సాక్షి,హైదరాబాద్: భాగ్యనగరానికి తాగునీరందించే జంట జలాశయాల్లో ఒకటైన ఉస్మాన్‌సాగర్‌లో నీరు ఫుల్‌ట్యాంక్‌లెవెల్ (ఎఫ్‌టీఎల్) స్థాయికి చేరింది. ఎగువ నుంచి ఉస్మాన్‌సాగర్‌కు వరద నీరురావడంతో నీటి మట్టం పెరిగింది. జలాశయానికి ఇన్‌ఫ్లో 500 క్యూసెక్కులు అధికారులు తెలిపారు.
జలాశయం నిండడంతో పాటు ఇన్‌ఫ్లో ఉండడంతో రెండు గేట్లు ఎత్తి ఉస్మాన్‌సాగర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. నీటి విడుదలతో పాటు మూసీకి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో జీహెచ్‌ఎంసీ సిబ్బందిని కమిషనర్ అమ్రపాలి అప్రమత్తం చేశారు.
ఇదీ చదవండి: హైడ్రా ఎఫెక్ట్..మూసీ పరివాహక ప్రాంతంలో ఉద్రిక్తత
Comments
Please login to add a commentAdd a comment