చెరువును చెరబట్టారు..!
- వెల్దుర్తి మండలం గోవర్ధనగిరి గ్రామ పొలిమేరలోని తన పొలంలో శ్రీరంగాపురం గ్రామానికి చెందిన మాధవరావు, పెద్ద రంగస్వామి, శివాంజనేయులు, మాధవస్వామిలు దౌర్జన్యంగా ఉపాధి హామీ పథకం కింద రస్తా వేయించారని, న్యాయం చేయాలని ఐ. మద్దిలేటి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
- వెల్దుర్తి మండలం గోవర్ధన గిరిలోని సర్వే నెంబర్లలో 134, 165లలోని 250 ఎకరాలు 32 మంది దళితులకు ప్రభుత్వం మంజూరు చేసిందని, అయితే ఎవరి భూమి వారికి ఇచ్చేందుకు తహసీల్దార్‌కు సుముఖత వ్యక్తం చేయడం లేదని.. దళితులు బన్న కిష్టన్న, చిన్న కిష్టన్న, ఎరుకలి సుంకన్న, దళిత బాలయ్య, అనుమన్న, నాగశేషులు, గోవిందుతో పాటు 32 మంది దళితులు.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
- కల్లూరు మండలం పెద్దపాడు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 79/2/బీలోని ఓపెన్ సైట్‌లో నకిలీ పట్టాలు, లేఔట్లను రద్దు చేసి, పూరి సెడిసెల్లో నివాసం ఉంటున్న తమకు ఇప్పించాలని ఎం. సువేదమ్మ, ఎం. సువర్ణమ్మ, షబానా కోరారు.
- ఆశావర్కర్స్‌కు తక్షణమే నెలకు రూ.5వేలు ఇచ్చి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారితోషికాలు పెంచాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మలమ్మ, ఏపీ ఆశావర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నాయకురాళ్లు రమిజాబీ, శివలక్ష్మీ, లక్ష్మీ, ఈశ్వరమ్మ కలెక్టర్‌కు విన్నవించారు.
- ఎస్సీ మేనేజ్‌మెంట్ హాస్టళ్లలో వార్డెన్లు లేరని.. మెనూ సక్రమంగా అమలు కావడం లేదని ఏఐఎస్‌ఎఫ్ నగర కార్యదర్శి, సహాయ కార్యదర్శి, నగర ఉపాధ్యక్షులు ఎ నాగరాజు, కె వెంకటేష్, కె మధు, విద్యార్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
- హౌసింగ్ కార్పొరేషన్‌లో ఇళ్లు మంజూరైతే ఇళ్లు కట్టుకున్నామని.. అయితే ఇళ్లు పూర్తయినా ఒక్క బిల్లు మంజూరు కాలేదని పెద్దపాడుకు చెందిన కురువ శివరాముడు హౌసింగ్ పీడీ హుస్సేన్ సాహెబ్‌కు ఫిర్యాదు చేశారు.
- ఆదర్శ పాఠశాల, కస్తూరిబాలలో అటెండర్, స్వీపర్ ఉద్యోగం ఇప్పించాలని వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన కె. మల్లికార్జున జేసీ2కు విన్నవించారు.