musi
-
కేసీఆర్ ను ఫినిష్ చేస్తానన్న వారే ఫినిష్ అయ్యారు: కేటీఆర్
-
CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవ సంకల్పయాత్ర.. భీమలింగానికి రేవంత్ ప్రత్యేక పూజలు
సాక్షి, వరంగల్: సంగెం నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర శుక్రవారం మధ్యాహ్నాం నుంచి ప్రారంభమైంది. భీమలింగం వరకు 2.5 కి.మీ మేర ఈ పాదయాత్ర కొనసాగింది. తొలుత యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చేరుకున్న సీఎం రేవంత్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైటీడీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. యాదాద్రి ఆలయంతో పాటు జిల్లా అభివృద్ధి పనులు, పెండింగ్ పనులపై చర్చించారు.అనంతరం వలిగొండ మండలం సంగెం గ్రామానికి చేరుకుని మూసీ పరీవాహక ప్రాంత రైతులతో కలిసి కాల్వల్ని పరిశీలించారు. తర్వాత రైతులు, కుల వృత్తిదారులతో సమావేశమై వారి యోగక్షేమాలు, మూసీ జలాలతో జరిగే నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. సంగెం-భీమలింగం-ధర్మారెడ్డిపల్లి కెనాల్ నుంచి నాగిరెడ్డిపల్లి వరకు పాదయాత్ర కొనసాగింది. మూసీలో నీటి కాలుష్యాన్ని రేవంత్‌రెడ్డి పరిశీలించారు. భీమలింగంకు సీఎం పూజలు చేశారు. నాగిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసే సభలో సీఎం ప్రసంగించారు. అనంతరం హైదరాబాద్‌కు చేరుకున్నారు. -
నేడు సీఎం ‘మూసీ’ యాత్ర
సాక్షి, హైదరాబాద్/సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం రైతులతో కలిసి మూసీ నది వెంట పాదయాత్ర ద్వారా భీమలింగం, ధర్మారెడ్డి కాల్వల్ని సందర్శించనున్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. తొలుత ఉదయం 8.45 గంటలకు కుటుంబ సమేతంగా హెలికాప్టర్లో శ్రీ యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చేరుకుని తన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ఉదయం 10 గంటలకు వైటీడీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.యాదాద్రి ఆలయంతో పాటు జిల్లా అభివృద్ధి పనులు, పెండింగ్ పనులపై చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో వలిగొండ మండలం సంగెం గ్రామానికి చేరుకుని మూసీ పరీవాహక ప్రాంత రైతులతో కలిసి కాల్వల్ని సందర్శిస్తారు. తర్వాత రైతులు, కుల వృత్తిదారు లతో సమావేశమై వారి యోగక్షేమాలు, మూసీ జలాలతో జరిగే నష్టాన్ని అడిగి తెలుసుకుంటారు. సంగెంలో 10 వేలమందితో ఏర్పాటు చేసే సభలో సీఎం ప్రసంగిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు చేరుకుంటారు.గుట్టకు రెండోసారిసీఎం రేవంత్‌రెడ్డి యాదగిరిగు ట్టకు రావడం ఇది రెండోసారి. మొదట మార్చి 11న యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం రోజున మంత్రులతో కలిసి సందర్శించారు. కాగా శుక్రవారం సీఎం పర్యటన దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ, జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. సంగెం వద్ద మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, యాదాద్రిలో ఈఓ భాస్కర్‌రావు ఏర్పాట్లు పరిశీలించారు.ప్రజల జీవన స్థితిగతులు మార్చాలన్నదే ఆశయం: తుమ్మలమూసీ పునరుజ్జీవం ద్వారా లక్షలాది మంది ప్రజల జీవన స్థితిగతులు మార్చాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి ఆశయమని మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సంగెం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మూసీ పరివాహక రై తులు, ప్రజలు, కులవృత్తుల వారి ఈతి బాధలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి మేలు చేసేందుకే సీ ఎం పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. కార్య క్రమానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
హైదరాబాద్‌ను ఫినిష్ చేసేయత్నం
సాక్షి, హైదరాబాద్: ‘‘గుజరాత్‌తో పోటీపడుతోందన్న అక్కసుతో హైదరాబాద్‌ను ఫినిష్ చేయాలని చూస్తున్నారు. మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగు రోడ్డు, రేడియల్ రాడార్, ఇరిగేషన్ ప్రాజెక్టులతో పురోగతి సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం.. గుజరాత్‌కు పోటీ ఇస్తుందనే విషయం తెలిసే బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి మా ప్రయత్నాలను ఆపాలని చూస్తున్నాయి..’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు.అందుకే కాంగ్రెస్ సర్కారు నిర్ణయాలను బీఆర్ఎస్ వ్యతిరేకించిన మరుసటి రోజే కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు కూడా తప్పుపడతారని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఏబీపీ నెట్వర్క్ ‘సదరన్ రైజింగ్ సమ్మిట్–2024’ను సీఎం రేవంత్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘గుజరాత్ రాష్ట్రంలో సబర్మతి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ మేం మూసీ పునరుజ్జీవం చేస్తామంటే మాత్రం బీజేపీ నేతలు అడ్డుకుంటారు. మూసీ పునరుజ్జీవంతోపాటు బాపూఘాట్ అభివృద్ధిని కూడా బీజేపీ వ్యతిరేకిస్తోంది. మీకు నచ్చకపోతే ఇంట్లో కూర్చోండి. మా ప్రభుత్వాన్ని పనిచేయనివ్వండి. మా ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని చూడొద్దు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నది గుర్తుంచుకోండి. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదు తెలంగాణ ప్రజల ఆలోచనలను పట్టించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే పడగొట్టాలని అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే నాకు మద్దతుగా నిలిచారు. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపించిన కేసీఆర్ పది సార్లు కూడా సెక్రటేరియట్‌కు రాలేదు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే పది నిమిషాలు అసెంబ్లీలో కూర్చుని వెళ్లిపోయారు.కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకముంటే ఎందుకు బయటకు రావడం లేదు? తానో జమీందార్ అని, ప్రజలందరూ గులాములని కేసీఆర్ భావిస్తారు. అందుకే బయటికి రావడం లేదు. ఈసా, మూసా నదులు కలిసే చోట బాపూఘాట్ ఉంది. అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా దానిని అభివృద్ధి చేస్తాం. గాంధీజీ వారసులుగా మేం ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా బాపూఘాట్ అభివృద్ధి చేయబోతున్నాం. గుజరాత్లో పటేల్ విగ్రహం తరహాలోనే బాపూఘాట్లో గాంధీజీ విగ్రహం ఏర్పాటు చేస్తాం. ప్రజల కోసం మోదీ ఏం చేశారు? నెహ్రూ మొదలుకుని ఇందిర, రాజీవ్, పీవీ, మన్మోహన్ వంటి కాంగ్రెస్ ప్రధానులందరూ దేశంలో అనేక సంస్కరణలతో పాటు విప్లవాలు తీసుకువచ్చారు. కానీ దేశానికి మూడోసారి ప్రధాని అయిన మోదీ ఏం విప్లవం తెచ్చారో, దేశ ప్రజల కోసం ఏం చేశారో, ఎవరికి ప్రయోజనం చేకూర్చారో చెప్పాలి. పార్టీలను, ప్రభుత్వాలను విడగొట్టడం, పడగొట్టడం, భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం తప్ప ప్రజలకు మోదీ ఏమీ చేయలేదు. ఈ దేశంలో ఉత్తర, దక్షిణ భారతాలనే విభజన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరిగేది. ఉత్తరాది రాష్ట్రాలకు కూడా నిధులు కేటాయించి అభివృద్ధి చేసేవారు. కానీ ఎన్డీఏ హయాంలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. గతంలో ఉత్తర భారతం నుంచి ప్రధాని ఉంటే.. దక్షిణ భారతం నుంచి రాష్ట్రపతిని చేసే సంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ పాటించింది. కానీ మోదీ ఈ సంప్రదాయాన్ని తుంగలో తొక్కి కేవలం ఎన్నికల్లో గెలుపు కోసమే పనిచేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పన్నులు తీసుకుంటున్నా.. కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. దక్షిణ భారత రాష్ట్రాలకు మోదీ నుంచి అందిన సహకారం చాలా తక్కువ. ఉత్తరప్రదేశ్ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో ఒక్క రూపాయి వెళితే.. 7 రూపాయలు వెనక్కు ఇస్తున్నారు. అలాగే బీహార్‌కు 6 రూపాయలు వెనక్కి ఇస్తున్నారు. తెలంగాణ నుంచి రూపాయి వెళితే.. కేవలం 40పైసలు మాత్రమే వెనక్కి ఇస్తున్నారు. ప్రధాని మోదీ ఉత్తర భారతదేశానికి చెందిన వ్యక్తి కావడంతోనే దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారన్న విషయాన్ని ప్రజలు గమనించాలి..’’ అని సీఎం రేవంత్ ఆరోపించారు. -
