మూసీ నీటిని చెరువుల్లోకి వదలాలి
మూసీ నీటిని చెరువుల్లోకి వదలాలి
Published Sun, Sep 18 2016 9:45 PM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
కేతేపల్లి : మూసీనీటిని వృథాగా దిగువకు వదులుతున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం కొర్లపహాడ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా నియోజకవర్గంలోని ఏ ఒక్క మండలంలో చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండలేదన్నారు. ఈ నేపథ్యంలో మూసీకి వచ్చిన నీటిని వృథాగా దిగువకు వదలకుండా అసిఫ్‌నహర్, ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, మూసీ కుడి, ఎడమ కాల్వలకు వదిలి చెరువులు నింపితే రైతులకు ప్రయోజనకరంగా ఉండేదన్నారు. సమావేశంలో కొర్లపహాడ్ సర్పంచ్ కె.నాగయ్య, నాయకులు ఎ.వెంకటనర్సయ్యయాదవ్, కోట పుల్లయ్య, మారం చెన్నకృష్ణారెడ్డి, ఎండీ.యూసుఫ్‌జానీ, కానుగు యాదగిరి, కె.సైదిరెడ్డి, జాల వెంకట్‌రెడ్డి, టి.జగదీశ్, ఎ.సత్యనారాయణ, ఎ.రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement