కూలగొట్టా.. వద్దా? ఈటల రాజేందర్ ఎంపీగా గెలిచావు కదా? మేం మూసీ అభివృద్ధి చేసుకోవద్దా? కేటీఆర్,హరీష్ రావు సెక్రటేరియేట్‌కు రావాలి. ప్రధాని మోదీ సబర్మతిని శుభ్రం చేసుకోవచ్చు. మేం మాత్రం మూసీని శుభ్రం చేసుకోవద్దా. చిన్నపాటి వర్షంతో మునిగిపోతున్న నగరాన్ని సంరక్షించేందుకు నడుం బిగించాం. మూసీ మురికి,దోమలతో అక్కడి ప్రజలు జీవచ్ఛవంలా ఉన్నారు. మూసీపై అఖిల పక్ష సమావేశానికి సిద్ధం హైదరాబాద్ నగరంలో చెరువులు,నాలాలు ఆక్రమణలు ఎవరు నిర్మించారో తేల్చుదాం. మీ ఫాంహౌస్‌లను కాపాడుకోవానికే పేదల పేరుతో ముసుగు వేసుకుంటున్నారు. బావబామర్దులు కిరాయి మనుషులతో హడావిడి చేస్తున్నారు.కూల్చి వేతలపై వెనక్కి తగ్గబోమని, ఇలాగే కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
- గతంలో ఒకాయన చేసింది రెండే పనులు.. అవి అప్పులు, తప్పులు
- అధికారం పోయాక విచక్షణ కోల్పోయి ఏదేదో మాట్లాడుతున్నారు.
- ప్రతిపక్షాలు వాగుడు ఆపడం మంచిది
- మూసీలో మునిగిపోయిన పేదలకు మీ అవినీతి సొమ్మును పంచి పెట్టండి
- మీ ఖాతాలోని రూ.500 కోట్లు పంచి పెట్టండి
- మూసీ మురికి,దోమలతో అక్కడి ప్రజలు జీవచ్ఛవంలా బతుకుతున్నారు
- మూసీ నిర్వాసితులకు ఇళ్లు ఇచ్చి మంచి జీవితం ఇవ్వాలనే ప్రయత్నం తప్పా
- మీరు మాత్రం ఫాం హౌజ్‌లో ఉండాలా?
- మీ ఫాంహౌస్‌లను కాపాడుకోవానికే పేదల పేరుతో ముసుగు వేసుకుంటున్నారు.
- మూసీపై అఖిల పక్ష సమావేశానికి సిద్ధం
- మీ ముగ్గురి ఫాంహౌస్‌లు కూల్చాలా? వద్దా?
- అధికారం రాక ముందు చెప్పులు లేకుండా తిరిగిన మీరు కోట్లకు ఎలా పడగలెత్తారు.
- మూసీ పేదలకు ఇళ్లు ఇవ్వాలా? వద్దా?
- బావబామ్మర్దులు కిరాయి మనుషులతో హడావిడి చేస్తున్నారు
- బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోంది
- ఒకరోజు కేటీఆర్ మాట్లాడితే.. మరో రోజు అదే అంశాన్ని ఈటెల మాట్లాడుతున్నారు
- ప్రధాని మోదీ సబర్మతి రివర్‌ను శుభ్రం చేసుకోవచ్చు. మేం మాత్రం మూసీని శుభ్రం చేసుకోవద్దా
- మోదీ దగ్గరు వెళ్దాం రా ఈటల
- ఎవరు ఆక్రమించారో తేలుద్దాం
- హైదరాబాద్ నగరంలో చెరువులు,నాలాల ఆక్రమణలు ఎవరు నిర్మించారో తేలుద్దాం
- కేటీఆర్,హరీష్‌రావు సచివాలయానికి రండి.. 4రోజులు లేవకుండా చర్చిద్దాం
Comments
Please login to add a commentAdd a comment