మూసీపై సీఎంది పూటకోమాట: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: మూ సీ నది ప్రక్షాళనపై ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పూటకోమాట మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ‘ఎ క్స్’ వేదికగా విమర్శించారు. మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి కోసం రూ. 1.50 లక్షల కోట్ల ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జూలై 20న సీఎం ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. అలాగే సెప్టెంబర్ 6న సీఎం విడుదల చేసిన ‘తెలంగాణ గ్రోత్ స్టోరీ: దిరోడ్ టు వన్ ట్రిలియన్ డాలర్ ఎకాన మీ’ అనే విజన్ డాక్యుమెంట్లోనూ ఇదే విష యాన్ని పొందుపరిచారని పేర్కొన్నారు. కానీ దీనిపై విపక్షాలు ప్రశి్నస్తే తాను ఎన్నడూ రూ. 1.50 లక్షల కోట్ల ఖర్చవుతుందని చెప్పలేదంటూ సీఎం ఆవేశంతో ఊగిపోతున్నారని హరీశ్ ఎద్దేవా చేశారు. మూసీ పునరుజ్జీవం పేరిట ప్ర జాధనం లూటీ చేయాలనుకొనే ప్రభుత్వ కు ట్రను బట్టబయలు చేస్తామనిస్పష్టం చేశారు. ప్రవీణ్‌ను ఆహ్వానించి అరెస్టు చేస్తారా? గోషామహల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరుల సంస్మరణ కార్యక్రమానికి మాజీ ఐపీఎస్ అధికారి, తమ పార్టీ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌ను ఓవైపు ఆహా్వనించి మరోవైపు హౌస్ అరెస్ట్ చేయడాన్ని హరీశ్‌రావు ఖండించారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రకటన చేశారని.. ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదమని హరీశ్‌రావు ఓ ప్రకటనలో మండిపడ్డారు. -
మూసీపై రేవంత్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తా: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : మూసీని మురికికూపంగా మార్చారన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏకీభవించారు. కానీ మూసీని మురికికూపంగా మార్చిన పాపం కాంగ్రెస్, టీడీపీలదేనన్నారు కేటీఆర్. 70 శాతం పారిశ్రామిక వ్యర్థాలు మూసీలోనే కలుస్తున్నాయని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు.మూసీ శుద్ధిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన కేటీఆర్.. ఢిల్లీకి మూటలు పంపడం కోసమే సీఎం రేవంత్‌కు మూసీపై ప్రేమ పుట్టికొచ్చిందన్నారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి మూసీపై అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడు. నోట్ల రద్దు సమయంలో మోదీ మాటలు మార్చినట్లు.. మూసీపై రేవంత్ రోజుకో మాట మాట్లాడుతున్నారు. మూసీ సుందరీకరణ అనే పదం మాట్లాడిందే మొదట రేవంత్‌రెడ్డి. లక్షన్నర కోట్లు ఖచ్చు చేస్తామని చెప్పింది కూడా రేవంత్‌రెడ్డినే. మూసీపై ప్రభుత్వం అస్సలు సర్వేనే చేయలేదు. తన చేసిన పాపం బయటకి రావటంతో ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పడ్తున్నాయి. గ్రాఫిక్స్ మాయాజాలంతో రేవంత్ అబద్దాలు చెప్పారు’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. -
‘అద్దాల మేడలు, అందమైన భామల కోసం మేం పని చేయడం లేదు’
సాక్షి,హైదరాబాద్: మూసీకి పునరుజ్జీవనం అందిస్తున్నాం. ‘అద్దాల మేడల కోసం అందమైన భామల కోసం మేం పనిచేయడం లేదు’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ నదీ ప్రక్షాళనపై సెక్రటేరియట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో 33మంది అధికారుల బృందం పనిచేసింది.పేదలతో ఎదుర్కొంటున్న ప్రజల సమస్యల్ని విన్నారు.మూసీపై 10 నెలలుగా అధికారులు సీరియస్‌గా పనిచేస్తున్నారు.మూసీ పునరురజ్జీవనం కోసం మేం ప్రయత్నిస్తున్నాం.మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఆదుకోవడం ఎలా అనేదానిపై దృష్టి పెట్టాంమూసీ సుందరీకరణను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు.ప్రజల్లో అపోహాలు సృష్టిస్తున్నారుబ్యూటిఫికేషన్ మీద విష ప్రచారం చేస్తున్నారుమూసీ కంటే బీఆర్ఎస్ నేతల మొదళ్లలో ఉంది.ఇప్పుడు ప్రజల్లో అపోహలు కల్పించి విషప్రచారం చేస్తున్నారు.మూసీ 300 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.మూసీకి పునరుజ్జీవనం అందిస్తున్నాం10ఏళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. రాష్ట్రాన్ని బందిపోటు దొంగల్లా దోచుకున్నారు.మూసీకి పునరుజ్జీవనం అందిస్తున్నాంఅద్దాల మేడల కోసం... అందమైన భామల కోసం మేం పనిచేయడం లేదుమూసీ 300 కిలోమీటర్లు ప్రయాణిస్తుందిబఫర్ జోన్లో 10వేల ఇళ్లు ఉన్నాయిమూసీ బాధితులను ఆదుకోవడం కోసమే ఈ ప్రాజెక్ట్మూసీకి పునరుజ్జీవనం అందిస్తున్నాంచెన్నై ముంబైలాంటి నగరాల్లో వరదలు ఎలా ఉన్నాయి?చెన్నై,ముంబై నగరాల్లో ఏం జరుగుతుందో కనపడతలేదా?చెరువులు,నాళాలు ఆక్రమించారు. మూసీ పరిస్థితి ఏంటి?నగరాన్ని మూసీలో ముంచదల్చుకున్నారా?హైదరాబాద్ మహానగరాన్ని ఏం చేయదలుచుకున్నారు?వద్దంటే చెప్పండి మూసీ టెండర్లు రద్దు చేస్తాంనాకు స్వార్థం ఉన్నట్లు మమ్మల్ని విమర్శిస్తున్నారుఅధికారం కోల్పోయిన వారు ప్రతీది అడ్డుకోవాలని చూస్తున్నారుమూసీ విషం హైదరాబాద్‌లోనే కాదు నల్గొండకు వెళ్తుందిఖమ్మం,విజయవాడ కళ్లముందే వరదల్లో మునిగిపోయింది.హైదరాబాద్‌ను కూడా అలాగే ముంచాలనుకుంటున్నారా?నల్గొండ ప్రజలు మౌనంగా ఉంటే ఎలా? ఇది మూసీ సుందరీకణ కాదు, పునరుజ్జీవన ప్రాజెక్టుమూసీ పునరుజ్జీవంపై కొంతమంది అపోహాలు సృష్టిస్తున్నారుహైదరాబాద్లోని అద్భుత కట్టడాలను నాశనం చేయాలని చూస్తున్నారుహైదరాబాద్ సర్వనాశనం అవుతుంటే మీకు రాజకీయాలే ముఖ్యమా?హైదరాబాద్‌ను అద్భుతంగా తీర్చిదిద్దడానికి డీపీఆర్ కోసం.. ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీలను కన్సార్టియంగా మార్చాందీనిపై అందురు ఒప్పుకుంటేనే ముందుకుపోదాం, లేదంటే వద్దుమూసీకి వెళ్తామంటున్న నేతలు అక్కడ మూడు నెలలు ఉండండికేటీఆర్,హరీష్‌రావు,ఈటలకు మూసీలో ఇళ్లు ఇస్తాంమూసీ అద్భుతంగా ఉంటే అక్కడే మూడు నెలలు ఉండండిమూసీలో కేటీఆర్,హరీష్,ఈటల మూడునెలల ఉంటే ప్రాజెక్ట్ ఆపేస్తాందేశ భద్రత విషయంలో రాజీపడందేశ భద్రత విషయంలో రాజీపడేది లేదురాడార్ స్టేషన్ కు గత ప్రభుత్వం లోనే అన్ని అనుమతులు ఇచ్చారు.రాడార్ స్టేషన్ వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్.. బతుకమ్మ చీరల విషయంలో గగ్గోలు పెడుతుందిహైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు.. గ్రౌండ్ ఫ్లోర్ వాల్లకు డబ్బులు ఇవ్వలేదు..5వ అంతస్తు వాల్లకు ఇచ్చారుదీనిపై ఏంక్వరీకి సిద్దమా.. సిద్దమైతే 24 గంటల్లో ఏసీబీ ఏంక్వరీకి ఆదేశిస్తా.. -
ఓ వైపు మరణ శాసనం..! మరోవైపు సుందరీకరణా?
సాక్షి, హైదరాబాద్: నౌకాదళానికి చెందిన రాడార్ స్టేషన్ ఏర్పాటు పేరిట ఓ వైపు మూసీ నదికి మరణం శాసనం రాస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోవైపు సుందరీకరణ పేరిట హడావుడి చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణంతో మూసీ నది అంతర్ధానమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పదేళ్లు తమ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా రాడార్ స్టేషన్ నిర్మాణానికి అంగీకరించలేదన్నారు. పర్యావరణానికి హాని కలిగించే రాడార్ స్టేషన్ నిర్మాణాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందన్నారు. రాడార్ స్టేషన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పర్యావరణవేత్తలతో కలిసి పోరాటం చేస్తామని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కేటీఆర్ ప్రకటించారు.ప్రమాదంలో మూసీ నది‘వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో నౌకాదళానికి సంబంధించిన వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణంతో మూసీ నది ప్రమాదంలో పడుతుంది. ఓ వైపు మూసీ సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు పెడతామంటూనే.. మరోవైపు రాడార్ స్టేషన్ నిర్మాణానికి అనుమతి ఇవ్వడం రేవంత్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ఏం ఆశించి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారో సీఎం చెప్పాలి. ఈ నెల 15న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేయడంపై బీఆర్ఎస్ నిరసన తెలుపుతుంది. దామగుండంలో రాడార్ స్టేషన్ ఏర్పాటుతో 2,900 ఎకరాల అటవీ భూమి, 12 లక్షల చెట్లను నష్టపోతాం. జనావాసాలు లేని ద్వీపాల్లో ఏర్పాటు చేయాల్సిన రాడార్ స్టేషన్‌ను తెలంగాణలో ఎందుకు నిర్మిస్తున్నారో చెప్పాలి’ అని కేటీఆర్ అన్నారు.మూసీ నది ఎకో–సెన్సిటివ్ జోన్ కాదా?‘గంగానది జన్మస్థానం గంగోత్రి వద్ద 150 కిలోమీటర్ల పరిధిని కేంద్రం ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించింది. దామగుండంలో ఏర్పాటు చేస్తున్న రాడార్ కేంద్రం వికారాబాద్ అడవుల్లోనే మూసీ జన్మస్థానం ఉంది. అలాంటప్పుడు మూసీ నది జన్మస్థానాన్ని ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించాలి. గంగా నదికి ఒక న్యాయం.. మూసీకి మరో న్యాయమా? రాడార్ స్టేషన్ ఏర్పాటుతో పర్యావరణ సమతుల్యతకు ప్రమాదం పొంచి ఉంది. మూసీ పేరిట రూ.వేల కోట్ల దోపిడీ చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. దేశ రక్షణ విషయంలో తెలంగాణ ముందు వరుసలో ఉంటుంది. కానీ జనావాసాలు లేని చోట ఏర్పాటు చేయాల్సిన రాడార్ స్టేషన్‌ను దామగుండంలో ఏర్పాటు చేయడాన్ని అంగీకరించం. పర్యావరణ వేత్తలతో కలిసి పోరాటం చేస్తాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
ముందు ఎంజీబీఎస్,మెట్రో పిల్లర్లు కూల్చండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ చేసే ముందు మహాత్మాగాం«ధీ బస్టాండ్ (ఎంజీబీఎస్)ను, మెట్రో పిల్లర్లను కూల్చాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. వాటిని తొలగించకుండా మూసీ ప్రక్షాళన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రణాళికలను రీషెడ్యూల్ చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ‘ఈ ప్రాజెక్ట్ కోసం రూ.1.5 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఎలాంటి డీపీఆర్, కార్యాచరణ ప్రణాళిక లేకుండా, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దకుండా సుందరీకరణ ఎలా చేస్తారు? ప్రభుత్వమే రోడ్లువేసి, విద్యుత్ కనెక్షన్లు, ఇంటినంబర్, ఆధార్‌కార్డ్‌లు ఇచ్చి.. ఇప్పుడు పేదలు, దిగువ మధ్యతరగతి వారి ఇళ్లు కూలుస్తామంటే ఎలా? ముందు ఇళ్లు కూల్చుతాము, ఆ తర్వాత ప్రణాళిక వేస్తామంటే.. భవిష్యత్‌లో ఈ ప్రాజెక్ట్ నిలిచిపోతే బాధిత ప్రజలు ఎక్కడికి వెళ్లాలి? ఇళ్ల కూలి్చవేతపై మూసీ ప్రభావిత ప్రాంతంలో సీఎం రేవంత్‌రెడ్డి దర్బార్ పెట్టి ప్రజలను ఒప్పించాలి.సీఎం వస్తే నేను కూడా అక్కడకు వచ్చి ప్రజల తరఫున మాట్లాడేందుకు సిద్ధం’అని కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చే ముందు ఇమ్లీబన్లోని ఎంజీబీఎస్‌ను, అక్కడి మెట్రో పిల్లర్లు, స్టేషన్‌ను కూల్చాలి. మూసీ పరీవాహక ప్రాంతంలో 30, 40 ఏళ్ల కిందటే పేదలు తమ కష్టార్జితంతో ఇళ్లు కట్టుకుని నివసిస్తుంటే, ప్రభుత్వం పెద్ద పెద్ద ఫామ్‌హౌస్‌లను వదిలిపెట్టి పేదలపై పడతామంటే మేము విడిచిపెట్టే ప్రసక్తే లేదు’అని హెచ్చరించారు. కాగా, తమతో బీఆర్ఎస్ నేతలెవరూ టచ్‌లో లేరని స్పష్టం చేశారు. తెలంగాణను లూటీ చేసిన ఆ పార్టీతో ఎలాంటి రాజీ లేదని, ఆ పార్టీ అవినీతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుతో పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఎలాంటి ప్రాజెక్ట్ పెట్టదని, అక్కడ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. హైడ్రా, మూసీపై నేను చెప్పేదే పార్టీ పాలసీ.. ‘హైడ్రా ద్వారా దుందుడుకు చర్యలు తీసుకోవడం సరికాదు. హైడ్రా అనేది రేవంత్‌రెడ్డి పెట్టుకున్న పేరు. అక్రమ నిర్మాణాల కూలి్చవేతలకు జీహెచ్ఎంసీలో ఓ వ్యవస్థ ఉంది. హైడ్రా వెనుక సీఎం రేవంత్‌రెడ్డికి వేరే ఉద్దేశాలు ఉన్నాయి’అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీలో హైడ్రాపై భిన్నస్వరాలు వినిపించడంపై ఏమంటారని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘పేదల ఇళ్లు కూల్చమని మా ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరైనా చెప్పారా’అని కిషన్‌రెడ్డి తిరిగి ప్రశ్నించారు. హైడ్రా, మూసీపై తాను చెప్పేదే పార్టీ పాలసీ అని స్పష్టంచేశారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించం జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఉపేక్షించమని కిషన్‌రెడ్డి చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా శాంతిభద్రతలు క్షీణిస్తే కేంద్రం జోక్యానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ‘కశ్మీర్లో బీజేపీ వంద శాతం లక్ష్యం చేరుకుంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను ఏకాకి చేయగలిగాం. భారత్‌కు వ్యతిరేకం కాబట్టి ఆ దేశానికి చైనా అన్నిరకాలుగా సహాయపడుతోంది’అని తెలిపారు. ఆరి్టకల్ 370 పునరుద్ధరణ అసాధ్యమని, అది ముగిసిన అధ్యాయమని అన్నారు. జమ్మూకశీ్మర్‌కు రాష్ట్ర హోదా కల్పనపై తగిన సమయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. -
‘మూసీ’ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు? కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: మూసీ సుందరీకరణ పేరిట అవినీతి ఆలోచనలు మానుకొని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టాలంటూ లేఖ రాసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ.. మరోసారి ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు.‘‘మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు? రైతు రుణ మాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు?. రైతు బంధు ఎగ్గొట్టి, మూసీ పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు?. మహిళలకు వంద రోజుల్లోనే నెలకు 2500 ఇస్తా అని చెప్పి తప్పించుకు తిరుగుతున్న మోసగాడు ఎవరు?. అవ్వ, తాతలకు నెలకు 4000 ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరు?. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తా అని మాట తప్పిన దగావీరుడు ఎవరు?. మూసి బ్యూటిఫికేషన్ పేరిట 1,500,000,000 కోట్ల లూటిఫికేషన్‌కి తెరతీసిన ఘనుడు ఎవరు?’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.కాగా, మూసీ ప్రక్షాళన కోసం రూ. లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామంటున్న ముఖ్యమంత్రికి రైతు భరోసా, దొడ్డు వడ్లకు బోనస్ ఇచ్చేందుకు డబ్బులు లేవా? అంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ దుయ్యబట్టారు. సీఎం నిర్వహించిన వ్యవసాయ సమీక్షలో దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్, వర్షాకాలంలో రైతు భరోసా వంటి అంశాలపై చర్చించలేదని విమర్శించారు.ఇదీ చదవండి: సర్కార్‌పై సమరానికి సై!గత సీజన్లోనూ రైతులకు వరి ధాన్యంపై బోనస్ చెల్లించకుండా ప్రభుత్వం మోసగించిందని ఆరోపించారు. కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనే ప్రకటనతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. 80 శాతం మంది రైతులు దొడ్డు వడ్లు పండిస్తారని తెలిసి కూడా కేవలం సన్న వడ్లకే ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రకటించడం సరికాదన్నారు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వకుంటే రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని కేటీఆర్ హెచ్చరించారు. -
కూల్చి వేతలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: ప్రధాని మోదీ సబర్మతి రివర్‌ను శుభ్రం చేసుకోవచ్చు. మేం మాత్రం మూసీని శుభ్రం చేసుకోవద్దా? అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్లో కుటుంబ డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా డిజిటల్ కార్డ్‌లు మూసీ సుందరీకరణ,కూల్చివేతలపై సంచలన వ్యాఖ్యలపై చేశారు.30 శాఖల దగ్గర ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి డిజిటల్ కార్డ్‌లను రూపొందించాం. అన్ని చోట్ల అద్యయనం చేసి డిజిటల్ కార్డ్‌లను తయారు చేశాం. ప్రతి పేదవాడికి రేషన్ కార్డ్‌లను ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నాం. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు కార్డ్ ఇవ్వాలి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డ్ ఇవ్వాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత బస్తీల్లో కుటుంబాలు పెరిగాయి. కొత్తగా కార్డ్‌లు లేకపోవడంతో పదకాలు అందలేదు. ప్రతి పేదవాడికి రేషన్ కార్డ్‌లు అందిస్తాం. ప్రజల సంక్షేమం కోసమే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్‌లు. రేషన్ కార్డ్‌లు ఇవ్వడం లేదనే కేసీఆర్‌ను ప్రజలు ఇంటికి పంపించారు. రేషన్ కార్డ్‌లు ఇవ్వాలని అన్నీ జిల్లాల నుంచి రిక్వెస్ట్‌లు పంపారు. డిజిటల్ కార్డ్‌లో ఫ్యామిలీ వివరాలు ఉంటాయి. అన్నీ పథకాలు ఒకటే కార్డ్ అదే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్. ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ సంబంధించిన వివరాలన్నీ అందులో ఉంటాయి. పేర్లు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. గ్రామాల నుంచి ఉపాధి కోసం పట్టణాలు, నగరాలకు వచ్చిన పేదలు ఉన్న ప్రాంతంలోనే రేషన్ తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. ముందుగా నియోజకవర్గానికి రెండు చోట్ల దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నాం. దీనిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు సరిదిద్దుతాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుబీజేపీ,బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేస్తున్నాం. తాగునీరు అందించే చెరువుల్లో ఫాంహౌస్ కట్టుకున్నారు. సబితా ఇంద్రారెడ్డి ఫాంహౌస్ కూలగొట్టా.. వద్దా? ఈటల రాజేందర్ ఎంపీగా గెలిచావు కదా? మేం మూసీ అభివృద్ధి చేసుకోవద్దా? కేటీఆర్,హరీష్ రావు సెక్రటేరియేట్‌కు రావాలి. ప్రధాని మోదీ సబర్మతిని శుభ్రం చేసుకోవచ్చు. మేం మాత్రం మూసీని శుభ్రం చేసుకోవద్దా. చిన్నపాటి వర్షంతో మునిగిపోతున్న నగరాన్ని సంరక్షించేందుకు నడుం బిగించాం. మూసీ మురికి,దోమలతో అక్కడి ప్రజలు జీవచ్ఛవంలా ఉన్నారు. మూసీపై అఖిల పక్ష సమావేశానికి సిద్ధం హైదరాబాద్ నగరంలో చెరువులు,నాలాలు ఆక్రమణలు ఎవరు నిర్మించారో తేల్చుదాం. మీ ఫాంహౌస్‌లను కాపాడుకోవానికే పేదల పేరుతో ముసుగు వేసుకుంటున్నారు. బావబామర్దులు కిరాయి మనుషులతో హడావిడి చేస్తున్నారు.కూల్చి వేతలపై వెనక్కి తగ్గబోమని, ఇలాగే కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.గతంలో ఒకాయన చేసింది రెండే పనులు.. అవి అప్పులు, తప్పులుఅధికారం పోయాక విచక్షణ కోల్పోయి ఏదేదో మాట్లాడుతున్నారు.ప్రతిపక్షాలు వాగుడు ఆపడం మంచిదిమూసీలో మునిగిపోయిన పేదలకు మీ అవినీతి సొమ్మును పంచి పెట్టండిమీ ఖాతాలోని రూ.500 కోట్లు పంచి పెట్టండిమూసీ మురికి,దోమలతో అక్కడి ప్రజలు జీవచ్ఛవంలా బతుకుతున్నారుమూసీ నిర్వాసితులకు ఇళ్లు ఇచ్చి మంచి జీవితం ఇవ్వాలనే ప్రయత్నం తప్పామీరు మాత్రం ఫాం హౌజ్‌లో ఉండాలా?మీ ఫాంహౌస్‌లను కాపాడుకోవానికే పేదల పేరుతో ముసుగు వేసుకుంటున్నారు. మూసీపై అఖిల పక్ష సమావేశానికి సిద్ధంమీ ముగ్గురి ఫాంహౌస్‌లు కూల్చాలా? వద్దా?అధికారం రాక ముందు చెప్పులు లేకుండా తిరిగిన మీరు కోట్లకు ఎలా పడగలెత్తారు.మూసీ పేదలకు ఇళ్లు ఇవ్వాలా? వద్దా?బావబామ్మర్దులు కిరాయి మనుషులతో హడావిడి చేస్తున్నారుబీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందిఒకరోజు కేటీఆర్ మాట్లాడితే.. మరో రోజు అదే అంశాన్ని ఈటెల మాట్లాడుతున్నారుప్రధాని మోదీ సబర్మతి రివర్‌ను శుభ్రం చేసుకోవచ్చు. మేం మాత్రం మూసీని శుభ్రం చేసుకోవద్దామోదీ దగ్గరు వెళ్దాం రా ఈటలఎవరు ఆక్రమించారో తేలుద్దాంహైదరాబాద్ నగరంలో చెరువులు,నాలాల ఆక్రమణలు ఎవరు నిర్మించారో తేలుద్దాంకేటీఆర్,హరీష్‌రావు సచివాలయానికి రండి.. 4రోజులు లేవకుండా చర్చిద్దాం -
మూసీ మురికి అంతా మీ నోట్లోనే: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో మూసీ సుందరీకరణ రాజకీయ మంటలు రేపుతోంది. సుందరీకరణ చేసి తీరుతామని అధికార కాంగ్రెస్ కుండబద్ధలు కొట్టి చెప్తుంటే.. పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లు కూల్చి ఎలా ముందుకు వెళ్తారో తాము చూస్తామంటూ విపక్ష బీఆర్ఎస్ సవాల్ విసురుతోందిఈ తరుణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూసీ సుందరీకరణపై మరోసారి ట్వీట్ చేశారు. ‘మూసి మురికి అంతా వాళ్ల నోట్లోనే...ఇంకా శుద్ధి ఎందుకు.. లక్షన్నర కోట్లు ఖర్చు ఎందుకు? మంత్రికి లీగల్ నోటీసులు పంపాము.కాంగ్రెస్ అసహ్యకరమైన, విసుగు పుటించే రాజకీయాలు చేస్తోంది. మంత్రిని, సీఎంని మానసిక ఆరోగ్య నిపుణుడి వద్దకు లేదా రీహాబిటేషన్ సెంటర్లకు ట్రీట్మెంట్కు పంపించాలని రాహుల్ గాంధీకి అభ్యర్థన’ అంటూ కేటీఆర్ ట్విటర్లో పేర్కొన్నారు.మూసి మురికి అంతా వాళ్ల నోట్లోనే...ఇంకా శుద్ధి ఎందుకు.. లక్షన్నర కోట్లు ఖర్చు ఎందుకు? Served legal notices to the Minister; Disgusting & Nauseating politics by Congress Request @RahulGandhi to send your Minister & CM to a mental health specialist or a rehabilitation… pic.twitter.com/cL8AI1RqHk— KTR (@KTRBRS) October 2, 2024👉చదవండి : అక్కా.. ఎందుకీ దొంగ ఏడుపులు -
మూసీ ప్రాజెక్టు కాంగ్రెస్‌కు రిజర్వు బ్యాంకు
సాక్షి, హైదరాబాద్/అత్తాపూర్: మూసీ ప్రాజెక్టు పేరుతో దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెర లేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును కాంగ్రెస్ రిజర్వు బ్యాంకులా వాడుకోవాలని చూస్తోందన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ ఎన్నికల నిధుల కోసమే ఈ ప్రాజెక్టు చేపట్టిందన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్న వారి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాల యముడిలా మారారన్నారు. ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లు కూలుస్తోందన్నారు.రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని విమర్శలు చేసిన రేవంత్‌రెడ్డి ఎలాంటి ప్రయోజనం లేని మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు రూ.1.50 లక్షల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహమూద్ అలీ, గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ రవీందర్రావు, ఎమ్మెల్యే గోపీనాథ్ తదితరులతో కలిసి సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 2400 కిలోమీటర్ల ‘నమామీ గంగే’ప్రాజెక్టుకు రూ.40వేల కోట్లు ఖర్చయితే 55 కిలోమీటర్ల మూసీ ప్రక్షాళనకు రూ.లక్షన్నర కోట్లు ఎందుకని ప్రశ్నించారు. కూల్చివేత బాధలు మాకు తెలుసు ‘పేద మధ్య తరగతి ప్రజలకు సొంతిళ్లు ఒక భావోద్వేగం. అప్పర్, మిడ్ మానేరు నిర్వాసితులుగా కూ ల్చివేత బాధ ఏంటో మాకు తెలుసు. చట్టబద్దంగా అనుమతులు పొందిన వారిని కూడా ఆక్రమణదారులుగా కాంగ్రెస్ ప్రచారం చేయిస్తోంది. నాలాల మీద నిర్మించిన హైడ్రా, జీహెచ్ఎంసీ భవనాలు కూల్చకుండా పేదల ఇళ్ల మీదకు బుల్డోజర్లు పంపిస్తున్నారు. కేసీఆర్ ఆనవాళ్ల లేకుండా చేసేందుకు సచివాలయాన్ని కూడా సీఎం రేవంత్ కూల్చివేస్తారేమో? రేవంత్‌ను ప్రజలు తిడుతున్న తిట్లు గతంలో ఎప్పుడూ నేను వినలేదు.రేవంత్ మీడియాకు ముఖం చాటేసి మంత్రులకు బదులు గా అధికారులను ముందు పెట్టి రాజకీయాలు చేస్తున్నాడు. ఢిల్లీ పారీ్టలను ఎప్పుడు గెలిపించినా గల్లీల్లో ప్రజల ఆక్రందనలు ఇలాగే ఉంటాయి. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లు కూల్చిన తర్వాతే పేదల మీదకు రావాలి. చిత్తశుద్ధి ఉంటే కొడంగల్‌లోని తన ఇంటితోపాటు హైదరాబాద్‌లో తన సోదరుడు ఇంటిని కూడా రేవంత్ కూల్చివేయాలి. బాధితులకు భరోసా ఇచ్చేందుకు మూసీ పరీవాహక ప్రాంతంలో పర్యటిస్తాం. బుల్డోజర్లకు మేము అడ్డుగా నిలబడతాం. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం’ అని కేటీఆర్ అన్నారు. మీ సోదరుడి ఇంటిని కూల్చండి కేటీఆర్ అత్తాపూర్ డివిజన్లోని మూసీ పరీవాహక ప్రాంతంలోని లక్ష్మీనగర్ పార్కులో నిర్వాసితులను కలిసి వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. గృహ నిర్మాణాలు చేసుకున్నందుకు ప్రభుత్వం నుంచి అన్ని రకా ల పర్మిషన్లు పొందుతూ రూ.లక్షలు బ్యాంకుల ద్వా రా అప్పుగా తీసుకుని ఇళ్లు కట్టుకుంటే ఎలా కూలుస్తారని నిలదీశారు. పర్మిషన్ ఇచ్చిన అధికారులను వదిలేసి సామాన్య ప్రజలపై ప్రతాపం చూపడం సరికాదన్నారు. దుర్గంచెరువు బఫర్ జోన్ ప్రాంతంలో వివేక్, కేవీపీ లాంటి వారి ఇళ్లతోపాటు మీ సోద రుడు తిరుపతిరెడ్డి ఇంటిని బుల్డోజర్లతో నేలమట్టం చేయాలన్నారు. అనంతరం కేటీఆర్ కిషన్‌బాగ్ మహమూద్ నగర్లో మూసీ బాధితులను కలిసి మీ వెంట తాము ఉంటామంటూ భరోసా ఇచ్చారు. -
నేడు ‘మూసీ’ పర్యటనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని మూసీ పరీవాహక ప్రాంత ప్రజల్లో భరోసా నింపడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆదివారం పర్యటించనున్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు కార్పొరేటర్లు ఈ పర్యటనలో పాల్గొంటారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ తదితరులు ఈ బృందంలో ఉన్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి హైదర్‌షాకోట్‌తో పాటు సమీప కాలనీల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పర్యటిస్తుంది. మూసీ పరీవాహక కాలనీల్లో అధికారుల సర్వే పరిశీలన, ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు వినడంతో పాటు బాధితులకు పారీ్టపరంగా భరోసా ఇస్తారు. -
మూసీ, హైడ్రాపై ఆచితూచి!
సాక్షి, హైదరాబాద్: హైడ్రా, మూసీ సుందరీకరణ ప్రాజెక్టులపై ఆచితూచి ముందుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులను చేపట్టడంలో ఎలాంటి అభ్యంతరం లేదని.. కచ్చితంగా ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందేనని టీపీసీసీ నేతలు అంటున్నారు. కానీ వీటి అమల్లో ముందుకెళ్లే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ కొందరు హైదరాబాద్ సిటీ ఎమ్మెల్యేలతో మాట్లాడారని గాం«దీభవన్ వర్గాలు చెప్తున్నాయి. హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణ పట్ల ప్రజల్లో సానుకూల స్పందన ఉందని, ప్రభుత్వానికి అభినందనలు అందుతున్నాయని.. కానీ ప్రజలకు ఈ అంశాల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యేలు, నేతలు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో కూల్చివేతల వలన కలిగే ప్రయోజనాలు, పరిహార ప్యాకేజీల గురించి ప్రజలకు క్షుణ్నంగా వివరించాలని ప్రభుత్వానికి సూచించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ అంశంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం చురుగ్గా వ్యవహరించాల్సి ఉంటుందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ టీపీసీసీ పక్షాన ప్రత్యేక నివేదికను సిద్ధం చేస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ శనివారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. త్వరలోనే సీఎం రేవంత్‌ను కలిసి నివేదిక ఇస్తారని వెల్లడించారు. హరీశ్‌రావు తొలుత మల్లన్నసాగర్ బాధితులను ఓదార్చాలి మూసీ సుందరీకరణ, హైడ్రా కూల్చివేతల వల్ల పేదలకు నష్టం జరుగుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు కన్నీరు పెట్టుకున్నారన్న అంశంపై మహేశ్‌గౌడ్ స్పందించారు. హరీశ్‌రావు ఓదార్చాల్సింది హైదరాబాద్‌లో కాదని.. సొంత జిల్లాకు వెళ్లి మల్లన్నసాగర్ బాధితులను ఓదార్చాలని సూచించారు. ఇన్నాళ్లూ మల్లన్నసాగర్ బాధితుల కన్నీళ్లు హరీశ్‌రావుకు కనిపించలేదా? అని ప్రశ్నించారు. నాడు మల్లన్నసాగర్ బాధితులను పరామర్శించేందుకు వెళ్తే అడ్డుకుని అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మూసీ నదిపై ఉన్నవన్నీ అక్రమ కట్టడాలేనని.. మూసీ ప్రక్షాళన జరిగితే నదీ పరీవాహకంలో ఉన్న రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో సాగునీరు పెరుగుతుందని చెప్పారు. హైడ్రా, మూసీ అభివృద్ధితో కొంతమంది సామాన్యులకు ఇబ్బంది కలుగుతుందని.. హైదరాబాద్ మొత్తానికి లాభం జరుగుతుందని మహేశ్‌గౌడ్ అభిప్రాయపడ్డారు. -
మూసీకి వరద..జీహెచ్ఎంసీ హైఅలర్ట్
సాక్షి,హైదరాబాద్: భాగ్యనగరానికి తాగునీరందించే జంట జలాశయాల్లో ఒకటైన ఉస్మాన్‌సాగర్‌లో నీరు ఫుల్‌ట్యాంక్‌లెవెల్ (ఎఫ్టీఎల్) స్థాయికి చేరింది. ఎగువ నుంచి ఉస్మాన్‌సాగర్‌కు వరద నీరురావడంతో నీటి మట్టం పెరిగింది. జలాశయానికి ఇన్‌ఫ్లో 500 క్యూసెక్కులు అధికారులు తెలిపారు.జలాశయం నిండడంతో పాటు ఇన్‌ఫ్లో ఉండడంతో రెండు గేట్లు ఎత్తి ఉస్మాన్‌సాగర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. నీటి విడుదలతో పాటు మూసీకి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బందిని కమిషనర్ అమ్రపాలి అప్రమత్తం చేశారు.ఇదీ చదవండి: హైడ్రా ఎఫెక్ట్..మూసీ పరివాహక ప్రాంతంలో ఉద్రిక్తత -
మూసి పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్
-
ముక్కు‘మూసీ’..
భూదాన్‌పోచంపల్లి: మూసీ కాలుష్య కాసారంగా మారింది. హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి వరద దిగువకు వచ్చి మూసీలో చేరుతోంది. దీంతో మంగళవారం మూసీ నది పరవళ్లు తొక్కింది. అయితే జంటనగరాల్లోని మురుగు, కాలుష్యం, చెత్తాచెదారం, గుర్రపుడెక్క ఆకు అంతా మూసీలోకి వచ్చి చేరడంతో.. దుర్గంధం వెదజల్లుతూ ప్రవాహం సాగుతోంది.యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్‌పోచంపల్లి మండలం పిలాయిపల్లి, జూలూరు. పెద్దరావులపల్లి వద్ద నల్లటి మూసీ నది నీరు దుర్వాసన వెదజల్లుతూ చెత్తాచెదారంతో ప్రవహించింది. కాగా జూలూరు వద్ద లోలెవల్ బ్రిడ్జిపై నుంచి మూసీ ప్రవహించడంతో.. ఈ మార్గంలో బీబీనగర్, భువనగిరికి రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ ప్రవహిస్తున్న విషయం తెలియక.. ఇబ్రహీంపట్నం నుంచి పోచంపల్లి మీదుగా భువనగిరికి వెళ్లే ఆర్టీసీ బస్సు మూసీనది వరకు వచ్చి తిరిగి వెనక్కి వెళ్లి పెద్దరావులపల్లి మీదుగా భువనగిరికి చేరింది. అయితే మూసీ ఉధృతి కొనసాగుతుండటంతో ఈ మార్గంలో వాహనాలు వెళ్లకుండా అధికారులు మూసీకి ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. -
లండన్ థేమ్స్‌లా మూసీ అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: నదులు, సరస్సులు, సముద్ర తీరం వెంట ఉన్న నగరాలన్నీ చారిత్రాత్మకంగా అభివృద్ధి చెందాయని.. హైదరాబాద్‌కు కూడా అటువంటి ప్రత్యేకత ఉందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అటు మూసీ నది వెంబడి, హుస్సేన్‌సాగర్ చుట్టూ, ఉస్మాన్‌సాగర్ వంటి జలాశయాలు కేంద్రంగా హైదరాబాద్ అభి వృద్ధి చెందిందని చెప్పారు. మూసీకి పునర్వై భవం తీసుకొస్తే.. నది, సరస్సులతో హైదరాబాద్ మరింత శక్తివంతంగా తయారవుతుందని తెలిపారు. మూసీ పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపక ల్పనలో భాగంగా.. ఇతర దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను తెలుసుకునేందుకు సీఎం రేవంత్ బృందం బ్రిటన్‌లోని లండన్‌లో పర్యటించింది. ఆ నగరంలోని థేమ్స్ నదిని పరిశీలించి.. దానిని నిర్వహిస్తున్న తీరును, అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేసిన తీరును సీఎం అడిగి తెలుసుకున్నారు. తర్వాత థేమ్స్ నది పాలక మండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులు, నిపుణులతో దాదాపు మూడు గంటల పాటు సమా వేశమై చర్చించారు. విజన్ 2050కి అనుగుణంగా మూసీ అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టనున్నామని, దీనికి సహకరించాలని సీఎం రేవంత్ కోరారు. అభివృద్ధితోపాటు సంరక్షణకు ప్రాధాన్యం దశాబ్దాలుగా వివిధ దశల్లో థేమ్స్ నదీ తీరం వెంట చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అక్కడి కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ సియాన్ ఫోస్టర్, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హెడ్ రాజ్కెహల్ లివీ తదితరులు సీఎం రేవంత్ బృందానికి వివరించారు. ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు, పరిష్కారాలు, ఖర్చయిన నిధులు, అనుసరించిన విధానాలను తెలిపారు. నదీ ఒడ్డున అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నది సంరక్షణకు ప్రాధాన్యమి చ్చినట్టు స్పష్టం చేశారు. నదీ జలాలను సుస్థిరంగా ఉంచటంతోపాటు స్థానికులకు ఎక్కువ ప్రయోజన ముండే రెవెన్యూ మోడల్‌ను ఎంచుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుకు తాము పూర్తిగా సహకరిస్తా మని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన ఔట్ లైన్, వివిధ సంస్థల భాగ స్వామ్యంపై చర్చించారు. భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరపాలని నిర్ణయించారు. సమావేశంలో సీఎం రేవంత్‌పాటు సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారత సంతతి బ్రిటన్ ఎంపీలతో రేవంత్ భేటీ దావోస్ పర్యటన ముగించుకుని లండన్‌కు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి అక్కడి భారత సంతతి ఎంపీలతో సమావేశమయ్యారు. ఓల్డ్ వెస్ట్ మినిస్టర్ పార్లమెంటు భవనంలో లేబర్ పార్టీకి చెందిన ఎంపీ వీరేంద్రశర్మ ఆతిథ్యమిచ్చిన ఈ భేటీలో.. ఏడుగురు బ్రిటన్ ఎంపీలతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. భారత్–బ్రిటన్ దేశాల మధ్య ఉన్న బలమైన దౌత్యబంధం ఉందన్నారు. ఇరు దేశాలు మహాత్మాగాంధీ సందేశాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. -
హైకోర్టుకు వందనం
అది పేరుకే భవనం..నిజానికది ఓ అద్భుత కళాఖండం..నిజాం జమానాకు నిజమైన ప్రతీక...నిర్మాణ కౌశలానికి నిండైన రూపం.విశిష్ట శిల్పకళారీతులకు విశేష దర్పణం.. రాచఠీవికి ప్రతిబింబం.వాస్తురీతులకు వాస్తవరూపం.చూపరులకు కనువిందు. మూసీ ఒడ్డున ముచ్చటైన నిర్మాణం. వందేళ్లు పూర్తి అయినా చెక్కుచెదరని వైభవం దాని సొంతం. వన్నె తగ్గకుండా కాంతులీనుతున్న ఆ కళాఖండమే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు భవనం. అది వందేళ్ల చరిత్రకు ప్రత్యక్ష సాక్షి. నేడు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ భవనంపై ప్రత్యేక కథనం... – సాక్షి, హైదరాబాద్ మూసీ ఒడ్డున సుందర భవనం.. హైదరాబాద్ నగరంలో మూసీనది ఒడ్డున అత్యంత సుందరంగా నిర్మించిన హైకోర్టు భవనం శతాబ్ది వేడుకలకు ముస్తాబవుతోంది. హైదరాబాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1920 ఏప్రిల్ 20న హైకోర్టు భవనాన్ని ప్రారంభించారు. 1915 ఏప్రిల్ 15న ప్రారంభమైన ఈ భవననిర్మాణం 1919 మార్చి 31 నాటికి పూర్తయినా 1920 ఏప్రిల్ 20న అధికారికంగా ప్రారంభించారు. చరిత్రలోకి ఓసారి... నిజాం హయాంలో హైదరాబాద్ రాజ్యంపై బ్రిటిష్ ప్రభావం ఎక్కువగా ఉండేది. 1800 అక్టోబరులో ఈస్టిండియా కంపెనీతో నిజాం రాజు ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పట్లో నిజాం కోర్టు నిర్వహణ బ్రిటిష్ వారి ఆధ్వర్యంలోనే సాగేది. సాలార్ జంగ్ హైదరాబాద్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సరికొత్త న్యాయ వ్యవస్థను రూపొందించారు. హైకోర్టు మొదట పత్తర్‌ఘట్టిలో ఉండేది. 1909లో వరదలు రావడంతో లాల్‌బాగ్‌లోని నవాబ్ సర్ ఆస్మాన్ ఝా దేవిడిలోకి మారింది. 1912లో కలరా వ్యాధి వ్యాపించడంతో దేవిడి నుంచి పబ్లిక్ గార్డెన్‌లోకి, 4 నెలల తరువాత చత్తాబజార్ లక్కడ్కోట్లోని సాలార్ జంగ్ బహదూర్ నివాసంలోకి తరలించారు. అక్కడా అనువుగా లేకపోవడంతో 1914లో సైఫాబాద్‌లో నవాబ్ సత్రజ్ జంగ్ నుంచి భవనాన్ని అద్దెకు తీసుకుని అక్కడికి మార్చారు. ఈ దశలోనే సర్వోన్నత న్యాయస్థానానికి శాశ్వత భవనం నిర్మించాలన్న ఆలోచన మొగ్గ తొడిగింది. తీరైన నిర్మాణ కౌశలం ఈ భవనం సొంతం. జైపూర్‌కు చెందిన ఇంజనీరు, ఆర్కిటెక్ట్ శంకర్‌లాల్ హైకోర్టు భవన నమూనాను రూపొందించారు. స్థానిక ఇంజనీరు మెహర్ అలీ ఫజల్ నిర్మాణపనుల పర్యవేక్షణ చేపట్టారు. బ్రిటిష్ ఇంజనీరు విన్సెంట్ జె.ఎక్ ప్రపంచమంతా పర్యటించి ఎక్కడా లేని విధంగా భవనం నిర్మాణ ఆకృతి రూపొందించారు. సుమారు రూ.18,22,750 వ్యయ అంచనాతో నవరతన్ దాస్ కాంట్రాక్ట్ పొందారు. నిజాం నవాబు ఇచ్చిన 300 కిలోల వెండితో హైకోర్టు నమూనాను రూపొందించి భవనానికి తాపడం చేశారు. గులాబీ రంగు గ్రానైట్, రాతితో అద్భుత కళాఖండంగా ఈ భవనాన్ని నిర్మించారు. ఇండోఇస్లామిక్ సంప్రదా య రీతిలో డోమ్‌ల ఆకృతిని ప్రత్యేక ఆకర్షణగా రూపొందించారు. భవన నిర్మాణం, రాతి శిల్పాలన్నీ నిజాం కాలంనాటి కళానైపుణ్యానికి అద్దంపట్టేలా ఉన్నాయి. మొదట ఆరుగురు జడ్జీల కార్యకలాపాలు, బార్ అసోసియేషన్‌కు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టారు. 1958 జులై 10న అదనంగా మరో రెండు బ్లాక్‌లను నిర్మించారు. 1976లో మరో బ్లాక్, 1998లో బహుళ అంతస్తుల పరిపాలనాభవనాలను నిర్మించారు. హైకోర్టు భవనం పక్కనే నిజాం కాలం నుంచి సేవలందిస్తున్న జజ్జిఖానా (ప్రసూతి ఆస్పత్రి)ను మరో ప్రాంతానికి తరలించి ఆస్పత్రికి చెందిన 9.5 ఎకరాలను 2009లో హైకోర్టుకు అప్పగించారు. అక్కడ కూడా ప్రత్యేక బ్లాకు నిర్మించారు. ఒకే భవనం.. వివిధ పేర్లు.. నిజాం కాలంలో రాయల్ చార్టర్ కింద కొనసాగిన న్యాయస్థానంలో 1928 హైకోర్టు యాక్ట్ కింద బెంచ్‌లను ఏర్పాటు చేసి కేసుల విచారణ మొదలుపెట్టారు. అప్పీళ్లపై విచారణకు జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటైంది. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైన తరువాత హైకోర్ట్ ఆఫ్ హైదరాబాద్ పేరిట కొనసాగింది. 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగింది. ఇదే భవనంలో దీపావళి, రంజాన్ పండుగల సందర్భంగా 1956 నవంబరు 5న 11 మంది జడ్జీలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రారంభమైంది. మొదటి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కోకా సుబ్బారావు, మొదటి అడ్వొకేట్ జనరల్‌గా దువ్వూరి నరసరాజు పనిచేశారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. దీంతో అదే తేదీ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా కొనసాగింది. రాష్ట్రపతి ఉత్తర్వులతో 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో ఏర్పాటైంది. ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కావడంతో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఈ భవనంలోనే కొనసాగుతోంది. న్యాయస్థానాల పేర్లు మారుతూ వస్తున్నా వందేళ్లుగా ఈ భవనం సేవలందిస్తూ వస్తోంది. భవనంలో అగ్నిప్రమాదం 2009 ఆగస్టు 31న రాత్రి హైకోర్టు ప్రధాన భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లైబ్రరీ హాలు మొత్తం అగ్నికి ఆహుతైంది. ఇందులో ఇంగ్లిష్ లా రిపోర్ట్స్, జర్నల్స్ అన్నీ కాలి బూడిదయ్యాయి. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు పోరాటంతో మద్రాసు హైకోర్టు నుంచి తీసుకువచ్చిన పుస్తకాలన్నీ ఆగ్నికి ఆహుతయ్యాయి. చిత్రాలు, నిజాం కాలం నాటి ఫర్నిచర్ కాలిపోయాయి. అనంతరం అదే రూపంలో భవనాన్ని పునరుద్ధరించి 2011 అక్టోబరు 13న ప్రారంభించారు. ఘనంగా శతాబ్ది ఉత్సవాల నిర్వహణ.. హైకోర్టు భవనానికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను నిర్వ హించాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్‌తో కలసి న్యాయ మూర్తులందరూ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. శనివారం సాయంత్రం జరిగే ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ లావు నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. తీరైన ఆర్కిటెక్చర్‌కు నిదర్శనం చారిత్రక సంపదకు, నిజాం కాలంనాటి అద్భుత నిర్మాణ కౌశలానికి ఈ భవనం అద్దం పడుతోంది. గతంలో ఓ సారి అగ్నిప్రమాదం సంభవించి కొంత మేర నష్టం వాటిల్లినప్పటికీ భవనం చెక్కు చెదరలేదు. హైకోర్టు భవనంతోపాటు నగరంలోని అన్ని చారిత్రక కట్టడాలను ప్రభుత్వం పరిరక్షించాలి. హైకోర్టు భవనం వందేళ్ల పండగ జరుపుకోవడం ఆనందం కలిగిస్తోంది. – అనురాధారెడ్డి, ఇన్టాక్ సంస్థ ప్రతినిధి -
మూసీ ఒడ్డున ఇద్దరి మహిళా మృతదేహాలు లభ్యం
-
కాశీయాత్ర చరిత్ర
‘జగదీశ్వరుండు నాచేత కొంత దేశాటనము జేయింపదలచి నన్ను నేలుచున్న సుప్రీం కోరటు దొరలగుండా సెలవిప్పించినాడు గనుక నేను కాశీయాత్ర బోవలెనని 1830(ఈ అంకెలు తెలుగు పద్ధతిలో రాస్తారాయన) సంవత్సరము మే నెల 18వ తేది కుజవారము రాత్రి 9 ఘంటలకు చెన్నపట్టణము విడిచి మాధవరము జేరినాను’. తెలుగులో యాత్రా సాహిత్యానికి తొలి అడుగు వేసిన రచన ఏనుగుల వీరాస్వామయ్య ‘కాశీయాత్ర చరిత్ర’. వీరాస్వామయ్య నాడు చెన్నపట్టణం అనబడిన చెన్నైలో నాడు ఉండిన సుప్రీమ్ కోర్డులో ఇంటర్‌ప్రిటర్‌గా పనిచేశారు. 1830–31 కాలంలో 15 నెలల పాటు ‘సకుటుంబముగా, సపరివారముగా’ సుమారు నూరుమందితో కాశీయాత్ర చేశారు. రోడ్లు, రైళ్లు లేని కాలంలో పల్లకీలో ఆయన వెళ్లారు. మద్రాసు, తిరుపతి, కడప, కర్నూలు, హైదరాబాద్, నాగపుర్, అలహాబాదు మీదుగా కాశీ చేరుకుని, తిరుగు ప్రయాణంలో గయ, భువనేశ్వర్, విశాఖపట్నం, నెల్లూరు మీదుగా సాగరతీరం వెంట మళ్లీ మద్రాసు వచ్చారు. ‘తాను చూచిన దేశములు, నగరములు, పల్లెలు, అందుండే నానాజాతి మనుష్యులు, వారి వృత్తులు, ఆచారములు మొదలయిన విషయములు సవిస్తరముగా వర్ణిస్తూ దినచర్య రచించినాడు’. అది 1838లో పుస్తకరూపంలో వెలువడింది. అందులోని క్లిష్టతరమైన తెలుగు–ఉరుదూ–తమిళం మిళిత భాషకు తెలుగు సమానార్థకాలను ప్రక్షేపించి దిగవల్లి వేంకట శివరావు 1941లో దాన్ని తిరిగి వెలయించారు. ‘అణాలు, అర్ధలు, పావులాలు చెన్నపట్టణపు దుడ్లు కడప విడిచిన వెనుక దొరకవు. కూడా తెచ్చియుంటే వెండి నాణ్యములు మాత్రము పనికి వచ్చుచున్నవి. కృష్ణ కవతలి పయిసాలు కృష్ణ కీవల పనికిరావు’ అని రెండవ ప్రకరణములో రాశారు.‘ఈ షహరు గోడకు చేరినట్టుగా ‘ముసి’ అని అక్కడి వారిచేత చెప్పబడుచున్న ముచుకుంద నది పారుచున్నది... పోయిన సంవత్సరం నదీప్రవాహము ఎక్కువగా వచ్చి ఢిల్లీ దరవాజా వద్ద యింగిలీషువారు కట్టిన వారధిని పగలకొట్టి ఆ షహరులో కొన్ని వీధులున్ను, బేగంబజారులో కొన్ని వీధులున్ను ముంచివేసి పోయినది. బేగంబజారుకున్నూ, షహరుకున్నూ నడమ ఆ నది దాటుటకు పూర్వకాలమందు తురకలు మంచి రాళ్ళతో అతి బలముగా నొక్క వారధి యేనుగలు మొదలయినవి గుంపుగా నెక్కి పోవడానికి యోగ్యముగా కట్టినారు’ అని హైదరాబాదు గురించి రాశారు. ‘కాశీ పట్టణములో పదివేల యిండ్లున్ను, లక్షమంది ప్రజలున్ను వుందురని తోచుచున్నది. యిక్కడ దొరకని పదార్థము వకటిన్ని లేదు. అందరు దేశభాష అయిన హిందుస్తాన్ మాటలాడుచున్నారు’. సుమారు రెండు వందల యేళ్ల కిందటి సామాజిక పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి గొప్ప ఉపకరణం ఈ పుస్తకం. -
మూసీకి తగ్గిన ఇన్‌ఫ్లో
కేతేపల్లి: మూసీ రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో తగ్గిపోవడంతో 2 క్రస్ట్ గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీ ఎగువ, పరిసర ప్రాంతాల్లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో గురువారం 3700 కూసెక్కుల నీరు వస్తుంది. దీంతో 2 గేట్ల ద్వారా 2900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమ కాల్వకు 250, కుడి కాల్వకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ ఎన్.రమేష్ తెలిపారు. -
మూసీకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
కేతేపల్లి: ముసీ రిజర్వాయర్‌కు శనివారం సైతం భారీగా ఇన్‌ఫ్లో వస్తుండడంతో అధికారులు ప్రాజెక్టు 9 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీకి ఎగువ ప్రాంతాలైన హైదరాబాద్, జనగాంతో పాటు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో మూసీ, బిక్కేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో శనివారం 30 వేల క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు మెుత్తం 9 గేట్లను ఎత్తి 35 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి ఇన్‌ఫ్లో 25 వేలకు తగ్గడంతో గేట్లను ఒక అడుగు మేర కిందకు దించారు. ప్రాజెక్టులో నీటిమట్టం 644 అడుగుల వద్ద నిలకడగా ఉండేలా చూస్తు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పర్యాటకుల సందడి మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో సందర్శకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కేతేపల్లి, సూర్యాపేట, నకిరేకల్, అర్వపల్లి తదితర మండలాల నుంచి భారీ సంఖ్యలో సందర్శకులు ప్రాజెక్టు వద్దకు వస్తున్నారు. ప్రాజెక్టు వద్ద ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
మూసీ నీటిని చెరువుల్లోకి వదలాలి
కేతేపల్లి : మూసీనీటిని వృథాగా దిగువకు వదులుతున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం కొర్లపహాడ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా నియోజకవర్గంలోని ఏ ఒక్క మండలంలో చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండలేదన్నారు. ఈ నేపథ్యంలో మూసీకి వచ్చిన నీటిని వృథాగా దిగువకు వదలకుండా అసిఫ్నహర్, ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, మూసీ కుడి, ఎడమ కాల్వలకు వదిలి చెరువులు నింపితే రైతులకు ప్రయోజనకరంగా ఉండేదన్నారు. సమావేశంలో కొర్లపహాడ్ సర్పంచ్ కె.నాగయ్య, నాయకులు ఎ.వెంకటనర్సయ్యయాదవ్, కోట పుల్లయ్య, మారం చెన్నకృష్ణారెడ్డి, ఎండీ.యూసుఫ్‌జానీ, కానుగు యాదగిరి, కె.సైదిరెడ్డి, జాల వెంకట్‌రెడ్డి, టి.జగదీశ్, ఎ.సత్యనారాయణ, ఎ.రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.